Home » Ladies Special » ఆడపిల్లలకు మొదటిసారి బ్రా కొనేముందు ప్రతి తల్లి ఇవి గుర్తుంచుకోండి!
ఆడపిల్లలకు మొదటిసారి బ్రా కొనేముందు ప్రతి తల్లి ఇవి గుర్తుంచుకోండి!

బ్రా అనేది మహిళల వస్త్రధారణలో ఒక భాగం. ఒక వయసుకు వచ్చాక చిన్న పిల్లల నుండి పెద్దల వరకు బ్రా ధరించడం జరుగుతుంది. సాధారణంగా నేటికాలంలో ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడం, శారీరకంగా వారు అభివృద్ది చెందడం జరుగుతోంది. ఆడపిల్లలకు వక్షోజాలు పెరగడం మొదలయ్యాక వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని తల్లులు పిల్లలకు బ్రా వేసుకోమని సూచిస్తుంటారు. అందుకోసం బ్రా కొనుగోలు కూడా చేస్తుంటారు. అయితే పిల్లల కోసం బ్రా కొనుగోలు చేసేముందు చాలామంది తల్లులు తప్పులు చేస్తుంటారు. మరికొందరు అవగాహన లేకుండా కొంటూ ఉంటారు. మొదటి సారి బ్రా కొనుగోలు చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి? ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
మొదటి తప్పు..
శరీరం ఎదుగుతున్నప్పుడు చాలామంది తల్లులు తమ పాపకు బ్రా వేస్తే మంచిదని అనుకుంటారు. అయితే మొదటి సారి ఎంచుకునే బ్రా చాలా వరకు తప్పుగా ఉన్నదే ఎంచుకోవడం జరుగుతుంది. చాలా టైట్ గా ఉన్నదో లేదా చాలా లూజ్ గా ఉన్నదో.. ప్యాబ్రిక్ పరంగా చూస్తే సౌకర్యవంతంగా లేనిదో.. ఇలా చాలా రకాలుగా మిస్టేక్స్ జరుగుతాయి.
సరైన వయసు..
చాలా వరకు చిన్న పిల్లలకు బ్రా వేసే వయసు 8 నుండి 12 సంవత్సరాల మద్య ప్రారంభం అవుతుంది. అయితే కొందరికి శారీరకంగా ఎదుగుదల ఉండి 8 ఏళ్లకే వక్షోజాలు పెరిగినట్టు కనిపిస్తుంది, మరికొందరికి 12 ఏళ్లు వచ్చినా ఎదుగుదల ఉండదు. కానీ వయసు వచ్చింది కదా అని అవసరం లేకపోయినా బ్రా వేయడం తప్పు..
సరైన ఎంపిక లేకపోతే ఏం జరుగుతుంది?
ఆడపిల్లలకు బ్రా వేయడం మంచిదే.. కానీ ఎంచుకునే బ్రా సరిగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. పిల్లలది ఎదిగే వయసు కావడంతో కాలంతో పాటు వక్షోజాల పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలలో చాలామంది మహిళలు పిల్లలు పెద్దగా అవుతారు కదా అని లూజ్ గా, పొడవుగా ఉన్న దుస్తులు కొంటారు. కానీ బ్రా మాత్రం అలా లూజ్ గా ఉన్నవి కొనకూడదు. లూజ్ గా ఉన్ బ్రా ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
బాగా టైట్ గా ఉన్న బ్రా ధరించడం వల్ల పిల్లలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. పెరిగే వయసు కాబట్టి వక్షోజాల పెరుగుదలకు ఆటంకం కలగడం, వక్షోజాల్లో నొప్పి వంటివి ఎదురవుతాయి.
బ్రా రకం..
పిల్లల కోసం ఎంచుకునే బ్రా రకం కూడా చాలా ముఖ్యం.పెద్దవాళ్లు ఎంచుకున్నట్టు బ్రాను ఎంపిక చేయకూడదు. బనియన్ టైప్ లో ఉన్న బ్రా లేదా స్పోర్ట్స్ బ్రా లాంటివి పిల్లలకు బాగుంటాయి.
ప్యాబ్రిక్..
పిల్లల కోసం ఎంచుకునే బ్రా ఫ్యాబ్రిక్ కూడా చాలా ముఖ్యం. క్లాత్ బాగా స్మూత్ గా ఉండాలి, స్కూల్ యూనిఫార్మ్ లేదా డ్రస్ మీద అసలు కనిపించనట్టు ఉండాలి, పెద్దవాళ్ల లాగా రఫ్ గా ఉన్నవి ఎంచుకోకూడదు. మరీ ముఖ్యంగా పెద్దవాళ్లు వేసుకున్నట్టు కప్ బ్రా లు పిల్లల కోసం అస్సలు ఎంపిక చేయకూడదు. వక్షోజాల నిపుల్స్ కు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేలాగా బ్రా ఎంపిక ఉండాలి.
బలవంతం వద్దు..
వయసు పెరుగుతోంది కాబట్టి బ్రా ఖచ్చితంగా వేసుకోవాలి అని పిల్లలను బలవంతం చేయకూడదు. దాని బదులుగా పిల్లలకు బ్రా వేుకోవడం ఎంత ముఖ్యం, అది ఎంత సౌకర్యంగా ఉంటుంది అనే విషయం అర్థమయ్యేలా చెప్పాలి.
పిల్లలు స్కూల్ కు వెళ్లడం రావడం మాత్రమే కాకుండా, ఆటలు ఆడేటప్పుడు, పరిగెత్తేటప్పుడు.. ఇలా వారికి బ్రా ఉండటం వల్ల ఎలాంటి సౌకర్యం ఉంటుందో అర్థమయ్యేలా చెప్పాలి. బ్రా వేసుకోవడానికి పిల్లలను మానసికంగా సిద్దం చేసిన తర్వాతే బ్రా కొనుగోలు చేయడం, పిల్లలకు వేయడం చేయాలి. ఇలా చేస్తే ఎంతో సున్నితమైన విషయాన్ని కూడా పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు.
*రూపశ్రీ.
