భారతీయుల ఆహారంలో నువ్వులు,  పల్లీలు, బెల్లం చాలా ప్రముఖమైనవి.  ఇవి లేని బారతీయ ఆహారాన్ని అస్సలు ఊహించలేరు కూడా.  అయితే నువ్వులు, పల్లీలు,బెల్లాన్ని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు.  పోషకాహార నిపుణులు ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోమని తమ పేషెంట్లకు సిఫారసు చేస్తారు కూడా. ప్రాంతాలను బట్టి వీటిని విభిన్న రకాలుగా ఆహారం తయారీలో వాడుతుంటారు. సాంప్రదాయ వంటకాలు ఇవి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి.  అయితే వీటిని సూపర్ ఫుడ్స్ అని ఎందుకు పిలుస్తారు? ఇలా పిలవడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలుసుకుంటే..

నువ్వులు,  వేరుశెనగల్లో ప్రోటీన్, విటమిన్లు,  ఒమేగా 6 వంటి పోషకాలు ఉంటాయి.ఇక బెల్లం ఐరన్, మెగ్నీషియం,  కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ మూడు సూపర్‌ఫుడ్‌లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని శీతాకాలపు సూపర్‌ఫుడ్‌లు అని కూడా పిలుస్తారు. వాటి పోషక విలువలు వాటిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి.


బెల్లంలో పోషక విలువలు..

బెల్లంలో సుక్రోజ్,  ఫ్రక్టోజ్ రూపంలో చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది, తక్షణ శక్తిని అందిస్తుంది. బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు A, C,  E ఉంటాయి. ఇందులో ఐరన్ తో  సహా అనేక ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి.


బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు..

జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కాలేయం,  రక్తం శుద్ది జరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.  మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది.

ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది.  చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.  శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది.

నువ్వుల పోషక విలువలు..

నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్,  పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిలో విటమిన్ B6 కూడా ఉంటుంది.


నువ్వులు తింటే కలిగే ప్రయోజనాలు..

ఎముకలు దృఢంగా మారుతాయి, వాపు తగ్గుతుంది.  ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది.  మెనోపాజ్ సమయంలో హార్మోన్లను బాలెన్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది,  రక్తపోటు అదుపులో ఉంటుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంటాయి.  కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి.

వేరుశనగ పోషక విలువలు..

వేరుశెనగల్లో ప్రోటీన్,  కొవ్వుతో సహా అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వాటిలో అనేక ముఖ్యమైన విటమిన్లు,  ఖనిజాలు కూడా ఉంటాయి.

వేరుశనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాపు తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.  క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది,  కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది,  పిత్తాశయంలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది. వేరుశనగ రెగ్యులర్ గా తింటే  జీవితకాలం పెరుగుతుంది.  మెదడు పనితీరు మెరుగుపడుతుంది.  కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఈ కారణాల వల్లనే ఈ మూడు ఆహారాలను సూపర్ ఫుడ్స్ అని అంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలం సూపర్ ఫుడ్స్ అని అంటారు.

 

   *రూపశ్రీ.

 

 

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...