Home » Others » పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : జగన్‌


 

కృష్ణా జిల్లా రామరాజుపాలెం ప్రాంతంలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన పంటలను మాజీ సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. 18 నెలల కూటమి పాలనలో 16 విపత్తులు వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిందన్నారు.15లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు.

మోంథా తుపాను 25జిల్లాల్లో ప్రతీకూల ప్రభావం చూపిందని జగన్ అన్నారు.ఇన్‌పుట్‌ సబ్సీడీ 18 నెలలుగా రాలేదని వాపోయారు. ఉచిత భీమా అడిగితే ధాన్యం కొనరట. సాయం చేయకపోగా రైతులను బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. అధికారులు పొలంలోకి అడుగు పెట్టకుండానే ఎన్యూమరేషన్ అయిపోయిందంటున్నారు అంటు మండిపడ్డారు.

 అనంతరం రైతులతో జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. జగన్‌ కాన్వాయ్‌ కారణంగా పెనమలూరులో భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. బందరు రోడ్డులో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉయ్యూరులోనూ పలుచోట్ల ట్రాఫిక్‌‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు