Home » Vegetarian » Batani Gravy Curry


 

 

బఠానీ గ్రేవీ కర్రీ

 

 

 

కావాల్సిన పదార్థాలు:

తెల్ల బఠానీ - 1/4 కేజీ
కొబ్బరి తురుము - ఒక కప్పు
ఉల్లి తరుగు - ఒక కప్పు
అల్లం తరుగు -  ఒక స్పూన్
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్
వెల్లుల్లి ముద్ద - అర స్పూన్
చింతపండు గుజ్జు - చిన్న కప్పుతో
కారం ,ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు
 పంచదార - ఒక స్పూను
గరం మసాలా - రెండు స్పూన్లు
నూనె - పోపుకి తగినంత

 

తయారు చేసే విధానం:
1. ముందుగా బఠానీలను ముందురోజే నానబెట్టుకోవాలి. అలా నానిన బఠానీలను ఓ 5 విజిల్సు వచ్చేదాకా కుక్కర్‌లో ఉడికిస్తే పూర్తిగా గట్టిగా కాకుండా, అలా అని పూర్తిగా మెత్తబడకుండా ఉంటాయి.

2. కూర తయారీకి ముందుగా బాణీలో నూనె వేసుకుని, ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, తరుగులు వేసి వేయించాలి. ఆ తర్వాత వెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, గరం మసాలా కూడా చేర్చి కాసేపు  వేయించాక చింతపండు గుజ్జు, కొబ్బరి తురుము, పంచదార కూడా వేసుకుని అన్నిటినీ బాగా కలిపి ఆఖరున ముందుగా ఉడికించిన బఠానీలు, ఉప్పు  చేర్చి కలియబెట్టాలి. ఓ చిన్న కప్పు నీరు పోసి మూత పెట్టాలి. సన్నని మంట మీద ఓ పదినిమిషాలు ఉడికిస్తే బఠానీలకు ఉప్పు, కారం, మసాలా, పులుపు అన్నీ  చక్కగా పట్టి మంచి రుచి వస్తుంది.

3. ఈ కూర రోటీలలోకి బావుంటుంది.

-రమ

 


Related Recipes

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

Aloo Batani Pulao

Vegetarian

పన్నీర్ క్యాప్సికమ్ కర్రి

Vegetarian

Colourfull Vegetable Salad (Holi Special)

Vegetarian

Bottle Gourd Sweet Curry with Milk

Vegetarian

Moong Dal Kosambari