Home » Fashion » ఫౌండేషన్ రాసుకున్న తర్వాత కూడా ముఖం మీద మచ్చలు కనిపిస్తున్నాయా
.webp)
సరైన చర్మ సంరక్షణ తీసుకున్నప్పటికీ, మచ్చలు, మొటిమలు తరచుగా కనిపిస్తుంటాయి. మచ్చలను వెంటనే చాలా త్వరగా తగ్గించుకోవడం సాధ్యం కాదు. అందుకే చాలామంది మచ్చలు కనిపించకుండా మేకప్ వేసుకుంటారు. దీని వల్ల మచ్చలు కవర్ కావడమే కాకుండా ముఖం కూడా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మచ్చలు కనిపించకుండా కవర్ చేసుకోవడానకి ఫౌండేషన్ చాలా అవసరం. చాలామంది ఫౌండేషన్ రాసుకున్నా ముఖం మీద మచ్చలు పూర్తీగా కవర్ కావు, మచ్చలు పైకి కనిపిస్తూ ఉంటాయి. మచ్చలేని చర్మం కనిపించాలన్నా, ముఖం మీద నల్ల మచ్చలు పూర్తీగా కనిపించకుండా మేకప్ లో కవర్ కావాలన్నా కొన్ని టిప్స్ పాలో కావాలి. అవేంటో తెలుసుకుంటే..
చర్మాన్ని ప్రిపేర్ చేయడం..
మేకప్ వేసుకోవడానికి ముందుగా చర్మాన్ని సిద్దం చేసుకోవాలి. చర్మ రకానికి సరిపోయే క్లెన్సర్‌ను ఉపయోగించాలి. ముఖం కడుక్కున్న తర్వాత, టవల్‌తో ఆరబెట్టి, ఆపై ప్రైమర్‌ను అప్లై చేయాలి. ఇది ముఖాన్ని నునుపుగా చేసి, మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉండేలా సహాయపడుతుంది. అంతేకాకుండా, స్కిన్‌కేర్ రొటీన్‌లో టోనర్ . సీరమ్ ఉన్నట్లయితే, ప్రైమర్ అప్లై చేయడానికి ముందు వాటిని అప్లై చేయాలి.
కన్సీలర్..
నల్ల మచ్చలను కప్పిపుచ్చడంలో కలర్ కరెక్టింగ్ కన్సీలర్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని అప్లై చేయడానికి వేళ్లను లేదా కన్సీలర్ బ్రష్‌ను ఉపయోగించాలి. మచ్చ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, ఆ తర్వాత సున్నితంగా చర్మంలో కలిసేలా చేయాలి గులాబీ లేదా పీచ్ రంగు కలర్ కరెక్టర్ లేదా కన్సీలర్ బాగా పనిచేస్తుంది.
ఫౌండేషన్..
కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ముఖానికి ఫౌండేషన్‌ను చాలా పలుచని పొరగా అప్లై చేయాలి. మేకప్ స్పాంజ్, బ్రష్ లేదా వేలికొనను ఉపయోగించి దీన్ని అప్లై చేయాలి. ముక్కు దగ్గర మొదలుపెట్టి, ఆ తర్వాత నెమ్మదిగా ముఖం అంతటా అప్లై చేయాలి. నేచురల్ లుక్ కోసం చర్మపు రంగుకు సరిపోయే ఫౌండేషన్ చాలా అవసరం.
సెట్టింగ్ పౌడర్..
ట్రాన్స్పరెంట్ సెట్టింగ్ పౌడర్‌ను ఒక స్పాంజ్ లేదా మెత్తని బ్రష్‌పైకి తీసుకుని, అదనపు పౌడర్‌ను తొలగించడానికి దానిని తేలికగా అద్దాలి. ఆ తర్వాత, దానిని టీ-జోన్ ప్రాంతంలో, కళ్ల కింద , ముక్కు చుట్టూ, సున్నితంగా అద్దుతూ అప్లై చేయాలి. మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉండాలంటే, సెట్టింగ్ స్ప్రేను ఉపయోగించాలి.
లాస్ట్ స్టెప్..
ఇలా మేకప్ వేసుకున్న తర్వాత మచ్చలేని చర్మం రెఢీ అయినట్టే.. అయితే లాస్టేజ్ లో బ్లష్, ఐ మేకప్, హైలైటర్ , లిప్‌స్టిక్ వంటి మిగిలిన మేకప్‌ను పూర్తి చేయాలి. ఇలా మేకప్ వేసుకుంటే.. అందంగా కనిపించడమే కాకుండా.. నల్ల మచ్చలను తాత్కాలికంగా కవర్ చేసుకోవచ్చు.
*రూపశ్రీ.
