చెన్నై లో కృష్ణన్, ఉమా కృష్ణాన దంపతులకు జన్మించిన త్రిష రామ్ నాడ్ లోని M.S.E.C కాలేజ్ మరియు చెన్నై సేక్రెడ్ హార్ట్ చర్చ్ స్కూల్ లో విద్యనభ్యసించారు. స్కూల్లో చదువుతున్న రోజుల లో త్రిష పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పాటలలో పాలు పంచుకునేది. అటు తర్వాత కాలేజికి వచ్చేసరికి మోడలింగ్, అందాల పోటీలలో పాల్గొనడం మొదలయింది. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల లో అనర్గళంగా మాట్లాడగల త్రిష ఫాంటా, టాటా ఇండికామ్ వివెల్ ఐ.టీ.సీ. వంటి ఎన్నో టీవీ ప్రకటనల తో పాటుగా ఫల్గుని పాథక్ మ్యూజిక్ ఆల్బం మేరి చునర్ ఉడ్ ఉడ్ జాయే లో ఆయేష తకియా స్నేహితురాలిగా నటించింది. ఈ విడియో ఎంతగానో పాపులర్ అయి త్రిషకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.
త్రిష తన సినీ జీవితాన్ని జోడి అనే తమిళ చిత్రం లో సిమ్రాన్ స్నేహితురాలిగా పెద్దగా గుర్తింపు లేని పాత్రతో మొదలు పెట్టింది. త్రిష మొట్టమొదటి సారిగా చేపట్టిన సినిమా ప్రియదర్శన్ దర్శకత్వం లోని లేసా లేసా అనే చిత్రం. దీనికి అనుబంధం గా ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూర్చిన ఎనక్కు 20 ఉనక్కు 18 చిత్రం లో అవకాశం కూడా లభించింది కానీ ఈ చిత్రాల విడుదల చాల ఆలస్యమయింది. ఈలోపు త్రిష అమీర్ నిర్మించిన మౌనం పెసియాదే అనే తమిళ చిత్రం తో హిరోయిన్ గా మొదటి సారి తెర పై కనిపించింది. సూర్య శివకుమార్ తో కలిసి జంటగా నటించిన ఈ చిత్రం ఒక షుమారుగా విజయవంతమై త్రిష కు మంచి పేరు ప్రతిస్థలను తెచ్చి పెట్టింది. దీని తర్వాత విక్రం తో హిరోయిన్ గా వచ్చిన సామి అనే చిత్రం ఎనలేని విజయం సాధించడం తో త్రిష కు అవకాశాల మీద అవకాశాలు రావడం మొదలయింది.
2004 లో త్రిష వర్షం చిత్రం ద్వారా తెలుగు సినిమాలలోకి ప్రవేశించింది. ఈ చిత్రానికి హీరో ప్రభాస్ కాగా, ఈ చిత్రం ఆ సంవత్సరం అన్ని చిత్రాలకంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసి రికార్డు సృష్టించడమే కాకుండా త్రిషను తెలుగులో హిరోయిన్ గా నిలబెట్టింది. దీని తర్వాత వ్యాపార పరంగా విజయవంతమైన ఘిల్లి తమిళ సినిమా అనంతరం ప్రభ దేవా దర్శకుడిగా త్రిష -సిద్దార్ధ నారాయణ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం త్రిషకు నంది మరియు ఫిల్మ్ ఫేర్ అవార్డులను తెచ్చిపెట్టింది. అటు తమిళ సినిమాలలోను, ఇటు తెలుగు సినిమాలలోనూ పాలు విజయవంతమైన చిత్రాలలో నటించిన త్రిష 2010 లో ప్రియదర్శన్ దర్శకత్వం లో అక్షయ్ కుమార్ సరసన ఖట్టా మీఠా చిత్రం తో బాలివుడ్ ప్రవేశం చేసింది. ఇలా తమిళ, తెలుగు, హిందీ చిత్రాల లో వరస విజయాలతో పయనిస్తున్న త్రిష కొన్ని వివాదాలకు గురి కావడం కూడా జరిగింది. 2004 లో త్రిష బాత్రూం లో నగ్నంగా స్నానం చేస్తున్న రెండున్నర నిమిషాల నిడివి గల విడియో క్లిప్ ఇంటర్నెట్ లో ఎవరో దుండగులు పోస్ట్ చేసారు. త్రిష ఆ క్లిప్ లో వున్నది తాను కానని, ఎవరో తనపై బురద చల్లడానికే ఇలా చేసారని పోలీసు లకు పిర్యాదు కూడా చేసింది.
అనంతరం ఆమె నగ్న చిత్రాలను పత్రికలో ప్రచురించినందుకు గాను నేత్రికన్ పత్రిక సంపాదకుడిని పోలీసులు అరెస్టు చేసారు. 2010 లో హైదరాబాద్ లో చోటు చేసుకున్న మాదక ద్రవ్యాల కేసులో కూడా త్రిష పేరు వినబడింది. హైదరాబాదులో పట్టుబడ్డ నైజేరియా దేశానికి చెందిన మాదక ద్రవ్యాల వ్యాపారి చీమా క్లెమెంట్ క్లయింట్ల లిస్టు లో ఇతర సినీ ప్రముఖుల తో బాటు త్రిష పేరు కూడా వుందని ఓ తెలుగు చానెల్ ఆరోపించింది. తను తెలుగు సినీ పరిశ్రమ లో అనగదోక్కడానికే ఇలా అభాండాలు వేస్తున్నారంటూ త్రిష ఆ చానెల్ పై దావా వేయడము కూడా జరిగింది. |