Home » Comedy Stories » Aadhi Katha

ఆది కథ

-తాజీప్రసాద్

భగవంతుడు ఆడమ్, ఈవ్ లని సృష్టించి ఈ సృష్టిలో విశిష్ట సృష్టికి శ్రీకారం చుట్టాడు. గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఈవ్ సరసన వున్నా ఆడమ్ ని ఒక సందేహం తీరక వేధిస్తోంది.

సృష్టి కర్తనే అడిగి ఆ సందేహం తీర్చుకుందామనుకున్నాడు ఆడమ్. ఒకరోజు తను ఒంటరిగా వున్న సమయంలో ఆకాశం వైపు చూస్తూ " హే భగవాన్ " అంటూ ప్రార్థించాడు.

“ ఏమిటి ఆడమ్ ?” అంటూ భగవంతుడి వాణి వినిపించింది.

“ భగవాన్ నన్ను ఒక సందేహం ఈవ్ కన్నా ఎక్కువగా అంటిపెట్టుకుని వుంది " అన్నాడు ఆడమ్.

“ చెప్పు " భగవంతుడు ధైర్యం చెప్పాడు.

“ భగవాన్, మీరు ఈవ్ ని ఎందుకు అంత అందంగా సృష్టించారు.? ” అని తన సందేహాన్ని వెల్లడించాడు ఆడమ్.

“ అదా నీ సందేహం. ఆమె ప్రేమలో నువ్వు పడడానికి " భగవంతుడు చెప్పాడు.

“ అది సరే భగవాన్. మరి ఈవ్ ని అంత మూర్ఖురాలిగా ఎందుకు సృష్టించారు " అని వెంటనే అడిగాడు ఆడమ్.

“ అమాయకుడా అందకూ కారణం వుంది.ఈవ్ నీ ప్రేమలో పడడానికి " అంటూ కనిపించని భగవంతుని వాణి వినిపించకుండా ఆగిపోయింది.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.