Home » Latest News » కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు


శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు సోమవారం (అక్టోబర్ 28) ఆరంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవాలకు ఆదివారం (అక్టోబర్ 27) ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

పవిత్రోత్సవాలలో భాగంగా తొలి రోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. రెండవ రోజు అంటే మంగళవారం (అక్టోబర్ 29)న మూలవర్లు, ఉత్సవవర్లు, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం, అలాగే ఆంజనేయస్వామివారికీ పవిత్రాల సమర్పణ ఉంటుంది. చివరి రోజు అంటే మంగళవార (అక్టోబర్ 30)న పూర్ణాహుతి నిర్వహిస్తారు. పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.  ఆలయదర్శనానికి వచ్చే భక్తుల వల్ల కానీ, ఆలయ సిబ్బంది వల్ల కానీ తెలియకుండా ఏమైనా దోషాలు జరిగితే, వాటి కారణంగా ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లకుండా నివారించేందుకు ఏటా పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. అందులో భాగంగానే కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.