Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ వెంకటాచార్య, కె.
గుండెపై కుంపటి
కపటబుద్ధితొ చైనాయె ఖడ్గమెత్తె
భటులు రాలిరి భరతాంబ పాదములను
క్షుభిత హృదయమ్ము ఘోషిల్లె శోకవితతి
నిలిచె కుంపటి గుండెపై, నీతిధనుడ!
ఘోరము ఘోరమో సఖుడ!
కుత్సితమిత్రుడు చైనవాడు, సం
భారము గూర్చి, సీమ విధి
భంగమొనర్చె, కవోష్ణ రక్తమే
పారెను హైమభూధరము
పై నగరాజు, కదల్చె నశ్రువుల్
ధీరత వేగ రమ్ము, బల
తీవ్రతజూపి మరల్చు శత్రువున్
చక్కని భూమి కొంత ఘన
శత్రు సమూహృతమౌనె? వేదనం
జిక్కుట, భావ్యమౌనె? రిపు
సేనల దున్మి మధింప లెమ్మురా!
టక్కరి జిత్తులన్ని, కప
టమ్మె, రణమ్మున లొంగరాదు, ము
న్నెక్కడలేని దుర్విధి ని
కెట్టుల శౌర్యధరిత్రి సైచురా?
విరివిగ మారణాస్త్రముల
బెంచి, సమస్త జగంపు నేస్తమే,
బిరబిర గూర్చి, చైన యను
భీకర రాక్షసమూర్తి గూల్ప, దు
ర్భర రణహింస దేల్ప, నవ
భారత రక్షక! సైన్యశక్తి, సం
గరమున జూపి, రక్షకయి
కాల్చుము వైరి బలాఢ్య యోధులన్||
నిదుర, విహారబుద్ధి పర
నింద, దురాశ, నిగూఢ వంచనల్
వదలవలెన్, ప్రచండయుగ
భంగిమ కన్పడ నైక్యయుక్తి సం
పద నిగుడించి, మించి, రణ
భైరవి గెల్వగ, జైత్రలక్ష్మి కీ
వధిపతి వౌదు, సద్భటుడ
వై ప్రబలోద్ధృత, రుద్రమూర్తివై
* * * *





