Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



                                         మూడవ అధ్యాయము
            
                                                      కర్మయోగము
    
    అర్జున ఉవాచః    
        జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్ధన
        తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ1

    జనార్ధనా! కేశవా! కర్మకన్న ననము ఉత్తమమైనదని బోధించినావు. నన్ను ఈ ఘోరకర్మ ఎందుకు ఆచరించమని పురికొల్పుతున్నావు.
    వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వధ నిశ్చిత్య యేన శ్రేయో హమాప్నుయామ్2
    నానావిధములుగా చెప్పినావు. నన్ను మోసమున బడవేసినావు,. నాకు శ్రేయస్సు గలుగుటకు ఏదేవి ఒక్కదానినే ఉపయోగించుము.
    శ్రీ భగవానువాచః
    లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురాప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినామ్3
    ఈ లోకమున నిష్ట రెండు రకములని పూర్వము నేను చెప్పియున్నాను. జ్ఞానయోగులకు సాంఖ్య నిష్ట. యోగులకు కర్మ యోగనిష్ట. ఈ విధముగా నిష్ట 2 రకములు అగుచున్నది.
        న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషో-శ్నుతే
        న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధి గచ్చతి 4

    నరుడు కర్మలను ఆచరించవలెను. అట్లుగాకున్న అతనికి యోగసిద్ది లభించదు. కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సాంఖ్యనిష్టను పొందజాలడు.
    
    దీపిక:
    నరుడు కర్మ చేయవలసి యున్నది. పనిమీదనే యీ లోకము, సమాజము నిలచియున్నవి. కాబట్టి కర్మ తప్పనిసరి. కర్మచేయనివానికి ఫలితం ఎట్లు? కర్మఫల త్యాగమెట్లు? నిష్కామకర్మ ఎట్లు. ఎటువంటి స్థితి గలిగినను, జ్ఞానమునకును, యోగమునకును, కర్మలేక పని అత్యవసరములు.
    సమస్త ప్రాణులు కర్మ చేయుచున్నవి. కర్మలేనిది లోకము లేకున్నది.
    న మి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్
    కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః 5 నరుడు క్షణమాత్రము అకర్ముడు కాజాలడు. ప్రాణులన్నింటికిని కర్మ చేయుట అవశ్యకమైయున్నది.
    
    దీపిక:
    కర్మ కేవలము కాయకము కాదు. అవయవములచే చేయబడునది మాత్రము కాదు. బుద్ధి, మనసు గూడా కర్మయే. నరుడు మానసికముగా గాని శరీరముతో గాని నిరంతరము కర్మచేయుచునే యుండును. ఆలోచన కూడా కర్మ అగును. కావున మనిషి పని చేయని క్షణము ఉండదు.
        కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసాస్మరన్    
        ఇంద్రియార్ధాన్ విమూఢాత్మా మిథ్యాచార స్సఉచ్చతే 6

    ఇంద్రియములను కట్టివేయుట. మనసుతో ఇంద్రియార్ధములను చింతించుట అట్టివాడిని మూఢాత్మ. మిధ్యాచారుడు అనుచున్నారు.
    
    దీపిక:
    కర్మేంద్రియములకన్న జ్ఞానేంద్రియములు శ్రేష్టములు. మనసు కలియని కార్యము కార్యముకాకున్నది. ఒక చిన్నపిల్ల గాజుపాత్రను పడవేయును. ఆమెను అడిగిన కావలయునని చేయలేదు అనును. అట్లనిన ఆమె చేసిన పనిలో మనసు కలసి లేదు. ఆ విషయము ఆ చిన్నపిల్లకు కూడా తెలుసు. అంటే ఇది సహజాతము. మనసు కలువని కార్యము నేరముగాదు.
        యస్త్యింద్రియాణి మనసా నియమ్యారభతే-ర్జున
        కర్మేంద్రియైః కర్మయోగం అసక్త స్స విశిష్యతే 7

    అర్జునా! మనస్సు ఇంద్రియములను వశపరచుకొనుము. అనాసక్తుడవు ఆగుము. అవయవములతో కర్మాచరణ చేయువాడు శ్రేష్ఠుడు.
        నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహ్య కర్మణః
        శరీర యాత్రా -పి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణ 8

    నీవు కర్తవ్యకర్మలను నిర్వహించుము. కర్మములను మానుట కన్న చేయుటయే ఉత్తమము. కర్మ ఆచరించకున్న దేహ ధారణయే కష్టము.
        యజ్ఞారధాత్కర్మణో -న్యత్ర లోకో యమ కర్మబంధనః
        తదర్ధం కర్మ కౌంతేయ! ముక్తసంగస్సమాచర 9

    కౌంతేయా! లోకము కర్మబంధి కావున యజ్ఞమును ఆచరింపుము అట్టి కర్మను నిస్సంగుడవై ఆచరించుము.
        సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
        అనేన ప్రసవిష్యధ్వం ఏషవో -స్త్విష్ట కామధుక్ 10

    కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించినాడు. అతడు వారితో ఇట్లు అన్నాడు.
    మీరు యజ్ఞముల ద్వారా వృద్ధి పొందండి. యజ్ఞములు మీ కోర్కెలను తీర్చును.
        దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః
        పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ 11

    యజ్ఞములు చేయండి. దేవతలను తృప్తి పరచండి దేవతలు అనుగ్రహింతురు. స్వార్ధములేని మనస్సుతో ఒకరినొకరు సంతృప్తి పరచుకొనుడు. అందువల్ల పరమశ్రేయము కలుగును.
        ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః
        తైర్ధత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః 12

    ఆ విధముగా చేయుట వలన దేవతలు భోగములను ప్రసాదింతురు. అటువంటి భోగములను, దేవతలకు నివేదించక అనుభవించువాడు వాస్తవ చోరుడు అగుచున్నాడు.
        యజ్ఞశిష్టాశిన స్సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః
        భుంజతే త్వఘం పాపాః యే పచంత్యాత్మ కారణాత్ 13

    యజ్ఞశిష్టాన్నమును భుజించువాడు సకల పాపములనుండి విముక్తుడు అగుచున్నాడు. తన కొరకు మాత్రము వండుకొనువాడు పాపిష్టి పాపమునే భుజించుచున్నాడు.
        అన్నాద్భవంతి భూతాని పర్జన్యా దన్న సంభవః
        యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః 14

    
        కర్మబ్రహోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవమ్
        తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిస్థితమ్ 15

    అన్నము నుండి ప్రాణులు జన్మించుచున్నవి. అన్నము పర్జన్యుని వలన కలుగుచున్నది. పర్జన్యుడు యజ్ఞము వలన కలుగుచున్నాడు. యజ్ఞము కర్మకు పుట్టిల్లు.
    కర్మ బ్రహ్మనుండి ఉద్భవించినదిగా తెలియును. బ్రహ్మ అక్షర సముద్భవుడు. కావున బ్రహ్మయందే సమస్తము నిలచియున్నది. బ్రహ్మ నిత్యయజ్ఞ ప్రతిష్టితుడు.
    
    దీపిక:
    యజ్ఞము సమ్యక్ కర్మ. యజ్ఞము సమిష్టికర్మ. యజ్ఞము వ్యక్తి నిష్టము కాదు. యజ్ఞమునకు అనేక విధముల పనులకు వేర్వేరుగా అనేకమంది కూడుచున్నారు. కాబట్టి యజ్ఞము సామాజిక కర్మ. యజ్ఞ విశిష్టాన్నము అందరు కలసి భుజించుచున్నది. కావున అది సర్వపాపముల నుండి విముక్తి కలిగించుచున్నది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.