Telugu e -Panchangam
Calendars 2026
Calendars 2025
Calendars 2024
Calendars 2023
Calendars 2022
Calendars 2021
Calendars 2020
Calendars 2019
Calendars 2018
Calendars 2017
Calendars 2016
Calendars 2015
Calendars 2014
Calendars 2013
Telugu Calendars 2012
Home » » డర్టీ ఫ్లోర్ ను ఎలా క్లీన్ చేయాలి ?
Home » » CIRCLES ON WALLS
Home » » ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వర్షాకాలం ఇల్లంతా తాజా!
Home » » అల్లం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!!
Home » » గర్బధారణ సమయంలో ఎలా కూర్చోవాలి..
Home » »  పచ్చిమిర్చి, కొత్తి మీర..   ఇలా స్టోర్ చేయండి..  నెలరోజుల వరకు పాడవకుండా తాజాగా ఉంటాయ్..!
Home » » మహిళలు ఇంటి పని, ఉద్యోగం రెండూ సక్సెస్ గా బ్యాలెన్స్ చేయడం ఎలాగంటే..!
Home » » మహిళలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకుంటే ఈ మూడు సమస్యలే కారణం కావచ్చు!
Home » » నెలసరి సమయంలో ఈ తప్పులు చేయకండి.. ఫెలోపియన్ ట్యూబ్‌లు మూసుకుపోతాయ్!
Home » » ఎంత ప్రయత్నం చేసినా వంటింట్లో బొద్దింకలు పోవడం లేదా..ఈ పవర్పుల్ టిప్స్ ట్రై చేయండి..!
Home » » మహిళలు ఆర్థికంగా ఎదగడం వైవాహిక బంధం విచ్చిన్నానికి  దారి తీస్తుందా.!
డర్టీ ఫ్లోర్ ను ఎలా క్లీన్ చేయాలి ?

డర్టీ ఫ్లోర్ ను ఎలా క్లీన్ చేయాలి ?
దైనందిన జీవితంలో అనేకసార్లు దుస్తులమీద, గచ్చుమీద రకరకాల మచ్చలు లేదా మరకలు పడుతుంటాయి. ముఖ్యంగా డర్టీ ఫ్లోర్ ను చూస్తే చిరాకేస్తుంది. మరి డర్టీ ఫ్లోర్ ను ఎలా శుభ్రం చేయాలి ? మన ఫ్లోర్ మార్బుల్ లేదా టైల్స్ గనుక అయితే ఆ మరకలు మరింత స్పష్టంగా, అందవికారంగా కనిపిస్తాయి. అందుకే మనది డర్టీ ఫ్లోర్ కాకుండా చూసుకుందాం. ఫ్లోర్ మీద పడిన మచ్చలు, మరకలను తొలగించుకునే మార్గాలు కొన్ని తెలుసుకుందాం.

--> డర్టీ ఫ్లోర్ ను రబ్బర్ ఎరేజర్ సాయంతో శుభ్రపరచవచ్చు.
--> నీళ్ళలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి పేస్ట్ లా తయారుచేసి, మరక పడినచోట దాన్ని రాసి కడిగేయడం ద్వారా కూడా పోగొట్టవచ్చు. ఈ మిశ్రమాన్ని మరకలపై రాసి, రెండు నిమిషాల తర్వాత కడిగి పొడి వస్త్రంతో తుడిచేస్తే సరి. టూత్ పేస్ట్ తో శుభ్రం చేసినా మరకలు పోతాయి.
--> అవి తుప్పు మరకలు గనుక అయితే, వాటిపై బేకింగ్ పౌడర్ జల్లి, కొద్దిసేపు ఉంచి, వెనిగర్ లో ముంచిన వస్త్రంతో తుడవాలి. మరక పోయేదాకా అలాగే చేస్తుండాలి.
--> మార్బుల్ ఫ్లోర్ పై మరకలుపడితే బేకింగ్ సోడా, బ్లీచ్ కలిపి పేస్ట్ మాదిరి తయారుచేసి, మరకల్ని పూర్తిగా కవర్ చేస్తూ రాయాలి. తడి వస్త్రం కప్పి రాత్రంతా అలా ఉంచేసి, ఉదయాన్నే తుడిచేయాలి.
--> మామూలు ఫ్లోర్ పై పడే మరకల్ని డిటర్జంట్ నీళ్ళలో ముంచిన బ్రెష్ లేదా స్పాంజ్ లతో తుడిచేయవచ్చు.
--> కొన్ని మరకలను పెట్రోల్లో దూదిని ముంచి తుడవడం ద్వారా పోగొట్టవచ్చు.
--> నూనె మరకలకు మార్కెట్లో ప్రత్యేకంగా లభించే క్లీనర్లు బాగా పనిచేస్తాయి.
--> నేలపై గమ్ పడినట్లయితే ఐస్ క్యూబ్ తో రుద్ది, ఆనక శుభ్రం చేస్తే తేలిగ్గా పోతుంది..  దైనందిన జీవితంలో అనేకసార్లు దుస్తులమీద, గచ్చుమీద రకరకాల మచ్చలు లేదా మరకలు పడుతుంటాయి. ముఖ్యంగా డర్టీ ఫ్లోర్ ను చూస్తే చిరాకేస్తుంది. మరి డర్టీ ఫ్లోర్ ను ఎలా శుభ్రం చేయాలి ? మన ఫ్లోర్ మార్బుల్ లేదా టైల్స్ గనుక అయితే ఆ మరకలు మరింత స్పష్టంగా, అందవికారంగా కనిపిస్తాయి. అందుకే మనది డర్టీ ఫ్లోర్ కాకుండా చూసుకుందాం. ఫ్లోర్ మీద పడిన మచ్చలు, మరకలను తొలగించుకునే మార్గాలు కొన్ని తెలుసుకుందాం.

--> డర్టీ ఫ్లోర్ ను రబ్బర్ ఎరేజర్ సాయంతో శుభ్రపరచవచ్చు.
--> నీళ్ళలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి పేస్ట్ లా తయారుచేసి, మరక పడినచోట దాన్ని రాసి కడిగేయడం ద్వారా కూడా పోగొట్టవచ్చు. ఈ మిశ్రమాన్ని మరకలపై రాసి, రెండు నిమిషాల తర్వాత కడిగి పొడి వస్త్రంతో తుడిచేస్తే సరి. టూత్ పేస్ట్ తో శుభ్రం చేసినా మరకలు పోతాయి.
--> అవి తుప్పు మరకలు గనుక అయితే, వాటిపై బేకింగ్ పౌడర్ జల్లి, కొద్దిసేపు ఉంచి, వెనిగర్ లో ముంచిన వస్త్రంతో తుడవాలి. మరక పోయేదాకా అలాగే చేస్తుండాలి.
--> మార్బుల్ ఫ్లోర్ పై మరకలుపడితే బేకింగ్ సోడా, బ్లీచ్ కలిపి పేస్ట్ మాదిరి తయారుచేసి, మరకల్ని పూర్తిగా కవర్ చేస్తూ రాయాలి. తడి వస్త్రం కప్పి రాత్రంతా అలా ఉంచేసి, ఉదయాన్నే తుడిచేయాలి.
--> మామూలు ఫ్లోర్ పై పడే మరకల్ని డిటర్జంట్ నీళ్ళలో ముంచిన బ్రెష్ లేదా స్పాంజ్ లతో తుడిచేయవచ్చు.
--> కొన్ని మరకలను పెట్రోల్లో దూదిని ముంచి తుడవడం ద్వారా పోగొట్టవచ్చు.
--> నూనె మరకలకు మార్కెట్లో ప్రత్యేకంగా లభించే క్లీనర్లు బాగా పనిచేస్తాయి.
--> నేలపై గమ్ పడినట్లయితే ఐస్ క్యూబ్ తో రుద్ది, ఆనక శుభ్రం చేస్తే తేలిగ్గా పోతుంది.. 


CIRCLES ON WALLS

CIRCLES ON WALLS

 

Blank walls make for cold and unwelcoming spaces. Happily, you can easily and inexpensively add warming layers of color and pattern. And Circles are hot now! 

Suspend a collection of vivid dishes that match your aesthetics; 
 

 
Group artworks that share a theme or color scheme; display colorful stitch frames as-is on walls, you don't need to frame them separately; 

If you are in your own house not a rental, then think of a beautiful wall paper in circular pattern.

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వర్షాకాలం ఇల్లంతా తాజా!

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వర్షాకాలం ఇల్లంతా తాజా!


వర్షాకాలం మొదలయ్యింది. ఇది క్రమంగా పెరిగేదే తప్ప ఇప్పట్లో తగ్గేది కాదు. ఇళ్లు కాస్త పాతవి అయినా, ఇంటి నిర్మాణం నాసిరకంగా ఉన్నా ఇంటి గోడలు వర్షం నీటి కారణంగా చెమ్మ ఏర్పడుతుంది. గోడలు నీటిని పీల్చుకుని వాసన వస్తుంటాయి. ఇది అంత సులువుగా తొలగిపోయే వాసన కాదు. ఇంట్లో వాళ్ళు ఏదో సర్దుకుపోతారు. కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్ లు, బంధువులు వస్తే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది.  ఈ సమస్య మీ ఇంట్లోనూ ఉన్నా, ఇంకా పెరిగే వర్షాల కారణంగా ఈ సమస్య వచ్చే అవకాశం ఉన్నా దాన్ని తరిమికొట్టే చిట్కాలు ఉన్నాయి.  ఈ కింది టిప్స్ పాటిస్తే ఇంటిలో వాసనను పారద్రోలడం సులభం.

దుర్వాసనను వదిలించుకోవడానికి చాలా ముఖ్యమైన విషయం ఇంటి లోపలి భాగం బాగా పొడిగా ఉండాలి. దీని కోసం, ఇంట్లో ఎక్కువ సమయం ఫ్యాన్‌ని ఆన్‌లో ఉంచండి . అలాగే ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో  వాసనలు రావు. ఇంట్లో  వాతావరణం చాలా వరకు తాజాగా  కనిపిస్తుంది.

గది నుండి వాసనను తొలగించడానికి చాలా మంది డియోను ఉపయోగిస్తారు, కానీ ఇది వాడకూడదు. ఎందుకంటే ఇందులో రసాయనాలు ఉంటాయి. ఇది మొదట బానే ఉన్నా ఇంట్లో ఉన్న వాసనతో కలిపి కొత్త రకమైన వాసనను ఇది క్రియేట్ చేస్తుంది. ఇంట్లో నుండి  ఈ వాసనను తొలగించడానికి వెనిగర్ మంచి ఆప్షన్.  దీని కోసం, ఒక స్ప్రే బాటిల్‌లో సమాన పరిమాణంలో వెనిగర్,  నీరు కలపాలి.  ఇంట్లో ప్రతి మూలలో  దీన్ని చల్లుకోవాలి.

నిమ్మ,  తులసి యొక్క కూడా ఇంటి నుండి తేమ వాసన తొలగించడంలో చాలా సహాయపడుతుంది. దీనికోసం ముందుగా ఒక పాత్రలో ¾ కప్పు నీటిని మరిగించండి. తర్వాత దానికి నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు తులసి వేసి కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు టీ స్టయినర్‌తో ఫిల్టర్ చేసి అందులో 2-3 స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో వేయాలి. తర్వాత కాసేపయ్యాక ఇంటి మొత్తానికి చల్లుతూ ఉండండి.

వర్షపు రోజులలో ఇంటి నుండి వచ్చే తేమ  వాసనను తొలగించడానికి  బేకింగ్ సోడా కూడా  ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక స్ప్రే బాటిల్‌లో 2 కప్పుల నీటిని పోయాలి, దానికి 1 టీస్పూన్ బేకింగ్ సోడా,  కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. దీన్ని బాగా  షేక్ చేసి ఇంట్లో చల్లాలి. అంతే ఇవన్నీ పాటిస్తుంటే ఇంట్లో వర్షం వల్ల కలిగే తేమ వాసన మాయమవుతుంది. ఇంట్లో తాజాదనం వస్తుంది.

                                                              *నిశ్శబ్ద.

 


అల్లం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!!

అల్లం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!!

భారతీయ వంటకాల్లో అల్లంకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపుగా అన్ని వంటకాల్లోనూ అల్లంను వినియోగిస్తుంటారు. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మనకు అజీర్ణం, దగ్గు, గొంతునొప్పి, గొంతునొప్పి ఉన్నప్పుడు కొద్దిగా అల్లం తింటే చాలా త్వరగా తగ్గుతుంది. మన అల్లం చాలా శక్తివంతమైనది. అయితే అల్లం పాడవకుండా చాలాకాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి.

తాజా అల్లం కొనండి:

అల్లం కొనుగోలు చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి.  మీరు తీసుకునే అల్లం గట్టిగా  తాజాగా ఉండాలి.చాలా మెత్తగా, చాలా పొరలతో ఉండే అల్లం త్వరగా పాడైపోతుంది. కాబట్టి అల్లం కొనుగోలు చేసే ముందుకు జాగ్రత్తగా పరిశీలించాలి.

అల్లం పొట్టును తొలగించవద్దు:

మీరు అల్లం నిల్వ చేయాలనుకుంటే..దానిపై ఉన్న పొట్టును తీయకూడదు. పొట్టుతో అలాగే ఉంచినట్లయితే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఇది అల్లానికి రక్షణ కవచం లాంటిది.

రిఫ్రిజిరేటర్లో ఉంచండి:

అల్లం  తాజాగా ఉండాలంటే  రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో కూడా భ్రదపరుచుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ బ్యాగ్ నుండి అదనపు గాలిని తొలగించండి. ఇది అల్లం తేమ నుండి రక్షిస్తుంది. ఇలా చేయడం వల్ల అల్లంపై ఫంగస్ దరిచేరదు.

ఎండిన అల్లం:

అల్లం నిల్వ చేయడానికి మరొక మార్గం ఏమిటంటే, దానిని పూర్తిగా శుభ్రపరచడం. నీటి శాతం పూర్తిగా పోయే వరకు ఆరబెట్టడం. లేదంటే ఓవెన్ లేదా ఎయిర్ ఫ్రైయర్‌లో నీటి శాతం పూర్తిగా లేకుండా చూడాలి. తర్వాత దీన్ని పొడి చేసి, అవసరమైనప్పుడు మసాలాగా ఉపయోగించవచ్చు.

చుట్టి ఫ్రీజర్‌లో ఉంచండి

ముక్కలు చేసిన అల్లాన్ని పార్చ్‌మెంట్ పేపర్‌తో కప్పిన బేకింగ్ షీట్‌పై చుట్టి, గట్టిగా అయ్యేంత వరకు ఫ్రీజర్‌లో ఉంచండి. తర్వాత వాటిని గాలి చొరబడని కంటైనర్ లేదా ఫ్రీజర్ సేఫ్ బ్యాగ్‌లో ఉంచండి.


గర్బధారణ సమయంలో ఎలా కూర్చోవాలి..

గర్బధారణ సమయంలో ఎలా కూర్చోవాలి..

గర్భధారణ సమయంలో సరిగ్గా కూర్చోవడం, నిలబడటం చాలా ముఖ్యం. అన్నింటికంటే..గర్భిణీలు ఏ భంగిమల్లో కూర్చోవడం ఉత్తమం? పూర్తి సమాచారం తెలుసుకుందాం.  

గర్భం చాలా సున్నితమైనది.  ఈ సమయంలో ఎలా కూర్చోవాలి? వంగడం మంచిదేనా? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఈ సమయంలో వెన్ను, మెడ, భుజాలలో నొప్పి కనిపించే అవకాశం ఉంటుంది. ఇది వారి కూర్చున్న భంగిమపై ఆధారపడి ఉంటుంది. గర్భధారణ సమయంలో శరీర బరువు పెరుగుతుంది. కాబట్టి సరైన భంగిమలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. స్లూచింగ్ మీ బిడ్డను ప్రభావితం చేస్తుంది.  

సరిగ్గా కూర్చోవడం ముఖ్యం:

గర్భధారణ సమయంలో  స్త్రీ అనుసరించే మంచి భంగిమ ఆమెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తప్పు భంగిమ అసౌకర్యం, నొప్పిని కలిగిస్తుంది. అలాగే, ఇది శిశువుకు హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. గర్భం  చివరి దశలలో, హార్మోన్లు కీళ్ళలోని స్నాయువులు, మృదువుగా చేయడం ప్రారంభించినప్పుడు ఈ నొప్పి తీవ్రమవుతుంది.

సరైన  భంగిమ ఏమిటి?

గర్భిణీలు వారి వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి, అసౌకర్యాన్ని తగ్గించడానికి గర్భధారణ సమయంలో సరైన భంగిమను అభ్యసిస్తారు. ఉదాహరణకు, కూర్చున్నప్పుడు లేదా వెనుకకు వంగి ఉన్నప్పుడు  వీపును నిటారుగా ఉంచండం మంచిది. గర్భిణీలకు నేలపై కూర్చోవడం సరైన భంగిమగా సూచిస్తుంది. ప్రసవానికి ఇది చాలా మంచి భంగిమ అని పెద్దలు అంటుంటారు. మీరు కుర్చీపై కూర్చోవడం అలవాటు చేసుకున్నట్లయితే, మీ వెనుకభాగంలో ఒక మృదువైన దిండు ఉంచుకోవడం మంచిది.

ఎక్కువ సేపు కూర్చోవద్దు:

గర్భిణీలు ఎక్కువసేపు కూర్చుంటే రక్తప్రసరణ దెబ్బతింటుంది. దీనివల్ల కాళ్లు నొప్పులు వస్తాయి. దీన్ని నివారించడానికి సాధారణ ఫుట్ వ్యాయామం చేయండి. ఆఫీసులో చాలా గంటలు కూర్చుని పని చేయాల్సి వస్తుంది. మీకు సమయం దొరికినప్పుడు కొన్ని నిమిషాలు నిలబడి నడవడం గుర్తుంచుకోండి.

అలాంటి భంగిమ ప్రమాదకరం:

బ్యాక్ సపోర్టు లేకుండా బీన్ బ్యాగులపై కూర్చోవద్దు. విచక్షణారహితంగా వంగడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కూర్చోవడం మంచిది కానీ రోజంతా అలా కూర్చోని ఉండటం మంచిది కాదు. ఇది పేలవమైన ప్రసరణకు దారితీస్తుంది, చీలమండలలో వాపు, అనారోగ్య సిరలకు కారణం అవుతుంది.

సరైన నిలబడే భంగిమ:

కూర్చునే భంగిమ ఎంత ముఖ్యమో నిలబడే భంగిమ కూడా అంతే ముఖ్యం. మీ పాదాలను ఒకే దిశలో ఉంచండి. రెండు పాదాలపై బరువును సమానంగా ఉంచండి. అలాగే, మీరు ధరించే చెప్పులు లేదా బూట్లు సరిపోతాయా? అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.


 పచ్చిమిర్చి, కొత్తి మీర..   ఇలా స్టోర్ చేయండి..  నెలరోజుల వరకు పాడవకుండా తాజాగా ఉంటాయ్..!


 కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వంటగదిలో దాదాపు ప్రతిరోజూ వాడేవే. అయితే, వాటిని సరిగ్గా నిల్వ చేయకపోతే, అవి కొన్ని రోజుల్లోనే వాడిపోవచ్చు, ఎండిపోవచ్చు లేదా పాడైపోవచ్చు.  కొందరు తమ ఇళ్లలో నిల్వ చేసిన తర్వాత పచ్చిమిర్తి, కొత్తిమీరను కుల్లిపోయిందనో లేదా వాడిపోయిందనో..  పదేపదే పడవేస్తూ ఉంటారు. వాటిని ఎంతో జాగ్రత్తగా నిల్వ చేశామని అయినా సరే.. అవి పాడైపోతున్నాయని అంటుంటారు.  అలాంటి వారు నిల్వ చేసే పద్దతిని మార్చుకోవాలి. కొన్ని సులభమైన చిట్కాలు కొత్తిమీర, పచ్చిమిరపకాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. ఏవేంటో తెలుసుకుంటే..

కొత్తిమీర నిల్వ కు సరైన పద్దతి..

కొత్తిమీరను చాలామంది మార్కెట్ నుండి తీసుకువచ్చాక అదే కవర్ లోనే నిల్వ చేస్తుంటారు. దీనివల్ల అదే కవర్ లో తేమ చేరి, కొన్ని రోజుల్లోనే ఆకులు కుళ్ళిపోతాయి. దీనిని నివారించడానికి సులభమైన మార్గం  కొత్తిమీరను మెల్లగా ఆరబెట్టి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి.  అదనపు తేమను పీల్చుకోవడానికి డబ్బా అడుగున ఒక పొడి పేపర్ టవల్ ఉంచాలి. ఆ తర్వాత కొత్తిమీరను ముద్దగా కాకుండా కాస్త పొడిలాగా  అమర్చి, డబ్బాకు మూత పెట్టి, ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర ఎక్కువ కాలం పచ్చగా, తాజాగా ఉంటుంది.

మరొక పద్దతి..

కొత్తిమీర కాండంలో ఒక చిన్న భాగాన్ని కత్తిరించి, కొద్దిగా నీరు నింపిన గ్లాసులో ఉంచి, దానిపై ఒక ప్లాస్టిక్ కవర్ ను  వదులుగా కప్పాలి. దీనివల్ల కాండం తేమగా ఉండి, ఆకులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. అయితే, ఈ పద్ధతిలో ప్రతి రెండు మూడు రోజులకు నీటిని మార్చవలసి ఉంటుంది.

పచ్చిమిర్చి నిల్వ చేసే విధానం..

పచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే, ముందుగా వాటి కాడలను తీసివేయాలి. తర్వాత పసుపు కలిపిన నీటితో వాటిని కడిగి, ఆపై శుభ్రమైన నీటితో బాగా కడగాలి. వాటిలో తేమ ఏమాత్రం లేకుండా చూసుకోవాలి.  కాటన్ క్లాత్ తో బాగా తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత మిరపకాయలను ఒక జిప్-లాక్ బ్యాగ్‌లో ఉంచి, తొక్క తీసిన రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను జిప్ లాక్ బ్యాగ్ లో వేసి. బ్యాగ్‌కు క్లోజ్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలు త్వరగా ఎండిపోకుండా లేదా ముడుచుకుపోకుండా ఉంటాయి.

ఇది తెలుసుకోవాలి..

రిఫ్రిజిరేటర్ గాలిలోని తేమను తగ్గిస్తుంది, దీనివల్ల పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వంటివి క్రమంగా తమ తేమను కోల్పోతాయి. వాటికి మూతపెట్టకుండా వదిలేస్తే లేదా వాటిలో నీరు ఉంటే, అవి త్వరగా పాడైపోతాయి. అందువల్ల, వాటిని నిల్వ చేయడానికి ముందు పూర్తిగా ఆరబెట్టడం , సరైన కంటైనర్  ఉపయోగించడం చాలా ముఖ్యం. ఈ చిట్కాలను పాటించడం ద్వారా,  పచ్చిమిరపకాయలు,   కొత్తిమీరను  దాదాపు నెల రోజుల వరకైనా  తాజాగా ఉంచుకోవచ్చు.

 

                                 *రూపశ్రీ.


 


మహిళలు ఇంటి పని, ఉద్యోగం రెండూ సక్సెస్ గా బ్యాలెన్స్ చేయడం ఎలాగంటే..!

 

మహిళలు ఇంటి పని, ఉద్యోగం రెండూ సక్సెస్ గా బ్యాలెన్స్ చేయడం ఎలాగంటే..!

మహిళా శక్తి  రోజు రోజుకూ పెరుగుతున్న కాలమిది. మగవారితో పాటు మహిళలు కూడా వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో సత్తా చాటుతున్నారు. కానీ మహిళలు ఎంత సక్సెస్ సాధించినా ఇంటి గడప తొక్కితే గృహిణులుగా మారిపోతారు. ఇంటి పనులు, వంట పనులు, భర్త, పిల్లల బాధ్యత అన్ని చూసుకుంటారు. అందుకే మహిళలను మల్టీ టాస్కర్లు అని అంటారు.  ఇది పైన చెప్పుకోవడానికి బానే ఉంటుంది కానీ  మహిళలు రెండింటిని బాలేన్స్ చెయ్యడానికి చెప్పలేనంత ఒత్తిడికి లోనవుతుంటారు. అటు ఉద్యోగినిగా, ఇటు తల్లిగా, భార్యగా, గృహిణిగా అన్నింటికి న్యాయం చేస్తూ ఒత్తిడి దరిచేరకూడదంటే ఈ కింది చిట్కాలు పాటించాలి.

 ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి..

ముందుగా సమయపాలన ముఖ్యం.  ముఖ్యమైన పనులు ఏమిటో నిర్ణయించుకోవాలి. అప్పుడు వాటిపై దృష్టి పెట్టాలి. అవసరమైనప్పుడు నో చెప్పడం నేర్చుకోవాలి. అంతేకాని మొహమాటానికి దేన్నీ నెత్తిన వేసుకోకూడదు.  అది పని అయినా లేదా ఇంటి బాధ్యత అయినా. చాలా కంపెనీలు పెళ్లై పిల్లలున్న మహిళలకు పని సౌలభ్యాన్ని అందిస్తాయి.  అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపికల ప్రయోజనాన్ని పొందాలి. అది రిమోట్ పని లేదా సౌకర్యవంతమైన పని గంటలు కావచ్చు, ఇంటి బాధ్యతలతో పాటు  మహిళలు తమని తాము డవలప్ చేసుకుంటూ తమ ఉద్యోగాన్ని నిర్వర్థించేందుకు ఇంట్లో వ్యక్తుల మధ్య సమన్వయం ఏర్పడేలా చూడాలి.

సాంకేతికతను బాగా ఉపయోగించుకోవాలి..

ఇప్పట్లో సాంకేతికత చాలా అభివృద్ది చెందింది.  పనిని సులభతరం చేయడానికి  సాంకేతిక సాధనాలను ఉపయోగించుకోవాలి. దీనితో  పని,  జీవితం మధ్య మంచి బ్యాలెన్సింగ్ సాధించవచ్చు. ఇంటి పనులను కుటుంబ సభ్యులతో కలసి షేర్ చేసుకోవడం వల్ల మహిళలకు కొంత ఊరట లభిస్తుంది.

స్వీయ సంరక్షణ ముఖ్యం..

మహిళలు శక్తివంతంగా ఉండాలి. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. వ్యాయామం చేయడం, చదవడం, ఇష్టమైన  వారితో సమయం గడపడం వంటివన్నీ మానసిక ,  శారీరక  ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

విజయాలను సెలబ్రేట్ చేసుకోండి..

మహిళలు సాధించే విజయాలు చిన్నవా, పెద్దవా అనే విషయం కాదు సక్సెస్‌లు చిన్నదైనా, పెద్దదైనా వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి.  పనిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ విజయాన్ని గుర్తించాలి. ఎవరో మీ విజయాన్ని గుర్తించి మిమ్మల్ని అభినందించాలనే ఆలోచన వదిలిపెట్టాలి. చిన్న విజయాలే పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి చేయూతనిస్తాయి. ఉత్సాహాన్ని పెంచుతాయి.  ఇది మహిళల మనస్తత్వాన్ని పాజిటివ్ గా ఉంచుతుంది.

మంచి  కమ్యూనికేషన్..

 సహోద్యోగులతో,  కుటుంబ సభ్యులతో మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. మహిళలు తమ ప్రాధాన్యతలు,  బాధ్యతలను వారికి తెలపాలి. ఉద్యోగం, ఇంటి జీవితం విషయంలో వారి సహాకారం, పని ముగించడానికి కావలసిన సమయం విషయంలో స్పష్టత ఇవ్వాలి.  వృత్తిపరమైన బాధ్యతల గురించి  కుటుంబ సభ్యులకు కూడా అర్థమయ్యేలా వివరించాలి.  ఇలా చేయడం వల్ల  జీవితంలో స్థిరత్వం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలిగే ఏ సందర్బాన్ని వీలైనంత వరకు వదులుకోవద్దు. ప్రతి మహిళ బలం కుటుంబం అయితే ఆమె వృత్తి జీవితాన్ని కూడా విజయవంతంగా నెగ్గుకురాగలదు.

                                                    *నిశ్శబ్ద.


మహిళలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకుంటే ఈ మూడు సమస్యలే కారణం కావచ్చు!

మహిళలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గకుంటే ఈ మూడు సమస్యలే కారణం కావచ్చు!

ప్రస్తుతకాలంలో అధికశాతం మంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో అధిక బరువు ప్రధానంగా ఉంది. అధిక బరువు క్రమంగా గుండె సంబంధ సమస్యలు,  మధుమేహం, కీళ్ల నొప్పులు, ఎముకల అరుగుదల వంటి సమస్యలకు కారణం అవుతుంది. అదే విధంగా అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు కూడా కారణం అవుతుంది. ప్రస్తుతం అధిక బరువు సమస్యకు వయసుతో కూడా సంబంధం లేదు.

ఈ అధిక బరువు మీద చాలా మందికి ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. దీన్ని తగ్గించుకోవడానికి  జిమ్ చేయడం, వ్యాయామాలు, ఆహారంలో మార్పులు వంటివి ఎన్నో ప్రాక్టీస్ చేస్తారు. ఇన్ని చేసినా సరే అధిక బరువు తగ్గడం లేదంటే అసలు కారణాలు వేరే ఉన్నాయని అర్థం. అవేంటో తెలుసుకుంటే..

థైరాయిడ్ సమస్యలు..

ఆహారం, వ్యాయామం, జీవనశైలి వంటి విషయాలలో ఎన్ని మార్పులు చేసుకున్నా బరువు విషయంలో ఏమాత్రం మార్పులు కనబడకపోతే థైరాయిడ్ సమస్య ఉందేమో చెక్ చేయించుకోవాలి.  థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో బరువు పెరుగుదల దారుణంగా ఉంటుంది.

ఒత్తిడి..

ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నవారు బరువు విషయంలో మార్పులు పొందలేరు. ఎందుకంటే ఒత్తిడి కారణంగా శరీరంలో హార్మోన్లు ప్రభావం అవుతాయి. ప్రధానంగా ఒత్తిడి సమయంలో శరీరంలో కార్టిసాల్ హర్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది.  ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. నెలసరి సమస్యలు, మెనోపాజ్, ఇతర ఒత్తిడులు బరువు మీద ప్రభావం చూపిస్తాయి.  ఒకవేళ ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిలో అధిక బరువు సమస్య ఉంటే బరువు తగ్గడం కంటే ముందు ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నం చెయ్యాలి.

నిద్ర..

పౌష్టికాహారం తీసుకుంటున్నా, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా బరువు విషయంలో ఎలాంటి మార్పులు లేవని చింతించేవారు ఉంటారు. అయితే అలాంటి వారు నిద్ర విషయంలో సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవాలి. నిద్రసరిగ్గా లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు.  నిద్ర వేళలు సరిగ్గా ఫాలో అవ్వకపోతే వారి రోజు మొత్తం గందరగోళంగా గడిచిపోతుంది. ఈ చికాకుల కారణంగా హార్మోన్లు కూడా ప్రభావితం అవుతాయి. అందుకే బరువు తగ్గాలని అనుకుంటే ముందు సరైన నిద్ర వేళలు పాటించాలి. రాత్రి 10 నుండి 11 గంటల లోపు నిద్రపోవడం. ఉదయాన్నే 6నుండి 6-30  నిమిషాల లోపు నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. రోజు ఖచ్చితంగా 7నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

                                                        *నిశ్శబ్ద.


నెలసరి సమయంలో ఈ తప్పులు చేయకండి.. ఫెలోపియన్ ట్యూబ్‌లు మూసుకుపోతాయ్!

నెలసరి సమయంలో ఈ తప్పులు చేయకండి.. ఫెలోపియన్ ట్యూబ్‌లు మూసుకుపోతాయ్!


నెలసరి మహిళలను ప్రతినెల పలకరిస్తుంది.  ఋతుచక్రం మొదలైనప్పటి నుండి మెనోపాజ్ దశ దాటే వరకు ప్రతి మహిళకు ప్రతినెల పీరియడ్స్ వస్తుంటాయి. సాధారణ ఋతు చక్రం 28 రోజుల పాటు ఉంటుంది,  నెలసరి సగటున 5 రోజుల పాటు కొనసాగుతుంది.  అయితే నెలసరి సమయంలో మహిళలు చేసే కొన్ని తప్పుల కారణంగా పెద్ద సమస్యలు వచ్చి పడతాయి.  ముఖ్యంగా పెలోపియన్ ట్యూబ్ లు మూసుకుని పోతాయని అంటున్నారు మహిళా వైద్యులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

నెలసరి సమయంలో పరిశుభ్రత..

ఋతుస్రావ సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ సమయంలో మంచి పరిశుభ్రత పాటించకపోతే స్వల్పకాలిక , దీర్ఘకాలిక సమస్యలు తలెత్తవచ్చు. ప్రారంభంలో, దురద, మంట, దద్దుర్లు, యోని స్రావాలు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు , పునరుత్పత్తి నాళాల ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేసినా లేదా అవి పదేపదే వచ్చినా, అవి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, పెల్విక్ నొప్పి, జ్వరం, ఫెలోపియన్ ట్యూబ్‌ల వాపు లేదా ట్యూబ్‌లు మూసుకుపోవడానికి దారితీయవచ్చు, ఇవి చివరికి పిల్లలు పుట్టుకుండా ఉండటానికి కారణం కావచ్చని మహిళా వైద్యులు అంటున్నారు. అందువల్ల నెలసరి సమయంలో పరిశుభ్రత గురించి అస్సలు కాంప్రమైజ్ కాకూడదు.

క్లాత్ ప్యాడ్ లు వద్దు..

పీరియడ్ ఉత్పత్తుల విషయానికి వస్తే, మార్కెట్లో చాలా ఛాయిస్ లు  అందుబాటులో ఉన్నాయి. వీటిలో సర్వసాధారణమైనవి శానిటరీ ప్యాడ్లు. డిస్పోజబుల్ ప్యాడ్లు , క్లాత్ ప్యాడ్లు రెండూ వాడతారు, ఎందుకంటే అవి ఉపయోగించడానికి సులభంగా ఉంటాయి. అయితే, ఏదైనా పీరియడ్ ఉత్పత్తిని ఉపయోగించే ముందు, మీ వయస్సు, ఫ్లో , సౌకర్యానికి సరిపోయే సరైన సైజును ఎంచుకోవడం ముఖ్యం.  

క్లాత్ ప్యాడ్లను వాడకపోవడం మంచిదని మహిళా వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిని ఎంత బాగా శుభ్రం చేసినా, అవి సేఫ్ కాదని,  వాటివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ప్యాడ్ పూర్తిగా తడిసినా లేదా తడవకపోయినా ప్రతి 6 నుండి 8 గంటలకు మార్చాలి. టాంపోన్లు , మెన్స్ట్రువల్ కప్‌లను యోని లోపల ఉపయోగిస్తారు,  వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నేర్చుకోకుండా వాటిని ఉపయోగించడం కూడా సమస్యలు తెచ్చిపెడుతుందట.

టాంపోన్ లు..

టాంపోన్ లు తీయడానికి సహాయపడే ఒక దారం ఉంటుంది. ట్యాంపూన్‌లను ప్రతి 4 నుండి 6 గంటలకు మార్చాలి. రాత్రిపూట ట్యాంపూన్‌లను వాడటం మానుకోవాలి, ఎందుకంటే వాటిని 8 గంటల కంటే ఎక్కువసేపు లోపల ఉంచుకోవడం వల్ల టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే తీవ్రమైన సమస్య వచ్చే అవకాశం ఉంటుదట.

మెన్స్ట్రువల్ కప్..

ఒకసారి మెన్స్ట్రువల్ కప్  వాడకం అలవాటయ్యాక, మెన్‌స్ట్రువల్ కప్‌ను ఉపయోగించడం చాలా సులభం,  సౌకర్యవంతంగా ఉంటుంది.  ఇది పర్యావరణానికి అనుకూలమైనది. ఒకసారి నింపిన తర్వాత, దానిని తీసివేసి, శుభ్రం చేసి, తిరిగి ఉపయోగించుకోవచ్చు. సరిగ్గా శుభ్రం చేసి, క్రిమిరహితం చేస్తే, ఒక మెన్‌స్ట్రువల్ కప్ 5 నుండి 8 సంవత్సరాల వరకు వాడుకోవచ్చట.

పీరియడ్ ప్యాంటీలు..

ఈ రోజుల్లో పీరియడ్ ప్యాంటీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ముఖ్యంగా టీనేజర్లలో , ఇప్పుడిప్పుడే రుతుస్రావం మొదలైన వారిలో బాగా ఆదరణ పొందాయి. లీకేజీ ప్రమాదాన్ని తగ్గించడానికి వీటిని తరచుగా ప్యాడ్‌లతో కలిపి ఉపయోగిస్తారు. టాంపన్‌లు , మెన్‌స్ట్రువల్ కప్‌లు కూడా లీకేజీని  నిరోధించడంలో బాగానే సహాయపడతాయి.

పరిశుభ్రత..

నెలసరి సమయంలో  పరిశుభ్రతను పాటించడానికి కొన్ని  జాగ్రత్తలు అవసరం. ప్రతిసారి ప్యాడ్స్ మార్చుకునే ముందు పరిశుభ్రత చూసుకోవాలి. ప్రతిసారి మార్చే ముందు , తర్వాత చేతులు కడుక్కోవాలి. వాడిన ప్యాడ్‌లు లేదా ఇతర ఉత్పత్తులను కాగితంలో లేదా కవర్‌లో చుట్టి, మూత ఉన్న చెత్తబుట్టలో పారవేయాలి. వాటిని ఎప్పుడూ టాయిలెట్‌లో ఫ్లష్ చేయకూడదు.

ఈ విషయాలలో శ్రద్ద అవసరం..

నెలసరి సమయంలో క్రమం తప్పకుండా స్నానం చేయాలి , గోరువెచ్చని నీటితో జననాంగాలను శుభ్రం చేసుకోవాలి. అధికంగా సబ్బు, ముఖ్యంగా సువాసనగల సబ్బు, డియోడరెంట్, టాల్క్ లేదా యాంటీబయాటిక్ సబ్బు వాడకాన్ని నివారించాలి. వి-వాష్‌ను కూడా అధికంగా ఉపయోగించకూడదు. తరచుగా దురద, దద్దుర్లు, స్రావాలు లేదా ఇన్ఫెక్షన్లు ఎదుర్కొనే వారు మాత్రమే దీనిని ఉపయోగించాలి. లేకపోతే, సాధారణంగా  యోని సహజంగానే శుభ్రపడుతుంది. డూషింగ్‌ను కూడా నివారించాలి. ఈ విధంగా నెలసరి సమయంలో మహిళలు శుభ్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

                                     *రూపశ్రీ.


ఎంత ప్రయత్నం చేసినా వంటింట్లో బొద్దింకలు పోవడం లేదా..ఈ పవర్పుల్ టిప్స్ ట్రై చేయండి..!

బొద్దింకలు చాలామంది ఇళ్లలో చాలా పెద్ద సమస్యగా ఉంటాయి.  ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా బొద్దింకలు ఎందుకు వస్తున్నాయో అని చాలామంది  గందరగోళానికి గురవుతూ ఉంటారు.  బొద్దింకలు ఇంటిని గందరగోళం చేయడమే కాకుండా వాటి కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. చాలామందిలో అలర్జీలు, ఆస్తమా కు కూడా కారణం అవుతాయి. అయితే బొద్దింకలను వదిలించుకోవడానికి ఖరీదైన క్రిమి సంహారకాలు వాడుతుంటారు.  దీనివల్ల బొద్దింకలు చావడం అటుంచితే..  ఇంటి సభ్యుల ఆరోగ్యానికి కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ తో బొద్దింకలను ఎలా వదిలించుకోవాలో తెలుసుకుంటే..

ఈ విషయం గుర్తుంకోవాలి..

బొద్దింకలు సాధారణంగా రాత్రిపూట చాలా చురుకుగా ఉంటాయి. అవి తేమ, చీకటి , చిన్న ఆహార కణాల పట్ల ఎక్కువగా ఆకర్షింపబడతాయి. అందుకే అవి సింక్‌ల కింద, గ్యాస్ స్టవ్‌ల వెనుక, వంటగది క్యాబినెట్‌లలో, డ్రెయిన్‌లలో , రిఫ్రిజిరేటర్ చుట్టూ సులభంగా దాక్కుంటాయి. అందువల్ల, వంటగదిని శుభ్రంగా ఉంచడం, నీటి లీక్‌లు లేకుండా చూసుకోవడం, ఆహారాన్ని ఎల్లప్పుడూ గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేయడం చాలా ముఖ్యం.

బొద్దింకలను ఎలా తరిమేయవచ్చు..?

బేకింగ్ సోడా , చక్కెర మిశ్రమం బొద్దింకలను తరిమివేయడంలో  చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెండు పదార్థాలను సమాన పరిమాణంలో కలిపి, బొద్దింకలు తరచుగా వచ్చే ప్రదేశాలలో ఉంచాలి. చక్కెర వాటిని ఆకర్షిస్తుంది, అయితే బేకింగ్ సోడా వాటి శరీరంపై పనిచేసి, వాటిని నిర్మూలించడంలో సహాయపడుతుంది. దీని ప్రభావం కొనసాగడానికి, ఈ మిశ్రమాన్ని ప్రతి కొన్ని రోజులకు మార్చాలి

ఫుడ్ గ్రేడ్ డయాటోమేషియస్ ఎర్త్ ..

ఫుడ్ గ్రేడ్  డయాటోమేషియస్ ఎర్త్ కూడా ఒక మంచి ఎంపిక. ఇది ఒక సహజమైన పొడి, ఇది బొద్దింకల శరీరం యొక్క బయటి పొరను దెబ్బతీసి, వాటిని క్రమంగా చంపుతుంది. దీనిని ఎల్లప్పుడూ పొడి ప్రదేశాలలో చల్లాలి,  తేమ ఉన్న చోట దీన్ని చల్లితే తేమ కారణంగా ఈ పొడి పవర్ తగ్గుతుంది.

ఇవి కూడా పాటించవచ్చు..

ఫుడ్ గ్రేడ్ డయాటోమేషియస్ ఎర్త్

పుదీనా, టీ ట్రీ లేదా యూకలిప్టస్ వంటి సుగంధ నూనెలు కూడా ఉపయోగపడతాయి. ఈ నూనెలలో కొన్ని చుక్కలను ఒక స్ప్రే బాటిల్‌లో వేసి అందులో నీటితో కలిపి, వంటగది మూలలు, సందులు , డ్రెయిన్‌ల చుట్టూ చల్లాలి. వాటి ఘాటైన వాసన బొద్దింకలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. బిర్యానీ  ఆకులు కూడా ఒక సులభమైన ఇంటి చిట్కా. ఎండిన బిర్యానీ ఆకులను కొద్దిగా నలిపి, వాటిని అల్మారాలు, డ్రాయర్లు , నిల్వ ప్రదేశాలలో ఉంచాలి.. బొద్దింకలకు వాటి వాసన నచ్చదు , అవి ఈ ప్రదేశాలకు దూరంగా ఉంటాయి. వైట్  వెనిగర్ కలిపిన  నీటితో కిచెన్ కౌంటర్ ను  శుభ్రపరచడం వల్ల జిడ్డు , చిన్న చిన్న మరకలు, వంటివి తొలగిపోతాయి, ఇది బొద్దింకల బెడదను తగ్గిస్తుంది.

 

                             *రూపశ్రీ.

 


మహిళలు ఆర్థికంగా ఎదగడం వైవాహిక బంధం విచ్చిన్నానికి  దారి తీస్తుందా.!

మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడం, సొంతంగా సంపాదించడం సమాజంలో ఒక కీలకమైన సానుకూల మార్పు. అయితే, మహిళల ఆర్థిక ఎదుగుదల వైవాహిక బంధాలను దెబ్బతీస్తోందని లేదా విడాకులకు దారితీస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఈ  చర్చ ఈమధ్య తరచూ వినబడుతోంది. నిజానికి ఆర్థిక స్వాతంత్ర్యం అనేది నేరుగా బంధాన్ని విచ్ఛిన్నం చేయదు. కానీ, సమాజంలో ఊహించని వేగంతో వస్తున్న ఈ మార్పును పాతకాలపు ఆలోచనా విధానంతో స్వీకరించడానికి ప్రయత్నించినప్పుడు కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతాయి.

మహిళల ఆర్థిక బలం.. ఆత్మగౌరవం..

మహిళకు ఆర్థికంగా బలం చేకూరినప్పుడు ఆమెకు ఆలోచనా స్వేచ్ఛ, నిర్ణయాధికారం , ఆత్మగౌరవం పెరుగుతాయి. గతంలో ఆర్థికంగా భర్తపైనే పూర్తిగా ఆధారపడటం వల్ల చాలామంది మహిళలు గృహహింస, వేధింపులు లేదా అసంతృప్తికరమైన దాంపత్య జీవితాన్ని భరిస్తూ నడుపుకొచ్చేవారు. ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకున్న మహిళలు గౌరవం లేని చోట లేదా వేధింపులు ఉన్న చోట ఉండటానికి సిద్ధంగా లేరు. ఇలా వేధింపుల నుండి తిరగబడి ఆ బంధం నుండి బయటకు రావడాన్ని చాలా మంది  వైవాహిక బంధం విచ్ఛిన్నం కావడంగా చూస్తున్నారు. ఇలా చూడటం కంటే, అణచివేతకు గురైన మహిళ తనకు తానుగా తీసుకుంటున్న నిర్ణయంగా అర్థం చేసుకోవాలి.

పురుషుల ఆలోచన మారాలి..

మహిళలు కూడా ఆర్థికంగా ఎదుగుతున్న  మార్పుల మధ్య వైవాహిక బంధం దృఢంగా ఉండాలంటే పురుషుల ఆలోచనా విధానం , ప్రవర్తన చాలా కీలకం. ఈ విషయంలో పురుషులు అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు  ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

అహంకారాన్ని పక్కన పెట్టడం..

సమాజంలో దశాబ్దాలుగా పురుషుడే ఇంటికి యజమాని , సంపాదకుడు అనే భావన బలంగా నాటుకుపోయింది. భార్య తమకంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడో లేదా ఉన్నత పదవిలో ఉన్నప్పుడో కొందరు పురుషుల్లో ఈగో లేదా అభద్రతా భావం తలెత్తుతుంది. భార్య విజయాలను తమ విజయాలుగా భావించడం, ఆమె ఎదుగుదలను చూసి గర్వపడటం భర్తలు అలవాటు చేసుకోవాలి.

బాధ్యతలు పంచుకోవడం..

పూర్వం మహిళలు ఇంటి పనులకే పరిమితమయ్యేవారు. ఇప్పుడు మహిళలు బయట ఉద్యోగం చేస్తూ సమయాన్ని, శ్రమను వెచ్చిస్తున్నారు. కాబట్టి, ఇంటి పనులు, పిల్లల పెంపకం కేవలం మహిళ బాధ్యత మాత్రమే కాదు. ఇంటి పనుల్లో భార్యకు భాగస్వామ్యం ఇవ్వడం, పనులను పంచుకోవడం వల్ల ఆమెపై మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.

ఆధిపత్య పోరు కాదు.. భాగస్వామ్యం ఉండాలి..

వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల సమాన భాగస్వామ్యం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. ఆర్థిక నిర్ణయాలు, కుటుంబ నిర్ణయాలు ఇద్దరూ కలిసి చర్చించి తీసుకోవాలి. భార్య సంపాదనను నియంత్రించాలని చూడకుండా, ఆమెకు నిర్ణయాధికారంలో ప్రాధాన్యత ఇవ్వాలి.

స్పష్టత..

దంపతుల మధ్య కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా ఉండాలి. సంపాదన, ఖర్చులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఏవైనా సందేహాలు లేదా చిన్నపాటి మనస్పర్థలు వచ్చినప్పుడు వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప మౌనంతో లేదా ఆధిపత్యంతో పరిష్కరించూసుకోవాలని అనుకోకూడదు. బంధంలో మౌనం అనేది చాలా పెద్ద అగాధాలు సృష్టిస్తుంది.

మెంటల్ సపోర్ట్..

ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో మహిళలకు రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. అటువంటి సమయంలో భర్త నుంచి లభించే మెంటల్ సపోర్ట్ ఆమెకు కొండంత బలాన్నిస్తుంది. ఆమె ఆశయాలకు, లక్ష్యాలకు ప్రోత్సాహాన్ని అందించే భాగస్వామిగా పురుషుడు నిలవాలి. అప్పుడు భార్య మాత్రమే కాదు.. అందరి దృష్టిలో భర్త మరింత ఉన్నత స్థాయికి వెళతాడు. 

చివరగా.. 

మహిళల ఆర్థిక ఎదుగుదల వైవాహిక బంధానికి ముప్పు కాదు, అది కుటుంబ ఆర్థిక స్థితిని బలపరిచే ఒక గొప్ప మార్గం. సమానత్వం, పరస్పర గౌరవం, అర్థం చేసుకునే గుణం ఉన్న చోట మహిళ ఆర్థిక ఎదుగుదల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది తప్ప విచ్ఛిన్నం చేయదు. పురుషులు పాతకాలపు ఆలోచనలను వీడి కొత్త దృక్పథంతో ముందడుగు వేసినప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన దాంపత్య జీవితం సాధ్యమవుతుంది.

                   *రూపశ్రీ.

 


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.