Read more!
 Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 3

 

    "ఈ ఆఫీసు నిన్నెంతకి కొన్నది."
    "వంద మీద కొంచెం"
    "సుఖంగా వున్నావా?"
    "సుఖమా? అంటే."
    "సుఖమంటే తెలీదూ.....హ.....హ...."
    "ఎందుకు నవ్వుతావ్."
    "దేవుడు  నాటకంలో నువ్వు ఆఫీసరుగాడిని కదూ .....హ.....హ.....హ...."
    "ముందు .....ఆ నవ్వు అపు. నాకు భయంగా ఉంది."
    "నీ పేరు శ్రీనివాసరావు కదూ!"
    "థెంక్స్ , నువ్వేనా నా పేరు గుర్తు చేసేవు. ఇక వెళ్ళు బాబూ. నేను చెక్కులు రాయాలి. లేకపోతే నన్ను తినేయగలడు మొగుడు ,వెళ్ళేళ్ళు."
    "శ్రీనివాసరావ్-"
    "ఓయ్!"
    "నీ పేరేమిటో చెప్పుకోవోయ్!"
    "రావ్ గాడివి కదూ!"
    "కాదోయ్ వెర్రీ! రావ్ ది గ్రేట్"
    "నువ్వు గుర్తున్నావు గురుడా! కాని నువ్వు గుర్తున్నప్పుడంతా నేను వణికి చస్తాను. శీతాకాలం చలిలో ఎముకలు సైతం వణికే వేళ నువ్వు నాకెప్పుడూ వెచ్చటి రగ్గులా సహాయపళ్ళేదు. కేవలం ముళ్ళకంపలా నీ గుర్తులు నన్ను బాధిస్తున్నాయి తెలుసా? నువ్వసలు నాకెందుకు గుర్తొస్తావ్. నేను రావ్ ని కాదిప్పుడు. శ్రీనివాసరావు నా తండ్రి.బీవన్ ని. నన్ను మళ్ళా అవరించకు ప్లీజ్. నీ దశకి కాలేజి నాలుగ్గోడల మధ్యే సమాధి కట్టెను. దయ్యమై వచ్చి నన్ను వేదిస్తావెందుకు. చెప్పు. నీకో నమస్కారం గురూ.... వెళ్ళిపో."
    "ఏమిటిది. ఇలా నీరసమైపోయారేం. బివన్గారూ. ఏం జరిగిందండి . అన్నది టైపిస్టు."
    శ్రీనివాసరావు ఆమె వేపు చూసేడు.ఆమె కళ్ళు అకారణంగా నవ్వుతున్నట్లు గమనించి సిగ్గుపడిపోయి పక్కనున్న రిజిస్టరొకదాని సాయంతో ప్రస్తుతంలోకి వచ్చి పడ్డాడు.
    "ఇవిగో మీ కాగితాలు. తప్పులేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి."
    "భలేవారే! మీ వేళ్ళలో ఏమున్నదో తెలిదు గాని శాంతాదేవిగారూ! బ్రహ్మ గూడా మీ అక్షరాల్లో తప్పు పట్టలేడని రాసిస్తాను.
    "థాంక్స్  ఫర్ కాంప్లిమెంట్! అన్నట్టు ఇంతకుముందు మీరు చిత్రంగా అగుపించేవారు నాకు. కారణం కూడా అడిగెను ."
    "చెప్పమంటారా?"
    "అభ్యంతరమైతే వద్దులెండి."
    "నేనో రకమైన పిచ్చి సన్నాసిని శాంతా దేవిగారూ! నేను చదువుకునే రోజుల్లో, మీరు నమ్మరేమో రాజులా ఉండేవాడిన్లెండి. ఎన్నో బంగారు కలలతో బరువుగానూ, వుండేవాడిని. ఆ బతుకు చాయలు గుర్తొచ్చినప్పుడు నేను తల్లడిల్లిపోతుంటాను. అప్పట్లో నా పేరు రావ్. సింప్లీ రావ్ వోన్లీ. ఆ రావ్ గాడు అప్పుడప్పుడు ఈ బీవన్ ని ఎగతాళి చేసేటందుకు వస్తుంటాడు. జీనియస్ లెండి వాడు. ఖర్మం చాలక వెధవ బతుకులో బతుకుతున్నాను గానీండి -- లేకపోతేనా , దేశాన్ని అమ్మేయగల ప్రబుద్దుడు ."
    శాంతాదేవి గబగబా నవ్వేసి అక్కణ్ణిం చి వెళ్ళిపోయింది.
    శ్రీనివాసరావు చెక్కులు రాయడం మొదలు పెట్టాడు.
    బసవరాజు అండ్ బ్రదర్స్ ఆరువేల రూపాయల అరావై నాలుగు పైసలు సూర్యం అండ్ కో నాలుగు వేల అయిదొందల పదహార్రూపాయిల తొంబై రెండు పైసలు.
    (అరవై నాలుగూ , తొంభై రెండు - పైసలట. అకాడికి ఈ పైసల వల్ల నిజాయితీ ధర పెరిగిపోయిందన్నమాటేగా! ఏం ధర్మ బుద్దిరా మీది?)
    లింగం అండ్ మణ్యం -- పద్నాలుగువెల రెండొందలు మాత్రమే!
    (వెరీగుడ్ ఇదిగో యిలా వుండాలి మింగుడంటే! పైసల కోసం పీనుగుల్లా పడికాపులు కాయారు వీళ్ళు. అన్నీ పూర్ణంకాలే . చిల్లర బేరం పనికి రాదంతే!"
    వంద చిల్లర జీతగాడు వేలకు వేలు చెక్కులు రాసి అవతల పారేయడమనే అందమైన వృత్తికీ శ్రీనివాసరావు బానిసైన తరవాత అతనెన్నో నిర్ణయాలు చేసుకున్నాడు.
    ఆఫీసరు గదిలోంచి కరెంటు బెల్లు 'బజ్' మనగానే ప్యున్ గాడు తలకొట్టుకుంటూ లోపలికి వెళ్ళి మరో క్షణానికి తిరిగి వచ్చేసి అక్కడ మొదటి సీట్లో కూర్చున్న బక్క మనిషిని పేరెట్టి పిలిచి చెప్పేడు.
    "డివన్ గారూ! అయ్యగారు పిలుస్తున్నారు."
    డీవన్ సొంతపేరు ఆంజనేయులు. ఆటను ఆఫీసంతల్లోనూ మెతక మహామునే గాకుండా భయస్థుడునూ. అతను లేచి నించుటూనే చేతులు రెండూ జోడించి నమస్కారం చేసుకుని, మనసులో దేవుళ్ళందర్నీ పేరుపేరునా వేడుకుని రెండగల్లో ఆఫీసరు గది తాలుకు స్ప్రింగ్ డోర్ దగ్గిర నుంచున్నాడు.
    ఆఫీసులో యావన్మందికి అతనో ఆటబొమ్మ! కీ యివ్వగా తిరిగే కోతి బొమ్మ! అందునా అతగాడి పేరు అంజానేయులు. అతను తలుపు దగ్గిర నించున్న తరవాత రెండు తడవలు తలుపు తెరిచి, లోపలికి వెళ్ళబోయి - ఆ ప్రయత్నానికి వాయిదా వేసి వెనక్కి వచ్చి నించున్నాడు. ఇది లోపలున్న ఆఫీసరు గమనించాడో ఏమో గాని ఆఫీసంతటికీ వినిపించేలా పెద్ద గొంతుతో అరిచేడాయన.
    "ఏమిటండీ! దసరా పులివేషం మీరూనూ. కబురంపెనుగా. తిన్నాగా లోనికి రావచ్చు కమిన్."
    ఆంజనేయులు చేతులు కట్టుకు లోపలికి వెళ్ళేడు. మరి అక్కడేం జరిగిందో ఏమో మరో అయిదు నిమిషాల్లో బిక్కమొహంతో తిరిగి వచ్చేడతను. అతని చేతిలో పైళ్ళూ వగైరాలు నలిగి వున్నాయి.
    అతను వస్తూనే --
    "ఏడుకొండలూ అన్నాడు.
    అక్కడే నించున్న ఫ్యూను గాడు ( ప్యూను పేరు ఏడుకొండలు . అతనీ ఆఫీసులో చేరి నేలరోజులయ్యింది. అతన్నంతా అరేయ్ , ఉరేయ్ అని పిలవడం కద్దు. చాలా కొద్దిమంది మాత్రం అతన్ని ఏడుకొండలనే పిలుస్తారు) ఆ పిలుపుతో నిలువునా పిలకించిపోయి -
    "ఆయ" అన్నాడు వినయంగా.
    "నాయర్నాడిగి కాఫీ పట్రా తొరగా" అని అతనికి పని పురమాయించి ఆంజనేయులు వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
    "ఏమిటి కధ?" అన్నాడు అసిస్టెంట్.
    "తిన్నాడు. పొద్దున్నే లేచి ఎవడి మొహం చూసానో గాని పూర్తిగా కడిగి వదిలిపెట్టేడు. శాంతమ్మగారేం టైప్ చేసేరో ఏమో, నమ్మకం కొద్ది నేను సంతకం పెట్టి పంపేను. దాని కాయన యింతెత్తు లేచి -- వద్దులేరా బాబు! ఈ బతుక్కు సుఖం లేదు" అన్నాడు ఆంజనేయులు నిట్టూస్తూ.
    శ్రీనివాసరావు శాంత వేపు చూసేడు. శాంత కళ్ళు తిప్పింది గమ్మత్తుగా.
    రాయవలసిన చెక్కులు ఇంకా మూడు న్నాయి. తొరగా రాసి సంతకాలు సంపాయించేస్తే అనక తీరుబడిగా అసలు సంగతేమిటో శాంతగారి నడిగి తెలుసుకోవచ్చు ననుకున్నాడు శ్రీనివాసరావు.
    చెక్కు రాస్తుండగా రావ్ గాడు దాపురించాడు శనిలా.
    "రేయ్ బీవన్! నీకు మన నాటకం గుర్తుందిట్రా? దానిలో ఆంజనేయులు వేషం ఎవరు? ముకుందంగాడు బ్రహ్మాండంగా చేసేడు. జ్ఞాపకముందా? వాడేనా సిసలైన గుమస్తా! చీమూ నెత్తురు ఉన్న మనిషి వాడు. అఫీసరయ్యేదీ , వాణ్ణి దించిన దేవుడయ్యేది - కేరేజాట్ గాడు. ఇక్కడ మీ అంజనేయులూ ఉన్నాడు ఎందుకు? వట్టి బఫూన్ . దేన్లోనైనా పడి చావమని సలహా యివ్వు."

 Previous Page Next Page