
లెజెండరీ నటుడు శోభన్ బాబు (Sobhan Babu) ఇంట విషాదం చోటు చేసుకుంది. శోభన్ బాబు తమ్ముడు ఉప్పు సాంబశివరావు (Uppu Sambasiva Rao) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. వీరి స్వగ్రామమైన కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చిన్న నందిగామలో అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. సాంబశివరావు మృతితో చిన్న నందిగామ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, శోభన్ బాబు 2008 మార్చి 20న 71 ఏళ్ళ వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.