Home » Comedy Stories » Mahesh Takkari Donga Parody Song
Mahesh Takkari Donga Parody Song
.jpg)
" టక్కరి దొంగ " సినిమాలోని '' నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదురో '' అనే
పాటకు పేరడీగా ఈ పాట.
పల్లవి : నలుగురికీ వండినది నాకొక్కడికి చాలదురో
నరులేవరూ తినలేంది సింగిల్ గా నే తింట్రానో
జోకులు వేశారంటే
అది మీలో హ్యుమరిజం
లావని డాక్టర్లన్నా
ఇహ మారదు నా నైజం
నేను ఒక్కడిని ఒకవైపు కుంభాలొకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు కుంభాలొకవైపు !! నలుగురికీ !!
చరణం : మెలకువలోన భోంచేయడం నథింగ్ స్పెషల్
నిద్రలో ఉన్నా లాగించేయుట సంథింగ్ స్పెషల్
గ్లాసుడు కాఫీ తాగామంటే నథింగ్ స్పెషల్
గుండిగనంతా ఖాళీ చేస్తే సంథింగ్ స్పెషల్
ఆకలి వేస్తె కేకులు తినడం నథింగ్ స్పెషల్
బేకరి మొత్తం లేపెయ్యడం సంథింగ్ స్పెషల్ !! నలుగురికీ !!
చరణం : మేడ మెట్లను ఎక్కి వెళ్లడం నథింగ్ స్పెషల్
లిప్టు ఎక్కినా లాగకపోతే సంథింగ్ స్పెషల్
పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తే నథింగ్ స్పెషల్
రావోద్దంటూ దండం పెడితే సంథింగ్ స్పెషల్
బ్రతుకుట కోసం తినడం అంటే నథింగ్ స్పెషల్
తిండి కోసమై బతికామంటే సంథింగ్ స్పెషల్ !! నలుగురికీ !!




