Home » Vegetarian » క్యాప్సికమ్ పనీర్ కర్రీ!


క్యాప్సికమ్ పనీర్ కర్రీ!

 

 

కావలసిన పదార్థాలు:

క్యాప్సికం - అరకేజి 

పన్నీర్ - పావుకేజీ 

యాలకులు - మూడు 

దాల్చిన చెక్క  - చిన్న ముక్క

జీలకర్ర - 1 స్పూన్ 

కారం - 2  స్పూన్లు 

ధనియాల పొడి  - ఒకటిన్నర స్పూన్లు

ఉల్లిపాయలు  - ఐదు 

అల్లం వెల్లుల్లి ముద్ద - 2 స్పూన్లు 

పసుపు - కొద్దిగా 

చింతపండు - కొద్దిగా

లవంగాలు  -  నాలుగు 

నూనె - సరిపడా

ఉప్పు  - తగినంత

వేరుశనగ పప్పు - ఒక  కప్పు 

కొత్తిమీర - కొంచం 

పుదీనా - కొంచం

కరివేపాకు - కొద్దిగా

తెల్ల నువ్వులు - 2 స్పూన్లు  

తయారుచేసే పద్ధతి:

ముందుగా  ఉల్లిపాయలు, క్యాప్సికం కట్ చేసి పెట్టుకోవాలి.

తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేరుశనగ పప్పులు, నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకుని అందులోనే నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను, పన్నీర్‌ను విడివిడిగా వేయించుకోవాలి.

ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, వేరుశనగ పప్పులు, చింతపండు, పుదీనా, కరివేపాకు, ఉప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత  స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ , యాలకులు, లవంగాలు, వేయాలి.

తర్వాత క్యాప్సికం ముక్కలు, మసాలా పేస్ట్, కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.

ఇప్పుడు  ధనియాల పొడి, కారం వేసి  పది నిమిషాలు ఉడికించాలి. చివరలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.


Related Recipes

Vegetarian

కడాయి పన్నీర్ మసాలా

Vegetarian

కాజు ప‌నీర్‌

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

పాలక్ పనీర్

Vegetarian

మలై పనీర్ కుర్మా

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

Palak Paneer