Home » vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్


                                                                                                                         20 - 3 - 91
    ప్రియమిత్రులు రఘుగారికి
    నమస్తే ,
        మీకు సెలవులు ఇప్పడే మాకూ సెలవులు! యెప్పడో విలుచూసుకుని  ప్రయాణం నిర్ణయించుకుంటాను. యేప్రిల్ 21 నుంచి జూన్ 20 వరకు సెలవులని రాశారు. మాకు me ఫస్టు  నుంచి సెలవులు.
        మీరు గాని యేప్రిల్ ఆఖరి వారంలో యిటోస్తే తప్పక కలుసుకుందాం. మే నెలలో మొదటి నాలుగ్తేదు  రోజులు వుంటాననుకుంటున్నాను. మొదటివారం అంతానో తెలియదు. యేప్రిల్ ఆఖరి వారంలోనో మే మొదటి వారంలోనో మా అమ్మాయి కాన్పు వుండొచ్చు. అంచేత అనుకోకుండా ప్రయనమవ్వాల్సి  రావొచ్చు.  ఐతే యేప్రిల్ ఆఖరి వరకూ వుంటాను యిక్కడే.
        మీ వేసవి సెలవుల అడ్రసు రాయండి. కొన్ని పేరాలు తప్ప  Reason in Exఐstentialism , sinare పుస్తకం చూడలేదు. కొన్నాళ్ళు వుంచుకుని తీరికగా చూసే విలుంటుందా?  సొంత కాపిగాని, ల్తెబ్రరి కాపిగాని.
        ప్రస్తుతానికి  తెలిసినంతవరకు నా వేసవి అడ్రసు-

              c/o sri. k.v.k vikram kumar, Advocate
              Nuzvid - 521 2౦1, krishna District.
        మీ యిరువురికి శుభాకాంక్షలు. చిరంజీవికి దీవనలు.
         ప్రేమతో,                                                                                                                         -వడ్డెర చండీదాస్.

                                                                                                                        3 - 7 - 91
    ప్రియమ్తెన రఘుగారికి,
    నమస్తే,
    ఆ మధ్యలో మీరు రెండుసార్లు  తిరుపతి వొచ్చినట్లు కిరణ్ కాంత్ గారు చెప్పారు. నేను ముందుగా మీకు చెప్పిన ప్రకారం 30 - 6 - 91  న తిరుపతికి తిరిగి వొచ్చాను.
    సినారె [R.A. sinare ] గారి పుస్తకం యింకా చదవటం మొదలవలేదు. కాని యెప్పుడు అవసరమ్తెనా  యివ్వగలను.
    మీరు - దసరా - సంక్రాంతి - యీ రెంటిలో యే సెలవుల్లో గోవాలోనే వుంటుంటరు? వీలయితే తప్పక వొస్తాను. రెండువారాలుండి మిమ్మల్ని యిబ్బంది పెడతాను! రచనా వ్యాసంగం సాగించండి.
    మీ యిరువురికి శుభాకాంక్షలు. చిన్నారికి దీవనలు. వుంటాను.
                                                                                                                        -వడ్డెర చండీదాస్.
                                                                                                                                                     14  - 8 - 91
    ప్రియమిత్రులు  రఘుగారికి
    మీ 18 - 7-91 వుత్తరం చేరింది. దసరా సెలవుల్లో రావడానికి ప్రయత్నిస్తాను. కాలం నిర్వ్యా పకంగా  దోర్లిపోతున్నట్లనిపిస్తోంది. యింకా R.A sinare పుస్తకం తెరవలేదు! యెప్పడో  చదివేస్తాను. (అలా అలా  చూశానులేండి.)
    మీ యిరువురికి శుభాకాంక్షలు. చిరంజీవికి దీవనలు.
                                                                                                                         -వడ్డెర చండీదాస్ .
    (వుత్తరం నా మూడ్ కంటే కూడా డల్ గా వున్నట్లుంది!)
                                                                                      321(మిద్దేమిద), భావనినగర్
                                                                                        తిరుపతి - 1                                                                                                                   9- 9- 91
    మిత్రులు రఘుగారికి
    నమస్తే.
    మీ రెండో తేది వుత్తరం యీరోజే అందింది.
    రాష్ట్రంలో నాలుగు యూనివర్సిటీలకు  వ్తెస్ చాన్సలర్ లు  లేరు. మీక్కూడా.
    సెలవులు యెప్పదిస్తారో, అసలిస్తారోలేదో  తెలియదు. మీకు oct 15  నుంచి nov 22  వరకు సెలవులని not చేసుకున్నాను. వొచ్చినప్పుడు కొన్ని గంటలుకాక వుండేలాగ రండి. కలసి గడపవోచ్చు.
    త్రిపురనేని శ్రీనివాస్ నుమ్చి జవాబు లేకపోతే రాయకండి -  యిటోచ్చినప్పుడు  షాపుల్లో కొనవోచ్చు.
    'రహస్తంత్రి ' కోసం రాస్తే (ఛాయ' జర్నలిస్ట్  కాలని, మొగల్రాజపురం  విజయవాడ- 10 కి, సాదాప్రతి. లేదూ నా పర్సనల్ కాపి వుంది తిసుకేడుదురు.
    సినారె పుస్తకం ముగించాను. వొచ్చినప్పుడు తిసుకుందురు.
    మీ యిరువురికి శుభాకాంక్షలు. చిన్నాటికి దీవెనలు.
    టి.వి. సీరియల్ 1992లో తెలియవోచ్చునట -accept చేసింది లేనిది
    రాష్ట్రంలోని నిర్మాతలకి preference యివ్వాలంటూ గొడవలేవదిశారట. వీళ్ళు మద్రాసు నుంచి కదా-
    ప్రేమతో,
                                                                                                                   -వడ్డెర  చండీదాస్ .
                                                                    మహాద్రసార్తి
    కాంక్ష లోంచి విముక్తిస్తూ, విముక్తి లోంచి కాంక్షిస్తూ-
    యెన్ని కాంక్షలో,  యెన్ని విముక్తులో!
    జననం, దేనికి తొలి ఆరంభం కానట్లే; మరణం, దేనికి తుది ముగింపు కాదు.
    కాంక్షా విముక్తులు  యెంతకి తిరావు, ముగియవు, అసలుకే తిరావని ముగియవని కాదు. ఆ తిరతం వల్లనే తిరనితనం  పెరుగుతుంది. (యిదంతా పునరుక్తించటం కాదూ! d.and l. నుంచి)
    యిప్పుడు 'ప్రాపంచికంగా' యేం కావాలనంటే - నిజానికి ఏమి అక్కర్లేదు.
    నిర్వివరణగా యెంతో యెన్నో చెప్పాను. (వాటికే దిక్కులేదు. యింకా దేనికి!) సృజన, నిర్వివరణగానే వుంటుంది. వివరిస్తే, సృజనత్వం పోతుంది.
    "హిమోహరాగిణి " ఎవరికి అందని సంగీతం.యెప్పడో యెలాగో అది అందే యత్నం చెయ్యాలి.
    జగత్తు, నిరంతర పరిణామశీలం  గనక; యెప్పడూ యెన్నో వుంటాయి, తెలుసు కోవల్సినవి వెల్లడించాల్సినవి. ఆయా మహనీయులు ఆ పని చేస్తూంటారు -సృజనియంగా ,  స్తేద్దాంతికంగా.
    ఆనందపు సరిగంచున్న దుష్టత్వపు పట్టుబట్ట కట్టుకున్న విశ్వమోహనం యెందుకున్నట్లు? మహంధకార  దుష్టత్వ  విశ్వవృక్షపు కూకటివెళ్ళ మొదళ్ళలోకి వెళ్ళి పెకలించివేసే  దారి ఏదో యెలా తెలుస్తుంది - స్వియాన్వేషనల్లో తప్ప!
    సంగీతమే  లేకపోతే యీవిశ్వాన్నే తిరస్కరించే పని. అసలుకి, విశ్వపునాడి నాదమే. సమస్త రస ప్రక్రియలకూ ఆ అనాహత  నాదమే ఆధారం.
    జీవితంలో యెన్నో కోర్కెలు (మాహొదాత్తమ్తెనవె) తీరినవి తిరనవి. తిరినందుకు యేమంత పోంగిపోయింది లేదు. తిరనందుకు కుంగిపోయింది లేదు.
    కాని, వో కోర్కె - తుది కోర్కె కల్లోల సాగరానందం.
    అర్దరాత్రి పండువెన్నెట్లో కల్లోలసాగారంలో; వోడలాంటిదాన్లో కాక, వో చిన్ని నావలో వొంటరిగా - బడబాగ్ని కిలలలోంచి ఆకాశానికి ఎగిసిపడే  తెలినిలి  కేరటలల్లోని చిరునావలో -
    అలా ప్రయాణిస్తూ, ఆ రాస్తెక సాగరంలోంచి  అనంతవిశ్వంలో లినమ్తేపోవాలని. యిది వుత్తి 'ఆలోచన' కాదు. స్వంచన (స్వవంచన) కాదు.
    ఐనా, వూహ తెలిసిన పసితనం నుంచి వున్న  ఆ మెటాఫిజికల్ కాంక్షకి తొందరేముందని!   
    అందుకే అందని అందాకా, మౌనం. యేది, ముందుగా - ఆరంభించిముగించని 'సాహిత్యేతర' కళాసృజన  ప్రక్రియల పనుల పూర్తి చెయ్యాలిగా!
    అందుకు అక్షరాలు అక్కర్లేదు.
                                                                                               21 - 12 - 91
                                                                                        -వడ్డెర చండీదాస్.

                                                                        321(upstairs), Bhavani Nagar
                                                                                Tirupathi - 517501




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.