Home » Yoga » కపాలభాతి ప్రాణాయామం.. ప్రతిరోజూ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

కపాలభాతి ప్రాణాయామం.. ప్రతిరోజూ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!

నేటికాలంలో యోగా, ప్రాణాయామం అనేవి ఆరోగ్యకరమైన జీవనశైలిలో ముఖ్యమైన భాగంగా మారాయి.  కపాలభతి అనేది ఒక ప్రసిద్ధ ప్రాణాయామం, దీనిని చాలా మంది తమ దినచర్యలో చేర్చుకుంటారు. సరైన పద్ధతి,  జాగ్రత్తలతో సాధన చేస్తే,  కపాలభతి చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే  ఏదైనా యోగాభ్యాసం ప్రారంభించే ముందు ఆరోగ్య స్థితి ఆధారంగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ప్రతిరోజూ కపాలభతి చేయడం మంచిదేనా?  దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవా? కపాలభాతి చేయడానికి సరైన పద్దతి ఏంటి? యోగా నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే..

కపాలభాతి అంటే..

కపలాభాతి అనేది ఒక రకమైన ప్రాణాయామం, దీనిలో శ్వాసను సాధారణంగా పీల్చుకోవడం ఆ తరువాత శ్వాసను చాలా వేగంగా వదలడం జరుగుతుంది. ఈ అభ్యాసం శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది,   జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.

రోజూ కపాలభాతి చేయవచ్చా..

యోగా నిపుణుల అభిప్రాయం ప్రకారం, కపలాభతి సరిగ్గా,  పరిమిత సమయం పాటు చేస్తే, అది ప్రతిరోజూ చేయడం మంచిదే.  అయితే, దీనిని మొదట్లో తక్కువ సమయంతో మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని పెంచాలి.

రోజూ కపాలభాతి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..


జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది..

కపలాభాతి చేయడం వల్ల ఉదర కండరాలు ఉత్తేజితమవుతాయి, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది..

కపలాభాతి క్రమం తప్పకుండా చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది..

ఈ ప్రాణాయామం శరీరం నుండి విషపూరిత పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది,  శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది..

కపలాభాతి మెదడుకు ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తుంది, ఇది ఒత్తిడి,  ఆందోళనను తగ్గిస్తుంది.

 చర్మాన్ని కాంతివంతం చేయడం..

క్రమం తప్పకుండా కపాలభాతి చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.


కపలాభతి చేసేటప్పుడు జాగ్రత్తలు..

 ఖాళీ కడుపుతో కపలాభతి చేయాలి.

మొదట్లో 2-3 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు.

క్రమంగా సాధన చేస్తూ సమయాన్ని పెంచాలి.

కపాలభాతి చేసినప్పుడు తల తిరుగుతున్నట్లు లేదా అసౌకర్యంగా అనిపిస్తే, వెంటనే ఆపాలి.

గుండె జబ్బులు, అధిక రక్తపోటు లేదా గర్భధారణ సమయాల్లో ఖచ్చితంగా వైద్యుడిని లేదా యోగా నిపుణుడిని సంప్రదించాలి.  


కపాలభాతి చేయడానికి సరైన మార్గం..

నిటారుగా కూర్చోవాలి.  వెన్నెముకను నిటారుగా ఉంచాలి.

లోతైన శ్వాస తీసుకొని పదే పదే గాలిని వదులుతూ కడుపుని లోపలికి లాగాలి.

శ్వాస స్వయంచాలకంగా లోపలికి వెళ్లాలి.  దీన్ని   30-50 సార్లు రిపీట్  చేయాలి.


                                         *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.