Home » Health Science » Healthy Drinks for Pregnant Women
గర్భధారణ సమయంలో మహిళలు తప్పకుండా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!

మహిళలు గర్భం దాల్చడం అనేది ప్రత్యేక వరం. ఆ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆహారం నుండి విహారం వరకు గర్బవతుల చిట్టా ప్రత్యేకం. ముఖ్యంగా చలికాలంలో గర్భవతులు ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోవాలి. వాతావరణ మార్పుల కారణంగా అనారోగ్యాలు ఎదురుకాకుండా, ఒకవేళ ఎదురైనా సరే అవి గర్భవతులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆహారం కూడా ముఖ్యమే. ఈ కింద చెప్పుకునే డ్రింక్స్ గర్భవతులకు చలికాలంలో చాలా మేలు చేస్తాయి.
వేడినీటితో నిమ్మరసం..
వేడినీటిలో కాసింత నిమ్మరసం కలిపి తీసుకోవడం చాలామంది చేస్తుంటారు. అయితే ఇది గర్భవతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇమ్యునిటీ పెంచడంలో సహాయపడుతుంది. సీజనల్ సమస్యలు రాకుండా చేస్తుంది. పుట్టబిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం మంచిది.
అల్లం పాలు..
అల్లం గొప్ప ఔషద గుణాలు కలిగి ఉంటుంది. అల్లాన్ని పాలలో వేసి బాగా ఉడికించి దీన్ని గోరువెచ్చగా ఉన్నట్టే తాగాలి. గర్భవతులు అల్లం పాలు తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో వాంతుల సమస్య తగ్గుతుంది. అలాగే ఉదర సంబంధిత సమస్యలు అంటే.. అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపులో వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.
వేడి పాలు..
వేడిపాలు పోషకాన్ని మాత్రమే కాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా వేడిపాలు తాగడం వల్ల పదే పదే అనారోగ్యానికి గురయ్యే సమస్య తగ్గుతుంది.
చికెన్-ఆనియన్ సూప్..
గర్భవతులు మాంసాహారులైతే వైద్యుల సలహా మీదట చికెన్-ఆనియన్ సూప్ తీసుకోవాలి. ఇది తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు బలపడతాయి. కండరాలు బలంగా ఉంటే మహిళలకు గర్భాన్ని మోయడంలో ఇబ్బంది ఉండదు.
*నిశ్శబ్ద.
(మనిక: గర్భవతుల ఆహారానికి సంబంధించి పోషకాహార నిపుణులు, వైద్యులు పలు వేదికలల్లో పేర్కొన్న విషయాల ఆధారంగా ఈ సమాచారం అందించబడింది. గర్భవతులు ఆహారం విషయంలో తమ వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవడం మంచిది)

