Home » » కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు
Home » » శివరాత్రి అంటే ...? శివరాత్రి పూజావిధానం ఎలా?
Home » » Mahamrityunjaya Mantra Origin, Significance and Meaning ...
Home » » విజయాలకి భక్తి మార్గాలు
Home » » మహాలయ పక్షాల ప్రాధాన్యత
Home » » హోలీ హోలీ రే హోలీ
Home » » వెంటాడే మిత్రుడు
కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు

 

implementation of these instructions karthika masam

 

కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.
శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.
ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.
కార్తీక మాసంలో పండుగలు

 

implementation of these instructions karthika masam

 


శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ
దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో  సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతేకాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.
శుక్లపక్ష చవితి ”నాగుల చవితి''
కార్తీక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు.

 

implementation of these instructions karthika masam

 

శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి
ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి ‘ఉత్థాన ఏకాదశీ లేదా ‘ప్రబోధన ఏకాదశి ‘ అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.
శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి
పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే . ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించవలెను.


శివరాత్రి అంటే ...? శివరాత్రి పూజావిధానం ఎలా?

శివరాత్రి అంటే ...?

 

శివరాత్రి పూజావిధానం ఎలా?

 

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 

వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం.పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.


శివరాత్రులు ఎన్ని?

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి : నిత్య శివరాత్రి, పక్షశివరాత్రి, మాసశివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.

 

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 


లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు, జ్యోతిరూపంలో, లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి, మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు, పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు.

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ, శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటకీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో యిష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. “రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి” అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది – హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!… వగైరా –

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!

ఉష ఋణేవ యాతయ||’


నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ త్రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.

‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!

మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


అందుకేనేమో గరుడ, స్కంద, పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని, ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో ‘అభ్యుదయ ‘ మని, ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని, అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ, శాస్త్ర విహిత నియమాది, సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.
మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని ‘తిథితత్వం' లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – ‘ మీరు స్నానం చేసినా, మంచి వస్త్రాలు ధరించినా, ధూపాలు వెలిగించినా, పూజ చేసినా పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం' అంటాడు శివుడు.

ఉపవాసం అంటే ఏమిటి?

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


దగ్గర వసించటం, నివశించటం, ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.
‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః


ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’
(వరాహోపనిషత్తు)



భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.


‘ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!


ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||’



మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. ‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి  అది.

‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ


యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘



విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.
శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!”

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ‘ఓం నమః శివాయ ‘ అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరొకసారి రథరాత్రి మూడవ, నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ ‘ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – 'పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా! శివ – భవా! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా, మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర, ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే, ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్చించాలనీ, శక్తికొలదీ పాలు, గంగోదకం, పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ, ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.

 

 


Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


శివరాత్రికి లొంగోద్భవకాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యొతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం . ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు  'బిల్వ' మూలంలో ఉంటాయనీ, శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు. శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.

ప్రదక్షణ విధులు…

 

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

బిల్వ దళం ప్రాముఖ్యత:

 

 

Shivaratri Puja procedure, Maha Shivratri Pujan Vidhi is given here. How to do ... maha shivaratri pooja vidhanam and upavasam in telugu

 

 


బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శి వప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణం లోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.


Mahamrityunjaya Mantra Origin, Significance and Meaning ...

Mahamrityunjaya Mantra Origin,

 

 

Significance and Meaning ...

 

 

Origin of Mahamrityunjaya Mantra, Significance of Mahamrityunjaya Mantra, Word to Word meaning of the Maha Mrityunjaya Mantra, The Maha Mrityunjaya Mantra was found by Rishi Markandeya

 

 

Origin

The Maha Mrityunjaya Mantra was found by Rishi Markandeya. It was a secret mantra, and Rishi Markandeya was the only one in the world who knew this mantra. The Moon was once in trouble, cursed by King Daksha. Rishi Markandeya gave the Mahamritryunjaya Mantra to Sati, Daksha's daughter, for the Moon. This is how this mantra became known which according to another version is the Bija mantra as revealed to Rishi Kahola that was given by Lord Shiva to sage Sukracharya who taught it to Rishi Dadicha who gave it to King Kshuva through whom it reached the Shiva Purana.

 

Origin of Mahamrityunjaya Mantra, Significance of Mahamrityunjaya Mantra, Word to Word meaning of the Maha Mrityunjaya Mantra, The Maha Mrityunjaya Mantra was found by Rishi Markandeya

 

 


It is also called the Rudra mantra, referring to the furious aspect of Lord Shiva; the Tryambakam mantra, alluding to Shiva's three eyes; and it is sometimes known as the Mrita-Sanjivini mantra because it is a component of the "life-restoring" practice given to the primordial sage Sukracharya after he had completed an exhausting period of austerity. Its Devata is Rudra or Lord Shiva in his fiercest and most destructive roopa or aspect. In the Vedas it finds its place in three texts - (a) the Rig veda VII.59.12, (b) the Yajur Veda III.60, and (c) the Atharva Veda XIV.1.17.

Mahamrityunjaya Mantra

 

Origin of Mahamrityunjaya Mantra, Significance of Mahamrityunjaya Mantra, Word to Word meaning of the Maha Mrityunjaya Mantra, The Maha Mrityunjaya Mantra was found by Rishi Markandeya

 

 


Om Tryambakam Yajaamahe
Sugandhim Pusstti Vardhanam
Urvaarukam Iva Bandhanaan
Mrtyor Muksheeya Maa-Amritaat

It's Meaning :

 

Origin of Mahamrityunjaya Mantra, Significance of Mahamrityunjaya Mantra, Word to Word meaning of the Maha Mrityunjaya Mantra, The Maha Mrityunjaya Mantra was found by Rishi Markandeya

 

 


"Let us worship Shiva (the three eyed), who is sacred (fragrant) and who nourishes all beings. Just as the ripe cucumber is automatically released from its attachment to the creeper, may we be liberated from (total identification with) death (our mortal body and personality) and be granted (realisation of )our immortality nature''

Word By Word Meaning :

Mritu - death


Jaya - victory


This mantra is so called because, when chanted sincerely with reflection on its meaning, it can convey realisation of our Essential Nature which is beyond birth and death. In this way, it gives us victory over unquestioned assumptions and ignorance of what we are.
symbol of underlying Reality, mystic mantra for evoking heightened Awareness.


Triyambakam - the three-eyed, indicating Shiva (Consciousness). This third eye is the faculty of intution and insight (in sight; inner vision; subtle perception) which allows us to realise Shiva (our Essential Nature). Besides our two fleshy eyes. each of us has a third eye which lies dormant unless it is awakened by the practices of Yoga or any other transformative system. When it awakes we can live in the world of mundne affairs (with the two fleshy eyes) whilst remaining in contact with the Roots of our Being (with the third eye).


Yajaamhe - we venerate or worship.

Sugandhim - fragrat. When the third eye is awakened everyting fragrant; that is, everything is seen to be fundamentally sacred.


Pushti - nourishes. Reality nourishes (sustains or supports) everything.

Vardhanam - increases. On the Yogic path, our understanding increases day by day.

 

Origin of Mahamrityunjaya Mantra, Significance of Mahamrityunjaya Mantra, Word to Word meaning of the Maha Mrityunjaya Mantra, The Maha Mrityunjaya Mantra was found by Rishi Markandeya

 

 


Urvaarukamiva - a creeper that bears cucumber-like furits. Here it symbolises each of us and our relationship to existence. Just as each cucumber ripes on the creeper and, at the right time, falls off, so each of us can grow and mature (aided by Yoga) until we realise a deeper Element behind our existence and that of everything. This gradually releases us from our self-obsessions and we ripen - we start to open up to a wider dimension of existence. It is a natural process; Yoga is part of this process of maturation.


Note: Some people are using following explanation for urvarukam: 'urva' means "vishal" or big and powerful or deadly. 'arukam' means 'disease'. But urva does not mean 'Vishal' in sanskrit but oorva. So this translation is not correct

Bandhanaan - bondage.


Mrityor
- death; ignorance.

Muksheeya - liberate.


Therefre bandhanaan mrityor muksheeya means 'liberate us from the bondage of death or ignorance'.


Maa-amritaat - (realisation of) the immortal Reality behind everything.
Constant repetition of this ancient Sanskrit mantra purifies the heart and awakens our perception (third eye) so that we start to understand on a deeper level. Simultaneous reflection on its meaning also helps to awaken our intuitive faculties.
It may also be chanted to aid those who are suffering or ill.

Significance

 

Origin of Mahamrityunjaya Mantra, Significance of Mahamrityunjaya Mantra, Word to Word meaning of the Maha Mrityunjaya Mantra, The Maha Mrityunjaya Mantra was found by Rishi Markandeya

 

 


Mahamrityunjaya Mantra is the great mantra for conquering death for it protects against all threats and at the time of death eases the process of release. It is one of the more potent of the ancient mantras, a call for enlightenment and a practice of purifying the karmas of the soul at a deep level. It is beneficial for mental, emotional and physical health. It is also a moksha mantra which bestows longevity and immortality. The Maha Mrityunjaya Mantra creates a very powerful protective shield of divine vibrations that wards off and protects us from negativities and evil forces. According to some puranas, the Mahamrityunjaya Mantra has been used by many Rishis as well as Sati during the time when Chandra suffered from the curse of Prajapati Daksha. By reciting this mantra, the effect of the curse of Daksha, that could make him die, slowed, and Shiva then took Chandra and placed it upon his head.

 

Origin of Mahamrityunjaya Mantra, Significance of Mahamrityunjaya Mantra, Word to Word meaning of the Maha Mrityunjaya Mantra, The Maha Mrityunjaya Mantra was found by Rishi Markandeya

 

 


This mantra is addressed to Lord Shiva for warding off untimely death. It is also chanted while smearing Vibhuti over various parts of the Body and utilised in Japa or Homa (havan) to get desired results. While its energy protects and guides the intiates a mantra re-links consciousness to its deeper and more abiding nature and repetition of the mantra constitutes Japa, the practice of which develops concentration that leads to a transformation of awareness. Whereas the Gayatri Mantra is meant for purification and spiritual guidance, the Mahamrityunjaya Mantra is meant for healing rejuvenation and nurturance.


విజయాలకి భక్తి మార్గాలు

 

విజయాలకి భక్తి మార్గాలు

   

   సాధారణంగా రోజూ చేసే  పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం.

1. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి.

2. ఇక వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు "కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందట.

3. ఇక మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ " హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి.

4. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు " విష్ణు సహస్రనామం, లలిలా సహస్ర నామం పారాయణ చేయాలిట.

5. పిల్లలు కలగాలని కోరుకునే దంపతులు "గోపాల స్తోత్రం " చదివితే మంచిదట. అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు.

6. ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి. మంచి సంబంధం దొరికి, పనులన్నీ చక్కగా జరగాలని,పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి  ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట.

7. ఋణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలిట. అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారుట.

8. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా విష్ణు  సహస్ర నామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయట.


-రమ


మహాలయ పక్షాల ప్రాధాన్యత

మహాలయ పక్షాల ప్రాధాన్యత

 

       

భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ ‘మహాలయ పక్షములు’ అంటారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే ‘మహాలయ పక్షాలు’ అంటారు. వీటినే ‘పితృపక్షము’లనీ.., ‘అపరపక్షము’లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము.

పితృదేవతలకు ... ఆకలా?


అనే సందేహం మీకు కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ‘ఆకలి’ అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.
              
              అన్నాద్భవంతి భూతాని  -  పర్జన్యాదన్న సంభవః
               యఙ్ఞాద్భవతి పర్జన్యో  -  యఙ్ఞః కర్మ సముద్భవః


అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షము వలన అన్నము లభిస్తుంది. యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది. ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే....
అన్నం దొరకాలంటే .... మేఘాలు వర్షించాలి.
మేఘాలు వర్షించాలంటే....దేవతలు కరుణించాలి.
దేవతలు కరుణించాలంటే...వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యఙ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని  అడగొచ్చు.

మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద  ‘జీవాత్మ’గా అవతరించడానికి...  అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.
మరణిచిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి  అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి  పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే ‘మోక్షం’ అంటే. రేపు మనకైనా ఇంతే.

తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?

 


అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి  పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక  మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ  ‘మహాలయ పక్షాలు’ పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు. ఏ కారణం  చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలా తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ...పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు.  వంశం నిర్వంశం కావడం అంటే... సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

- సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమమం. ఏ కారణంచేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో ‘మహాలయ అమావాస్య’నాడు
   పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి.
- క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి ‘చేత భరణి లేక భరణి పంచమి’ తిథులలో అనగా..మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.
- భార్య మరణించిన వాడు ‘అవిధవ నవమి’నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం  పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర,రవికెలగుడ్డ  పెట్టి   సత్కరించి పంపాలి.
- చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. చిన్న పిల్లలు అంటే..ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ      పది సంవత్సరముల వయస్సు లోపే  ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి.
- ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ‘ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి’నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.
మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరము) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఐదుగురు భోక్తలు ఎందుకంటే...

1.పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త.
2.ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త.
3.ఇది పితృస్థానం.  తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.
4.ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.
5.ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే.. ‘శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో...కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గానీ...మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. మరొక్క విషయం. మనిషన్నాక బలహీనతలు సహజం. కనుక వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఈ పితృకార్యం చేసే అర్హత, అధికారం లేదు. శాస్త్రం ఆ వీలు కల్పించలేదు. కనుక మనకీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధివిధాన పితృకర్మలు నిర్వహించడం.., వారి పుత్రులుగా మన విధి, కర్తవ్యం, బాధ్యత. ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి, ఈ మహాలయ విధులు భక్తి, శ్రద్ధలతో నిర్వహించి పతృదేవతల ఆశీస్సులు అందుకుంటారని ‘తెలుగు వన్’ ఆకాంక్షిస్తోంది. 
                                                     

-యం.వి.యస్.సుబ్రహ్మణ్యం


హోలీ హోలీ రే హోలీ

 

హోలీ హోలీ రే హోలీ

 

హోలీ వస్తోందంటే ఇదివరకు మా ప్రాంతమంతా ఈ పాటతో మారుమ్రోగిపోయేది..ఈ మధ్య ఈ పాట హోరు తగ్గిందిగానీ, రంగుల హరివిల్లులు తగ్గలేదు.  హోలీ రంగుల పండగాయే మరి..  పెద్ద, చిన్న అందరిలో ఉత్సాహాన్ని నింపే పండగ ఇది.  దీపావళిలాగానే మన దేశంలో వారేకాక వేరే దేశాలవారు కూడా జరుపుకునే పండుగ.  మరి ఇన్ని ప్రదేశాలలో ఇంత విశేషంగా జరుపుకునే ఈ పండగ అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?   ఆది తెలుసుకోవటానికి మనం పురాణాల్లోని ప్రహ్లాదుని కధలోకి వెళ్ళిపోదాం.

ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు.  ప్రహ్లాదుడి విష్ణు భక్తి మాన్పించాలని అతనిని అనేక విధాల శిక్షిస్తాడు.  అతను హరి భక్తిని వీడకపోయేసరికి చివరికి కన్న కొడుకనయినా చూడకుండా చంపించాలనికూడా అనేక ప్రయత్నాలు చేస్తాడు.  అయినా ప్రహ్లాదుడు విష్ణు భక్తి మానలేదు.  ఆ మహావిష్ణువు సహాయంతో తండ్రి పెట్టే అన్ని విషమ పరీక్షలనుంచి క్షేమంగా బయటపడ్డాడు.  విసిగిపోయిన హిరణ్యకశిపుడు తన చెల్లెలు అయిన హోలికను ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని  చితిలో కూర్చోమన్నాడు.  ప్రహ్లాదుడు మంటల్లోంచి భయపడి బయటకి పోకుండా హోలిక పట్టుకు కూర్చోవాలన్నమాట.  ఆవిడ అన్నగారి ఆదేశం ప్రకారం మంటలనుంచి రక్షించే శక్తి వున్న ఒక శాలువా కప్పుకుని, ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుంది.

ప్రహ్లాదుడు హరి నామ స్మరణతో నిర్భయంగా కూర్చున్నాడు.  అందరూ ప్రహ్లాదుడు చనిపోతాడని భావించారు.  మంటలు మొదలయ్యాయి.  అందరూ చూస్తుండగానే హోలిక కప్పుకున్న శాలువా ఎగిరి ప్రహ్లాదుడిని కప్పింది.  దాని వలన ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు, హోలిక మంటల్లో కాలి మరణించింది.  తర్వాత శ్రీ మహావిష్ణువు నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపుతాడు.

హోలిక మంటల్లో కాలిపోయిన రోజున హోలికా దహన్ అని వీధుల కూడళ్ళల్లో కఱ్ఱలు వగైరాలతో  మంటలు వేస్తారు.  కొన్ని చోట్ల హోలిక బొమ్మని కూడా తగలబెడతారు.

దక్షిణాదిన ఈ పున్నమిని కాముని పున్నమి అని, ఈ మంటలని కాముని దహనం అంటారు.  మరి దానికి సంబంధించిన కధ తెలుసుకోవాలికదా.  పార్వతీ దేవి పరమ శివుణ్ణి భర్తగా పొందాలనుకుంటుంది.  ఆ మహా శివుడేమో తన తపస్సేమిటో, తన సంగతేమిటో తప్ప పార్వతీ దేవిని పట్టించుకోలేదు.  మన్మధుడు లోక కళ్యాణార్ధం (తారకాసురుడనే రాక్షసుణ్ణి చంపటానికి పార్వతీ పరమేశ్వరులకి పుత్ర సంతానం కలగాలి)  పార్వతీ దేవికి సహాయం చేద్దామనుకుంటాడు.  తన పూల భాణాలు శివుడిమీద ప్రయోగిస్తాడు.  తపస్సు చేసుకునే శివుడు కోపంతో తన మూడో కన్న తెరుస్తాడు.  పాపం మన్మధుడు భస్మమవుతాడు.

రతీదేవి తన భర్తని తిరిగి బ్రతికించమని శివుణ్ణి పరిపరి విధాల ప్రార్ధిస్తుంది.  శివుడు కనికరించి మన్మధుణ్ణి బ్రతికిస్తాడుగానీ భౌతిక ప్రేమకన్నా గొప్పదైన ఆధ్యాత్మక ప్రేమ విశిష్టతను లోకానికి తెలియజేయటానికి మన్మధుడు కేవలం రతీదేవికి మాత్రమే కనబడేటట్లు అనుగ్రహిస్తాడు.  భౌతిక కామ వాంఛలన్నీ తగలబెట్టి, ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం పేరుతో మంటలు వేస్తారు.

శ్రీ కృష్ణుడు పుట్టి, పెరిగిన మధుర, బృందావనం వగైరా ప్రదేశాలలో ఈ పండగ చాలా ఉత్సాహంగా, గొప్పగా జరుపుకుంటారు.   16 రోజులపాటు  జరిగే ఈ ఉత్సవాలలో ఆ ప్రదేశాలన్నీ పర్యాటకులతో కళకళలాడుతూంటాయి.  చిన్ని కృష్ణుడు తన తల్లితో రాధ తెల్లగా వుందని తను నల్లగా ఎందుకున్నాననీ ఫిర్యాదు చేశాడట.  కొడుకుని నవ్వించటానికి తల్లి రాధ మొహానికి రంగు పూసిందని, అప్పటినుంచీ హోలీ ప్రారంభమయిందనీ వారి విశ్వాసం.  కృష్ణుడు, రాధ, గోపికలు ఆనాడు బృందావనంలో ఈ ఉత్సవాల్ని జరుపుకున్నారని భావిస్తారు.  అందుకే ఉయ్యాలలో రాధా కృష్ణుల విగ్రహాలుంచి ఊపుతూ డోలోత్సవం అని చేస్తారు.

వసంత కాలంలో జరిగే వాతావరణ మార్పులవలన జలుబు, జ్వరాలు త్వరగా వస్తాయి.  వాటి నివారణకోసే ఇదివరకు నిమ్మ, కుంకుమ, పసుపు, బిల్వ, మోదుగ మొదలకు వృక్ష భాగాలనుంచి తయారు చేసిన రంగుల పొడిన జల్లుకునేవారు, వాటిని నీటిలో కలిపి ఒకరిమీద ఒకరు జల్లుకునేవారు.  వాటివల్ల ఆరోగ్యం మెరుగుపడేది.  కానీ ఇప్పుడు వాడుతున్న రసాయనిక రంగులవల్ల లేనిపోని అనారోగ్యాలు వచ్చే అనకాశం వున్నది.

భారత దేశంలోనే కాక కొన్ని విదేశాలలో కూడా జరుపుకునే ఈ పండగలో ప్రాంతాలు వేరయినా, పేర్లు వేరయినా, జరుపుకునే పధ్ధతులు వేరయినా ఉద్దేశ్యంమాత్రం ఒక్కటే.  చలికాలం వెళ్ళి వేసవి వచ్చే వేళలో వసంత ఋతువుకి ఆహ్వానం పలికే వేడుకే హోలీ.  వసంతుని రాకతో పులకరించిన ప్రకృతిని చూసిన మనుషుల్లో అనేక వికారాలు ఉద్భవిస్తాయి.   భౌతికమైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను విజ్ఞానమనే మంటల్లో తగలబెట్టి మంచి జీవితం గడపటమే ఈ పండగ ముఖ్యోద్దేశ్యం.

హోలీ రోజున జల్లుకునే రసాయనాలు లేని రంగులు శరీరాన్ని చల్లబరుస్తాయి.  తర్వాత చలువ చేసే పానీయాలు తాగి, మిఠాయిలు తింటారు.

ఫాల్గుణ  మాసంలో  పౌర్ణమి రోజున వస్తుంది ఈ పండుగ.  డోలా పూర్ణిమ అని కూడా పిలవబడే ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ నారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం వగైరా వ్రతాలు కూడా చేస్తారు.

తెలుగునాట పల్లెటూళ్ళల్లో అంత ఎక్కువ లేకపోయినా, పట్టణాలలో హోలీ ఉత్సాహాన్ని చూస్తూనే వుంటాము.

ముగించే ముందు నేను చూసిన విశేషం ఒకటి చెబుతాను.  అస్సాం రాష్ట్రంలో వైష్ణవ మందిరాలలో ఆవరణలోనే ఆలయం ఎదురుగా చిన్న మందిరం వుంటుంది.  డోల్ మందిర్ అంటారు దానిని.  హోలీ రోజున అక్కడ కృష్ణ విగ్రహాన్ని పెట్టి అందరూ నృత్యాలు చేస్తూ, రంగులు జల్లుకుంటూ గొప్ప ఉత్సవం చేస్తారుట.

-పి.యస్.యమ్. లక్ష్మి

 

 


వెంటాడే మిత్రుడు

వెంటాడే మిత్రుడు

సుఖ,దుఃఖాలతో సంబంధం లేకుండా అనుక్షణం నీవెంట ఉండేవాడే..నీకు నిజమైన మిత్రుడు. వెలుతురులో(సుఖాలలో) ఉన్నప్పుడు అందరూ నీడలా నీవెంటే ఉంటారు. చీకటిలో(కష్టాలలో) ఉన్నప్పుడు నీ నీడకూడా నీకు తోడుగా ఉండదు. కానీ, అనుక్షణం నీ వెంటే ఉంటూ, నిన్ను సుఖాల కలల నుంచి, కష్టాల అలల నుంచి బయటకు లాగే నిజమైన నిస్వార్ధ మిత్రుడు ఈ స్వార్ధప్రపంచంలో ‘మృత్యువు’ ఒక్కడే. అందుకే అంటారు ‘ప్రాణికి భగవంతుడు ఇచ్చిన మహత్తరమైన వరం మరణం ఒక్కటే’ అని. మృత్యువు వల నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇందుకు తార్కాణంగా ఒక కథ చెప్తాను.

ఈ కథకు ఏ విధమైన పురాణాధారం లేదు. ఇది కేవలం కల్పితం.

ఒకసారి శ్రీ మహావిష్ణువుకు దేవకార్య విషయమై పరమశివునితో పని ఉండి గరుత్మంతునిమీద కైలాసం వచ్చాడు. గరుత్మంతుని కైలాస ముఖద్వారం దగ్గరే ఉండమని చెప్పి, శ్రీమహావిష్ణువు ఒక్కడూ శివసాన్నిధ్యానికి వెళ్ళాడు. కైలాస ముఖద్వారం దగ్గర గరుత్మంతుడు ఒక్కడూ ఉన్నాడు. ఇంతలో ఒక బంగారు పిచ్చుక ఎగురుతూవచ్చి గరుత్మంతుని సమీపంలో వాలింది. అక్కడ తమ జాతికి రాజైన గరుత్మంతుని చూసి, నమస్కరించి, కైలాస పర్వతసానువుల మీద ఉన్న గడ్డిలోని పురుగులను తింటూ, ఉల్లాసంగా ఎగురుతూ ఆనందిస్తోంది. అది చూసి గరుత్మంతుడు చాలా ఆనందించాడు. ఇంతలో పరమశివునితో పని ఉండి యమధర్మరాజు కూడా కైలాసం వచ్చి, గరుత్మంతుని కుశల ప్రశ్నలు వేసి, కైలాస ముఖద్వారం దాటి లోపలకు వెడుతూ, అక్కడ ఆనందంగా ఎగురుతున్న ఆ బంగారుపిచ్చుక వంక ఆశ్చర్యంగా చూసి, లోపలకు వెళ్ళాడు. యమధర్మరాజు, తన జాతి పక్షి అయిన ఆ బంగారుపిచ్చుక వంక ఎందుకు అలా చూసాడో ఎంత ఆలోచించినా గరుత్మంతునకు అర్థం కాలేదు. అతనికి అర్థం అయినది ఒక్కటే.  

తన పాలనలో ఉన్న ఆ బంగారుపిచ్చుక మీద యమధర్మరాజు దృష్టి పడింది. అంటే..దానికి ఆయువు మూడినట్టే. నా ప్రజలను కాపాడ వలపిన బాధ్యత  పక్షీంద్రునిగా నాకు ఉంది. కనుక ఆ బంగారుపిచ్చుకను కాపాడాలి అని సంకల్పించి, ఆ పిచ్చుకను దగ్గరకు పిలిచి, ‘కుమారా.. ఇక్కడ ఉంటే నీ ప్రాణాలకు ప్రమాదం, నిన్ను సురక్షితమైన ప్రదేశానికి చేర్చుతాను., నా వీపున అధిరోహించు’ అని చెప్పాడు. ఆ బంగారుపిచ్చుక గరుత్మంతుని వీపును ఎక్కి కూర్చుంది. వెంటనే గరుత్మంతుడు మహావేగంగా ఎగురుతూ, కైలాసగిరికి కొన్ని వేల యోజనాల దూరంలోనున్న ఒక దట్టమైన అడవిలోని ఓ పర్వత పగులులోని జాగాలో ఆ బంగారుపిచ్చుకను ఉంచి ‘ఇదే నీకు సురక్షితమైన ప్రదేశం, ఈ అరణ్యంలో హాయిగా జీవించు’ అని చెప్పి తిరిగి అదే వేగంగా కైలాస పర్వతం చేరుకున్నాడు.

కొంతసేపటికి యమధర్మరాజు తిరిగి వచ్చి అక్కడ ఉండే బంగారుపిచ్చుక కోసం అటు ఇటు చూసాడు. అది గమనిస్తున్న గరుత్మంతుడు తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, పైకి అమాయకత్వం నటిస్తూ, ‘యమధర్మరాజా..ఎవరి కోసం వెతుకుతున్నారు’ అని ప్రశ్నించాడు. అప్పుడు యమధర్మరాజు ‘ఇక్కడ ఒక బంగారుపిచ్చుక ఉండాలి..ఎక్కడకు వెళ్ళిందా అని వెతుకుతున్నాను’ అని బదులు ఇచ్చాడు. అది విని గరుత్మంతుడు మరింత అమాయకత్వం నటిస్తూ ‘ఈ సృష్టిలో ఎన్నో గొప్ప గొప్ప ప్రాణులు ఉండగా, అల్పప్రాణి అయిన ఆ బంగారుపిచ్చుక గురించి ఎందుకింత ప్రత్యేక శ్రధ్ధ చూపిస్తున్నారు యమధర్మరాజా’ అని అడిగాడు. ‘ఏమీలేదు గరుత్మంతా..ఈ కైలాసగిరికి కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న ఓ దట్టమైన అడవిలోని ఒక పర్వత పగులులో నివసించే ఓ పాముకు ఆ బంగారుపిచ్చుక పది క్షణాలక్రితం ఆహారం కావాలి... ఈ పది క్షణాల వ్యవధిలో ఆ బంగారుపిచ్చుక అక్కడకు చేరుకునే శక్తి, బలం దాని రెక్కలకు లేవే..అని ఆశ్చర్యపోతూ శివసన్నిధికి వెళ్లాను, తిరిగి వచ్చేటప్పటికి ఆ పిచ్చుక కనిపించకపోయేసరికి ఆశ్చర్యం వేసింది’ అని ఓ క్షణకాలం కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచి చిరునవ్వుతో గరుత్మంతుని వంక చూసి ‘ఆ పాముకు ఆహారం అందింది’ అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు యమధర్మరాజు. ఆశ్చర్యపోవడం గరుత్మంతుని వంతు అయింది.

కనుక , మృత్యువు ఎప్పుడూ మనతోనే ఉంటాడు...తనతోనే తీసుకు వెడతాడు. అట్టి మిత్రుని మనమెన్నడూ మరువరాదు.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.