Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
3. అభిషుత, దేవతర్పక, కర్త, పాత్రలందు ద్రవించు. సర్వద్రష్ట సోమము అందరకు దర్శన మిచ్చుటకు ప్రవహించును.
4. సోమమా! శుద్ధుడవగుము. వసతీవరి జలముమున కలియుము. ధారగా పడుము. నీవు రత్నదాతవు. సత్యయజ్ఞస్థానమున ఆసీనమగుదువు. స్పందనశీలివి హిరణ్మయుడవు.
5. సోమము మాదకుడు. ప్రసన్నకర్త, దివ్యగోస్తనమును పిదుకువాడు. అతడు ప్రాచీన స్థానమగు అంతరిక్షమున వసించును. కర్మనిష్ఠులగు ఋత్విక్కులు సోమమును గ్రహింతురు. శుద్ధిచేయుదురు సర్వద్రష్ట సోమము పరగు పరుగున - యజ్ఞకర్త యజమానికి అన్నము అందించుటకు సాగును.
6. సోమమా నీవు జాగృతుడవు. ప్రియుడవు పరిశుద్ధుడవు మేషలోమ పవిత్రమున ప్రవహించు వాడవు. విప్రుడవు పితరులనేతవు. మా యజ్ఞమును నీ మధుర రసమున నింపుము.
7. సోమమా! నీవు మార్గదర్శివి. విప్రుడవు సూక్ష్మగ్రాహివి. క్రాంత ప్రజ్ఞుడవు. దేవకామివి. సోమము స్రవించును. ద్యులోకమున సూర్యుని వెల్లడించును.
8. ఋత్విక్కులచే అభిషుత సోమము ఉచ్చ, మేషలోమ పవిత్రమునకు సాగును. హరితవర్ణ, మాదక ధారలచే ద్రోణ కలశమున చేరును.
9. తానుసేవించు దుగ్ధాదులతో కలసిన సోమము దిగువ నున్న కలశమునకు పారును. నీరు సంద్రానకు సాగినట్లు - సంభజనీయ, రసవంత సోమము ద్రోణకలశమునకు సాగును. సోమమును మత్తు - కలిగించుటకు అభిషవింతురు.
10. సోమమా! నీవు రాళ్లచే అభిషుతమగుదువు. "మేషలోమ" పవిత్రమును అవలోకించి ద్రవింతువు. అభిషవణ ఫలకము మీద ఉన్న కలశమున - జనులు నరగమున స్ధిరపడినట్లు - సోమము స్థిరపడును. చెక్క పాత్రలో స్థానము ఏర్పరచు కొనును.
11. అన్నభిలాషి సోమము సూక్ష్మ మేశాలోమ పవిత్రమును అవలోకించి ద్రవించును. పురోహితులు శద్ధిచేసినదియు, ఆమోద యోగ్యమగునదియు, పురోహితులచే శుద్ధిచేయబడినదియు, విప్రులచే అభిషుతమైన, హరిత వర్ణ సోమమును - యుద్ధమున కంపు అశ్విమునువలె - ఆలంకరింతురు.
12. సోమమా! జలములు సముద్రమునువలె - దేవతల పానము కొరకు నీవు జలములచే పూరించ బడుదువు. మాదక జాగృతుడవగు నీవు తీవల రసయుక్తుడువై మధుశ్చుత కలశమున ప్రవేశింతువు.
13. స్వృహణీయుడు, ప్రసన్నకారకుడు, పుత్రునివలె శుభ్రము చేయదగిన సోమము కృష్ణవర్ణ పవిత్రమును ఆవరించుము. వేగావంతుడగు నరుడు రథమును యుద్ధమునకు పంపినట్లు - పది అంగుళులు సోమమును జలమునకు పంపును.
14. గమనశీల సోమము తన మాదక రసమును నలువైపుల ప్రవహింప చేయును. విద్వాంసుడు, మాదకుడు, అందరు అందుకొన దగిన సోమము అంతరిక్షంలో అత్యున్నత పవిత్రమున ప్రవహించును.
15. శోధిత, దివ్య, సత్యసామ్రాట్టు సోమము కలశమున ధారగా పడుచు. ప్రేరిత, మహాసత్య సోమము మిత్రావరుణులను రక్షించుటకు తరలు చున్నాడు!
16. కర్మనిష్ఠులు ఏర్పరచిన, స్వృహణీయ, సూక్ష్మదర్శక, దివ్య అంతరిక్ష ఉత్పన్న సోమసామ్రాట్టు ఇంద్రుని కొరకు ద్రవించును.
17. సోమమా! నీ స్నేహమున నేను నిత్యము. ఆనంద జీవితము గడుపు చున్నాను. నీ మిత్రుడనగు నన్ను అనేకమంది రాక్షసులు హింసించు చున్నారు. వారిని వధించుము.
18. పింగళసోమమా! నీ మైత్రి కొరకు నేను రాత్రింబవళ్లు తపించు చున్నాను. ఉజ్వలుడవు, పరమస్థానము నందున్న సూర్యుని వంటి నిన్ను చేరుకొనుటకు ప్రయత్నించు చున్నాము. పక్షి సూర్యుని చేరుటకు వలె నేను నిన్ను చేరుటకు తపించుచున్నాను.
19. శుభంకర అంగుళుల సోమమా శుద్ధిచేయదగిన నీవు కలశమును శబ్ధమునంపుదువు. పవమనా సోమమా! నీవు స్తోతలకు పింగళవర్ణ, బహుజన అర్ధిత ధనమునిమ్ము.
20. సోమమా! నీవు వర్షకుడవు. జలములందు ఆలంకృతుడవు. మేషలోమ పవిత్రమున శుద్ధిచేయబడిన వాడవు. కలశమున ధ్వనులు చేయుదువు. పాలలో కలసిన నీవు అలంకరించబడిన స్థానమునకు చేరుదువు.
21. సోమమా! సకల స్తోత్రములు లక్ష్యముగా అన్నలాభము కొరకు ద్రవించుము. నీవు దేవతలకు మత్తు కలిగించువాడవు దేవతలందు ముఖ్యుడవు కలశరూపము దాల్చుము.
22. సోమమా! మర్త్యలోక, దివ్యలోకములందలి సమస్త ద్రవపదార్థములతో ద్రవించుము. సూక్ష్మ దృష్టిగల సోమమా ! నీవు శ్వేద వర్ణుడవు విప్రులు స్తుతులు, అంగుళులతో నిన్ను అర్చింతురు.
23. శోదిత, మరుద్యుక్త, గమనశీల, మాదక, ఇంద్రసేవిత, సోమమును స్తుతి, అన్నము కొరకు ధాదారూపమున పవిత్రమున కల్పింతురు.
24. జలములోకలిసి, అభిషవకర్తలచే పంపబడి సోమము కలశమున ప్రవేశించును. సోమము దీప్తిని ప్రకాశింప చేయును. క్షీరాదుల రూపము దాల్చుము. ప్రస్తుతము స్తుతులు కోరుచున్నాడు "మన్దనా అవీవిశత్."
నూట ఎనిమిదవ సూక్తము
ఋషి - వేరు వేరు. దేవత - పవమాన సోమము. ఛందస్సు -
కకుభ బృహతి - గాయత్రి.
1. సోమమా! నీవు పుత్రదాతవు మహానుడవు. దీప్తుడవు అత్యంత మధిరమవగుము. మాదకుడ వగుము. ఇంద్రుని కొరకు ద్రవింపుము.
2. ఇంద్రుడు కోరకల్ని తీర్చువాడు. అతడు నిన్ను పానము చేయును. వృషభమువలె ప్రవర్తించును - "వృషాయతే" సోమమా! నీవు సర్వద్రష్టవు. నిన్ను పానము చేసి ఇంద్రుడు జ్ఞానిఅగును. యుద్ధములోకి గుఱ్ఱము చొచ్చినట్లు - శత్రువుల అన్నమును ఆక్రమించును.
3. సోమమా! ఎంతో దీప్తమంతులగు దేవతలను అమరులను చేయుటకుగాను శబ్దము చేయును.
4. అంగిరలు అభినవ మార్గమున యజ్ఞానుష్ఠానము చేసినవారు. వారు సోమము వలననే పణులు అపహరించిన గోవుల ద్వారములు తెరచినారు. సోమము వలననే విప్రులు అపహృత గోవులను విడిపించినారు. ఇంద్రాది దేవతల కొరకు చేపట్టిన యజ్ఞములందు సోమము వలననే యజమానులు అమృతమయ అన్నమును పొందినారు. ఆ సోమమే దేవతలను అమరులను చేయుటకు నినదించును.
5. మాదకతమ జలసంఘాత సమమగు సోమము జలక్రీడలాడును. అభిషుతమగును. మేషలోమ పవిత్ము నుండి ధారగా కలశమున పారును.
6. సోమము గమనశీల మేఘములోనికి దూరి బలవంతముగా వర్షము కలిగించినాడు. ఆ సోమమే అశ్వములను, గోవులను వ్యాపింప చేసినాడు. శత్రుహంత సోమమా! కవచధారి శూరునివలె అసురులను హతమార్చుము.
7. సోమము అశ్వమువలె వేగవంతము. స్తుత్యము, అంతరిక్ష జలప్రేరకము. తేజోప్రేగకము. జలవర్షకము. ఋత్విక్కులారా! సోమమును జలకములాడించండి అభిషవించండి.
8. జలములందు ఉత్పన్నము, మహారాజు, దివ్యుడు, స్తుత్యుడు, మహానుడగు సోమము జలములందు ఎదుగును. అనేక దారలుగల, కామవర్షక, జలవర్థక, ప్రియ సోమమును అభిషవించండి.
9. అన్నపతి, స్తుత్య సోమమా! దేవాభిలాషివగు నీవు మాకు దివ్యమును. విశేషమును అగు అన్నము ప్రదానము చేయుము. అంతరిక్షమందలి మేఘమును భేదించుము. వర్షము కలిగించుము.
10. సజల సోమమా! అభిషుత ఫలకరములమీద అభిషుతమగుము. మహారాజువలె సమస్త ప్రజను పాలింపుము. విచ్చేయుము. ద్యులోకమునుండి జలమునంపుము. గవాభిలాషి యజమాని కోరికలు తీర్చుము.
11. సోమము మాదకము బహుధారావంతు. కామవర్షికము సకల కారకము దేవాభిలాషి ఋత్విక్కుల సోమమును దుహింతురు.
12. శబ్దము కలిగించు, అంధకారమును దూరము చేయునట్టి. కామవర్షిక, అమర, సోమమును. జ్ఞానము తెలిసికొనును. విప్రులు సోమమును కలుపుదురు. స్తుతింతురు. మూడు సవనముల యజ్ఞిక కర్మలు సోమము వలెనే పూర్తిఅగును.
13. సోమము ధనములు, గోవులు, అన్నములు, మునుష్యులుగల ఇండ్లు ప్రసాదించువాడు. సోమము ఋత్విక్కులచే అభిషుతమగును.
14. ఇంద్ర, మాదుత, అర్యము భగులు పానము చేయునదియు, మిత్ర, వరుణ, ఇంద్రులను అభిషము చేయు సోమము అభిషవించ బడును.
15. సోమమా! నీవు ఋత్విక్కులచే నియతుడవై, ఆయుధయుక్తుడవై, అత్యంత మధురమవై, మాదకమవై ఇంద్రుని కొరకు ప్రవహింపుము.
16. సోమమా! నీవు మిత్ర, వరుణ, వాయు సేవితుడవు. ద్యులోక స్తంభమవు. స్వట్టముడవు. నదులు సముద్రనందు వలె ఇంద్రుని హృదయకలశమున ఆసీనుడవగుము.
నూట తొమ్మిదవ సూక్తము
ఋషి - ఈశ్వరపుత్ర ఆగ్నేయులు. దేవత - పవమాన సోమము.
ఛందస్సు - ద్విపద విరాజి.
1. సోమమా! నీవు స్వాదునవు. ఇంద్ర, మిత్ర, పూష, భగుని కొరకు క్షరితుడవగుము.
2. ప్రజ్ఞానము, బలము కొరకు ఇంద్రుడు అభిషుతమైన నిన్ను పానము చేయవలెను. సకల దేవతలు నిన్ను పానము చేయవలెను.
3. సోమమా! నీవు ప్రదీప్తుడవు దివ్యుడవు దేవతల పానయోగ్యుడవు ఆభరణములు మహాగృహముకొరకు ద్రవించుము.
4. సోమమా! నీవు మహారస ప్రవాహకుడవు సర్వపాలకుడవు దేవతలు లక్ష్యముగా ప్రవహింపుము.
5. సోమమా! దీప్తువగుము. దేవతల కొరకు క్షరింపుము. ద్యావాపృథ్వులు సకల ప్రజకు సుఖములు ప్రసాదించుము.
6. సోమమా! నీవు దీప్తుడవు పానయోగ్యుడవు ద్యులోకమును వహించువాడవు బలవంతుడవగును. ససత్యభూత యజ్ఞమందు ప్రవహించుము.
7. సోమమా! నీవు యశస్వివి. శోభన ధారలు కలవాడవు ప్రాచీనుడవు మేషలోమము దాటి ప్రవహించుము.
8. సోమము కర్మనిష్ఠులచే నియుతుడు జాయమానుడు పవిత్రుడు శోధితుడు ప్రసన్నుడు సర్వజ్ఞుడు అతడు మాకు సకల ధనముల ప్రసాదించవలెను.
9. దేవతలను వర్థిల్ల చేయు సోమము మాకు సంతానము సకల ధనములు ప్రసాదించవలెను.
10. సోమమా! నిన్ను గుఱ్ఱమును మార్జినము చేయుదురు. జ్ఞానము, బలము, ధనము కొరకు ప్రవహింపుము.
11. అభిషువకర్తలు బలము కొరకు నీయొక్క రసమును శుద్ధిచేయుదురు. వారు మహా అన్నమునకు గాను నిన్ను శుద్ధి చేయుదురు.
12. జలపుత్ర, జాయమాన, హరిత వర్ణ, దీప్త సోమమును ఋత్విక్కులు, దేవతల కొరకు శుద్ధిచేయుదురు.
13. సోమము కళ్యాణరూపి క్రాంత ప్రజ్ఞుడు. అతడు జలముల స్థానము అంతరిక్షమున బలము ధనము కొరకు ద్రవించును.
14. సోమము ఇంద్రుని దేహమును భరించును. ఆ దేహముతోనే ఇంద్రుడు సకల పాపిరాక్షసులను హతమార్చినాడు.
15. ఆవుపాలు కలిపినదియు, పురోహితులు అభిషవించిన సోమమును సకల దేవతలు పానము చేయుదురు
16. అభిషుత, బాహుధారాయుత సోమము మేషలోమ పవిత్రమున ఏర్పరచి నలువైపుల ప్రవహించును.
17. సోమము అనేక తేజోయుక్తము బలశాలి జలమున శోధితము దుగ్ధమిశ్రితమగు సోమము నలు వైపుల ప్రవహించును.
18. ఋత్విక్కులచే అభిషుతమై, పాత్రలలో అభిషుతమైన సోమము కలశమునకు చేరవలెను.
19. పవిత్రమున ఏర్పడి, బలశాలియై, బహుధారల సోమమును ఇంద్రుని కొరకు సిద్ధము చేయుదురు.
20. కామవర్షక ఇంద్రుని మత్తునకుగాను ఋత్విక్కులు సోమమునందు మధురరసము కలుపుదురు.
21. సోమమా! జలముల కలసిన, హరితవర్ణమవగునిన్ను దేవతల పానము, వారి జలము కొరకు త్విక్కులు శుద్ధిచేయు చున్నారు.



