.webp)
'అక్కినేని నాగార్జున(Nagarjuna)పూరి జగన్నాధ్(Puri Jagannadh)కాంబోలో వచ్చిన 'సూపర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన బాలీవుడ్ నటుడు'సోనుసూద్'(sonu Sood)'అరుంధతి' సినిమాతో అయితే స్టార్ యాక్టర్ గా గుర్తింపు పొంది,ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన క్యారెక్టర్స్ ని పోషించి తన స్టామినాని చాటి చెప్పాడు.హిందీ చిత్ర సీమలో ఎక్కువ సినిమాలు చేసిన సోనుసూద్, తెలుగుతో పాటు తమిళ,కన్నడ భాషలకి సంబంధించిన చిత్రాల్లోను నటించాడు.రీసెంట్ గా గత నెలలో 'ఫతే' అనే హిందీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
రీసెంట్ గా సోను సూద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'చంద్రబాబునాయుడు'(Chandrababu Naidu)ని కలిసాడు. తన సోనుసూద్ ఫౌండేషన్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్‌లు విరాళంగా ఇచ్చాడు.ఈ సందర్భంగా సోనుసూద్ ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.సోనుసూద్ చాలా కాలం నుంచి పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
