Read more!
 Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 4


    జనరల్ ఇయాసత్ ఖాన్ మరోసారి కుర్చీలో అసహనంగా కదిలాడు.

 

    అప్పటికి పావుగంట గడిచింది. ఏజెంట్ క్యూ రాలేదు. సర్వసైన్యాధికారి, దేశపు  ప్రెసిడెంట్, దేశపు నియంతనే  పదిహేను  నిమిషాలు  వెయిట్  చేయించగల వ్యక్తి అయిన ఏజెంట్  క్యూ తలుపు తీసుకుని అప్పుడు లోపలకు వచ్చాడు. అప్పుడు సమయం ఆరుగంటల పదిహేను నిమిషాలైంది.

 

    ఒక అమెరికన్ యువతికి, పఠాన్ కి పుట్టిన ఏజెంట్  క్యూ అసలు పేరు  ఎవరికీ తెలియదు. ఆష్ఘనిస్తాన్ లో సోవియెట్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి చేసిన 'ఆపరేషన్ రెస్ క్యూ' విజయవంతంగా నిర్వహించినప్పటి నుంచి అతడి పేరు ఏజెంట్  'క్యూ' గా వ్యవహరిస్తున్నారు.

 

    ఆరున్నర అడుగుల ఎత్తు, పులికన్నా చురుకైన కళ్ళు, ఆ కళ్ళల్లో తెలివితేటలు, డానికి మించిన క్రౌర్యం, బింగిచిన పెదవుల వెనుక పట్టుదల  అతడి ఆభరణాలు. అతడి మొహంలో ఏ రకమైన భావాలూ కనిపించవు.

 

    అవతలివ్యక్తి మరణాన్ని కూడా చిరునవ్వుతో చూడడం అతడి అలవాటు.

 

    "కూర్చో మిస్టర్ క్యూ. నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చావు" అతడు  కూర్చుంటూ వుండగా సలహాదారు అన్నాడు.

 

    "అవును...... అర్జెంటుగా  జూరిచ్  ఒక టెలిగ్రాం ఇవ్వవలసి  వచ్చింది భారతదేశానికి సంబంధించిన  సర్పభూషణరావ్ కి" అన్నాడు.

 

    సెకండ్ లెఫ్టినెంట్  కరీముల్లా బేగ్  వ్యంగ్యంగా "ప్రెసిడెంట్  పిలుపు కన్నా భారతదేశానికి సంబంధించిన సర్పభూషణరావ్ కి" అన్నాడు.

 

    సెకండ్  లెఫ్టినెంట్  కరీముల్లా బేగ్ వ్యంగ్యంగా "ప్రెసిండెంట్ పిలుపు కన్నా ఆ టెలిగ్రామే ఎక్కువైందా?" అని అడిగాడు.

 

    "ఒక రకంగా  అంతే సర్...." అన్నాడు క్యూ. అతడి మాటల్లో నిర్లక్ష్యం లేదు. కానీ చిన్న చిరునవ్వు  వుంది. "మనమందరం ఇక్కడ సమావేశమైంది భారతదేశాన్ని సైనికంగా ఎలా బలహీనం చెయ్యాలో వ్యూహం వెయ్యడం  కోసం! డానికి సరిపడా ఏకైక ఆయుధం  భూషణరావు" అన్నాడు.

 

    నలుగురు సైనికాధికారులూ ఉలిక్కిపడ్డారు. తమకి మాత్రమే ఈ సమావేశపు వివరాలు తెలుసుననుకున్నారు ఇప్పటివరకు వాళ్ళు. దాన్ని అతడు  చెప్పడం అలజడి  పుట్టించింది.

 

    ఇయాసత్ ఖాన్ తన అలజడి  కప్పిపుచ్చుకుంటూ "మిస్టర్ క్యూ..... డానికి అయిదు నిమిషాలు చాలు. ఇంకో పాతిక నిమిషాలు ఆలస్యంగా వచ్చావు" అన్నాడు.

 

    "అవును సార్...... ఈ రాత్రికి మీ మీద జరగబోతున్న కూ(ప్) వివరాలు కనుక్కోవడంలో ఆ ఆలస్యమైంది."

 

    బాంబు పడ్డట్టు అదిరిపడ్డారు నలుగురూ.

 

    "వాటార్యూ టాకింగ్......? జనరల్ అడిగాడు.

 

    "మీ ముగ్గురిలో ఒకరు ఈ రాత్రికి సైన్యంలో తిరుగుబాటు లేవదీయా లనుకుంటున్నారు మిమ్మల్ని చంపడం ద్వారా......" కామ్ గా చెప్పాడు క్యూ.

 

    ఆర్మీ చీఫ్, డిఫెన్స్ అడ్వయిజర్, సెకండ్ లెఫ్టినెంట్  కరీముల్లాల శరీరాలు చెమటతో తడిసిపోయాయి. జనరల్ ఇయాసత్ ఖాన్ చేయి అత్యవసర సమయాల్లో ఉపయోగించే బటన్  మీదకు వెళ్ళింది. అది చూసి అకస్మాత్తుగా తిరుగుబాటుదారుడు కరీముల్లా బేగ్ కుర్చీలోంచి మెరుపులా లేచాడు. కనురెప్పపాటు కాలంలో జేబులోంచి పిస్టల్  తీయడం, జనరల్ ఇయాసత్ ని గురి చూడడం జరిగిపోయింది.

 

    'ఢాం' అన్న శబ్దంతో ఆ గది గోడలు కంపించాయి.

 

    కరీముల్లా బేగ్ కుప్పలా కూలిపోయాడు.

 

    ఎప్పుడు తీశాడో తెలీదు. అతఃదికన్నా వేగంగా  పిస్టల్ తీసి ఏజంట్ క్యూ అతన్ని కాల్చాడు. రెండు కళ్ళ మధ్య నుంచి గుండు దూసుకువెళ్ళి ఆ  తిరుగుబాటుదారుడు అక్కడికక్కడే మరణించాడు.

 

    "థాంక్యూ..... థాంక్యూ మిస్టర్ క్యూ......" అన్నాడు ఇయాసత్ ఖాన్.

 

    "ఇట్సాల్ రైట్  సర్....."

 

    శవాన్ని తీసుకెళ్ళే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగతా ఇద్దరూ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. యుద్ధంలో ఎంతో అనుభవమున్న వారినే ఈ అకస్మాత్ సంఘటన దిగ్భ్రాంతుల్ని చేసింది. ఏజెంట్ క్యూని ఒక అద్భుతమైన వ్యక్తిలా చూస్తూ వుండిపోయారు.

 

    "వెళ్ళొస్తాను సార్. ఈ రాత్రికి ఇండియా వెళ్తున్నాను. కొద్ది రోజుల్లో మనం ఇండియా మీద కయ్యానికి కాలు  దువ్వుతాం. కొద్ది నెలల్లో అది యుద్ధంగా మారుతుంది. సిద్ధంగా వుండండి."

 

    ...........తలుపు తెరుస్తూ అతడు పూర్తి చేశాడు. "...........గెలవడానికి."

 

    
                                          2    

 

    ఇండియా

 

    ఆగస్ట్ 22, సోమవారం

 

    క్రైమ్ ఇన్ వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్  డైరెక్టర్ తన గదిలో విసుగ్గా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతడు విసుగుకి ఒక  ప్రత్యేక  కారణం వుంది. సర్పభూషణరావుని ఎలా కటకటాల వెనక్కి పంపాలా అని అతను  ఆలోచిస్తున్నాడు. గంట  క్రితం  అతడు  తన ఆఫీసుకి మూడు వేర్వేరు డిపార్ట్ మెంట్ ల నుంచి ఆయా శాఖల వున్నతాధికారుల్ని రప్పించాడు. దేశపు దిగుమతుల్ని పర్యవేక్షించే అధికారి, డ్రగ్ కంట్రోలర్, హోమ్ సెక్రటరీ.

 

    సర్పభూషణరావు దిగుమతుల్ని గాని, అతడి దేశీయ అమ్మకాల్ని గాని  తాము ఏ  విధంగానూ ఆపుచేయలేమని మొదటి ఇద్దరు అధికారులూ  తమ  నిస్సహాయతని వెలిబుచ్చారు. హోం సెక్రటరీ కూడా అదే అన్నాడు. ఇప్పటికే  సర్పభూషణరావుని 'ఫెరా' , 'మీసా'ల క్రింద రెండు సార్లు అరెస్ట్  చేయడం  జరిగిందని, మరోసారి ఆ ప్రయత్నం చేస్తే , అతడు ప్రభుత్వం మీద కోటిరూపాయిలకు దావా వేస్తాడని, పార్లమెంట్ లో  కూడా తనకున్న పలుకుబడి ద్వారా సమస్య  లేవా నెట్టుతాడని, అతడిని ఏ విధంగానూ ఏమీ చెయ్యలేమని హోం సెక్రటరీ చెప్పాడు క్రైమ్ ఇన్ వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్  చీఫ్ డైరెక్టర్  భగీరథరావు ప్రస్తుత విసుగుకి అదీ  కారణం. ఇప్పుడు అమెరికాలో కేసు గెలవడం ద్వారా, భారత ప్రధానమంత్రి పుట్టినరోజు పండక్కి ఒక పాకెట్  నిండా హెరాయిన్ పంపి 'బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రం యస్.బి.ఆర్, అని వ్రాయగల సమర్థత తన కుందని సర్పభూషణరావు  మరోసారి నిరూపించాడు.

 

    'ఇన్ సల్ట్..... ఇన్ సల్ట్....' అనుకుంటూ రావు దూరదర్శన్ ఆన్  చేశాడు. వార్తలు వస్తున్నాయి. పుండు మీద కారం జల్లినట్టు ఆ రోజు విమానాశ్రయంలో సర్పభూషణరావు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రసారమావుతూంది. 'ఇది తన దేశమనీ, తన  దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాననీ, అమెరికాలో కేసు కొట్టివేయబడి స్వదేశం తిరిగివచ్చిన భూషణరావు విలేకరులకు చెప్పారు' అంటూ చెప్పుకపోతున్నాడు వార్తలు చదివే వ్యక్తి.

 Previous Page Next Page