RELATED EVENTS
EVENTS
సిలికానాంధ్ర మనబడి ద్వితీయ సాంస్కృతికోత్సవం

 

 

సిలికానాంధ్ర మనబడి ద్వితీయ సాంస్కృతికోత్సవం Falls Church High School , Viriginia లో ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమం లో మేరీల్యాండ్ , వర్జీనియా రాష్ట్రాల నుంచి వచ్చిన 250 మనబడి విద్యార్థుల ప్రదర్సనలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రోజంతా వర్షం పడుతూనే ఉన్న మనబడి కార్యక్రమాల మీద ఉన్న ఆసక్తి తో దాదాపు 900 మంది విచ్చేసి ఈ సాంస్కృతికోత్సవ కార్యక్రమాన్నిఎంతో విజయవంతం చేశారు . మనబడి విద్యార్థుల తెలుగు ప్రతిభ పాటవాలు చూసి చాలామంది మేము కూడా మా పిల్లలని వచ్చే విద్యా సంవత్సరం మనబడి లో చేర్పిస్తాము అని చెప్పారు . చాలామంది వారికి దగ్గరలో మరిన్ని మనబడి సెంటర్స్ ని ప్రారంభిన్చావలసినది గా అభ్యర్థించారు .

 


సిలికానాంధ్ర  మనబడి  సాంస్కృతికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ga కాలిఫోర్నియా  నుంచి  మనబడి  అధ్యక్షులు  శ్రీ . రాజు  చామర్తి  గారు , సిలికానాంధ్ర  ఉపాధ్యక్షులు  శ్రీ .దీనబాబు  కొండుభట్ల  గారు ,స్నేహ  వేదుల  గారు , న్యూ జెర్సీ  నుంచి  శ్రీ  శరత్  వేట  గారు , V.P Global development,విచ్చేసి  విద్యార్థులకు  ప్రశంస  పత్రాలు , ఉపాధ్యాయులకు జ్ఞాపికలు  అందచేసారు.


ఈ  కార్యక్రమాన్ని  విజయవంతయం  చేయడానికి  కృషి  చేసిన  విద్యార్థులకు , విద్యార్థులు  తల్లిదండ్రులకు ,స్వచ్చందంగా పనిచేసిన వారందరికి  పేరు  పేరున  ధన్యవాదములు  తెలిచేసారు . ఈ  కార్యక్రమం  విజయవంతం కావడానికి సహకరించిన  క్యాట్స్అధ్యక్షులు  శ్రీ . మధు  కోలా  గారికి   ధన్యవాదములు  తెలిపారు .

 




సిలికానాంధ్ర  మనబడి  సాంస్కృతికోత్సవం  విజయవంతం  కావడానికి  విశేషంగా కృషి  చేసిన  సాంస్కృతిక  కార్యవర్గ  సభ్యులు  శ్రీనివాస్  చివలురి  గారు ,  అనిత  కారంచేడు  గారు , చిత్ర గుండ్లపల్లి  గారు , నీరజ  గుమ్మ  గారు, గీత  జొన్నలగడ్డ  గారు , నరేష్ గోగినేని  గారు , జానా  గారు,  జనార్ధన్  గారికి, సమన్వయ కర్తలకు ,ఉపాధ్యాయులకు ఇతర వాలంటీర్స్ అందరికి సిలికానాంధ్ర  మనబడి  వర్జీనియా , మేరీల్యాండ్ , వాషింగ్టన్  D.C ఏరియా  రీజినల్  కోఆర్డినేటర్  గౌడ్  రాంపురం  గారు  ప్రత్యేక  ధన్యవాదములు  తెలిపారు .

TeluguOne For Your Business
About TeluguOne
;