|
|
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (అక్టోబర్ 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
అయితే టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆదివారం (అక్టోబర్ 27) శ్రీవారిని మొత్తం 69 వేల 333 మంది దర్శించుకున్నారు. వీరిలో 22 వేల 606 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 53లక్షల రూపాయలు వచ్చింది.