Read more!
 Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 2


     తన పెద్దకూతురు  ఇంటిలో తేడాగా పెరుగుతోందని రామారావుకు తెలుసు. కానీ ఆ విషయంలో అతడు కలగజేసుకోలేదు అందుక్కారణం మాణిక్యాంబ.
    మాణిక్యాంబకు అన్నివిధాలా భర్తను సుఖపెట్టడం తెలుసు. సంసారం పొదుపుగా చేస్తోంది. ఇంటిలోమాట బైటికిపోదు పిల్లలను క్రమశిక్షణలో ఉంచుతుంది.
    రామారావు నిర్మల విషయంలో కలగజేసుకుంటే ఇంట్లో ఈ ప్రశాంతత ఉండదు. ఇల్లు నరకమవుతుంది.  అది రామారావుకిష్టంలేదు. అందువల్ల నిర్మల ఆ యింట్లో పనిమనిషికాని పనిమనిషిగా బ్రతుకుతోంది.
    మాణిక్యాంబ పలువిధాల నిర్మలను బాధిస్తుంది. ఎన్నిపనులుచేసిన  ఆమెను సోమరి అనే తిసుతుంది. నిర్మలకిష్టమైన పదార్ధాలువండి ఒక్కటి కూడా ఆమెకు పెట్టాదు. ఆమెకిష్టంలేనివన్ని బలవంతాన తినిపిస్తుంది. ఆమె రూపాన్ని , అభిరుచుల్ని, తెలివిని ఎప్పడూ నిరసిస్తునేవుండేది. నిర్మలచేసిన ప్రతి పనిలోనూ తప్పులెన్నుతూనే వుండేది. అంతటితో ఊరుకొక రోజుకొక్క సారి రామారావు చేత కూడా  ఆమెను  తిట్టిస్తూండేది.
    తిరికూర్చుని కూతుర్ని తిట్టడం రామారావుకిష్టంలేదు. కానీ ఇందులో మాణిక్యాంబకో పరమర్ధముంది.
    ఆ యింట్లో మనసులోనైనా నిర్మలను ప్రత్యేకంగా అభిమానించే అవకాశం ఒక్క రామారావుకేవుందని మాణిక్యాంబకు తెలుసు. అలాగని నిర్మల మనసులో బావన వుండవచ్చునని ఆమెకుతెలుసు రామారావు మిగతా వారినుంచి వేరన్న బావం నిర్మలలో పెరక్కూడదు. రామారావు తనకు రక్షకుడన్న అభిప్రాయం నిర్మలక్కలక్కూడదు. అందుకని  ప్రతిరోజూ రామారావుకు సంబంధించిన కొన్నిపనులు నిర్మలకు అప్పజేప్పేది. మనిక్యంబను సంతృప్తిపరచడంకోసం  రామరావామెను అకారణంగా తిట్టేవాడు.మొదట్లో అతడికి బాధగావుండేది. కానీ కరంగా అలవాటుపడిపోయాడు.
    ఇప్పడు నిర్మలకు తన మనసులోని బాధను చెప్పకునేందుకెవ్వరూ లేరు. తండ్రి అంటే తల్లికన్న ఎక్కువభయమేర్పడిందామెకు.
    తీరుబడివున్నప్పడల్లా నిర్మల పుస్తకాలు చదువుతుంది. ఆ చదువామే అవగాహనను  పెంచింది. కష్టాలు కలకాలముండవని  ఏదో ఒకరోజున తన జాతకం మారుతుందని  ఆమె ఆశిస్తుండేది.
    ఇప్పుడు నీలంపువ్వులపరికిణి వేసుకునేసరికి అన్ని ఆశలూ తీరినట్లే అనిపించిందామెకు. అద్దంముందలాగే నిలబడి తన అందం చూసుకుంటూ- "ఇప్పడే రాజకుమారుడైన నన్ను చూస్తే?" అనుకుందామె.
    అప్పుడు నిర్మల  కళ్ళకు కాటుక  పెట్టుకుంది ముఖానికి పౌడరు  రాసుకుంది. మ్యంచింగ్ టిఫ్ పెట్టుకుంది తనఅందాన్ని పదేపదేచూసుకుని మురిసిపోతూ- "ఇప్పడే రాజకుమారుడ్తెన వస్తే?" అని మళ్ళి అనుకుంది.
    సరిగ్గా అప్పడే కాలింగ్ బెల్ మ్రోగింది.
    నిర్మల ఉలిక్కిపడింది.
    వచ్చిన దెవరు? పిన్నివాళ్ళు  కాదుకదా- అన్నదామెభయం!
    కాలింగ్ బెల్ మళ్ళి మ్రోగింది.
    "ఎవరూ?" అంది నిర్మల లోపల్నుంచే!
                                         2
    చంచల్రావుకు తల్లిదండ్రులు చక్కగా ఎంచిమరి పేరు పెట్టారు. అతడి మనసు చంచలమైనది- ముఖ్యంగా ఆడపిల్లను విషయంలో.
    వయసులోవున్న ఏ ఆడపిల్లను చూసినా అతని మనసు చలిస్తుంది. సినిమాహిరోలా వాళ్ళవెనుక పడాలకుంటుందిగాని ద్తెర్యంచాలదు చటుక్కున ఆ అమ్మాయి చెప్పతిసుకుకొడితే నలుగురిలో తనపరువేమైపోవాలి?
    చంచల్రావుకు పరువుగురించినప్రాకులాట వుందికానీ మనసులో  అతడికున్న కోరికల్లో ఒక్కటి  అతడిపరువు నిలబెట్టదికాదు.
    అతడి ఎదురింట్లో ఓ వనజాక్షివుంది. సన్నగా పొడుగ్గా బాగానేవుంటుంది. రోజు మొగుడామేను కొడతాడు ఆమె అదేబ్బలు భరించలేక పెద్దగా కేకలుకూడా  పెడుతూంటుంది. ఒక రోజున వనజాక్షి చంచాల్రావును చూసి నవ్వింది. చంచల్రావు  అయిసైపోయడు. ఆమె నిజంగానేనవ్విందని గ్రహించేక తనూ నవ్వాడు.
    నాలుగు రోజుల్లో పరిచయం నవ్వుల్నించి కనుసైగలదాకా పెరిగింది. అయితే చంచల్రావు ఆమెనుంచి ప్రోత్సహంకోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాడు తప్పితే తను ముందడుగు వేయడంలేదు.
    చివరికోరోజున వనజాక్షి సాహసించి తనే అతణ్ణి పిలిచింది. సంకోచిస్తూనే చంచల్రావు వెళ్ళాడు.
    "నేను పిలవకుండానే వస్తావనుకున్నాను...." అంది వనజాక్షి.
    "ఎందుకు?" అన్నాడు చంచల్రావు  మొహమాటంగా.
    "ఇందుకు!" వనజాక్షి చటుక్కున అతణ్ణి కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది.
    చంచల్రావు ద్రిల్ల్తేపోయాడు. అలాంటి అనుభవం గురించి అతడాశ పడ్డాడుకానీ అనుకోలేదు. అప్రయత్నంగా వనజాక్షి చుట్టూ అతడి కౌగిలిబిగిసింది.
    వనజాక్షి అతడిని మృదువుగా  విడిపించుకుని- "నా దురదృష్టంకొద్ది నిన్ను చూడ్డానికిముందే నా పెళ్ళి అయిపోయింది- లేకుంటే నిన్నుతప్ప వేరెవ్వరినీ పెళ్ళిచేసుకుని ఉండేదాన్ని కాదు-" అంది.
    చంచల్రావు అయిసైపోయి - "ఎందుకని?" ఆనాడు.
    "నీకింకా అర్ధకాలేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను-" అందామె .
    ఆమె అంత సూటిగా అనేసరికి చంచల్రావు  తెల్లబోయాడు. అతడు మాట్లాడకపోవడం చూసి- "నువ్వు నన్ను ప్రేమించడం లేదా?" అంది వనజాక్షి.
    "ప్రేమిస్తున్నాను కానీ ఇది  తప్పుకదా!" అన్నాడు చంచల్రావు.
    "భార్యను భార్తకోట్టడం తప్పు నా భర్త అందరికి తెలిసేలా అతప్ప చేస్తున్నాడు. అందరూ ఆ తప్పను చూసి భరిస్తున్నారు. అవునా?" అంది వనజాక్షి.
    చంచల్రావు తలూపాడు.
    "ఈ సమాజంలో డబ్బునవాడుబలవంతుడు.  మగాడు బలవంతుడు వాళ్ళెంతప్పచేసినా సమాజం క్షమిస్తుంది ఈ సమాజం పేదవాడికి, ఆడదానికి రక్షణ కల్పించలేదు అలాంటి  ఈ సమాజం తప్పన్నది తప్పగా నేనేందుకు అంగీకరించాలి? సమాజం ఎదైతే తప్పని అందో ఆ తప్పే నేనూ చేస్తాను...."అంది వనజాక్షి.

 Previous Page Next Page