నెయ్యి కలిపిన పాలు తాగితే.. సాధారణ ప్రసవం జరుగుతుందా? డాక్టర్ చెప్పిన నిజం ఇదే!


గర్భిణీ స్త్రీలు సాధారణ ప్రసవం కోసం చాలా రకరకాల టిప్స్ పాలో అవుతూ ఉంటారు.  ఎంతో మంది మహిళలు సాధారణ ప్రసవం కోసం ఎంతో ట్రై చేస్తుంటారు. సిజేరియన్ లు పెద్ద ఆప్షన్ గా మారిన  ఈ కాలంలో కూడా చాలామంది మహిళలు నార్మల్ డెలివరీ కావాలని అడుగుతూ ఉంటారు. అయితే నార్మల్ డెలివరీ కూడా మరింత సులువుగా, సుఖంగా గడవాలని కూడా అనుకుంటారు. సుఖంగా, సులభంగా నార్మల్ డెలివరీ కావాలని కోరుకునేవారు పాటించే  ఎన్నో సలహాలలో ఒకటి నెయ్యి కలిపిన పాలు తాగడం. ఇది సాధారణ ప్రసవానికి సహాయపడుతుందని  చాలామంది నమ్ముతారు. అయితే  దీని గురించి వైద్యులు చాలా షాకింగ్ నిజం చెప్పారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

పాలలో నెయ్యి  కలుపుకుని తాగడం వల్ల సాధారణ ప్రసవం జరుగుతుందన్న మాట అపోహ అని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయ కండరాల సంకోచానికి ఖర్జూరాలు, నెయ్యి కలిపిన పాలు ఖచ్చితంగా సహాయపడతాయి. కానీ సాధారణ ప్రసవానికి కణజాలాలు, కండరాలే కారణం. గర్భాశయం ఆరోగ్యంగా ఉండి, కండరాలు మృదువుగా, తెరుచుకుని ఉంటే, అది దానంతట అదే జరిగిపోతుంది. ఆ తర్వాత శారీరక శ్రమ కూడా పాత్ర పోషిస్తుందని అంటున్నారు.  యోగా, నడక వంటి శారీరక శ్రమతో కూడిన కార్యకలాపాలు చేస్తే  కండరాలు సాధారణ ప్రసవానికి, గర్భాశయం తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంటాయని అంటున్నారు.

నార్మల్ డెలివరీ గురించి అసలు నిజం..

ఖర్జూరాలు మెగ్నీషియం, ఐరన్ మరియు పొటాషియంను అందించి, ప్రయోజనకరంగా ఉంటాయి. పరిమిత పరిమాణంలో నెయ్యి , పాలు తీసుకుంటే  మహిళలకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను , శక్తిని అందించి, సాధారణ ప్రసవం కోసం సహాయపడతాయి . అందుకే  సాధారణ ప్రసవం కావాలంటే, పాలలో నెయ్యి కలుపుకుని తాగడం, ఖర్జూరాలు తినడం వంటివి మంచివే.. కానీ చురుకుగా ఉండటం అన్నింటి కంటే ఎక్కువ ముఖ్యం.శరీరం చురుగ్గా ఉండాలి,  తేలికపాటి వ్యాయామం,  వాకింగ్ వంటివి తప్పని సరిగా చేయాలి. ఇవి మాత్రమే కాకుండా.. నార్మల్ డెలివరీ అనేది  మహిళ శరీర స్థితిపై ఆధారపడి ఉంటుంది.

                                *రూపశ్రీ.