
ప్రతి వ్యక్తి అలవాట్లను బట్టి వారి మెదడు, వారి వయస్సు కంటే ఎక్కువగా వృద్ధాప్యం చెందుతుందని అంటారు. ఈ విషయాన్ని స్వయానా వైద్యులే చెబుతున్నారు. మనం ఏమి తింటాము, ఎలా జీవిస్తాము, అన్నీ మన మెదడుపై ప్రభావం చూపుతాయి. మనలో చాలా మంది తెలియకుండానే మన మెదడుకు క్రమంగా హాని కలిగించే అలవాట్లను పాటిస్తుంటారు. మెదడులకు రహస్యంగా హాని కలిగించే ఏడు సాధారణ అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుని, వాటిని నివారించడం చాలా ముఖ్యమని, లేకపోతే వాటి కారణంగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు వైద్యులు. ఇంతకీ స్ట్రోక్ రావడానికి కారణమయ్యే తప్పులు ఏంటో తెలుసుకుంటే..
నిద్ర..
శారీరక అలసట నుండి ఉపశమనం పొందడమే కాకుండా మెదడు రిలాక్స్ అవ్వడానికి, రికవర్ అవ్వడానికి. ముఖ్యంగా రిపేర్ అవ్వడానికి కూడా నిద్ర చాలా అవసరం. రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇంకా రియాక్షన్ టైం నెమ్మదిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఎక్కువ సేపు కూర్చోవడం..
నేటికాలంలో డెస్క్ ఉద్యోగాల కారణంగా గంటల తరబడి ఒకే చోట కూర్చోవాల్సి వస్తోంది. కానీ 8 నుండి 10 గంటలు వరుసగా కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందట. శారీరకంగా చురుకుగా ఉండకపోవడం మెదడుకు విషం లాంటిది.
రాత్రి సమయంలో స్క్రీన్ స్క్రోలింగ్..
పడుకునే ముందు మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉపయోగించడం వల్ల మెదడులోని నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ తగ్గిపోతుంది. ఇది గాఢ నిద్ర రాకుండా చేస్తుంది. గాఢ నిద్ర లేకుండా, మెదడు తనను తాను రిపేర్ చేసుకోలేదు, మరుసటి రోజు మానసికంగా అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంది.
వ్యాయామం..
వ్యాయామం లేకపోవడం వల్ల శారీరక, మెదడు పెరుగుదల రెండూ కుంటుపడతాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెదడు కణాల పెరుగుదల, నిర్వహణకు బాధ్యత వహించే ప్రోటీన్ BDNF (బ్రెయిన్-డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్) తగ్గుతుంది.
బీపి, షుగర్..
అదుపులేని రక్తపోటు, షుగర్ లెవెల్స్ గుండెకు శత్రువులే కాదు.. అవి మెదడులోని చిన్న రక్త నాళాలను కూడా నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి. ఇది నిశ్శబ్దంగా మెదడును దెబ్బతీస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతుంది.
ఒత్తిడి..
ఒత్తిడి మానసిక స్థితిని నాశనం చేయడమే కాదు, అది మెదడును శారీరకంగా కుంచించుకుపోయేలా చేస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి మెదడు యొక్క హిప్పోకాంపస్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది నేర్చుకోవడం, జ్ఞాపకశక్తికి కీలకమైన కేంద్రం.
గురక..
నిద్రపోతున్నప్పుడు బిగ్గరగా గురక పెడితే అది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు. ఈ పరిస్థితి నిద్రలో ఆక్సిజన్ లోపిస్తుంది. దీని వలన మెదడు పొగమంచు ఏర్పడుతుంది, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...




