RELATED ARTICLES
ARTICLES
డల్లాస్ లో మంచు లక్ష్మి ప్రసన్న మీట్ అండ్ గ్రీట్

అనంత్ మల్లవరపు అధ్యక్షతన డల్లాస్ లోని కోకిల రెస్టారెంట్ లో మంచు లక్ష్మి ప్రసన్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఆద్యంతం సరదాగా సాగింది. ఈ సందర్భంగా లక్ష్మి ప్రసన్న నటించిన పలుచిత్రాలు, కార్యక్రమాల మీద వివేక్ పుట్టపర్తి, రచన మల్లవరపు సమకూర్చిన మల్టీ మీడియా దృశ్యాలను ప్రదర్శించారు. చిత్తూరు ఎన్నారై సంస్థ గురించి, సంస్థ చిత్తూరు జిల్లాలో చేస్తున్న సేవాకార్యక్రమాల గురించి విజయ్ మోహన్ కాకర్ల సభకు విచ్చేసిన వారికి వివరించారు. లక్ష్మి ప్రసన్నను టాంటెక్స్ వారు ఘనగా సన్మానించారు.

లక్ష్మి ప్రసన్న సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ... అమెరికాలో ఉన్నప్పుడు తనకు వచ్చిన అవకాశాలను, ముఖ్యంగా డల్లాస్ నగరంతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. తన తండ్రి మంచు మోహన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి, సభికులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సరదాగా సమాధానాలు ఇచ్చారు. డల్లాస్ లోని తెలుగువారితో గడిపిన ఈ సాయంత్రం తనకు తీపి గుర్తుగా మిగిలిపోతుందని అన్నారు. శ్రీనివాస్ కోనేరు వందన సమర్పణతో ఈ కార్యక్రం విజయవంతంగా ముగిసింది.


TeluguOne For Your Business
About TeluguOne
;