అలోపతి వైద్యంలో జరుగుతున్న తప్పిదము

భారతదేశ ఋషులు మానవ శరీరము - కంటికి కనపడే స్థూల శరీరం (పంచభూతాల తత్వముతో కూడినది) కంటికి కనపడని సూక్ష్మ శరీరము (17 తత్వములతో కూడినది) అనే భాగములతో కూడినదిగా చెప్పారు, వ్యాధులు వచ్చేటప్పుడు వాటి మూలము సూక్ష్మ శరీర భాగములో ఉండి కాలక్రమేణా స్థూల శరీరములో మనకు కనబడే వ్యాధిగా పరిణామం చెందుతున్నది.

అలోపతి వైద్యములో సూక్ష్మ శరీరము గురంచి అవగాహన లేదు. వాటిని తెలుసుకొని. విపులీకరించే పరికరములు లేవు. కాబట్టి సూక్ష్మ శరీరమునకు వైద్యము కూడా లేదు. మనకు తెలిసిన స్థూల శరీరములోని అవయవములన్ని మనకు కనపడని - సూక్ష్మ శరీర నియంత్రణలో పని చేస్తున్నాయి.

అలోపతి వైద్యము - స్థూల శరీర భాగములను పరిమితమయినది.సూక్ష్మ శరీర భాగాలకు దీనిలో వైద్యము లేదు. ఏ వ్యాధి వచ్చినా, అది సూక్ష్మ, స్థూల శరీరములు రెండింటికి వస్తుంది, కానీ వీరు స్థూల శరీరమునకు మాత్రం వైద్యము చేస్తున్నారు. ఈ స్థూల శరీరంలో కూడా కొన్ని వ్యాధులకు ఇప్పటికి వైద్యము లేదు. ఉదా|| వైరస్ వ్యాధులు, చక్కెర వ్యాధి, అధిక రక్తపోటు, కన్సర్ అనేక చర్మవ్యాధులు, Pseudo Muscular Dystrophy, కీళ్ల వాతములు మొదలగునవి. కొన్నిసార్లు కొత్త కొత్త వైద్య విషయములు శోదించామని చెప్పి, కొంత కాలం తరువాత వాటిలో కొన్ని తప్పని ప్రకటించడం, ఈ లోపు ఆ వైద్యముతో రోగగ్రస్తులైన మనుష్యులకు చెడు జరగడం చూస్తూనే ఉన్నాము. అంటే వైద్యము అసంపూర్తిగా జరుగుచున్నది. దీనికి బాధ్యత వహిస్తున్న వైద్యులు, వైద్య శాసనకర్తలు, ప్రభుత్వం - జరుపుతున్న తప్పును సరి చేసుకోవలసిన అవసరమున్నది. ఈ సంపూర్తి వైద్యానికి - కొన్నిసార్లు వ్యాధి నిర్ధారణకు, వైద్యమునకు చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తున్నది. ఈ జరుగుతున్న పొరపాటును సరి చేసుకొని, మానవులకు సరైన సంపూర్ణ వైద్యము అందించు ప్రయత్నం మనము చేద్దాం. స్థూల, సూక్ష్మ శరీర భాగముల గురించి మన ఋషులు మన భారతీయ ఆయుర్వేద వైద్యములో వివరించి, వాటికి వచ్చే వ్యాధులకు వైద్యము చెప్పారు.

స్థూల, సూక్ష్మ శరీరముల గురించి తెలుసుకొని, వైద్యం చేసేందుకు డానికి సంబంధించిన అవగాహన కోసం, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవలసిన అవసరమున్నదని వైద్యులను, ప్రభుత్వ వైద్య విభాగ అధిపతులను, విజ్ఞులను ప్రార్థిస్తున్నాను.

1. ప్రాణము - దీని నిర్వచనము. దేహములో దాని స్థానము, అది చేసే దేహకృత్యాలు, అనారోగ్యమైన ప్రాణానికి - ప్రాణచికిత్సా విధానము

2. శ్వాసకు - ప్రాణానికి - అయుస్సునకు గల సంబంధము.

3. మనస్సు - దీని నిర్వచనము, దేహములోని దీని స్థానము, అది చేసే దేహ కృత్యములు. అనారోగ్యమైన మనస్సుకు మానసిక చికిత్సా విధానము.

4. మనిషి గుణము - 3 రకములైన సాత్విక, రాజసిక, తామసిక గుణముల నిర్వచనము. గుణము ఎలా ఏర్పడుచున్నది? ఆహారము - గుణమునకు సంబంధము. గుణము తెలుసుకొనే విధానము. ఆరోగ్యములో - గుణము పాత్ర.

5. వీర్యము - ఆరోగ్యము - మేధాశక్తికి గల సంబంధము, విపులంగా చర్చించి యువతకు మంచి భవిష్యత్తు కలుగచేయాలి.

6. వ్యాయామము - ఆసనములు - మానవ ఆరోగ్యములో వీటి పాత్ర గురించి తులనాత్మక చర్చ.

మానవునిలోని స్థూల, సూక్ష్మ శరీర భాగములు గురించి తెలుసుకొనేందుకు, సంపూర్ణ వైద్యం అందించేందుకు, వైద్యంలో జరుగుతున్న పొరపాట్లను సరిచేసి మానవాళికి మేలు చేసేందుకు ఈ క్రింది నిష్ణాతులతో కలిపి చర్చా వేదికలు ఏర్పాటు చేసిన నిగూఢమైన విషయములు బైటకు వచ్చి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వమునకు మార్గము చూపిన వారమవుతాము.

1. సేవాభావము, భారతీయ సంప్రదాయమందు జ్ఞానమున్న అలోపతి వైద్యులు.

2. తపశ్శక్తి ఉన్న ఆయుర్వేద వైద్యులు డా|| వెలిదండ్ల ముక్తేశ్వరావు M.A.(Sanskrit), ఆయుర్వేదాచార్య, (ఢిల్లీ)

విజయవాడ, ఫోన్: 2435115

డా|| V.V.S.రామశాస్త్రి, M.D. (ayu)

Professor & Civil Surgeon,

Govt Ayurvedic College,

Hyderabad.

Ph.No: 27763585

3. ఆధునిక ఋషులయిన ఈ క్రింది వారిలో ఒకరు-

శ్రీ రామకృష్ణ మఠం, హైదరాబాదులోని పూర్వాశ్రమంలో సైంటిస్టుగా ఉండిన యోగి ఒకరు.

శ్రీ సామవేదం, షణ్మఖశర్మగారు, హైద్రాబాదు ఫోన్: 27655859

శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి, కుర్తాళం పీఠాధిపతి, గుంటూరు (పూర్వాశ్రమంలో వీరి పేరు శ్రీ ప్రసాదరాయకులపతి) రిటైర్డు ప్రిన్సిపాల్, హిందూ కాలేజి, గుంటూరు ఫోన్: 2231625

4. డా|| జయప్రకాష్ నారాయణ M.B.B.S IAS, లోక్ సత్తా కన్వీనర్, హైదరాబాదు.

శ్వాస – ఆయుస్సు

మన ఆయుస్సు శ్వాసయే కాని దినములు, నెలలు, సంవత్సరములు కావు. ఒక్కొక్క మనుష్యునకు యిన్ని కోట్ల శ్వాసలని జనన కాలమునకు ముందే గర్భమునందున్న శిశువులో చేర్చబడి యున్నది, మనము లోపలికి పీల్చు శ్వాస – ఉచ్చ్వాసము (Inspiration) పూరకము, వెలుపలకు విడుచు శ్వాస నిశ్వాసము (Expiration) రేచకము - ఈ రెండు కలిసినది ఒక శ్వాస, నిమిషమునకు 15 శ్వాసలు నడుచుచుండును. ఒక గంటకు 15X60=900 శ్వాసలు. 1 రోజుకు 900X24=21,600, శ్వాసలు నడుచును, ఈ శ్వాస సకల జీవుల యొక్క దేహమధ్యమున ప్రాణవాయువుగా ఉండి రేచక, పూరకములుగా నాభియందుండి బయలుదేరి నాసికారంధ్రముల ద్వారా ఉచ్చ్వాస నిశ్వాసములుగా ఆడుచుండును. అట్లు ఆడుచుండు శ్వాసము హంస అందురు.

ముక్కు నుండి బైటకు వచ్చు శ్వాస (నిశ్చ్వాసము)ను రేచకము అందురు, లోనికి వచ్చు (ఉచ్చ్వాసము)ను పూరకము అందురు, ఎడమనాసిక యందు వచ్చు శ్వాసము చంద్రనాడి, ఇడనాది అని అంటారు. కుదినాసికలో వచ్చే శ్వాసను సూర్యనాడి, పింగళానాడి అని అందురు. రెండు నాసికలలోను సమానముగా నడచు శ్వాసను సుషుమ్నా నాడి అందురు. పీల్చిన శ్వాసను నిపిలినచో కుంభకము అందురు. వెన్ను పూసలోని మేరుదందకము (Spinal Card) లో ఎడమవైపున ఇడనాడి, కుడివైపున పింగళనాడి, మధ్యలోని ఖాలీభాగము సుషుమ్నా నాడిగా చెప్పారు.

ఇడ, పింగళ, సుషుమ్న నాడులు: మన స్థూల శరీరంలో మనకు కనబడే నాడులు లాంటివి Astral Body లో 75 వేల నాడులు ఉన్నాయని యోగులు చెప్పారు.వీటి ద్వారా ప్రాణశక్తి శరీరమున సంచరిస్తుంది. వీటిలో ముఖ్యమైనవి 3 నాడులు - ఇడ, పింగళ, సుషుమ్న నాడులు, Astral Body ఉన్న సూక్ష్మనాడులు పదార్ధముతో కూడినవి కావు. అందువలనే ఇవి కంటికి కంటికి కనపడవు, ఆధునిక వైద్యశాస్త్రము 1899 సంవత్సరంలో శరీరాన్ని నియంత్రించే Endocrine Glands గురించి కనుగొన్నది, అంతకు పూర్వమే భారతదేశపు యోగులు చెప్పిన యోగాసనములు, షట్ చక్రములు. నాడులు, వీరికి Endocrine Glands ఉన్న ప్రదేశములకు సంబంధము వుంటూ, వీటిని చైతన్యవంతము చేసే విధానాలు చెప్పారు. మన ఋషులు తపస్సు ద్వారా శరీర స్థూల, సూక్ష్మ అవయవములన్నీ తమ దివ్యదృష్టితో తెలుసుకొని Science తెలుసుకోలేని సూక్ష్మ విషయములు శరీరము గురించి చెప్పారు. ఇడ, పింగళ, సుషుమ్న – అనే 3 నాడులు పుట్టే కేంద్రాన్ని నాడీ కేంద్రము (నాడీ కందము) అంటారు. ఈ నాడీ కేంద్రము గుద స్థానము ( ANUS) నకు పైన, మర్మావాయవమునకు క్రింద, అండాకారంలో ఉంటుంది, ఈ నాదీ కేంద్రములోనే ఇడ, పింగళ, సుషుమ్న నాడులు కూడా పుట్టాయి. ఈ నాడీ కేంద్రానికి పైన వెన్నెముకలో మేరుదండం (Spinal Card ఉన్నది. షట్ (7) చక్రములలోని మూలాధార చక్రము గుదస్థానమునకు పైన ఉన్నది.

ఇడ, పింగళ, సుషుమ్న నాడులు మూడు మూలాధార చక్రంలో త్రిజటా రూపంలో అల్లుకొని ఉంటాయి. దీనినే త్రివేణీ అని కూడా అంటారు. ఈ త్రివేణీయే మూలాధార చక్రము, మూలాధార చక్రము నుండి బయలుదేరిన 3 నాడులూ మేరుదండం ద్వారా పైకి వెళ్ళి కనుబొమ్మల మధ్య (భూమధ్యం) ఉన్న ఆజ్ఞా చక్రము వద్ద కలుస్తాయి, ఇడ, పింగళ నాడులు అజ్ఞా చక్రం వద్ద ఆగుతాయి. సుషుమ్న నాడి మాత్రం మెదడు పైదాకా వెళ్ళి సహస్రారం వద్ద ఆగుతుంది.

ఇడ నాడి (చంద్రనాడి) - పై వ్రాసిన మూలాధారా నాడీ కేంద్రములో పుట్టి మేరుదండం ఎడమ భాగం నుండి ఆజ్ఞా చక్రం (కనుబొమ్మలు మధ్యస్థానం) వరకూ పోయి నాసికా రంద్ర పర్వంతము వ్యాప్తి చెంది వుంటుంది.

సుషుమ్న నాడి - మూలాధార నాడీ కేంద్రములో నుండి బయలు దేరి మేరుదండం మధ్యలో ప్రయాణించి ఆజ్ఞా చక్రము వద్ద ఇడ, పింగళ నాడులతో కలుస్తుంది. అచ్చట నుంచి సహస్రారము (బ్రహ్మరంధ్రము) వరకూ వెళ్తుంది, అది ఈ నాడి గొప్పతనము. సుషుమ్న నాడి మధ్యలో సూక్ష్మాతి ;బ్రహ్మనాడి' ఉంటుంది.

ఇడ నాడికి - అధిష్టాన దేవత చంద్రుడు. అందుకే దీనిని చంద్రనాడి అంటారు. ఈ నాడిలో మంచి శ్వాస వెళ్ళినప్పుడు శరీరానికి చల్లదనము, సుఖము కలుగుతాయి. అందువలనే ఎడమశ్వాస వల్ల శీతలము కలుగుతుంది.

పింగళ నాడికి అధిష్టాన దేవత దేవుడు, ఈ నాడిలో నుండి శ్వాస వెళ్ళినప్పుడు శరీరానికి ఉష్ణం కలుగుతుంది.

సుషుమ్న నాడి - చంద్ర, సూర్య తత్వములతో కూడినది, సుషుమ్న ద్వారా శ్వాస వెళ్ళునప్పుడు చల్లదనము కలుగుతుంది. వేడి కలుగవచ్చును. శ్వాస రెండు నాసిక ద్వారముల గుండా సమానముగా వెళ్ళదు. కొంత సేపు కుడి నాసిక యందు (సూర్యనాడి) కొంత సేపు ఎడమ నాసిక యందు (చంద్రనాడి) నడుచుచుండును. ముక్కు దగ్గర చేయి పెట్టి శ్వాస వదిలితే ఏ నాసికనుండి వచ్చేది తెలుస్తుంది. కుడి నాసిక నుండి వచ్చు శ్వాస (సూర్యనాడి) 8 అంగుళములు. ఎడమ నాసిక నుండి వచ్చు శ్వాస (చంద్రనాడి) 12 అంగుళములు బైటకు వెళ్ళుచుండును. నాడి నాసికనుండి బైటకు వచ్చే ఒక్కొక్క శ్వాసయందు, ఎడమ నాసిక నుంచి వచ్చే స్వాసకన్నా 4 అంగుళముల శ్వాస మిగులుచున్నది, కుడి నాసిక ద్వారా శ్వాస ఆగుచున్న ఆయువు పెరుగుతుంది. ఎడమ నాసిక ద్వారా శ్వాస ఆగుచున్న ఆయువు క్షీణిస్తుంది. మనము శ్వాస ఏ నాసిక ద్వారా ఆడుతున్నదో చూసుకొంటూ వుండాలి. ఆయుస్సు పెరిగేందుకు కుడి నాసిక ద్వారా శ్వాస ఆడేటట్లు చూసుకోవాలి. శ్వాసను ఎడమ వైపు నుండి కుడి వైపుకు, కుడి వైపు నుంచి ఎడమవైపుకు మార్చుకొను విధానము కూడా శాస్త్రములో చెప్పారు.

ఈ రహస్యము తెలియక మనము శ్వాస ఖర్చు చేసి వేస్తూ ఆయుస్సు తగ్గించుకొంటున్నాము. శ్వాస ఈ క్రింది విధముగా నష్టపోతుంది. మాట్లాడునప్పుడు 12 అం||లు శ్వాస బైటకు వెళ్ళి 8 అం||లు శ్వాస లోపల ప్రవేశించి 4 అం|లు బయట నష్టమగుచున్నది.

ఈ క్రింద చూపిన పట్టికలో వివిధ పనుల ద్వారా శ్వాస ఎలా నష్టపోయేది చూడగలరు.

                               బైటకు వెళ్ళు శ్వాస    లోపల ప్రవేశించు   శ్వాస నష్టమగుచున్నశ్వాస

                                 అం||లలో                   అం||లలో                       అం||లలో మాట్లడునప్పుడు               12                              8                                4 వాడులాడునప్పుడు             24                           12                              12 నడుచునప్పుడు                  16                            8                                8 పరిగెత్తునప్పుడు                  54                           27                              27

చేతి పనులు                      20                          10                              10

చేయునప్పుడు

సంభోగ కాలమున             64                           24                               40

శాంతముగా, మౌనముగా వున్నపుడు - శ్వాస నెమ్మదిగా ఆడును. ఆయుస్సు పెరుగును. క్రోధము, వాదులాటలయందు, శ్వాస ఎక్కువగా వ్యయమగును. ఈ విధముగా మనము ప్రతిదినము శ్వాసను ఖర్చు చేస్తూ ఆయువును కోల్పోతున్నాము.

సాధారణంగా మనిషికి నిమిషానికి 16 నుండి18 శ్వాసలు ఉంటాయి. నిమిషానికి తీసుకొనే శ్వాసలు బట్టి ఆయుస్సు ఈ క్రింది విధంగా వుంటుంది.

నిమిషానికి తీసుకొనే శ్వాసలు          రోజుకు అయ్యే శ్వాసలు              ఆయుస్సు సం||లలో

15-21                                               600                                           100

18-25                                               920                                            80

21-30                                               240                                            60

 

శ్వాసలను బట్టి జీవుల ఆయుస్సు ఈ క్రింది విధంగా ఉంటుంది.

జీవి                          నిమిషానికి తీసుకొనే శ్వాసలు             ఆయుస్సు సం||లలో

 

కుక్క                                   28-30                                             14

గుఱ్ఱం                                  20-22                                             40

మనిషి                                15-16                                             100

పాము                                  7-8                                                          150

తాబేలు                                4-5                                                200

 

శ్వాసలు ఎక్కువ అయ్యే కొద్ది ఆయుస్సు తగ్గిపోతుంది.

ప్రాణాయామం ద్వారా తక్కువ సంఖ్యలో దీర్ఘశ్వాసలు అలవాటు చేసుకొంటే దీర్ఘకాలం జీవించవచ్చు. తక్కువ శ్వాసలోతో ఎక్కువ గాలి పీల్సుకోనేందుకు ప్రయత్నిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. దీర్ఘశ్వాస తీసే వారికి ముసలితనంలో కూడా కంటిచూపు బాగా ఉంటుంది, శ్వాసలకు, గుండె కొట్టుకోనేందుకు అవినాభావ సంబంధం ఉన్నది. సుమారు 1 శ్వాసకు 4 సార్లు (1:4) గుండె కొట్టుకుంటుంది. ఎక్కువ సార్లు గుండె కొట్టుకుంటే ఆయుస్సు తగ్గుతుంది. శ్వాసలు తగ్గించుకొంటే గుండె తక్కువసార్లు కొట్టుకొని ఆయుస్సు పెరుగును.

ఉదయము నిద్ర లేచినప్పుడు శ్వాస సూర్యనాడిగా (కుడినాసిక) ఆడుచున్న ఆ రోజుంతయూ మంచి జరుగుతుంది. ఆరోగ్యము బాగా ఉంటుంది, ప్రయాణ సమయమున శ్వాస సూర్యనాడి యందుంచుకొని వెళ్ళిన యెడల ఆ పని నెరవేరుతుంది. సూర్యనాడి ద్వారా శ్వాస ఎల్లప్పుడూ ఆడుతుంటే ఆయుస్సు పెరుగుతుంది. యోగులు ఎల్లప్పుడూ శ్వాసను సూర్యనాడి యందే ఉంచుకుంటారు. కంచి శ్రీ చంద్రశేఖరరేంద్ర సరస్వతీ స్వామీ - చెప్పిన శ్రీ జగద్గురు బోధలు 2 వ Volume లో కుదినాసిక నుండి శ్వాస వస్తే - మంచి చిత్తవృత్తి, శాంతము, ఆరోగ్యము కలుగుతాయి. ఎడమ నాసిక నుండి వస్తే - కోపము, రోగము, దుఃఖము కలుగుతాయి అని చెప్పారు.

శ్రీ సత్యసాయి బాబా ఫిబ్రవరి 1989 సనాతన సారధి సంచికలో ఇలా చెప్పారు "నీవు ఉదయమున నిద్ర మేల్కొనినప్పుడు సూర్య చంద్ర నాడులలో ఏ నాడి ఆడుచున్నదో చూచుకొనుము. సూర్యనాడి అడుచున్న యెడల పాలభాగపు కుడివైపును 'ఓం' వ్రాసుకొని కుడి అరచేతిని దానిపై హత్తుకొని, కుడికాలు నేలపై మోపి పడక నుండి దిగుము, చంద్రనాడి ఆడుతున్న, ఎడమ అరచేతిపై 'ఓం' వ్రాసుకొని పాలభాగపు ఎడమవైపున హత్తుకొని ఎడమకాలు నేలపై మోపి దిగుము.

శ్వాసను మార్చు విధము: కూర్చున్నప్పుడు ఎడమ నాసిక యందున్న శ్వాసను కుడినాసిక యందు మార్చుకునేందుకు యోగ దండమును కాని, చంక ఎత్తున ఉండెడి ఒక పీటలాంటి చెక్కను కానీ తీసుకోవాలి, ఎడమ చేతిని ప్రక్కగా భుజము వరకు లేపి, ఎడమ చంక ప్రక్కన చేతి క్రింద ఈ యోగదండమును కానీ, చెక్కను కానీ నేల మీద నిలబెట్టి చంకలో నుంచి ఎడమ చేతిలోకి పోతున్న పెద్ద నరమును (Brachial plexus)ఈ యోగదండము మీద కానీ పీట మీద కానీ అదుముచున్న యెడల కొన్ని నిమిషములలో ఎడమ నాసిక యందున్న శ్వాస కుడినాసికలోనికి మారును. కుడి నాసిక యందున్న శ్వాస ఎడమ నాసికలోనికి మార్చుటకు - పై విధముగనే కుడి వైపు చేయాలి, యోగులు యోగదండమును తమ వద్ద ఉంచుకొని ఎల్లప్పుడూ శ్వాస సూర్యనాడిలో ఉంచెదరు పడుకొనినప్పుడు ఎడమనాసికి యందున్న శ్వాసను కుడి నాసికలోనికి మార్చుకునేందుకు - ఎడమ భుజము మీద ప్రక్కగా పడుకొని ఎడమ చేతి బొటన వ్రేలితో ఎడమ ప్రక్కన మెడ మీద అదుమవలెను. దీని వలన గుండె నుండి మెదడుకు రక్తమును తీసుకు వెళ్లు కెరోటిడ్ ధమని (Carotid artery) చుట్టూ వున్న Cervical sympathetic nerve tissues, Vegus nerve అనే నరముల ఒత్తిడి కలుగును, ఈ ఒత్తిడితో కొద్ది నిముషములలో చంద్రనాడి సూర్యనాడిగా మారుతుంది. సూర్యనాడిని చంద్రనాడిగా మార్చేందుకు కుడి భుజము మీద ప్రక్కగా పడుకొని పై విధంగానే కుడివైపున చేయాలి.

జీర్ణశక్తికి - ఆయుర్య్రద్దికి - పడుకొనే విధము: ఎల్లప్పుడూ తూర్పువైపుకు తల వుంచి, ఎడమ చేతి మీద ప్రక్కగా పడుకోవాలి. తూర్పు వైపున తల పెట్టి పడుకొనేందుకు కారణము - సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. భూమి అయస్కాంత క్షేత్రము (Earth Axis) ఉత్తర – దక్షిణి దిక్కులలో ప్రసరిస్తూ ఉంటుంది. మనలోని అయస్కాంతము భూ అయస్కాంతము లాగి వేయకుండా, భూ ఆయస్కాంతమునకు వ్యతిరేక దిక్కులలో (తూర్పు, పడమర దిక్కులలో) పరుండాలి. అప్పుడు మనలోని విద్యుచ్ఛక్తి నష్టపోకుండా వుంటుంది.

నిద్రలో - ఎడమ చేతిమీద ప్రక్కగా పాడుకొనుట వలన లాభము:

1. మన కడుపులోని జీర్ణాశయము (stomach) ఎడమవైపున వున్నది, ఎడమ వైపు పరుండుట వలన భుజించిన ఆహారము సరిగా జీర్ణమయి చిన్న ప్రేగులోనికి నెమ్మదిగా వెళ్ళును. పొరపాటున కుడివైపు పడుకొనిన ఎడమ వైపున వున్న జీర్ణాశయము (Stomach) కు కుడిప్రక్కన దొర్లును. దీని వలన ఆహారము జీర్ణము కాక అనారోగ్యము ప్రాప్తించును.

2. ఎడమ చేతి మీద ప్రక్కగా పడుకొనుట వలన శ్వాస కుడినాసిక యందు నడుచుచుండును. ప్రతి శ్వాసలోను 4 అం||లు శ్వాస మిగులుచు ఆయుస్సు పెరుగును.

3. తూర్పు వైపు తల వుంచి, ఎడమ భుజముపై పరుండుటవలన – దక్షిణ దిశ నుండి వచ్చే మంచి పైరు గాలి మనకు అందుతు ఉంటుంది.

4. కడుపులో - చెడు రక్తమును గుండెకు తీసుకొని వెళ్ళే Inferior Vena Cava అనే పెద్ద సిర (Vein), Abdominal Aorta అనే పెద్ద ధమని (artery)కి కుడివైపున ఉంటుంది.

ఎడమ వైపు పడుకొన్నప్పుడు Inferior vena Cava మీద ఒత్తిడి వుండదు. దీని వలన కడుపులోని, కాళ్ళలోని - చెడు రక్తము సులువుగా గుండెకు వెళ్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పొరపాటున కుడివైపుగా పడుకుంటే Inferior Vena Cava మీద ఒత్తిడి పెరిగి కాళ్ళు వాయడం జరుగుతుంది.

శ్వాసకు, ప్రాణమునకు వున్న సంబంధము - శ్వాస ప్రాణము యొక్క బాహ్యస్వరూపము.

ప్రాణ చికిత్స (Pranic Healing):

శ్వాసను లోపలికి పీల్చి కుంభించి (ఆపి), ప్రాణమును నీ దేహములోని రోగ భాగమునకు పంపితే ఆ వ్యాధి నయమవుతుంది.

ప్రాణశక్తి ఇతరుల శరీరములోని రోగ భాగమునకు పంపిన వారిలోని ఆ వ్యాధి నయమవుతుంది.

పై విషయములు, ఆరోగ్యము కోసం వ్యాధులు నయము చేసుకునేందుకు ఉపయోగించుకొని మంచి ఆయుస్సును, ఆరోగ్యమును పొందగలరని ఆశిస్తున్నాను. వివరములు కావలసిన వారు నన్ను సంప్రదించగలరు. వ్రాసిన విషయములు మన భారత దేశ ఋషుల రచనల నుండి, అలోపతి వైద్య శాస్త్రము నుండి గ్రహించినవి. ఏమయినా దోషములున్న తేలియచేసిన సరిచేసుకుంటాను.

ప్రాణము: ప్రాణము శరీరమును పెంచి పోషిస్తూ మనలను బ్రతికించుచున్న సూక్ష్మమైన జీవశక్తి, ప్రాణము పంచ ప్రాణ వాయువులతో కూడి ఉన్నది, అవి - ప్రాణవాయువు. ఆపాన వాయువు, వ్యాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, ప్రానములోని భాగములైన పంచ ప్రాణ వాయువులు. శరీరములో వివిధపనులు చేయుచుండును. ప్రాణము పంచభూతములతో (ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి) కూడిన శరీరాన్ని నిర్మిస్తుంది. వృద్ధి చేస్తుంది. నశింపచేస్తుంది. సప్తధాతువులను (రసము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముక, మజ్జ, శుక్లము) సారంగా తోడు తెచ్చుకొని శరీరాన్ని పరిణామక్రమంగా సృష్టిస్తుంది. ప్రాణము సర్వాంతర్యామి అనంత జగత్తు నుంచి ఈ ప్రాణం వస్తుంది. శరీరమంతటిలోను తన వెలుగును నింపి ఉంటుంది, దేహము నుండి ప్రాణము బైటకు పోవుటయే మరణము.

పంచప్రాణములు: ప్రాణములు 5 రకములుగా దేహమున సంచరించుచు వివిధపనులు చేస్తుంటాయి.

1. ప్రాణము - నాసాగ్రములో - (ముక్కు చివర) ఉండి ఇచ్చ్వాస, నిశ్చ్వాసములను సల్పును.

2. అపానము- గుద స్థానములో ఉండి మలము, మూత్రము, రేతస్సును బైటకు పంపు క్రియను చేస్తుంది.

3. వ్యానము- శరీరమంతటనూ ఉంటుంది, ఇది భుజించి జీర్ణమయిన అన్న పానీయములను రక్తము ద్వారా శరీరమంతటనూ వ్యాపింపచేస్తుంది. రక్తప్రసరణమును గావించును.

4. ఉదానము - కంఠములో ఉంటుంది. పంచ ప్రాణములలో ఉదానము ముఖ్యమయినది. ఇది మాట్లాడుట, మ్రింగుట, అనే పనులు చేస్తుంది. కక్కునప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గునప్పుడు లోని పదార్ధములను బైటకు తెచ్చును, ఇది నిద్రా సమయమున జీవుని హృదయము వద్దకు తీసుకువెళ్ళును. ఇది మరణ సమయమున స్థూల శరీరము నుండి సూక్ష్మ శరీరమును వేరు చేస్తుంది. ఇది ఆత్మను, పరమాత్మ దగ్గరకు చేరుస్తుంది. 'ఓం' కారము ఉచ్చరించుట చేత ప్రానములో ఉన్న ఉదాసవాయువు జాగృతం అవుతుంది.

5. సమానము - ఇది నాభి స్థానంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను చేస్తుంది. భుజించిన ఆహారము ఉదరములో జీర్ణమగుటకు జఠరాగ్నికి సహాయపడును. పంచప్రాణములలో సమతౌల్యము లోపించి, వ్యత్యాసము కలిగినప్పుడు శరీరముణ వ్యాధులు ఉద్భవిస్తాయి

మనస్సు - ప్రాణము: మనస్సు, ప్రాణము కలిసే ఉంటాయి, మనస్సు ఉన్న చోట ప్రాణం ఉంటుంది, ప్రాణం ఉన్న చోట మనస్సు ఉంటుంది, ప్రాణము మనస్సు స్థూల రూపము. మనస్సుకు, ప్రాణానికి పుట్టుక ఒక్క చోటే. అదే ఆత్మ, ఆత్మ తేజము నుండి మనస్సు, ఆలోచించడం ప్రారంభిస్తుంది. ప్రాణశక్తి కంపనము వలననే మనస్సు పని చేస్తుంది. ప్రాణాన్ని ఉపసంహరిస్తే మనస్సు ప్రేతమవుతుంది. ప్రాణశక్తి వలననే ఇంద్రియములు తమ పనులు చేస్తుంది, సుషుప్తి (గాఢనిద్ర)లో మనస్సు, ఇంద్రియములు ప్రాణమున విశ్రమించును. మనస్సు యింద్రియములు విశ్రాంతి గైకొను నిద్రయందు సైతము ప్రాణము పని చేస్తుంది, శరీరమును, మనస్సును కలిపి ఉంచే కొలిచే (connection) ప్రాణము, స్థూల సూక్ష్మ శరీరముల మధ్య నుండు కొలికి ప్రాణము, నీవు ప్రాణమును నిగ్రహించినచో మనస్సును నిగ్రహింపగలవు. మనస్సును నిగ్రహించినచో ప్రాణమును నిగ్రహింపగలవు. ప్రాణాయామము ద్వారా మనస్సును నిగ్రహించవచ్చు. ప్రాణము, మనస్సు, వీర్యము - వీనికి ఒకదానికి మరొకదానికి అంతరంగిక సంబంధము కలదు. వీర్యశక్తిని నిగ్రహింపగలిగినది మనస్సును, ప్రాణమును నిగ్రహించవలసి వస్తుంది. జీవితము కాలమున మనస్సు, ప్రాణమును శరీరమున ఉంచును, దేహము మరణించు సమయమున మనస్సు ప్రాణమును ఆక్రమించి బైటకు తీసుకొని పోతుంది. ప్రాణము వాహనము జీవుడు వాహనములోని యజమాని. జీవునికి ఆధారణం ప్రాణములు. చనిపోవునప్పుడు ప్రాణములు బైటకు వెళ్తూ జీవిని లాగుకుపోతాడు.

శ్వాస – గాలి - ప్రాణము: శ్వాస ప్రాణము తాలూకు బాహ్య స్వరూపము. శ్వాసములోని వాయువే బాహ్యంగా, స్థూలంగా వ్యక్తమవుతున్న ప్రాణ శక్తి. పీల్చే గాలి వలననే సామాన్యులమైన మనము బ్రతుకుతున్నాము. కారు నడపటానికి పెట్రోలు ఎలా ఇంధనమో, శరీరం నడపటానికి గాలి అలా ఇంధనము. 24 గంటలు ఉచ్చ్వాస నిశ్వాసముల ద్వారా గాలిని తీసుకోవాలి. మనము పీల్చేగాలి (ప్రాణశక్తి), మనస్సుకు అత్యంత ముఖ్యమైనది. శ్వాసలోని గాలి మనస్సును ఆలోచింపచేస్తుంది. మంచి గాలిలో మనస్సు, శక్తివంటమగును. నిముషమునకు 15సార్లు చొప్పున రోజులో 21,600 సార్లు శ్వాస ద్వారా ప్రాణము శరీరములోనికి ప్రవేశించి శాఖోపశాఖలుగా మారి శరీరమును కాపాడి, పోషిస్తూ ఉంటుంది, నీ శరీరాన్ని కాపాడటానికి ప్రాణం రోజు 21,600 సార్లు నీకు తేలియకుండానే నీలో ప్రవేశిస్తున్నది. శ్వాస నిరోధము వలన ప్రాణము నిగ్రహింపబడును. ప్రాణాన్ని నిగ్రహిస్తే విశ్వాశక్తులన్నింటినీ నిగ్రహించగలవు. మనస్సును నిగ్రహించగలవు. ప్రాణాయామం ద్వారా ప్రాణాన్ని నిగ్రహించి కావలసినంత ప్రాణశక్తిని నిలువ చేసుకోవస్తుంది శ్వాసను లోపలికి పీల్చి కుంభించి, ప్రాణాన్ని దేహములోని రోగ భాగమునకు పంపింటే ఆ వ్యాధి నయమవుతుంది. యోగి తన ప్రాణశక్తిని యితరులకు బదిలీ చేసి వారి వ్యాధులను నయము చేయగలడు.

ఆత్మ – ప్రాణము - (ఈశావాస్యోపనిషత్తు నుండి) ఆత్మ – జీవిని వెనుక వున్న చైతన్యము, ఆత్మ సకలప్రాణి కోటుల కార్యకలాపాలకు పాలకుడు, ఆత్మ తన సాన్నిధ్య మాత్రం చేతనే ప్రాణ శక్తిని కార్యోన్ముఖం చేస్తుంది. ఆత్మ స్వయంగా ఏ కార్యం చేయదు, ఆత్మశక్తి తన చైతన్యమునుప్రాణశక్తి ద్వారా ప్రచురింపచేస్తుంది.

శ్వాస 4 రకములు: 1. మందశ్వాస 2. మథ్య శ్వాస 3. దీర్ఘశ్వాస 4. శూన్యకం మొదటి 3 రకాల శ్వాస యొక్క దీర్ఘతను బట్టి శ్వాస ఎంత బలంగా వుందో చెప్పవస్తుంది శ్వాసకు బలం వుంటేనే నీకు బలం వస్తుంది, శ్వాసకు బలం లేకపోతే నీకు బలహీనత, శోష వస్తుంది. అంటే శ్వాసకు, నీలోపలి బలానికి అవినాభావ సంబంధం ఉన్నది.

1. మంద శ్వాస: నాసికాపుటాలు బయట ఉన్న గాలిని ఒక జానెడు దూరం నుంచి మాత్రమే ఆకర్షించి లోనికి తీసుకోగలుగుతాయి. లోపలికి వెళ్ళిన ఆ శ్వాస ప్రాణమై జానెడు, జానెడు చొప్పున శరీరంలో తిరుగుతుంది. దీని వలన ఒక అవయవానికి ప్రాణం అందితే మరొక అవయవమునకు ప్రాణం అందదు దీని వలన శరీరం కృశించి రోగగ్రస్తమవుతుంది.

2. మధ్యశ్వాస: ఇది మనం రోజు చేసే శ్వాసక్రియ, దీనిలో దాదాపు రెండు జానలు దూరం నుండి బైట ప్రాణం లోపలికి వెళ్తుంది. అన్ని శరీర అవయవములకు చేరి సామాన్యులకు ఆరోగ్యాన్ని యిస్తుంది.

3. దీర్ఘ శ్వాస: ఇది బయట గాలిలో మూడు నుంచి ఆరు జానల దూరం వరకు వున్న ప్రాణాన్ని లోపలికి ఆకర్షిస్తుంది. ఇది సముద్రములోని పెద్ద అలలాగా అన్ని శరీర అవయవములకు అమృద్దిగా ప్రాణమును అందించి దారిలో వుండే రోగాలను కడిగివేస్తుంది.

4. శూన్యకం: ఇది ఒక రకంగా బాహ్యకుంభకం అంటే గాలిని పూర్తిగా బైటకు వదలి బయటనే బిగపట్టి రానివ్వకుండా వుంచడము. దీర్ఘ, మధ్య శ్వాసలతో అవయవములను కడుక్కొన్న తర్వాత అవి ఏండి పరిశుభ్రం కావడానికి యోగులు ఈ శూన్యశ్వాసను ఉపయోగిస్తారు.