Home » Vegetarian » Aloo Vankaya Curry
ఆలూ వంకాయ కూర
కావాల్సిన పదార్ధములు:
వంకాయ ముక్కలు - 250 గ్రా
ఆలూ గడ్డ - 150 గ్రా
మునక్కాడ - ఒకటి
ఉల్లిపాయ తరుగు - రెండు
పచ్చిమిర్చి - రెండు
టమాటో - మూడు
అల్లం వెల్లులి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్స్
ఆవాలు - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
ఎండు మిర్చి - రెండు
ఉప్పు - తగినంత
పసుపు - పావు టేబుల్ స్పూన్
కారం - ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా - అర టేబుల్ స్పూన్
నూనె - పావు కప్పు
చింతపండు - సరిపడ
తయారీ విధానం:
* నూనె వేడి చేసి అందులో మునక్కాడ ముక్కలు వేసి 3-4 నిమిషాలు పాటు మగ్గనిచ్చి పక్కకి తీసుకోవాలి.
* అదే నూనెలో వంకాయ ముక్కలు మరియు ఆలు గడ్డ ముక్కలు వేసి వంకాయ మెత్తగా, ఆలూ గడ్డ బంగారు రంగు వచ్చేదాకా వేపుకుని పక్కనపెట్టుకోవాలి.
* తర్వాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలి.
* ఉల్లిపాయ తరుగు , ఉప్పు , పసుపు వేసి మగ్గెవరకు వుంచాలి.
* మగ్గిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లులి పేస్టు వేసి వేపుకోవాలి, తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కొద్దిగా నీళ్లు పోసి మాడకుండా వేపుకోవాలి.
* టమాటో తరుగు వేసి గుజ్జుగా అయ్యేదాకా మగ్గనివ్వాలి.
* మగ్గిన టమాటోలో వేపిన ఆలూ, వంకాయా, మునక్కాడ ముక్కలు వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి 4 నిమిషాలు మగ్గనివ్వాలి.
* మగ్గిన తరువాత చింతపండు పులుసు పోసి మునక్కాడ మెత్తబడేదాకా మూతపెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.
* కొత్తిమీర తరుగు గరం మసాలా వేసి కలిపితే మనకు కావాల్సిన ఆలూ వంకాయ కూర రెడీ.