Home » vaddera chandidas » ప్రేమతో ....వడ్డెర చండీదాస్


                                                                       
                                                                                                          తిరుపతి
                                                                                                       7-5-04
    రఘుగారికి నమస్తే,
    అకాల వేసవి ముసురుకు - మనసూ వాళ్ళూ; మోహనరాగంలా  ఆహ్లాదంగా ఊయలలూగుతున్నాయి.
    హిందీవాళ్ళు 'ర' కి 'డ' కి యింగ్లిషు లిపిలో రాసేటప్పుడు 'R' అక్షరం రాస్తారెందుకో,  హింది యేతరులకు తెలియదు. ఆల్ మోడా Almora, చొప్డా chopra, లాడ్ కి Lakrmi అనాడి  anari  అలా అని 'ర ' కి కూడా R వాడాతారు.  charkha  లో  లాగా. యెందుకో  నాకు అర్ధం కాదు. హిందీ యేతరులకు 'డ' కి 'ర' నె పలుకుతారు తెలియక; డ  పలకరు.
    కాళిదాస్ భట్టాచార్యగారు  desire  and  liberation ని ౩౦౦ పేజిలకు విస్తరించమన్నారు. నేను ఆ పని చెయ్యలేదు. ఆ లోటు మీరు తీర్చుతున్నారు. అందుకు  అవసరమ్తెన శ్రమ,  సామర్ధ్యం మివి!
    తిరుపతిలో  వేసవి ఘోరాతిఘోరం. Air cooler గాలి బాగానే వుంటుంది గాని నీళ్ళు నింపుతూండటం,  నెలకొకసారి water tank  కడగటం,  విసుగు.
    గాయత్రిగారి T. series  cassette లోని యెందరో మహానుభావులులోని; రాగం, పదాలు అంత నిర్దుష్టంగా స్పష్టంగా అధ్బుతంగా పలికించిన ఆ ప్రతిభతో సరిపోల్చ తగిన మరొక వాధ్యకుడు లేడు.
    వూళ్ళో హిందీ ప్రోపెసరు  శివరామిరెడ్డిగారు  మంచికి చెడుకి  తోడుగా వుంటున్నారు.
    Headlines Todayలో వార్తలు చదివే, ప్రజ్ఞావర్మగొంతు  యాక్సెన్ట్  బావుంటాయి.
    మాలిని రాజూర్ కర్ దాని రాగం వింటూ తాదాత్మ్యిస్తూ   గడిచింది. యీ పూట.
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
                                                                                                  -వడ్డెర చండీదాస్.

                                                                                                      తిరుపతి
                                                                                                      14-5-04
    రఘుగారికి నమస్తే,
    యివ్వాళ  టమోటా పప్పు వోండుకున్నాను.  కందిపప్ప టమాటా యిష్టం. రోజు మర్చి రోజు వోండుతుంటాను.
    వేకువన ఐదుకి  లేస్తాను. 5.30  కి కేరళ యేషియానెట్ టివిలో కర్నాటక  వక గంటసేపు. 6 గంటలకి D D chennai లో కర్నాటక సంగీతం  వొస్తుంది  వక గంటసేపు. ప్రోగ్రాం  బాగోపోతే రేడియో శ్రీలంక పెట్టి వింటాను. 6 గంటలకి వంట పూర్తి చేస్తాను.
    స్నానిస్తాను. బ్రూకాఫీ, కాంప్లాన్  కలుపుకుంటాను. రేడియో  వింటూనే వక గంట Fashion TV చూస్తాను. 8కి డిల్లి నుంచి పాటలు. 8.30  కి హ్తేదరాబాద్  రేడియోలో  కర్నాటక సంగీతం వొస్తుంది.  తొమ్మిదికి సినిమా పాటలు వొస్తాయి. ఆ తరువాత టేప్  పెడతాను, తీరికగా.
    రోజుకి నాలుగుసార్లు  చక్కెర పాలూ లేకండా బ్లాక్ టి  తాగుతాను. మధ్యానం వివిధభారతి, సాయంత్రం వివిధ ఆంగ్ల టివి చానల్స్ లో వార్తలు. 7కి DD  హ్తేదరాబాద్ లో తెలుగులో వార్తలు.
    రాత్రి 11కి వివిధ భారతి ముగించటంతో,  నిద్రకుపక్రమిస్తాను.
    హిందూ  మత వ్తేవిధ్య విశాలత్వం; ప్రపంచంలో మరింకే మాతానికి లేదు.
    ఆషాభోస్లే ,  నానా గోంతుల్తో  నానా  రకాలుగా పాడుతూంటుంది, సామర్ధ్యంగా.
    మనసంకితం లాంటివి తప్ప, డబ్బుతో చాలా సాధ్యపడతాయి.  మిడిలిస్టూ ఆయిల్ ధనంతో సముద్రపు నీటిని మంచినిరుగా మర్చి తాగుతున్నారు కదా!
    21 శతాబ్దంలో  వొస్తున్న తెలుగు హిందీ సినిమా సంగీతం యెప్పడో  వోకప్పటికి నామ రూపాల్లెకండా  అంతరించి పోతుంది. అది భారతీయ సంగితానుసారం లేదు.
    పిపిలికంటూ చిమల్ని పట్టించుకున్నట్లు కనిపించాడు. కోతుల బెడద కంటే  చీమల బెడద చాలా యెక్కువ. వుదాహరణకి- అడ్డమ్తెంది  తంటూ అడ్డమ్తేన  చోట్లా పాకి, వోండుకున్న  అన్నం లోకి చేరతాయి. అందువల్ల యిన్ ఫెక్షన్.
    మొన్నొక రాత్రి సంగిత దర్శకుడు రోషన్ పాట లోచ్చాయి అధ్బుతం.
    మీ నలుగురికి శుభాకాంక్షలు.
                                                                                                     -వడ్డెర  చండీదాస్.  

                                                                                                         తిరుపతి 
                                                                                                         18-5-04
    రఘుగారికి నమస్తే,
    యివ్వాళ  వుదయం లేస్తూనే వీణా ప్రావిణ  గుర్తొచ్చారు. ఆమెకి నా వినమ్ర పాదాభివందనం. నేను పాదాభివందనం అన్నది ఆమె వోక్కరికే.
    వ్తెణికుడు బాలచందర్ ప్రతిభాశాలి.  అతని వీణ సవ్వడి కూడా బావుంటుంది. కాకపోతే అతను కాస్త పరుషంగా పలికిస్తాడు.
    భారతదేశంలో - మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి కూడా ఆస్తిహక్కు  సంక్రమించేలాగా చట్టం NTR చేశాడు. యీ చట్టం మన రాష్ట్రంలోనె  చెల్లుతుందను కుంటాను.
    నటి కృష్ణకుమారికి రావాల్సినంత పేరు రాలేదు.  మరే హిరోయిన్ కి లేనన్ని సినిమాలున్నాయి ఆమెకి.  (మంచి పాటలెన్నో) ఆకారం మార్పులు చేందకండా యెప్పుడు  వోక్కలాగే కనువిందుగా వుంటుంది. తనకిచ్చిన పరిమితుల్లో నటించిన తార.
    తల్లి బిడ్డ దృశ్యం; అత్యంత అపురూపం.
    (గజాలే ఐనా) అభితో మ్తేజవాన్ హూ (మలిఖా పుఖరాజ్ ) చాలా యిష్టం. వుమ్రావ్ జాన్ లోని  గజల్లన్ని  యిష్టం.  కవులకి,  నాన్- ఫిలిం గజళ్ళు పాడే వాళ్ళకి; సినిమాల్లో, 'మేరా గిత్ అమర్ కర్ ధో' జగజీత్ సింగ్  పాడిన గజల్.
    సోనియాగాంధీ ప్త్రేమ్మినస్టరుగా  వుంటే, దేశం మ్తెలపడి పోతుందిట - సుష్మాస్వరాజ్,  బి.జె.పి.
    బి.జి.పి,  ఒక అల్ప స్త్రీ ప్రాణికి భయపడింది. యిప్పడా భయం, స్ధిరపడి పోయింది. తప్పించుకోటానికి లేకండా.  సుష్మాస్వరాజ్ సోనియాగాంధీని  ప్త్రేమ్మినస్టరుగా యెలా వుచ్చారించాను?! అని అంది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా యిస్తుందట. సుప్రీంకోర్టు, సోనియాగాంధీని  భారతదేశాస్తురాలని తీర్పు చెప్పింది. సోనియాగాంధీకి ప్త్రేమ్మినస్టరుగా  నానా రకాల సమస్యలు. ఆ వోచ్చిందేదో  మరి కాసిన్ని సీట్లోస్తే  వొడ్డున పడేది. ముల్లకిరిటంతో  రాణి!
    యివ్వాళెందుకో,  కాగజె  కేపూల్ లో గితాదత్ పాడిన; "హమ్  రహే, న, గమ్.  హమ్,న, తుమ్"  గుర్తుకోస్తోంది,  మాటిమాటికి.  విషాదం,  అతి మధురంగా జాల్వరింది.
    మీ నలుగురికిశుభాకాంక్షలు.
                                                                                                                -వడ్డెర చండీదాస్.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.