గర్భధారణ సమయంలో చాలా సార్లు తల్లి లేదా బిడ్డ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే సాధారణ ప్రసవం సాధ్యం కాని పరిస్థితులు తలెత్తుతాయి. దీనివల్ల  వైద్యులు సి-సెక్షన్‌ను సిఫారసు చేస్తారు.  నిజానికి నేటి కాలంలో సి-సెక్షన్ ఏ ఎక్కువగా సాగుతోంది. అయితే నేటి కాలం మహిళలలో మెల్లిగా మార్పు వస్తోంది.  చాలామంది సి-సెక్షన్ బదులు సాధారణ ప్రసవం కావాలని వైద్యులను సంప్రదిస్తున్నారు.  ఇందుకోసం ప్రెగ్నెన్సీ క్లియర్ అయ్యింది మొదలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు కూడా. అయితే చాలామంది మహిళలు చేసే ఒక తప్పు వల్ల సాధారణ డెలివరీ కావాలని అనుకున్న వారు కూడా సి-సెక్షన్ కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మహిళలు చేస్తున్న తప్పేంటి? తెలుసుకుంటే..

నీరు..

గర్భాధారణ సమయంలో మహిళలు  నీరు పుష్కలంగా తాగకపోవడం సాధారణ డెలివరీ అవకాశాలను తగ్గిస్తుందట.  భారతదేశం వంటి వేడి చాలా ఎక్కువగా ఉండే దేశంలో గర్భిణీ స్త్రీలు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు లేదా ద్రవాలు తీసుకోవాలని గైనకాలజిస్టులు చెబుతున్నారు.

చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు లేదా నీటి వనరులు అంటే నీరు మాత్రమే అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీని కోసం జ్యూసులు  కూడా తాగవచ్చు. అలాగే  కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కానీ  రోజంతా 3 నుండి 4 లీటర్లు నీరు తాగాలి.

శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు, అది గర్భంలో ఉన్న శిశువు చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. దాని స్థాయి పడిపోతే శిశువు ఎప్పుడైనా గర్భంలో మల విసర్జన చేయవచ్చు.  ఇది ప్రసవాన్ని  అత్యవసరం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో డాక్టర్ సాధారణ ప్రసవానికి బదులుగా సి-సెక్షన్‌ను సిఫారసు చేస్తారు. కాబట్టి నీటి విషయంలో జాగ్రత్త వహించాలి.


                                *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..