EVENTS
అంబరాన్ని అంటిన CATS(Capitol Area Telugu Society) ఊగాది సంబరాలు

CATS ఊగాది సంబరాల్లో టాలీ లయలకు D.C హొయలు వర్షపు జల్లులలతో చినుకుల చిత్తడితో ముసురుకున్న మబ్బులన్ని ఒక్కసారిగా ఊదయ భానుడి లేలేత కిరణాలతో మటుమాయమయ్యి ఏప్రిల్ 23,2011 న Washington DC నగరమందు Capitol Area Telugu Society ఉగాది సంబరాలకు తెరలేపాయి.

పంచాంగ శ్రవణం తో మొదలైన ఈ ఉత్సవం లో తెలుగింటి చిన్నారులు,యువతులు,యువకులు తమ తమ నాట్యవిలాసాలతో,జానపదాలతో,ఆట పాటలతో DC Metro ప్రాంత వాసులను అలరించారు.

Maryland State Assembly కి House of Delegate గా ఎన్నికైన మొట్ట మొదటి తెలుగు మహిళ, శ్రీమతి అరుణ మిల్లర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు.ఆమె తన ప్రసంగంలో తెలుగు ప్రజలందరికి ఆంధ్ర ప్రదేశ్ ను Sister State of Maryland గా గుర్తించమని మేరిలాండ్ గవర్నర్ గారికి e-mail ద్వారా విన్నవించాలని కోరడమైనది.

CATS అధ్యక్షులు శ్రీ కొండా రాం మోహన్ గారు తమ ప్రసంగంలో ఊగాది శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్య సభ్యులు(భువనేష్ బూజాల,బద్రీనాథ్ చల్లా,చంద్రశేఖర్ కాటుబోయిన,భాస్కర్ బొమ్మా రెడ్డి,వెంకట్ కొండపోలు,సుధారాణి,ఆనంద్ బాబు గుమ్మడి,శ్రవణ్ స్రిరామోజు,నారాయణ గరిమెల్ల,కిరణ్ మీగడ,ప్రవీన్ కట్టంగుర్,బాలాజి,మధు కోల,ప్రమీల అన్నప రెడ్డి,అనంత లక్ష్మి ,అపర్ణ మరియు చంద్ర చింతపర్తి) అందరిని సభకు పరిచయం చేశారు.

చిన్నారుల నుంచి కురు వృద్దుల వరకు క్రిక్కిరిసిన సభా ప్రాంగణమంతా రఘు కుంచె చమత్కారం,అనూజ్ గురువార జన సమ్మోహనం,నిఖిల్ చలాకితనం,భార్గవి నయగారం,సాంస్కృతిక కార్యక్రమ రూపకర్తల కొత్తదనం,యువ హృదయాల అత్యుత్సాహంతో దద్దరిల్లింది.

గాయకుల పరిచయంలో భాగంగా ,పాట పంచదారా,ఆట మగధీర,పాడింది గురువారా అనంగనే ఒక్కసారిగా ఈళలతో చప్పట్లతో మొదలైన అనూజ్ గురువార,భార్గవిల ప్రభంజనం ఆద్యంతం రక్తి కట్టించింది.యువతను తన డ్యాన్సులతో, అభినయం తో నిఖిల్ కుర్ర కారు మనసులను దోచాడు.

సంగీత దర్శకుడు మరియు గాయకుడు అయిన రఘు కుంచె గారు ఎందుకే రవణమ్మా అంటూ ఆకాశమే సరిహద్దుగా చెలరేగారు.పాట పాటకు మధ్య ప్రజల నుండి వచ్చే GOOD JOB, GREAT JOB వంటి ప్రశంశలతో జనాలకు నచ్చే పాటలతో మెచ్చే మాటలతో అందరిని సమ్మోహన పరిచారు.

TeluguOne For Your Business
About TeluguOne
;