Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
8. సోమపు బలము కొరకు ప్రియగోవులు శబ్దము చేయును శోధిత సొమము రక్షణ కొరకు దారులు పరచుచున్నాడు.
9. సోమమా! నీలోని రసము ఓజస్వి. చమత్కారి దానిని వ్యాపింప చేయుము. అది పంచజనుల వద్దకు చేరును. దానివలన మాకు ధనము లభించవలెను.
10. పథిప్రదర్శక, దేవమిత్ర, అభిషుత, పాపశూన్య, దీప్త శోభన ధ్యాన, సర్వజ్ఞ సోమము మా కొరకు విచ్చేయుచున్నాడు.
11. సోమము గోచర్మ ఉత్పన్నుడు, శిలలందు అభిషుతుడు. ధనసాధకుడు. అతడు నలుదిశల నినదించును.
12. పవిత్ర శోధిత, విప్ర, దధిమిశ్రిత, జలక్రీడ, స్థిరుడగుసోమము సూర్యునివలె పాత్రలందు దర్శనీయడు.
13. అభిషుత, పానయోగ్య సోమపు ప్రసిద్ధ గర్జన కర్మవిఘ్నకారి శునకమును ధ్వంసము చేయవలెను ప్రాచీన కాలమున భృగువులు మఖదామకును వధించినారు. స్తోతలారా! మీరును అట్లే వినయశూన్య శునకుమును వధించండి.
14. తల్లిదండ్రుల బాహువులందు బిడ్డవాలినట్లు దేవమిత్ర సొమము పవిత్రమున వాలును. జారుడు జారిణిని వెదుకుచు పోయినట్లు - సోమము స్వస్థానమగు కలశమునకు పోవును.
15. సోమము బలసాధకుడు శక్తిమంతుడు, అతడు స్వతేజమున ద్యావా పృథ్వులును ఆచ్ఛాదించును. నిర్మాతయగు యజమాని తన గృహమున ప్రవేశించినట్లు - హరిత వర్ణసోమము కలశమున బుద్ధిగా ప్రవేశించును.
16. సోమము మేషలోమ పవిత్రమునుండి కలశమున చేరును. గోచర్మపుపై శబ్దించు కామవర్షక, రిత వర్ణ సోమము ఇంద్రుని కొరకు అలంకరించిన స్థానమునకు చేరును.
నూట రెండవ సూక్తము.
ఋషి - ఆప్తత్రితుడు. దేవత - పవమాన సోమము. ఛందస్సు - ఉష్టిక్
1. సోమము యజ్ఞకర్త. పూజనీయుడు జలపుత్రుడు. అతడు యజ్ఞధారక రసమును కల్పించును. సమస్త ప్రియహమిని వ్యాప్తము చేయును. సోమము ద్యావాపృథ్వులందు వసించును.
2. మాయజ్ఞమందు, హవిర్థానమున నిలిపిన రాతివంటి గట్టి అభిశవ ఫలకముల మీదికి సోమము చేరినాడు. ఋత్విక్కులు యజ్ఞధారకములగు గాయత్రి మున్నగు ఏడు ఛందస్సులతో సోమమును స్తుతింతురు.
3. సోమమా! మా యజ్ఞపు మూడు సవనములందు ప్రవహించుము. విచ్చేయునపుడు ఇంద్రుని వెంటతెమ్ము. వర్థమాన స్తోతలు ఇంద్రుని స్తుతిస్తారు.
4. సోమము ప్రాదుర్భూతమా. కర్మధారకము. అట్టి సోమమును మాతృరూప సప్తనదులు లేక సప్త ఛందస్సులు - యజమానులకు సంపదలు కలిగించుటకు స్తుతించును. "అయంధ్రువో రయాణాం చికేతమత్." అతడు ధనజ్ఞాతయగుట యదార్థము.
5. ద్రోహరహితులగు సమస్తదేవతలు సోమపు కార్యములందు కలిసిపోవుదురు. అభిలాషులు అగుదురు. అభిషుత సోమమును సేవింతురు.
6. వసతీవరీజలము యజ్ఞవర్థకము. ఆజలము తన గర్భరూపమగు సోమమును యజ్ఞమందు దర్శనార్థము సృష్టించునాడు. సోమము సర్వశుభప్రదాత. క్రాంత ప్రజ్ఞుడు. పూజ్యుడు. అందరకు అభిలషణీయుడు.
7. ద్యావాపృథ్వులు పరస్పరసంగతములు. గొప్పవి. సత్య యజ్ఞపు మాతృరూపలు సోమము స్వయముగా వాని వద్దకేగును. యాజ్ఞిక పురోహితులు సొమమును జలమున కలుపుదురు.
8. సోమము - జ్ఞానము, దీప్తింద్రియములు, స్వతేజమున ద్యులోకపు అంధకారమును అంతము చేయును. సోమమా! హింసాశూన్య యజ్ఞమున నీ యొక్క సత్యరూపరసమున పెంపొందించుము.
నూటమూడవ సూక్తము
ఋషి - ఆప్తధ్వితుడు. దేవత - పవమాన సోమము. ఛందస్సు - ఉష్టక్.
1. సోమము పవిత్రము శోధితము. కర్మవిధాత. స్తోతలకు ప్రసన్నదాయకుడు. ద్వితా! భృతి పొందు సేవకునివలె నీవు సోమమును ఉద్యతి వచనముల స్తుతించుము.
2. ఆవుపాలలో కలసిన సోమము మేషలోమ పవిత్రమునకు చేరును. హరితవర్ణసోమము శుద్ధియై 1. ద్రోణకలశము 2. ఆధవనీయము 3. పూతభూతమను మూడు తావరములను ఏర్పరచును.
3. సోమము మేషలోమ పవిత్రమునుండి మధురరసము కలిగించు ద్రోణ కలశమునకు తనరసమును పంపుము. ఋషుల సప్త ఛందములు సోమమును నుతించును.
4. సోమము స్తుతుల నాయకుడు. అందరకు దేవత. హరిత వర్ణుడు. శోధిత సోమము అభిషవ ఫలకములపై ఆసీనుడగును. అభిషవమైనంత ఇంద్రాది సమస్త దేవతలు సోమము వద్ద చేరుదురు.
5. సోమమా! నీవు ఇంద్రసమ రథమును అధిరోహింపుము. దేవసేనను చేరుము. ఋషులు శుద్ధి చేసిన అమర సొమము స్తోతలకు ధనాదులు ఇచ్చును.
6. అశ్వమువలె యుద్ధాభిలాష, దీప్యనవాన, దేవతల కొరకు అభిషుత, పాత్రలందుచేరిన, పవిత్రమున శుద్ధిచేసిన సోమము నలువైపుల పరగులిడును.
(శ్రీమదాంథ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ అష్టకము తొమ్మిదవ మండలము ఆరవ అనువాకము సమాప్తము.)
ఏడవ అనువాకము నూటనాలుగవ సూక్తము
ఋషి - కాణ్వ పర్వత, నారదులను ఇదిదరు. లేదా కశ్యప పుత్రికలు శిఖండినులను
ఇద్దరు... దేవత - పవమాన సోమము. ఛందస్సు - ఉష్టిక్
1.మిత్రులగు పురోహితులారా! కూర్చొండి పరిశుద్ధ సోమపు పాటలు పాడండి. అభిషుత సోమనకు యజ్ఞపుహవి మున్నగునవి మసర్దించండి. పిల్లలను తల్లిదండ్రులు నగలతో అలంకరించినట్లు - సోమమునకు శోభకూర్చుటకు అలంకరించండి.
2.సోమము గృహసాధకుడు. దేవతల రక్షకుడు మదకారకుడు ఎంతో బలవంతుడు ఋత్విక్కులారా! సోమము మాతృరూప జలమున - దూడను ఆవుతో కలిపినట్లు కలపండి.
3. బలసాధక సోమమును పవిత్రమున శుద్ధిచేయండి వేగసోమము దేవతలకు పానీయమగును. మిత్ర వరుణులకు సోమము పావమై ఎంతో సుఖము కలిగించును.
4. సోమమా ! మాకు దానము లిప్పించుటకు ధనదాత మా వచనములచే నిన్ను స్తుతించును. మేము నీ యొక్క రసమును వరింతుము. దానిని ఆవుపాలతో కలుపుదుము.
5. మత్తులకు స్వామి సోమమా! నీ రూపము వెలుగులు చిమ్మును. "పభౌవ సభ్యేగాతువిత్త మోవ" - మిత్రుడు మిత్రునకు వలె మాకు చక్కని మార్గము చూపుము.
6. సోమమా ! మాతో ప్రాచీనస్నేహము చేయుము. ఉద్దండుడు, లోనబయట మాయలున్నవాడు, పొట్ట పెరిగిన వాడగు రాక్షసుని వధింపుము. మా పాపములను నష్టపరచుము.
నూట అయిదవ సూక్తము
ఋషి - పర్వత, నారదులు. దేవత - పవమాన సొమము. ఛందస్సు - ఉష్టిక్
1. మిత్రులగు పురోహితులారా! దేవతలకు మత్తు కలిగించుటకు సోమమును స్తుతించండి. శిశువును అలంకరించినట్లు -గోదుగ్ధము, స్తుతులు మున్నగువానితో సోమమును అలంకరించండి.
2. సోమము సేనారక్షకుడు మాదకుడు స్తుతులచే అలంకృతుడు ప్రోత్సాహితుడు ఆవును దూడతో లిపినట్లు -సోమమును నీటితో కలుపుదురు.
3. సోమము బలసాధకుడు, వేగవంతుడు దేవతల అనుభవమునకు అభిషుతడగువాడు. సోమము అత్యంత మధురము.
4. సుబలశాలి సోమమా! అభిషుతుడవగుము. మాకు యజ్ఞసాధక ధనమును, అశ్వ గోయుక్త ధనమును ప్రసాదించుము.... నేను సోమరసమును పాలతో కలుపుతాను.
5. హరితవర్ణ, పశుస్వామివగు మాసోమమా! నీవు అత్యంత దీప్తరూపుడవు. ఋత్విక్కులచే నియుక్తడవు. మాకు దీప్త కిరణవ్ తుడవగుము - వెలుగులనిమ్ము.
6. సోమమా! మాతో ప్రాచీన స్నేహము చేయుము. దేవ శూన్యులు, పొట్టలుగల రాక్షసులను మానుండి దూరము చేయుము. శత్రువులను ఓడించుము. బధాకలును బాదుము. లోన, బయటమాయలున్న రాక్షసులను మానుంచి దూరముంచుము.
నూట ఆరవ సూక్తము
ఋషి - వేరువేరు. దేవత - పవమాన సోమము. ఛందస్సు - ఉష్టిక్.
1.శీఘ్రజ్ఞాత, ద్రవణశీల, సర్వజ్ఞ, హరితవర్ణ, అభిషుత కామ వర్ణక సోమము ఇంద్రుని వద్దకు చేరవలెను.
2. సంగ్రామము కొరకు ఆశ్రయనీయుడు, క్షరణశీల అభిషుత సోమము ఇంద్రుని కొరకు ద్రవించుచు ఇంద్రుడు లోకములను ఎరుగును. సోమము ఇంద్రుని ఎరుగును.
3. సోమము పుట్టినంత ఇంద్రుడు పూజనీయ, గ్రహణీయ ధనుస్సు పట్టును. అంతరిక్షమున ఇంద్రుడు "అహి,నా మముంచినాడు వర్షము కలిగించినాడు. వజ్రము పట్టినాడు."
4. సోమమా! నీవు అప్రమత్తుడవు ఇంద్రుని కొరకు పాత్రలందు నీరగుము. దీప్తయుక్త సర్వజ్ఞ శత్రునాశక బలముతో విజయము చేయుము.
5. సోమమా! నీవు ఎల్లరకు దర్శనీయుడవు. బహుమార్గవి యజమాను సన్మార్గకర్తవు. సర్వ ద్రష్టవు ఇంద్రుని కొరకు వర్షక మాదక రసమును కలిగించుము.
6. సోమమా! నీవు మార్గదర్శివి. దేవతలకు మధురిమవు శబ్దించువాడవు. అనేక మార్గముల నుండి కలశమున ప్రవేశించుము.
7.సోమమా ! దేవతలు సేవించుటకు బలవర్థక ధారలతో కరిగి ఇంద్రాది దేవతలు సుఖకర సోమమును సేవింతురు.
8. సోమరసము ఇంద్రుని వర్థిల్ల చేయును. అమరత్వమునకు గాను ఇంద్రాది దేవతలు సుఖకర సోమమును సేవింతురు.
9. అభిషవించబడు సోమమా! భూమి మీద జలవర్షము కలిగించు సోమమా! వృష్టియుక్త ద్యులోక వంతసోమమా! మా కొరకు ధనము కొనితెమ్ము.
10. పవిత్ర, స్తోత్రపు మొదట శబ్దించు, శుద్ధించబడిన సోమమా! ధారలుగా మేషలోమ పవిత్రమున ప్రవేశింపుము.
11. సోమము బలశాలి. జలక్రీడి, పవిత్రమును దాతువాడు. స్తోతలు అట్టిసోమమును స్తుతులతో వర్ఘిల్లచేయుదురు. మూడు సవనముల వారును సోమమును స్తుతింతురు.
12. అశ్వమును యుద్ధమునకు సాగనంపుదురు. అన్నభిలాషి సోమమును కలశమునకు పంపుదురు. శుద్ధించిన సోమము ధ్వని చేయుచు పాత్రలలో పడును.
13. శ్లాఘనీయ, హరిత వర్ణసోమము సాధుమార్గమున కుటల పవిత్రమును దాటును. సోమము స్తోతలకు వీరులగు పుత్రులను ఇచ్చుచున్నాడు.
(సాధు మార్గము చక్కనిది. కుటిల పవిత్రము వంకరిది)
14. సోమమా! దేవాభిలాషివగుము. ధారలుగా ప్రవహింపుము. నీ మాదక ధారలు సిద్ధమగును. శబ్దించు సోమము పవిత్రమునకు నలువైపులనుంచి చేరును.
నూట ఏడవ సూక్తము
ఋషి - భరద్వాజ కాశ్యపాది సప్తర్షులు. దేవత - పవమాన సోమము.
ఛందస్సు - వేరు వేరు.
1. సోమము దేవతలకు ఉత్తమ హవిస్సు. మానవుల హితైషి. అంతరిక్షజ్ఞాత. అట్టి సోమమును పురోహితులు అభిషవింతురు. ఋత్విక్కులారా! కర్మ తరువాత సోమమును జలములందుంచండి.
2. సోమమా! నీవు అహింసనీయుడవు సుగంధివి శోధితుడవు. మేషలోమ పవిత్రమున ప్రవహించుము. అభిషవమైనంత నీలో పాలు, సత్తు కలుపుదుము. జలములందున్న నిన్ను భజింతుము.



