Home » » విష్ణు అనుగ్రహానికి రెండు మార్గాలు
Home » » దసరా ఉత్సవాలు - బతుకమ్మ పాటలు (Telangana Batukamma Songs)
Home » » శక్తిపీఠాలు (Shakthi Peethas)
Home » » శక్తిపీఠాలు - 1 (Shakthi Peethas - 1)
Home » » శక్తిపీఠాలు - 2 (Shakthi Peethas - 2)
Home » » శక్తిపీఠాలు - 3 (Shakthi Peethas - 3)
Home » » కార్తీక మహాపురాణం మొదటి రోజు
Home » » సంపూర్ణ కార్తీక మహా పురాణం రెండవ రోజు
Home » » కార్తీక మహా పురాణం మూడవరోజు
Home » » కార్తీక మహా పురాణం నాలుగో రోజు
Home » » కార్తీక మహా పురాణం ఐదవ రోజు
Home » » కార్తీక మహా పురాణం ఆరవ రోజు
Home » » సత్యభామ పూర్వజన్మ విశేషాలు
Home » » కార్తీక మహా పురాణం ఏడవరోజు
Home » » కార్తీక మహా పురాణం ఎనిమిదవ రోజు
Home » » కార్తీక మహా పురాణం తొమ్మిదోరోజు
Home » » కార్తీక మహా పురాణం పదవరోజు
Home » » కార్తీక మహా పురాణం పదకొండవ రోజు
Home » » కార్తీక మహా పురాణం పన్నెండవ రోజు
Home » » కార్తీక మహా పురాణం పదమూడవ రోజు
Home » » కార్తీకమాసంలో వనభోజనాలు ఎందుకు
Home » » కార్తీకంలో పసందైన వనభోజనాలు Vanabhojanam in Karthika Masam
Home » » మత్స్యావతార విశేషాలు Karthika Puranam – 17
Home » » శివుని మూడో కంటి నుండి పుట్టిన బాలకుడు
Home » » శివుని కంటే ముందు కీర్తిముఖుని పూజించాలి
Home » » జలంధరునితో యుద్ధం చేసిన మహాశివుడు
Home » » విష్ణుమూర్తిని శపించిన బృంద
Home » » తులసి, ఉసిరి కథలతో స్వర్గప్రాప్తి
Home » » బ్రాహ్మణుడి భార్య రాక్షసిగా ఎలా మారింది
Home » » పిల్లలు దేవుడి ప్రతిరూపాలు (Children's Day in India )
Home » » త్రిమూర్తులు నదులుగా ఎలా మారారు
Home » » రావిచెట్టుని పూజిస్తే లక్ష్మీ కటాక్షం
Home » » Hopeful New Year 2012
Home » » Hindu Epics Love Stories
Home » » Women from Vedic to Modern age
Home » » భగినీ హస్త భోజనం ... సోదరి ఇంట భోజనం చేయాలి
Home » » మాఘ పూర్ణిమ ప్రత్యేకత ?
Home » » మాఘ పూర్ణిమ ప్రత్యేకత ?
Home » » sri kalahastiswara brahmotsavam Starts from Sunday 23-02-2014
Home » » Sri Ahobila Lakshmi Narasimha Swami Temple Brahmotsavam from Today ...
విష్ణు అనుగ్రహానికి రెండు మార్గాలు


విష్ణు అనుగ్రహానికి రెండు మార్గాలు

Karthika Puranam – 26

విష్ణుగణాలు చెప్పింది విని విస్మృత చేష్టుడు, విస్మయరూపుడు అయిన ధర్మదత్తుడు వారికి దండవత్ ప్రణామాలు చేసి ''ఓ విష్ణు స్వరూపులారా! ఈ ప్రజానీకమంతా అనేకానేక క్రతువ్రత దానాలచేత ఆ కమలనాభుని సేవించుకుంటూ ఉన్నారు. వాటిలో దేన్ని ఆచరించడంవల్ల విష్ణువుకు అత్యంత ప్రీతి కలుగుతుందో, దేనివల్ల విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దాన్ని సెలవీయండి'' అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనికి ఇలా సమాధానం ఇచ్చాయి.

''పాపరహితుడైన బ్రాహ్మణుడా! పూర్వం కాంచీపురాన్ని ''చోళుడు'' అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరుమీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి చెందాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. యజ్ఞాలకోసం నిర్మించిన బంగారు యూపస్తంభాలతో తామ్రపర్ణీ నది రెండు తీరాలు కుబేర ఉద్యానవనాలైన ''చైత్రరథాల'' వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకనాడు ''అనంతశయన'' పేర యోగనిద్రాముద్రితుడై ఉండే విష్ణు ఆలయనికి వెళ్ళి మణి మౌక్తిక సువర్ణ పుష్పాలతో శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి స్థిమితంగా శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు.

అంతలోనే ''విష్ణుదాసు'' అనే బ్రాహ్మణుడు విష్ణువును పూజించేందుకు ఆలయానికి వచ్చాడు. విష్ణుసూక్తాన్ని పఠిస్తూ, అభిషేకం చేసి తులసిదళాలతోనూ గుత్తులతోనూ విష్ణుపూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణ అభిజాత్యాన్ని విస్మరించి ''ఓరి విష్ణుదాసుడా! నేను మాణిక్యాలతోనూ, బంగారు పూలతోనూ చేసిన నా పూజవల్ల ప్రకాశమానుడైన ఆ ప్రభువును తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావు? నేనెంతో భక్తితో ఆచరించిన పూజను ఇలా పాడుచేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా?'' అన్నాడు.

ఆ మాటలకు బ్రాహ్మణునికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి ''రాజు'' అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ''ఓ రాజా! నీకు దైవభక్తి లేదు సరికదా, ఐశ్వర్యమత్తుడివై ఉన్నావు. విష్ణు ప్రీత్యర్థం నువ్వు ఆచరించిన యజ్ఞం ఏదైనా ఒక్కటుంటే చెప్పు'' అనడిగాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ ''నీ మాటలవల్ల నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది. ధనహీనుడివి, దరిద్రుడివి అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నువ్వు ఎప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడివి.. నీకు భక్తుడివి అనే అహంకారం మాత్రం ఉంది. ఓ సదస్యులారా! సద్బ్రాహ్మణులారా! శ్రద్ధగా వినండి.. నేను విష్ణు సాక్షాత్కారం పొందుతానో, ఈ బ్రాహ్మణుడు పొందుతాడో చూడండి. అంతటితో మా ఇద్దరి భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది'' అని ప్రతిజ్ఞా పూర్వకంగా పలికి, చోళుడు స్వగృహానికి వెళ్ళి ''ముద్గలుడు'' అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు యాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయ క్షేత్రంలో ఋషి సముదాయాలు చేసిన, అన్నదానాలు, అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించసాధ్యం కానిది సర్వ సమృద్ధిమంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు

పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ, కార్తీక వ్రతాచరణలూ, తులసివన సంరక్షణలు, ఏకాదశినాడు ద్వాదశాక్షరీ యుత విష్ణుజపం, షోడశోపచార విధిని నిత్యపూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ తన శక్తిమేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యం సర్వ వేళల్లోనూ భోజనాది సమయాల్లో సంచారమందు, తుదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ, కార్తీక మాసాల్లో విశేష నియమపాలన చేస్తున్నాడు. ఇలా భక్తులైన చోళ, విష్ణుదాసులు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రత నిష్ఠలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలాకాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు.

కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసి వెళ్ళిపోయారు. దాని గురించి విష్ణుదాసు విచారణ చేయలేదు. కానీ తిరిగి వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతూ ఉండటంవల్ల ఆరోజు భోజనం లేకుండానే విష్ణుపూజలో గడిపేశాడు. మర్నాడు కూడా వంటచేసుకుని శ్రీహరికి నివేదించేలోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళ మించకూడదని ఆరోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజూ అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తున్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారంరోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలి అనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే వంటకాలను పూర్వస్థానంలోనే ఉంచి తాను చాటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురుచూడసాగాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం దీనంగా ఉంది. ఎముకల గూడులా ఉన్నాడు. అతన్ని చూసి జాలిపడిన బ్రాహ్మణుడు ''ఓ మహాత్మా! కాసేపు ఆగవయ్యా! ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం. ఈ నేతిని కూడా పట్టుకు వెళ్ళు'' అంటూ నేతిగిన్నెతో అతని వెంటపడ్డాడు.

ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించడానికే అనే భయంతో చండాలుడు పరుగుతీయసాగాడు. విప్రుడేమో ''అయ్యా! నేతితో కలుపుకుని తినవయ్యా'' అంటూ వెంబడిస్తూనే ఉన్నాడు. చివరికి చండాలుడు కిందపడి మూర్ఛపోయాడు.

వెనకే వచ్చిన బ్రాహ్మణుడు ''అయ్యో, మూర్ఛపోయావా?'' అంటూ తనపై వస్త్రపు చెంగుతో చండాలునికి విసరసాగాడు. ఆ సేవవల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్ళకు శంఖచక్ర గదాదారి, పీతాంబరుడు, చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతను అవాక్కయ్యాడు. ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదిదేవతలు విమానరూఢులై అక్కడికి వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసునిమీద కూడా పూలవాన కురిపించారు. అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. ఆదినారాయణుడు విష్ణుదాసుని ప్రేమగా కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతోబాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయల్దేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి ''ఓ ముద్గరమునీ! నాతో జగడమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్తున్నాడు. ఇంత ఐశ్వర్యవంతుని అయ్యుండీ, కఠినమైన యజ్ఞదానాలు చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారం పొందలేక పోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా! నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నామీద లేశమైనా కృప కలిగినట్లు లేదు. దీన్నిబట్టి మహా భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గంలేదు. ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను'' - అని చెప్పాడు.

బాల్యం నుంచీ యజ్ఞదీక్షలోనే ఉండటంవల్ల నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు.

ఆ కారణంచేతనే చోళ దేశాల్లో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్ళే కర్తలవుతూ ఉన్నారు. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరికి చేరి ''ఓ శ్రీహరీ! త్రికరణ శుద్ధిగా నీపట్ల భక్తిని సుస్థిరం చేయి తండ్రీ!'' అని ప్రార్ధించి సమస్త సదస్యులూ చూస్తుండగానే అగ్నిప్రవేశం చేశాడు.

అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రమీనాటికీ ''విశిఖ''గానే వర్ధిల్లుతోంది.

హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు.

ఓ ధర్మదత్తా! అలనాడే ఈవిధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని, ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కనుక ఓ విప్రుడా! విష్ణు అనుగ్రహానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండూ ఒకటి ఆత్మజ్ఞానం, రెండోది ఆత్మార్పణం'' అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు.

Karthika Puranam Epic 26th Chapter, Karthika Puranam and Dharmadatta story, Karthika Puran Vaikuntha Dwarapalaka, Karthika Puranam and story of Vishnudas

 


కార్తీక మహాపురాణం మొదటి రోజు

కార్తీక మహాపురాణం

సంపూర్ణ కార్తీక మహాపురాణం

(నిత్య పారాయణ గ్రంధం)


సూతుడు కార్తీక మహా పురాణాన్ని ఇలా చెప్పాడు.
పూర్వం నైమిశారన్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి, సంతుషుని చేసి కైవల్యదాయకం అయిన కార్తీకమాశ మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతముని

''శౌనకాదులారా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని ''అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మ పురాణాలు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిషుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోనూ, హేలావిలాస బాలమణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణంలోనూ ఈ కార్తీక మహాత్మ్యమును సవివరంగా ఉన్నది. మన అదృష్టంవల్ల నేతి నుండి కార్తీక మాసం ప్రారంభం. కావున ప్రతిరోజూ నిత్య పారాయణంగా ఈ నెల అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహాత్యాన్ని వినిపిస్తాను వినండి..'' అంటూ చెప్పసాగాడు.

జనకుడు వశిష్టుని కార్తీక వ్రాత ధర్మములు అడుగుట.. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్నా యోగానికి అవసరమైన ద్రవ్యార్ది అయిన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు.

అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి ''హే బ్రహ్మర్షీ! మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి.. సంవత్సరంలోని సర్వ మాసముల కంటే కూడా కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనది. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదని, చెప్తూ ఉంటారు. ఈ నెలకు అంత ప్రాముఖ్యత ఎలా కలిగింది.. ఆ వ్రతం ఉత్క్రుష్ట ధర్మం ఏ విధంగా అయింది'' - అని అడుగగా మునిజన విశిష్టుడైన వశిష్టుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు. జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీలాంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైంది, విన్నంతమాత్రంచేత అన్ని పాపాలనూ అణచివేసేదీ అయిన కార్తీక మహాత్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు అడిగిన సంగతులను చెప్తాను, విను..

కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో.. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమనాడిగా గానీ, శుద్ధ పాడ్యమి నుండి గానీ ప్రారంభించాలి. ముందుగా - ''సర్వపాప హారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే'' ఓ దామోదరా! నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయుము తండ్రీ'' అని నమచేసిస్కారపూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానం ఆచరించాలి.

కార్తీకమండలి సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే, గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలకు చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశాయాల్లో కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీకమాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళూచేతులూ కడుక్కుని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. తర్వాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి.

అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలితో నీటిని చెలికి మూడు దోసిళ్ళ నీళ్ళను గట్టుమీదికి జల్లి తీరం చేరాలి. చేరగానే కట్టుబత్తలను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని తెల్లటి పొడి మది వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ పున్ద్రాలను ధరించి, సంధ్యావందనం, గాయత్రీ జపాలను ఆచరించాలి.

తర్వాత ఔపోసన చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తోటలోంచి తెచ్చిన మంచి తాజా పుష్పాలను, శంఖ చక్రదారి అయిన విష్ణువును సాలగ్రామంలో ఉంచి భక్తితో షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణం చదివి గానీ విని గానీ స్వగృహం చేరి దేవతార్చన చేసి భోజనం చేయాలి. ఆపైన ఆచమించి పునః పురాణ కాలక్షేపం చేయాలి.

సాయంకాలం కాగానే ఇతర పనులన్నిటినీ విరమించుకుని శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను వెలిగించి, దేవుని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిణి స్తుతించి నమస్కరించుకోవాలి.

కార్తీకమాసం అంతా ఇలాగే వ్రతాన్ని చేసినవారు పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగావయో బేధరహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే, వాళ్ళు మొక్షార్హులు కావడం నిస్సంశయం.

జనకరాజా! తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా, ఇతరులు చేస్తుండగా చూసి, అసూయారహితుడై ఆనందించేవారికి ఆరోజు చేసిన పాపాలన్నీ విశ్నుక్రుపాగ్నిలో ఆహుతైపోతాయి.

కార్తీక సోమవార వ్రతం

వశిష్ఠ ఉవాచ 

హే జనకమహారాజా! వినినంత మాత్రంచేతనే మనోవాక్కాయకర్మల ద్వారా చేసిన సర్వ పాపాలనూ హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను.. ఈ కార్తీకమాసంలో శివునికి ఇష్టమైన కార్తీక సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజయినా సరే స్నాన, జపాడులను ఆచరించినవారు వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు. ఈ సోమవారా వ్రాత విధి 6 రకాలుగా ఉంది.

1.ఉపవాసం

2. ఏకభక్తం

3. నక్తం

4.అయాచితం

5.స్నానం

6. తిలాపాపం

1. ఉపవాసం

చేయగలిగిన వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంగా ఉంది, సాయకాలం శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరం తులసితీర్థం మాత్రమే సేవించాలి.

2. ఏకభక్తం

సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానజపాదులు యథావిధిగా ముగించి, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్ధమో తులసి తీర్ధమో తీసుకోవాలి.

3. నక్తం

పగలంతా ఉపవాసం ఉంది, రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ తీసుకోవాలి.

4. అయాచితం

భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయాలి. దీన్నే అయాచితం అంటారు.

 

5. స్నానం

పైన సూచించిన వాటికి వేటికీ శక్తి లేనివారు సమంత్రక స్నానజపాదులు చేసినట్లయితే సరిపోతుంది.

6. తిలాపాపం

 

మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

పై ఆరు పద్ధతుల్లో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ, తెలిసి ఉండి కూడా ఏ ఒక్క పద్ధతినీ ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుమ్బీపాక రౌరవాది నరకాలని పొందుతారని ఆర్షవాక్యం. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనాధలు, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడూ కూడా పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భాగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు.

సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను, వినండి.

నిష్టురి కథ

పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి ''నిష్టురి'' అనే కూతురు ఉండేది. ఆమె అందంగా, ఆరోగ్యంగా, విలాసంగా ఉండేది. అయితే సద్గుణాలు మాత్రం లేవు. అనేక దుష్ట గుణాలతో గయ్యాళిగా, కాముకురాలిగా ఉండే ఈ నిష్టురిని ఆమె చెడ్డ గుణాలకారణంగా ''కర్కశ'' అని పిలిచేవారు.

నిష్టురి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కాషను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైణ మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్ళి జరిపించి, చేతులు దులుపుకున్నాడు. మిత్రశర్మ చదువు, సదాచారాలు ఉన్నవాడు. సద్గుణాలు ఉన్నాయి. సరసమూ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు కావడాన కర్కశ ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ, కొడుతూ ఉండేది. అయినప్పటికీ భార్యపై మనసు చంపుకోలేకపోయాడు. పైగా పరువు పోతుందని ఆలోచించాడు. కర్కశ పెట్టే బాధలన్నీ భరించాడే తప్ప, ఆమెను ఎన్నడూ శిక్షించలేదు. ఆమె ఆఖరికి పర పురుషులతో సంబంధం పెత్తుకుని౮ భర్తను, అతని తల్లితండ్రులను హింస పెట్టేది.

ఒకరోజు ఆమెతో నేస్తం చేసిన ఒక దుర్మార్గుడు ''నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం'' అంటూ రెచ్చగొట్టగా ఆ రాత్రి కర్కశ భర్త నిద్రిస్తుండగా బండరాతితో తల పగలగొట్టి చంపింది. శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె దుర్గుణాలు, దుష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనకుండా, తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.

అంతటితో కర్కశ మరీ రెచ్చిపోయింది. కామంతో కన్నుమిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది. పైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగింది. చివరికి ఆమె జబ్బులపాలయింది. పూవు లాంటి శరీరం పుళ్ళతో జుగుప్సాకరంగా తయారైంది. విటులు అసహ్యంతో రావడం తగ్గించారు. సంపాదన పోయింది. అప్పటిదాకా భయపడినవారంతా ఆమెను అసహ్యించుకోసాగారు. ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు. చివరికి తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఒంటినిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుంది. యమదూతలు ఆమెను నరకానికి తీసికెళ్ళి శిక్షించారు.

భర్తను హింసించిన కర్కశకు భయానక నరకం

భర్తను విస్మరించి, పర పురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమెను మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలి. ముళ్ళ గదలతో తల పగిలేట్లు కొట్టారు. రాతిమీద వేసి చితక్కొట్టారు. సీసం చెవుల్లో వేశారు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె చేసినా పాపాలకు గానూ ముందు పది తరాలు, వెనుక పది తరాలు, ఆమెతో కలిసి 21 తరాలవాళ్ళను కుంభీపాక నరకానికి పంపారు. ఆ తర్వాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది.

సోమవార వ్రత ఫలంవల్ల కుక్క కైలాసం చేరుత

ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుదు పగలు ఉపవాసం ఉండి, శివాభిభిషేకం మొదలైనవి చేసి, నక్షత్ర దర్శనానంతరం నకట స్వీకారానికి సిద్ధపడి, ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆరోజంతా ఆహారం దొరకక పస్తు ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వల్ల డానికి పూర్వ స్మృతి కలిగి ''ఓ విప్రుడా! నన్ను రక్షించు'' అంటూ మూలిగింది. ఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడటాన్ని చూసి విస్తుపోతూనే ''ఏం తప్పు చేశావు.. నిన్ను నేను ఎలా రక్షించగలను?!'' అనడిగాడు.

అప్పుడు కుక్క ''ఓ బ్రాహ్మణుడా! పూర్వజన్మలో నేనొక విప్ర వనితను. కామంతో ఒళ్ళు తెలీక జారత్వానికి ఒడికట్టాను. పతితను, భ్రష్టను అయి, భర్తను కూడా చంపాను. ఆ పాపాలవల్ల నరకానికి వెళ్ళాను...'' అంటూ మొదలుపెట్టి అంతా వివరంగా చెప్పింది. చివరికి నాకు ఇలా పూర్వ జన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటంలేదు.. దయచేసి చెప్పు..'' అంది.

బ్రాహ్మణుడు జ్ఞాన చక్షువుతో తెలుసుకుని ''శునకమా! ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకూ పస్తు ఉండి నేను విడిచిన బలి భక్షణం చేశావు కదా. అందువల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగింది..'' అన్నాడు.

దానికి కుక్క ''కరుణామయుడివైన ఓ బ్రాహ్మణా! నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పు'' అని అడిగింది.

దయాళుడైన భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే కుక్క తన శునక దేహాన్ని వదిలి దివ్య స్త్రీ సరీరిని అయి, ప్రకాశ మానహార వస్త్ర్ర విభూషిత అయి, పితృ దేవతా సమంవితయై కైలాసం చేరింది. కనుకనే ఓ జనక మహారాజా! నిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు'' అంటూ చెప్పాడు వశిష్టుడు.


Kartika Puranam, Kartika Maha Puranam, Kartika Puranam brings Punya, Kartika Puranam Hindu Tradition, Kartika Puranam Hindu Culture


సంపూర్ణ కార్తీక మహా పురాణం రెండవ రోజు

సంపూర్ణ కార్తీక మహా పురాణం

రెండవ రోజు

Kartika Maha Puranam-2

బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. ''రాజా! ఈ కార్తీకమాసంలో స్నాన దాన జపాల్లో దేనినైనా, కొద్దిపాటిగా ఆచరించినా సరే.. అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే, సుఖలాలసులై శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరిన్చారో అలాంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.

పౌర్ణమ్యాం కార్తీకమాశ స్నానాందీస్తు నాచారాన్|

కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప||

క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః|

అత్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనం||

భావం:

కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాల్లో ఏ ఒక్కటీ కూడా ఆచరించనివాళ్ళు కోటి పర్యాయాలు చండాల జన్మలు ఎత్తి, చివరికి బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను వినండి..

తత్వనిష్ఠోపాఖ్యానం

పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యాలను పలకనివాడు, భూతదయ గల దయాళువూ, తీర్థాటనప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకసారి తీర్ధయాత్ర గురించి ప్రయాణిస్తూ దారిలో గోదావరీ తీరాన ఉన్న ఒకానొక ఎత్తయిన మర్రిచెట్టు మీద కారునలుపు శరీర ఛాయ గలవారు, ఎండిన డొక్కలు, ఎర్రని కళ్ళు, పెరిగిన గడ్డాలతో జుట్టు ఇనుప తీగల్లా పైకి పొడుచుకు నిటారుగా నిలబడిఉన్న తల వెంట్రుకలతో వికృత వదనాలతో కత్తులు, కపాలాలూ ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు.

ఆ రాక్షసులవల్ల భయంచేత మర్రిచెట్టు నాలుగువైపులా కూడా పన్నెండు మైళ్ళదూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండి చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దాంతోబాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడి శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు.

 తత్వనిష్ఠుడి శరణాగతి

 త్రాహి దేవేశ లోకేష త్రాహి నారాయణావ్యయ సమస్త భయవిధ్వంసిన్|

త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ! త్వట్టోహం జగదీశ్వర||

అంటే - ''దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివి అయినవాడా! నారాయణా! అవ్యయా! నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతం చేసేవాడా! నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను. నన్ను అన్నివిధాలా కాపాడు'' అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడినుంచి పారిపోసాగాడు. అతన్ని పట్టుకుని చంపాలనే ఆలోచనతో ఆ రాక్షసత్రయం అతని వెనుకే పరిగెత్తసాగింది. రాక్షసులు దగ్గరౌతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు ద్యోతకం అవడంవల్ల తెరిపి లేకుండా అతను హరినామాన్ని స్మరించడంవల్ల వెంటనే వారికి జ్ఞానోదయం అయింది. అదే తడవుగా బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్ళి దండప్రణామం చేసి, అతనికి తాము ఎలాంటి కీడు తలపెట్టామని నమ్మబలికి ''ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనంతో మా పాపాలు నసిమ్చిపోయాయి'' అని మళ్ళీ నమస్కరించారు.

వారి నమ్రతకు కుదుటపడిణ హృదయంతో తత్వనిష్ఠుడు ''మీరెవరు? చేయరాని పనులు ఏం చేసి ఇలా అయ్యారు? మీ మాటలు వింటే బుద్దిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరంగా చెప్పండి.. మీ భయాలు, బాధలు తొలిగే దారి చెప్తాను'' అన్నాడు.

ద్రావిదుని కథ

పారుని పలుకులపై, ఆ రాక్షసుల్లో ఒకడు తన కథను ఇలా వినిపించాడు.

''విప్రోత్తమా! నేను ద్రావిడిని. ద్రవిడ దేశంలోని మంధర అనే గ్రామాదికారిని. కావడానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలుడిని, వంచించే చమత్కారిగా ఉండేవాణ్ణి. ణా కుటుంబ శ్రేయస్సుకై అనేకమంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గానీ, బ్రాహ్మణులకు గానీ ఏనాడూ పట్టెడు అన్నం పెట్టలేదు. నయ వంచానలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంవల్ల ణా కుటుంబం నాతొ సహా ఏడు తరాలవాళ్ళు అథోగతి పాలయ్యారు.

మరణానంతరం దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడినయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు'' అన్నాడు. 

ఆంధ్రదేశీయుని గాథ

రెండవ రాక్షుసుడు ఇలా విన్నవించుకున్నాడు.

''ఓ బ్రాహ్మణోత్తమా! నేను ఆంధ్రుడిని. నిత్యం ణా తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ ఉండేవాడిని. నేను ణా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నం పెట్టేవాడిని. బాంధవ బ్రాహ్మణకోటికి ఎన్నడూ ఒక పూటయినా భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి గర్వంగా ఉండేవాడిని. చనిపోయిన తర్వాత నరకం చేరి ఘోరాతిఘోరమైన భాధలు అనుభవించి చివరికి ఇలా పరిణమించాను. ఆ ద్రావిడునికి మల్లేనే నాక్కూడా ముక్తి కలిగే మార్గం బోధించు''

పూజారి కథ

మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ''ఓ సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదెస బ్రాహ్మణుడిని. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని అయి పరుషంగా మాట్లాడేవాడిని. భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలను వేశ్యలకు ఇచ్చి, విష్ణు సేవలను సక్రమమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. చివరికి గుడి దీపాల్లో నూనెను కూడా దొంగిలించి, వేశ్యలకు ధారపోసి వారితో సుఖంగా గడిపేవాణ్ణి. పాపపుణ్య విచక్షణ తెలిసేది కాదు. నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన జన్మలూ ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుని అయ్యాను. ఓ విప్రుడా! నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు'' అని ప్రార్ధించాడు.

 బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట

తమ పూర్వ భవకృత అపరాధానికి ఎంతో పశ్చాత్తాపం చెందుతున్న రాక్షసులను చూసి విప్రుడు ''భయపడకండి. నాతొ కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలూ నశించిపోతాయి'' అని చెప్పి వారిని తన వెంట తీసికెళ్ళాడు.

అందరూ కలిసి కావేరీనది చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తాను స్వయంగా మున్ డు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. తర్వాత

అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్ధం |

అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే | |

అనే సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసి, తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులూ, దివ్యరూపులూ అయి, తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.

విదేహరాజా! అజ్ఞానం వల్ల కానీ, మోహ, ప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీకమాస సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వారికి నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసి కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో వీలు కాకపోతే గోదావరిలో లేదా మరెక్కడైనా సరే ప్రాతఃకాల స్నానం చేయాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానం చేయరో వాళ్ళు పది జన్మలు చండాలపు జన్మలు ఎత్తి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు.

కనుక ఎటువంటి మీమాంసలూ లేకుండా స్త్రీలు గానీ, పురుషులు గానీ కార్తీకమాసంలో తప్పక ప్రాతఃస్నానం చేయాలి.

అప్పుడు జనకుడు ''హే బ్రహ్మర్షీ! నువ్వు ఇంతవరకూ కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరిన్చాలో, ఏయే దానాలు చేయాలో కూడా తెలియజేయి'' అనడిగాడు.

వశిష్ట ఉవాచ

అన్ని పాపాలనూ హరించేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం అయిన విషయం. కార్తీక వ్రతం ఆచరించడం వల్ల నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అంత మహత్తరమైన ఈ వ్రత ధర్మాలను, తత్ఫలితాలను చెప్తాను విను.

 కార్తీకమాస సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము లభిస్తుంది. శివాలయ గోపురద్వారా, శిఖరాలయందు గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఎవరయితే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతి, తో కా, నీ విప్ప నారింజ నూనెలతో గానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలౌటారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించినవాళ్ళు అత్యంత పుణ్యవంతులౌతారు. కాంక్షతో గానీ కనీసం నలుగురి నడుమా బడాయి కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులౌటారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను.

దీపారాధన మహిమ

పూర్వం పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజు కుబేరుని మించిన సంపదలు ఉన్నప్పటికీ, కుమారులు లేని కారణంగా కుంగిపోయి, కురంగపాణికై తపస్సు చేశాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని ''ఓ రాజా! ఈ మాత్రం కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీకమాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి, బ్రాహ్మణులను దీప దాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది'' అని చెప్పాడు. ఋషి వాక్యం శిరోధార్యంగా భావించి ఆ పాన్చాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి, శివప్రీతికై బ్రాహ్మణులకు దీప దానములు చేశాడు. తత్ఫలితంగా మహారాణి నెల తప్పి, యుక్తకాలంలో మగ శిశువును ప్రసవించింది. రాజా దంపతులు ఆ శిశువుకు ''శత్రుజిత్తు'' అని పేరు పెట్టారు.

శత్రుజిత్తు చరిత్ర

శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి, యువకుడై, వీరుడై వేశ్యాంగనా లోలుడై ఇంకా తృప్తి చెందక పర స్త్రీ అనురక్తితో యుక్తాయుక్త విచక్షణ లేక విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు. హితవు చెప్పేవారిని చంపుతానని బెదిరిస్తూ పరమ హీనంగా జీవిస్తున్నాడు. ఇలా ఉండగా ఒక మహా సౌందర్యరాశి అయిన విప్రుని భార్యను చూసి మోహితుడయ్యాడు. ఆమె కూడా ఈ యువరాజు పట్ల మోజుపడింది.

భర్త నిద్రించగానే ఆమె రాజు రమ్మన్న సంకేత స్థలానికి వచ్చేది. ఇద్దరూ ఆనందించేవారు. ఒకరోజు భర్తకు విషయం తెలిసిపోయింది. కానీ, ఆ విప్రుడు పైకి ఏమీ తెలీనట్లు ఉన్నాడు. ఇద్దరూ కలిసుండగా చూసి చంపాలి అనుకుని కత్తి చేతబట్టి తిరుగుతున్నాడు. వారికి ఈ సంగతి తెలీదు. ఒక కార్తీక పౌర్ణమినాడు సోమవారం కలిసివచ్చింది. ఆవేళ కాముకులిద్దరూ సురత క్రీడలకై పాడుపడ్డ శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. ఆలయంలో చీకటిని పోగొట్టేందుకు విప్ర స్త్రీ తన చీర కొంగును చింపి, ఒత్తిని చేసింది. రాజు ఆముదం తెచ్చి అక్కడున్న ఖాళీ ప్రమిదలో పోశాడు. మొత్తానికి దీపం వెలిగించారు. ఇక ఇద్దరూ ఏకమయ్యారు.

విప్రుడు అక్కడికొచ్చి, వారిద్దర్నీ చంపేసి, తాను కూడా కత్తితో పొడుచుకుని చనిపోయాడు. అటు యమదూతలు, ఇటు శివ దూతలూ కూడా వచ్చారు. శివదూతలు విప్ర స్త్రీని, రాజును కైలాసానికి తీసికెళ్ళారు. యమదూతలు విప్రుని నరకానికి లాక్కేళుతుంటే అతను ఆక్రందన చేస్తూ ''పాపం చేసినవారికి కైలాసం, నాకేమో నరకమా?'' అన్నాడు. అందుకు యమదూతలు ''వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి. పైగా సోమవారం. ఏ కారణం అయితేనేం దీపం వెలిగించారు. అందునా ఆలయంలో వెలిగించారు. కనుక పుణ్యాత్ములయ్యారు. అలాంటివారిని చంపి నువ్వు పాపాత్ముడివి అయ్యావు. అందుకే వారికి కైలాసం, నీకు నరకం'' అన్నారు.

బ్రాహ్మణుడికీ, శివదూతలకు జరిగిన సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని ''అయ్యా, దోషం చేసింది మేము. మాకు కైవల్యం ఇచ్చి, ఈ పుణ్యదినాన మమ్మల్ని చంపి, మాకు స్వర్గప్రాప్తి కలగాజేస్తున్న అతన్ని నరకానికి పంపడం భావ్యం కాదు.

కార్తీకమాసం గొప్పది అయితే, సోమవారం ఇంకా పుణ్యమైంది అయితే, దీపారాధన మరీ పుణ్యప్రదమైంది అయితే మాతోబాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణునికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు'' అని వాదించాడు. ఫలితంగా శత్రుజిత్తు తానూ, తన ప్రేయసి చేసిన ఒత్తులు, ఆముదం పుణ్యం తాము ఉంచుకుని, దీపం వెలిగించిన పుణ్యాన్ని విప్రునికి ధారపోయగా అతన్ని కూడా దూతలు కైలాసానికి తీసికెళ్ళారు.

కనుక, ఓ మిధిల నగరాధీశ్వరా! కార్తీకమాసంలో తప్పనిసరిగా శివాలయంలో గానీ, విష్ణుఆలయంలో గానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందగల్గుటారు. అందునా శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీకమాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి''

 

Kartika Masa Vratam, Kartika Maha Puranam Parayanam, Kartika Somavaram vratam, Kartika Puranam deepam, Kartika Purana in Shivalayam

 


కార్తీక మహా పురాణం మూడవరోజు

కార్తీక మహా పురాణం

మూడవరోజు '

 

'ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నిటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీకమాస వ్రతానికి మాత్రమే ఉండి. కార్తీకమాసంలో విష్ణు సన్నిధిని ఎవరయితే భగవద్గీతగా పారాయణ చేస్తారో, వారి పాపాలన్నీ పాము కుబుసంలాగా తొలగిపోతాయి. వైకుంఠానికి క్షేత్ర పాలకులౌటారు. ఎవరయితే కార్తీకమాసంలో తులసీదళాలతో గానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలు అనుభవిస్తారు. ఈ కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే ఏ పూరాణాన్ని అయినా సరే ప్రవచించేవారు సర్వ కర్మ బంధ విముక్తులౌతారు.

 

 

 

 

 

 

కార్తీక వనభోజనాలు 

 

యః కార్తీకే సైట్ వనభోజన మాచరేత్ | 

 

నయాతి వైష్ణవం ధామ సర్వ పాపైః ప్రముచ్యతే|| 

కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనం చేసినవారు పాప విముక్తులై విష్ణు దామాన్ని పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర చందాలాదుల సంభాషణలను విన్న పాపం తుడిచిపెట్టుకుపోతుంది.

 కనుక మహారాజా!కార్తీకమాశ శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరిచెట్టు కింద సాలగ్రామం ఉంచి గాంధ పుష్పాక్షతలతో పూజించి, యధాశక్తి బ్రాహ్మణులణు ఆహ్వానించి గౌరవించి, వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీకమాసంలో వనభోజనాన్ని ఎవరయితే నిర్వహిస్తారో, వారు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచీ విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారు. 

ఓ జనక మహారాజా! ఈ కార్తీక మహత్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణుదు దుర్యోనీ సంకటం నుండి రక్షించబడ్డాడు. ఆ కథ చెప్తాను, విను.

 

దేవదత్తోపాఖ్యానం 

పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుదు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైణ కొడుకు పుట్టాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతన్ని పాపవిముక్తుడిని చేయాలని సంకల్పించి ''నాయనా! రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలం హరి సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు. ఇలా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి అవ్వు'' అని చెప్పాడు. కానీ ఆ కొడుకు తాను అటువంటి కట్టు కథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని చేయనని చెప్పాడు. అందుకు తండ్రి దేవశర్మ బాధపడుతూ, ''అడవిలో చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు'' అని శపించాడు. శాపానికి భయపడిణ ఆ కొడుకు తండ్రి కాళ్ళమీద పడి తరుణోపాయం చెప్పమని కోరగా ఆయన ''బాబూ! నువ్వు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని పూర్తిగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది'' అని శాపవిముక్తి అనుగ్రహించాడు.

 


కార్తీక మహా పురాణం నాలుగో రోజు

కార్తీక మహా పురాణం

నాలుగో రోజు

''ఓ జనకరాజా! పవిత్రమైన కార్తీకమాసంలో పుష్పార్చన, దీపారాధనల గురించి చెప్తాను విను.

పుష్పార్చనా ఫలదానా దీపారాధన విశేషాలు

కార్తీకమాసంలో కమలనాభుడైణ శ్రీహరిని కమలాలతో పూజిస్తే కమలంలో నివసించే లక్ష్మీదేవి ప్రసన్నురాలై, భక్తుల ఇళ్ళలో నివాసం ఏర్పరచుకుంటుంది. తులసిదళాలతో గానీ, జాజిపూలతో గానీ మారేడు దళాలతో గానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మ ఎత్తరు. మోక్షం పొందుతారు. కార్తీకమాసంలో ఫలాలను దానం చేస్తే వారు చేసిన పాపాలు సూర్యోదయానికి చేకటిళా చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని కన్నెత్తి చూడటానికి యముడికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారిని మించిన ధన్యులు ఉండరు.

బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువుళా ఆనందిస్తారు. ఎవరైతే కార్తీకంలో విష్ణు ఆలయమ్లో మావిడాకుల తోరణం కడతారో, వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పూలతో, అరటి స్తంభాలతో మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారి అయినా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేసినవారు అశ్వమేధ పుణ్యవంతులు అవుతారు. విష్ణువుకు ఎదురుగా జప, హోమ దేవతార్చనలు చేసేవారు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడి బట్టలతో ఉన్నవానికి పొడి బట్టలు దానం చేసినవారు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు. ఆలయ శిఖరం పై ధ్వజారోహణం చేసినవారి పాపాలు గాలికి పుష్ప పరాగం వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరి పూజను చేసినవారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీకమాసంలో ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి, పంచ రంగులతో, శంఖ, పద్మ, స్వస్తికారి నందా దీపాన్ని సమర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయినోళ్ళ ఆదిశేషుడు కూడా పొగడలేడు.

కార్తీకమాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై, అన్త్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిణి మల్లెపూలతో పూజించిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యాన్ని చేసినవారి పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమై పోతాయి. భక్తియుక్తులై అన్నదానం చేసేవారి పాపాలు గాలికి మంచుతునకల్లా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీకమాసంలో నువ్వుల దానం, మహానదీ స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం - ఈ నాలుగూ ఆచరించడం ధర్మంగా చెప్పారు. స్నాన దానాడులను ఆచరించని లోభులు నూరు జన్మలు కుక్కలుగా పుట్టి, చివరికి చండాలునిగా పుడతారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి, తదుపరి నూరు జన్మలు శునకంగా పుడతారు.


కార్తీక మహా పురాణం ఐదవ రోజు

కార్తీక మహా పురాణం

ఐదవ రోజు

యమదూతల ప్రశ్నలకు విష్ణుదూతలు చిరునవ్వు నవ్వి, ''ఓ మయదూతలారా! మేం విష్ణుదూతలం. మీ ప్రభువు మీకు విచించిన ధర్మాలేమిటి? ఎవరు పాపాత్ములు, ఎవరు పుణ్యాత్ములు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులంగా చెప్పండి'' అన్నారు.

అందుకు యమదూతలు ''సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యళు దశదిశా కాలాలనూ మనుషులు చేసే పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేం శిక్షిస్తాం. ఓ విష్ణు దూతలారా! శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్చాచారులూ, సాధుజన బహిష్క్రుతులూ యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడూ, అసత్యవాది, జంతుహింస చేసేవాడు, దానం చేసినదాన్ని తిరిగి ఆశించేవాడూ, దాంబికుడు, దయారహితుడూ, పర భార్యా సంగముడు, పక్షపాత వైఖరి చూపేవాడు, చేసిన దానాన్ని చెప్పుకునేవాడు, మిత్ర ద్రోహి, కృతఘ్నుడు, తోటివారిని చూసి ఏడ్చేవాడూ, కన్యాశుల్కంతో జీవించేవాడూ, వాపీకూప తటాకాది నిర్మాణాలను ఆటంకపరిచేవాడు, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచినవాడు, కేవలం భోజనం గురించి ఆలోచించేవాడూ, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాడూ, నిత్యం స్నాన సంధ్యాడులను విడిచినవాడు, బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడతారు.


కార్తీక మహా పురాణం ఆరవ రోజు

కార్తీక మహా పురాణం (ఆరవ రోజు)

 Karthika Maha Puranam- 6

వశిష్ట ఉవాచ

''ఓ మహారాజా! కార్తీకమాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో, వారికి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ, కుశాలతోనూ పోజించేవారు పాపవిముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్ర వర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాచరణం చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవారు, వైకుంఠ పురాణ పాఠకులూ, శ్రోతలూ కూడా విగత పాపులై పరమపదాన్ని చేరతారు. ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలను నశింపచేసేదీ, ఆయురారోగ్య దాయినీ అయిన ఒక కథణు వినిపిస్తాను, విను.

మంధరోపాఖ్యానం

కళింగ దేశీయుడైన మంధరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నిటినీ విసర్జించి, పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వ సాముద్రికాది శుభ లక్షణాలతో సంపన్న, సద్గుణ సముచ్చయంచేత ''సుశీల'' అనే పేరున్న భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడు అయినా కూడా, అతనియందు రాగమే తప్ప ద్వేషం లేకుండా పాత్రివ్రత్య నిష్ఠ పాటిస్తూ ఉండేది.

కొన్నాళ్ళ తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగాతుడై, ఖడ్గపాణిఅయి, దారులు కాచి, బాటసారులను కొట్టి, వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగసొత్తుణు ఇరుగుపొరుగు దేశాలకు తీసికెళ్ళి, అమ్మి, ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికి దారి కాచి ఉన్న మంధరుడు దానిన వెళ్తున్న ఒక బ్రాహ్మణుని పట్టుకుని, అక్కడి మర్రిచెట్టుకు కట్టేసి, అతని వద్ద ఉన్న ధనాన్ని దోచుకున్నాడు.

ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైణ ఒక కిరాతకుడు ధనం దోచుకున్న మంధరుని, ధనం పోగొట్టుకుని బంధీగా ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దర్నీ చంపి, ధనాన్ని హరించుకుపోయాడు. కానీ, అదే సమయానికి అక్కడి కిరాత, మంధర, బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనణు పసిగట్టిన పులి వచ్చింది. కిరాతుడు దానితో కలబడ్డాడు.కొద్దిసేపటికి పులి, కిరాతుడు ఇద్దరూ చనిపోయారు.

అలా మరణించిన విప్రుడు, మంధరుడు, వ్యాఘ్ర, కిరాతకులు నలుగురూ యమలోకం చేరి, కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమ కింకరులు నలుగురినీ పురుగులూ, అమేత్యంతో నిండిన తప్త రక్త కూపంలో పడేశారు.

ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలీని మంధరుని భార్య సుశీల మాత్రం నిత్యం అతన్నే ధ్యానిస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవిన్చాసాగింది. ఒకరోజు నిరంతర హరినామ సంకీర్తనా తత్పరుడు, సర్వుల యందు భగవంతుని దర్శించేవాడూ, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి బిక్ష వేసి ''అయ్యా! నా భర్త కార్యార్ది అయి వెళ్ళాడు. ఇంట్లో లేదు. నేను ఏకాకిని ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను'' అని విన్నవించుకుంది.

అందుకా యతి ''అమ్మాయీ, బాధపడకు. ఈరోజు కార్తీక పూర్ణిమ. ఇది మహా పర్వదినం. ఈరోజు సాయంకాలం నీ ఇంట్లో పురాణ పఠన, శ్రవణాదులు ఏర్పాటు చేయి. అన్డుగ్గానూ ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గరుంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే, దీపం వెలిగించవచ్చు'' అన్నాడు.

ఆ యతిశ్రేష్టుని మాటలకు సరేనని, సుశీల తక్షణం గోమయంతో ఇల్లంతా అలికి, పంచరంగుల ముగ్గులను పెట్టింది. పత్తిని శుభ్రం చేసి, రెండు వత్తులు చేసి, యతీస్వరుని వద్ద ఉన్న నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది.

యతి, దీప సహితంగా విష్ణువుణు పూజించి, మనశ్శుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇళ్ళకు వెళ్ళి, వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి మధ్యలో తాను కూడా ఏకాగ్ర చిత్తఅయి ఆ పురాణాన్ని వింది. తర్వాత ఆమెకు శుభాశీస్సులు అందించి యతీస్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరి సేవనం వల్ల క్రమక్రమంగా ఆమె జ్ఞానిఅయి తదుపరి కాలధర్మం చెందింది.

తక్షణం శంఖ చక్రాంకితులు, చతుర్భాహువులు, పద్మాక్షులు, పీతాంబరదారులు అయిన విష్ణుదూతలు నందనవన, సుందర మందారాది సుమాలతో, రత్నమౌక్తిక ప్రవాళాదులతో నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళ్తున్న సుశీల మార్గమద్యంలో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి, విమానాన్ని ఆపించి, అందుక్కారణం ఏమిటో తెల్లియజేయమని విష్ణు దూతలను కోరింది.

అందుకు వారు ''అమ్మా! నీ భర్త అయిన మంధరుదు, విప్రుడు అయినప్పటికీ వేదాచారాలను మరచి కూలియై, మరి కొన్నాళ్ళు దొంగ అయి, దుర్మార్గుడై, ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్ర ద్రోహి. మిత్రుని చంపి అతని ధనంతో పర దేశాలకు పారిపోతూ నీ భర్తచేత బంధితుడయ్యాడు. అతని పాపాలకు గానూ అతడు నరకం పొందాడు. మూడవవాడూ కిరాతకుడు. బంధితుడైణ ఆ బ్రాహ్మణుని, నీ భర్తణు కూడా చంపి పాపానికి ఒడికట్టి, నరకం చేరాడు. ఇక నాల్గవ జీవి ఒక పులి. ఆ పులి అంతఃపూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశినాడు భక్ష్యా భక్ష్య విచక్షణా రహితుడై ఆచరించిణ తైలాదిక భోజనాల వలన నరకం పొంది, పులిగా పుట్టి, చివరికి కిరాతకుడితో పోరి, నరకం చేరింది. వీరి నరక యాతనకు కారణాలు ఇవి'' అని వివరంగా చెప్పాడు.

అప్పుడు సుశీల విష్ణు దూతలను చూసి ''ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పండి'' అని కోరింది.

దూతలు ''కార్తీకమాసంలో నువ్వు ఆచరించిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వల్ల నీ భర్త, పురాణ స్రవనార్ధమై నువ్వు ఇంటింటికీ వెళ్ళి ప్రజలను పెలిచిన పుణ్యాన్ని ధారబోయడం వల్ల మిత్ర ద్రోహి అయిన ఆ విప్రుడు, పురాణ స్రవనార్ధమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని చేరి సగంగా ధారపోయడంవల్ల కిరాత, వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తి పొందుతాయి'' అంటూ వివరించారు.

అలా వాళ్ళు చెప్పగానే సుశీల ఆయా పుణ్యాలను ధారబోయడంతో ఆ నలుగురూ నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలణు వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహా జ్ఞానులు పొందే ముక్తి పథానికి వెళ్ళగలిగారు.

కనుక జనక మహారాజా! కార్తీకమాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకాన్ని తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో!

 ద్వాదశాధ్యాయం (వశిష్ట ప్రవచనం) 

వశిష్టుడు ఇంకా జనకునికి ఇలా చెప్పసాగాడు.

''ఓ రాజా! కార్తీకమాసంలో వచ్చే సోమవార మహత్యాన్ని విన్నావు కదా! ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వందరెట్లు, కార్తీక పూర్ణిమ వెయ్యిరెట్లు, శుక్ల పాడ్యమి లక్షరెట్లు, శుక్ల ఏకాదశి కోటిరెట్లు, ద్వాదశి లెక్కకు అందనంత అనంతమైన ఫలాలను ఆదనంగా ప్రసాదిస్తాయి.

ఏ కారణం చేతనైనా సరే శుక్ల ఏకాదశినాడు ఉపవాసం ఉండి, మర్నాడు అంటే ద్వాదశినాడు బ్రాహ్మనయుక్తులై పారాయణ చేసేవారు మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు అన్నదానం చేసినవారికి సమస్త సంపదలూ అభివృద్ధి చెందుతాయి. రాజా సూర్యగ్రహణ సమయంలో గంగాతీరంలో కోటిమంది బ్రాహ్మణులకు అన్నసమారాధన చేయడంవల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యమూ కేవలం కార్తీకద్వాదశినాడు ఒక్క బ్రాహ్మణునికి భోజనం పెట్టడంవల్ల కలుగుతుంది. వేయి గ్రహణపర్వాలు, పదివేల వ్యతీపాత యోగాలూ, లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పహారవ వంతు కూడా చేయమని తెలుసుకో. మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నయినా ఉండవచ్చును గాక.. వాటన్నిటి కంటే కూడా సాక్షాత్తూ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు.

ద్వాదశి దానములు

కార్తీక శుద్ధ ద్వాదశినాడు క్షీర సాగరం నుండి శ్రీహరి నిద్ర లేస్తాడు. అందువల్ల దీనికి హరిబోధినీ ద్వాదశి అనే పేరు వచ్చింది. ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో, వాళ్ళు ఇహలోకంలో భోగానుసేవనాన్ని, పరలోకంలో భోగిశయనామ సేవనాన్నీ పొందుతారు. కార్తీక ద్వాదశినాడు పెరుగుతో కూడిన అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పారు. ఎవరైతే ఈ ద్వాదశినాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కలూ, బంగారు కొమ్మలతో అలంకరించి, పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో, అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్దాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చేరుతారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఓ మహారాజా! ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశినాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్నీ దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెప్తాను, విను.

  ధర్మవీరోపాఖ్యానం

పూర్వం గోదావరీ తీరంలో దురాచారవంతుడూ, పరమ పిసినారి అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లుబ్దుఁడు దానధర్మాలు చేయకపోవడమే కాకుండా తాను కడుపునిండా తిననైనా తినకుండా ధనం కూడబెట్టేవాడు. ధనదాన్యాలనే కాదు, కనీసం ఎవరికీ మాట సాయం కూడా చేసేవాడు కాదు. రోజూ ఇతరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై జీవించే ఈ పిసినారి ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకూ ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు.

ఒకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి, తాను ఇచ్చిన బాకీని వెంటనే వడ్డీతో చెల్లించమని పట్టుబట్టాడు. అందుకు, బ్రాహ్మణుడు ''అయ్యా! నీ బాకీ ఎగ్గొట్టేవాడిని కాను. ఎందుకంటావేమో..

 

యో జీవతి రుణీనిత్యం నియమం కల్పమశ్నుతే |

పశ్చాత్తస్యసుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి ||

''ఎవరయితే రుణం తీర్చకుండానే పోతాడో, అతను మరుజన్మలో రుణదాతకు సంతు రూపంగా జన్మించి ఈ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివరికల్లా నీ రుణం చేల్లిస్తాను. అంతవరకూ ఆగు'' అని చెప్పాడు.

ఆ బ్రాహ్మణ వచనాలను మాయమాటలుగా, తనను చిన్నబుచ్చడానికి చెప్పిన మాటలుగా భావించి, ''నీ కబుర్లు నా దగ్గర కాదు. నీ బాకీ వసూలు చేయకుండా ఇంకా నెలరోజులు ఆగే సమయం లేదు. మర్యాదగా ఇప్పుడే ఇవ్వు. లేదా ఈ కత్తితో పోడిచేస్తాను'' అన్నాడు.

నిజంగా తనవద్ద డబ్బు లేదని, వెంటనే తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి, బ్రాహ్మణుడి జుట్టు పట్టుకుని లాగి, నేలమీద పడేసి, కాలితో తన్నాడు. అయినా కసి తీరక కత్తితో పొడిచాడు. సింహపు పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైణ కోమటి కత్తివేటుకు బ్రాహ్మణుడు ప్రాణం కోల్పోయాడు. అంతటితో కోమటి తాను చేసిన హత్యానేరానికి గాను రాజు తనను దండిస్తాడు అనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి, గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా బ్రతగ్గలమే కానీ, గుట్టుగా ఉన్నంత కాలం బ్రతకలేం కదా! అలాగే కోమటి కూడా ఆయువు తీరి చనిపోయాడు. యమకింకరురు వచ్చి, ఆ కోమటిని నరకానికి తీసికెళ్ళారు.

జనకభూపతీ! ''రురువు'' లనే మృగాలచేత, వాటి శ్రుంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే ''రౌరవం'' అంటారు. ఈ కొమతిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలుచేయసాగారు.

ఇక భూలోకంలో ఆ లుబ్ధ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడు. అతను మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజా శ్రేయస్సుకై చెరువులు, నూతులు తవ్వించి తోటలు వేయించి, వంతెనలు కట్టించి పేదలకు పెళ్ళిళ్ళు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను, క్షుత్పీడుతులకు తరతమ బేధం లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నాడు.

Karthika Maha Puranam chapters, Karthika Puranam stories, Karthika Somavaram, Holy month Kartika masam, Kartika Dwadashi

 

 


సత్యభామ పూర్వజన్మ విశేషాలు

కార్తీక మహా పురాణం పదహారవ రోజు

సత్యభామ పూర్వజన్మ విశేషాలు

  Karthika Puranam – 16

సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైన శౌనకాది కులపతులు ''సూతమునీ! లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణం స్కందమునందే కాక పద్మపురాణాంతర వర్తితమై ఉంది. దాన్ని కూడా విశదపరచమని ప్రార్ధించగా మందస్మిత వదనుడైన సూతుడు ''మునులారా! వైకుంఠుని లీలా వినోదాలు, మహిమలు వినేవారికి, వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయేగానీ విసుగు కలిగించవు. భక్తిప్రపత్తులతో మీరు కోరాలేగానీ గురు ప్రసాదిత శక్త్యానుసారం వక్కాణిస్తాను, వినండి..

స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్టులవారు ఎలా ఈ మహత్యాన్ని బోధించారో, అలాగే పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణపరమాత్మ ముఖతః ఈ కార్తీకమాస విశేషాలన్నీ వివరించబడ్డాయి.  

పారిజాతాపహరణం

ఒకానొకప్పుడు నారదమహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి, కృష్ణునికిచ్చి ''శ్రీహరీ! నీ పదహారువేల ఎనిమిదిమంది భార్యల్లో, నీకు అత్యంత చాలా ఇష్టమైన ఆమెకి ఈ పువ్వు ఇవ్వు'' అన్నాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా ఇచ్చాడు.

ఈ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. 'ప్రియమైన భార్యకు ఇవ్వమంటే తనకు ఇవ్వాలే గానీ, ఆ రుక్మిణికి ఇవ్వడం ఏమిటి అని కోపించింది.

కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరట్లో పాదుకొలిపేదాకా ఊరుకోనని బెదిరించింది. సత్యభామ అలుక తీర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించిన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. కృష్ణుడు పారిజాత వృక్షాన్ని కోరగా, స్వర్గసంపద అయిన ఈ వృక్షాన్ని భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు ఒప్పుకోలేదు. దాంతో ఇంద్ర, ఉపేంద్రుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు దేవేంద్రుడు తగ్గి, పారిజాత వృక్షాన్ని యాదవేంద్రునికి సమర్పించాడు. దానవాన్తకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సాత్రాజితీ నివాసంలో ప్రతిష్టించాడు. అందుకు ఎంతో సంతోషించిన సత్యభామ పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ''ప్రాణప్రియా! నేను ఎంతయినా ధన్యురాలీని. నీ పదహారు వేళ ఎనిమిదిమంది సఖుల్లో నేనే నీకు ఎక్కువ ప్రియతమను కావడంవల్ల నేను ధన్యురాలిని అయ్యాను.అసలీ జన్మలో నీ అంతటివాడికి భార్యను కావడానికి నీతోబాటు గరుడారూఢవై బొందెతో స్వర్గసందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్పవృక్షం (పారిజాతం) నా పెరటిమొక్కగా ఉండటానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదునికి ధారపోసినా అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదంతో తాడించినా నువ్వు మాత్రం నామీద నువ్వుగింజ అంత కోపం కూడా చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే అందుకు నేను గతజన్మలో చేసిన పుణ్యమే కారణం. నిన్ను ఇకముందు జన్మల్లో కూడా ఎడబాయకుండా ఉండాలంటే ఇప్పుడు నేనింకా ఏం చేయాలి?'' అంది.

అందుకు ముకుందుడు మందహాసం చేసి ''ఓ భామా! నువ్వు నన్ను కోరరానిది కోరినా, ఇవ్వలేనిదాన్ని ఆశించినా కూడాల్ ఆ వాంఛలను నెరవేర్చి నిన్ను సంతృప్తురాలీని చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే'' అంటూ ఇలా చెప్పసాగాడు.

సత్యభామ పూర్వజన్మం

కృతయుగాంతంలో ''మాయా'' అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేకలేక పుట్టిన ఆడపిల్ల గుణవతి. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని, తన శిష్య పరంపరలోని వాడే అయిన ''చంద్రుడు'' అనేవానితో పెళ్ళి జరిపించాడు దేవశర్మ.

ఒకరోజు మామ, జామాతలిద్దరూ కలిసి సమిధలను, దర్భలను తెచ్చుకునేందుకు అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు అయిన వారిని మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గానీ, గాణాపత్యులుగానీ, సౌరవ్రతులు గానీ, శాక్తేయులు గానీ - వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై తుదకు సముద్రాన్ని చేరినట్లుగా నన్ను చేరుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో దేవదత్తుని లాగా నేనే వివిధ నామ రూప క్రియాదులతో అయిదుగా విభజించబడి ఉన్నాను. అందువల్ల మరణించిన మామా అల్లుళ్ళను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజస్సమకాంతులతో ఆ ఇరువురి జీవాలూ వైకుంఠం చేరి, విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి.

గుణవతి కథ

పితృభర్తృ మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది. కానీ, పోయిన వారితో తను కూడా పోలేదు గనుకా, మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్ని అంతటినీ విక్రయించి తండ్రికి, భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేషజీవితాన్ని శేషశాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారులైన వారింట పుట్టి పెరిగిన కారణంగా బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది.

''సత్యా! పుణ్యగణ్యాలు, భుక్తిముక్తిదాయకాలు, పుట్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అనే సంగతి నీకు తులుసుకదా! కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా రోజూ ప్రాతఃస్నానం ఆచరించే వారి సమస్త పాపాలనూ నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసిపూజ చేసేవాళ్ళు వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు. విష్ణు ఆలయంలో శంఖం, పద్మం మొదలైన ముగ్గులు పెట్టి పూజించేవారు జీవన్ముక్తులౌతారు.

కార్తీకమాసం నెలరోజులూ లేదా కనీసం మూడు రోజులైనా పూజలు ఆచరించేవారు సర్వ దేవతలను ఆరాధించినవారౌతారు. ఇక పుట్టింది మొదలు జీవితాంతం పూజించేవారి పుణ్య వైభవాన్ని చెప్పడానికి సాధ్యం కాదు. అలాగే, ఆనాటి గుణవతి, విష్ణు ప్రియంకరులై ఏకాదశీ కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి, కొన్నాళ్ళ తర్వాత వయోభారం వల్ల శుష్కించి, జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదు అనే పట్టుదలతో నదికి వెళ్ళి, ఆ చలిలో కూడా నడుంలోతు నీళ్ళలో ఉండి స్నానంచేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుండి శంఖ చక్ర గదా పద్మాదులు చేతబూని, విష్ణుదూతలు పుష్పకవిమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీలచేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది.

 తర్వాత శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మేరకు దేవకీ గర్భాన ఇలా కృష్ణునిగా అవతరించాను. నాతొబాటే అనేకమంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మల్లో ''చంద్రుడు'' ఈ జన్మలో అక్రూరుడు అయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద, నామీద మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా.. అంతే సత్రాజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి కారణం పూర్వజన్మలో నువ్వు చేసిన కార్తీక వ్రత మహిమే తప్ప వేరు కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా, ఈనాడు నీ ఇంటావంటా కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను ''నారాయణేతి సమర్పయామి'' అంటూ జగత్పతినైన నాకే ధారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవు అయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకూ కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంతవరకూ నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితీ! నువ్వే కాదు, నీలాగా ఎవరయితే కార్తీక వ్రతానుష్టాన నిష్టులూ నా భక్తగరిష్టులూ అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థల్లో తత్కారణంగా, నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటారు.

రాగవతీ! ఒక్క రహస్యం చెప్తాను, విను. తపోదాన యజ్ఞాదికాలను ఎన్నిటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో పదహారోవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో.

పైన చెప్పినట్లుగా శ్రీకృష్ణప్రోక్తమైన తన పూర్వజన్మ గాధను, కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకితురాలిన ఆ పూబోణి తన ప్రియమైన విశ్వంభరుడికి వినయవిధేయతలతో ప్రణమిల్లింది.

Karthika Puranam and 30 Chapters, Karthika Puranam Holy Epic, Mukti or Salvation through Karthika Puranam, Karthika Puranam recited in Karthika Masam

 


కార్తీక మహా పురాణం ఏడవరోజు

 

కార్తీక మహా పురాణం ఏడవరోజు 

  కన్యాదాన ఫలం

   Karthika Puranam - 7  

వశిష్ఠ ఉవాచ

''రాజా! ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణాన్ని అనుసరించి కార్తీకమాసంలో ఆచరించవలసిన ధర్మాల గురించి చెప్తాను. ఏకాగ్రచిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వాటిని చేయకపోవడం వల్ల పాపం కలుగుతుంది. ఈ కార్తీక ధర్మాలన్నీ నా తండ్రి బ్రహ్మదేవుని ద్వారా నాకు తెలిశాయి. నీకు వాటిని వివరిస్తాను. జనకరాజా! కార్తీకంలో ప్రాతః స్నానం, యోగ్యుడైన బ్రాహ్మణ బాలునికి ఉపనయనం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం ముఖ్యంగా చేయాలి. ఈ నెలలో ఒడుగు చేయించి దక్షిణ సమర్పించడంవల్ల పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఇలా తమ ధనంతో ఉపనయనం చేసినపుడు, వటువు చేసే గాయత్రీ జపం వల్ల దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి. వంద రావిచెట్లు నాటిన్చినా, వంద తోటలు వేయించినా, వంద నూతులు, దిగుడు బావులు తవ్వించినా, పదివేల చెరువులు తవ్వించినా వచ్చే పుణ్యం ఎంతో, దానికి పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వల్ల కలిగే పున్యమ్లో పదహారో వంతుకు కూడా సమానం కాదు.

మాఘ్యాం వైమాధవేమాసిచోత్తమం మౌంజి బంధనం ||

కారయష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే ||

 కార్తీకంలో ఉపనయన దానం చేసి తర్వాత వచ్చే మాఘంలో గానీ వైశాఖంలో గానీ ఉపనయనం చేయించాలి. సాధువులూ, శ్రోత్రియులూ అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడంవల్ల అనంత పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు అందరూ చెప్పారు. అలాంటి ఉపనయనానికి కార్తీకమాసంలో సంకల్పం చెప్పుకుని ఫలానావారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను - అని వాగ్దానం చేయడంవల్ల కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో.

 జనకరాజా! ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ, బ్రాహ్మణ సమారాధనలు వల్ల కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది. కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనంతోబాటు పెళ్ళి కూడా చేయించడంవల్ల పుణ్యం ఇనుమడిస్తుంది.

 కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్భక్తి ౭తోనఘ | 

స్వయంపాపై ర్వినిర్ముక్తః పితృణాం బ్రాహ్మణపదం ||

కార్తీకంలో కన్యాదానం ఆచరిరించినవాడు స్వయంగా తాను తరించడమే గాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడౌతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసం చెప్తాను విను. 

సువీరోపాఖ్యానం

 ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడికన్నుల వంటి సోగ కన్నులుగల సుందరాంగి అతని భార్య. దైవయోగంవల్ల సువీరుడు, దాయాదులు రాజ్యభ్రష్టుని చేయగా, భార్యతో సహా అడవులకు పారిపోయి, కందమూలాలతో కాలక్షేపం చేయసాగాడు.

ఇలా ఉండగా అతని భార్య గర్భం దాల్చింది. రాజు నర్మదాతీరంలో పర్ణశాల నిర్మించాడు. అందులో రాణి చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలూ శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలతో బతుకుతున్న రోజుల్లో కడుపు పంది సంతానం కలిగి, పోషించలేని స్థితి రావడం ఏమిటని పురాకృత కర్మలను నిందించుకుంటూ కూతుర్ని పెంచుకోసాగారు.

సువీరుని కూతురు అందంగా, నేత్రానందకారిణిగా పెరిగింది. ఎనిమిదేళ్ళకే ఆమెను చూసి ఒక ముని కుమారుడు మోహించి ఆమెతో పెళ్ళి జరిపించమని కోరాడు. అందుకు సువీరుడు ''ఋషిపుత్రా! ఇప్పుడు నేను ఘోర దరిద్రంలో ఉన్నాను. కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా ఇవ్వగలిగితే నీ కోరిక తీరుస్తాను'' అన్నాడు.

ఆమెమీద ఉన్న మక్కువకొద్దీ మునికుమారుడు ''రాజా! నేను కేవలం మునికుమారుణ్ణి. కనుక నువ్వడిగే ధనం నావద్ద లేదు. అయినా, తపస్సు చేసి, ధనాన్ని సంపాదించి ఇస్తాను. అంతవరకూ ఈ బాలికను నాకోసమే ఉంచు'' అన్నాడు. సువీరుడు అందుకు ఒప్పుకోగా, అతను నర్మదాతీరంలోనే తపోనిష్టుడై, అనూహ్య ధనరాశులు సంపాదించి రాజుకు ఇచ్చాడు.

రాజు అందుకు సంతోషించి, ఇచ్చిన మాట ప్రకారం కూతురితో అతని పెళ్ళి జరిపించాడు. ఆమె భర్తతో వెళ్ళిపోయింది. కన్యావిక్రయ ద్రవ్యంతో రాజదంపతులు సుఖంగా జీవించారు. ఇంతలో సువీరుని భార్య మరోసారి గర్భవతి అయి ఆడపిల్లకు జన్మ ఇచ్చింది. రాజు సంతోషించాడు. పెద్దపిల్లను విక్రయించినట్లుగానే, ఈ కూతురి ద్వారా కూడా ద్రవ్యాన్ని సంపాదించవచ్చు అనుకున్నాడు. బిడ్డ పెరుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒక యతీస్వరుడు నర్మదానదికి స్నానానికి వచ్చాడు. పర్ణశాలలో సువీరుని, అతని భార్యను, కూతుర్ని చూసి, ''ఓయీ! నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్యప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నీవెవరివి?'' అన్నాడు.

 యతీంద్రుడి ప్రశ్నకు ''అయ్యా, నేను వంగదేశాధీశుడైన సువీరుడిని. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడినై ఇలా అడవిలో ఉంటున్నాను'' అన్నాడు సువీరుడు.

 న దారిద్ర్య సమం దుఃఖం నశోకః పుత్రమారణా త్ | 

న చ వ్య దానుగమనేన వియోగః ప్రియాపహాత్ ||

దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు లేకపోవడం. అంతకన్నాఏడవవలసింది రాజ్య వియోగం. అంతకన్నా బయటకు ఏడవలేని దుఃఖం మానసిక క్షోభ. దాన్ని మించింది ఇంకేమీ ఉండదని తమకు తెలుసు కదా. ప్రస్తుతం నేను ఆ మూడు విధాలైన విచారాల వలనా అమిత దుఃఖితుడినై కందమూల భక్షణతో అరణ్యమే శరణ్యంగా బతుకుతున్నాను. ఇక్కడే తోలిచూలుగా నాకొక కూతురు పుట్టింది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి, ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బతుకుతున్నాను. ఇది ణా రెండో కూతురు. ఈమె నా భార్య. ఇంకా నా గురించి ఏం వివరాలు కావాలో అడిగితే చెప్తాను'' అన్నాడు సువీరుడు.

సువీరుడి సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ''రాజా! ఎంత పని చేశావు? మూర్ఖుడివై అగణితమైన పాపాన్ని పోగుచేసుకున్నావు

కన్యా ద్రవ్యేణ యో జీవే దసిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పిత్రూన్ క్యాపి

కన్యా ద్రవ్యేణ తర్పయేత్ శాపం దాస్యంతి తే సర్వే జన్మ జన్మ న్యపుత్రతాం

ఆడపిల్లని అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు, మరణాంతాన ''అసిపత్రం'' అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృ గణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మజన్మలకూ కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక, అలా ఆడపిల్లలను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్నవాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు.

 సర్వేషా మేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుదా | 

కన్యా విక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం న చోదితం ||

 

అన్ని రకాల పాపాలకూ ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ ఈ కన్యాశుల్క మహా పాపానికి ఈ శాస్త్రంలోనూ ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు.

కనుక సువీరా! ఈ కార్తీకమాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కల్యాణం జరిపించు. కార్తీకంలో విద్యాతేజశ్శీల యుక్తుడైన వరునికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్దాల్లో స్నానదానాదులు చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని యధోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాడి యాగాలు చేసినవాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు'' అని హితబోధ చేశాడు.

కానీ, నీచుడైన సువీరుడు ఆ సజ్జన సద్బోధనలు లెక్కచేయక ''ఏం చెప్పావ్యా.. మానవజన్మ ఎత్తినప్పుడు సర్వ విధాలుగా ఈ శరీరాన్ని సుఖపెట్టాలే గానీ ధర్మం అంటూ పాకులాడితే ఎలా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా, ఋషిగారు.. ఏదోరకంగా డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడమే ముఖ్యం. పెద్దపిల్ల విషయంలో కంటే ఎక్కువ ధనం ఇచ్చేవానికే నా చిన్నకూతుర్ని ఇచ్చి పెళ్ళి చేసి, సుఖాలు అనుభవిస్తాను. నువ్వు చెప్పింది చాలు, ఇక నీ దారిన వెళ్ళు'' అని కసురుకున్నాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళాడు. 

శ్రుతకీర్తి ఉపాఖ్యానం

 సువీరుని పూర్వీకులలో శ్రుతకీర్తి అనే రాజు ఉన్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్తా, శతాధిక యాగకర్తా అయిన ఆ శ్రుతకీర్తి తన పుణ్య కార్యాల వల్ల స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు.

సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరి అక్కడ సుఖిస్తున్న శ్రుతకీర్తి జీవుని పాశబద్ధుని చేసి, నరకానికి తీసుకువచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శ్రుతకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రాప్పించావు? నేను చేసిన పాపం ఏమిటి?'' అని నిలదీసి అడిగాడు.

మందహాసం చేసి మహాధర్ముడు ఇలా చెప్పాడు. ''శ్రుతకీర్తీ, నువ్వు పుణ్యాత్ముడవె. స్వర్గార్హుడివె. కానీ, నీ వంశీకుడైన సువీరుదనేవాడు కన్యను విక్రయించాడు. అతడు చేసిన మహాపాపం వల్ల అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసివచ్చింది. అయినా సువీరుని రెండో కూతురికి ఇంకా వివాహం కాలేదు. కనుక నువ్వు నా అనుగ్రహంవల్ల దేహివై (భూలోకవాసులు గుర్తించే శరీరం కలిగిఉండటం) అక్కడికి వెళ్ళి యోగ్యుడైన వరునికి ఇచ్చి, కన్యాదాన యుక్తంగా పెళ్ళి జరిపించు. ఎవరైతే కార్తీకంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడూ లోకాధిపతితో తుల్యుడౌతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడూ బ్రాహ్మణ కన్యను అందుకోబోతున్న బ్రాహ్మణుడు కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్ష రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని, ఆ కన్యను చక్కటి వరునికి ఇచ్చి పెళ్ళి చేసేవారు కూడా క్నయాదానా ఫలాన్ని పొందుతారు. కనుక ఓ శ్రుతకీర్తీ, నువ్వు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కన్యాదానం చేసినట్లయితే తద్వారా నువ్వూ, నీ పూర్వీకులు, సువీరాదులు కూడా నరకం నుండి విముక్తి పొందుతారు'' అని చెప్పాడు.

ధర్ముని అనుగ్రహం వల్ల దేహదారి అయిన శ్రుతకీర్తి వెంటనే భూలోకలోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవు చెప్పి వారి రెండో కూతుర్ని స్వర్ణాభరణ భూశితురాలిని చేసి, శివప్రీతిగా ''శివార్పణమస్తు'' అనుకుంటూ ఒక బ్రాహ్మణునికి కన్యాదానం చేశాడు. ఆ పుణ్యమహిమ వల్ల సువీరుడు నరకపీడా విముక్తుడై, స్వర్గం చేరి సుఖించసాగాడు. తర్వాత శ్రుతకీర్తి పదిమంది బ్రహ్మచారులకు కన్యామూల్యం ధారబోయడంవల్ల వారి వారి పితృపెటా మహాదివర్గాల వారంతా కూడా విగత పాపులై, స్వర్గాన్ని పొందారు. అనంతరం శ్రుతకీర్తి కూడా యధాపూర్వకంగా స్వర్గం చేరి తనవారిని కలిసి సుఖించసాగాడు. కనుక ఓ జనకరాజా! కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు, సర్వ పాపాలనూ నశింపచేసుకుంటాడు అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. కన్యామూల్యాన్ని చెల్లించలేనివారు వివాహార్ధం మాట సహాయం చేస్తే కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా! ఎవరైతే కార్తీకమాసంలో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, చేయనివాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో సందేహం లేదు.

 

karthika puranam Kanyadanam, karthika puranam in Telugu, karthika puranam story in telugu, karthika puranam story in telugu

 

 


కార్తీక మహా పురాణం ఎనిమిదవ రోజు

కార్తీక మహా పురాణం ఎనిమిదవ రోజు

  Karthika Puranam – 8

 

వశిష్ట ఉవాచ

''జనక నరేంద్రా! కార్తీకమాసంలో ఎవరైతే శ్రీహరి ముందు నాట్యం చేస్తారో, వాళ్ళు హరిని ప్రసన్నం చేసుకున్నవారౌతారు. కార్తీక ద్వాదశినాడు హరికి దీపమాలార్పణ చేసేవారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలం విష్ణువును అర్చించేవాళ్ళు స్వర్గ నాయకులౌతారు. ఈ నెలరోజులూ నియమంగా విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకూ ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీకమాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళనివారు ఖచ్చితంగా రౌరవ నరకానికో, కాలసూత్ర నరకానికో వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కర్మా అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మా అక్షయ పాపాన్ని కలిగిస్తాయి. శుక్ల ద్వాదశినాడు విప్ర సహితుడై భక్తియుతుడై గాంధ పుష్పాక్షతలు, దీపదూపాజ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించేవారి పుణ్యానికి మితి అనేది లేదు.

కార్తీక శుద్ధ ద్వాదశినాడు శివాలయంలో గానీ, కేశవాలయంలో గానీ లక్ష దీపాలను వెలిగించి, సమర్పించేవాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడ్తలు అందుకుంటూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకం నెలంతా దీపం పెట్టలేని వాళ్ళు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ -రోజుల్లో దీపం వెలిగించాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపం వెలిగించినవాళ్ళు పున్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసినవాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే, దాన్ని పునః వెలిగించేవారు ఘనమైన పాపాల నుండి విముక్తి పొందుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, విను. 

ఎలుక దివ్య పురుషుడైన విధం

సరస్వతీ నదీతీరంలో అనాదిగా పూజా పునస్కారాలు లేక శిథిలమై పోయిన విష్ణు ఆలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్ధమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి, తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి, ఆ గుడిని తుడిచాడు. నీళ్ళు చల్లాడు. దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్ళి పత్తి, నూనె, పన్నెండు ప్రమిదలు తెచ్చి, దీపాలను వెలిగించి ''నారాయనార్పణమస్తు'' అనుకుని తనలో తాను ధ్యానం చేసుకోసాగాడు.

యతి ప్రతిరోజూ ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశినాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరక్కపోవడంవల్ల ఆకలితో ఉన్న ఒక ఎలుక ఆ గుడిలో ప్రవేశించింది. ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణ చేసి మెల్లగా దీపాల దగ్గరికి వచ్చింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వల్ల ఆరిపోయిన వత్తి మాత్రమే ఉండి. తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక, అదేదో ఆహారంగా భావించి, ఆ వత్తిని నోట కరచుకుని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. అప్పటిదాకా నూనెలో మునిగి, వెలిగిన వత్తి కావడంతో ఆ వేడికి వెలుగుతున్న వత్తి తగిలి వెంటనే అంటుకుంది. చప్పున ఎలుక వత్తిని నోటినుండి జారవిడవడంతో అది కాస్తా ప్రమిదలో పడి, రెండు వత్తులూ వెలగసాగాయి.

రాజా! కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా, ఆ దీపం ఎలుకవల్ల పునః ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగత దేహియై దివ్యమైన పురుష జన్మను పొందింది.

అప్పుడే ధ్యానం నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుని చూసి, ''నువ్వెవరు? ఇక్కడికి ఎందుకొచ్చావు?'' అనడిగాడు.

ఆ అద్భుత పురుషుడు ''ఓ యతీంద్రా!నేనొక ఎలుకను. కేవలం గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అలాంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వల్ల వచ్చిందో తెలీడంలేదు. పూర్వజన్మలో నేనెవర్ని? ఏ పాపం వల్ల అలా ఎలుకనయ్యాను? ఏ పుణ్యం వల్ల ఈ దివ్య దేహం పొందాను? తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి. దయగలవాదివై వివరించు. నేను నీ శిష్యుణ్ణి'' అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాన నేత్రంతో సర్వం దర్శించి ఇలా చెప్పాడు.

తిలాసమేతంగా నేతితో దీపాన్ని వెలిగించి, విష్ణు అర్పణం చేసి, మళ్ళీ గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి ఛటచ్చటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపం వైపు చూశారు. వాళ్ళు అలా చూస్తుండగానే ఆ స్థంభం ఫటఫటమంటూ నిలువునా పగిలిపోయింది. అందులో నుండి ఒక పురుషాకారుడు వెలువడటంతో విస్మయచకితులైన ఆ ఋషులు ''ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు" నే కథ ఏమిటో చెప్పు'' అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు.

''ఓ మునివరేణ్యులారా! నేను గతంలో ఒక బ్రాహ్మణుడను. అయినా వేదశాస్త్ర పఠనం గానీ, హరి కథా శ్రవణం గానీ క్షేత్ర యాత్రాటనలు గానీ చేయలేదు. అపరిమిత ఐశ్వర్యంవల్ల బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజుని పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములూ అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోబెట్టి, నేను ఉన్నతాసనంపై కూర్చునేవాణ్ణి. ఎవరికీ దానధర్మాలు చేసేవాణ్ణి కాను. తప్పనిసరి అయినప్పుడు మాత్రం ''ఇంతిస్తాను, అంతిస్తాను'' అని వాగ్దానం చేసేవాణ్ణే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాణ్ణి కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికి ఖర్చు చేసుకునేవాణ్ణి. ఫలితంగా దేహాంతాన నరకగతుడనై, అనంతరం 52 వేలసార్లు కుక్కగా, పదివేలసార్లు కాకిగా, ఇంకో పదివేలసార్లు తొండగా, మరో పదివేలసార్లు పురుగుగా, కోటి జన్మలు చెట్టుగా, గత కోటి జన్మలుగా ఇలా మొద్దువలె పరిణమించి కాలం గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి.

ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు.

''ఈ కార్తీక వ్రతఫలం యదార్ధమైంది. ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళముందే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా! అందునా కార్తీక పూర్ణిమనాడు స్తంభదీపాన్ని పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనం పెట్టిన దీపంవల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది. మోద్దయినా, మాను అయినా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వల్ల దామోదరుని దయవల్ల మోక్షం పొందడం తథ్యం''

ఇలా చెప్పుకుంటున్నవారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు ''అయ్యలారా! దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడూ, దేనిచేత బుద్ధుడూ అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించండి'' అని ప్రార్ధించడంతో, ఆ తాపసులలో ఉన్న అంగీరసుడు అనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు.

Kartika Puranam book, Kartika Puranam in 30 Parts, Hindu Epic Kartika Puranam, Kartika Puranam Vashishta


కార్తీక మహా పురాణం తొమ్మిదోరోజు

కార్తీక మహా పురాణం తొమ్మిదోరోజు

  Karthika Puranam – 9

 ఉద్భూత పురుషునితో అంగీరసుడు ''నాయనా! ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలు చెప్తాను, విను.. అంటూ మొదలుపెట్టి ఆత్మజ్ఞాన బోధ చేశాడు.

కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యకారణమేవచ |

స్థూల సూక్ష్మం తాతా ద్వంద్వ సంబంధో దేహముచ్చతే ||

కర్మబంధం, ముక్తికార్యం, కారణం, స్థూల, సూక్ష్మం - ఈ ద్వంద్వ సంబంధమే దేహం.

అత్రబ్రూమస్సమాధానం కోన్యో జీవస్త్వ మేవహి |

స్వయం పృచ్చ సిమాంకో౭హం బ్రహ్మైవాస్మి న సంశయః ||

జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు ''నేనెవర్ని?'' అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే ''నేనే బ్రహ్మ.. ఇది నిశ్చయం'' అనే సమాధానం వస్తుంది.

పురుష ఉవాచ:

''అంగీరసా! నువ్వు చెప్పిన వాక్యార్ధ జ్ఞానం నాకు తట్టడంలేదు. నేనే బ్రహ్మను అనుకోదానికైనా బ్రహ్మ అనే పదార్ధం గురించి తెలిసి ఉండాలి కదా! ఆ పదార్ధ జ్ఞానం కూడా లేని నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను''

అంగీరస ఉవాచ:

అన్తఃకరనానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్, చిత్ ఆనందరూపీ అయిన పదార్ధమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవలె రూపాదివత్గా ఉన్న పిండ శేషం, ఆకాశాది పంచభూతాల వల్ల పుట్టిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇలాగే ఇంద్రియాలు గానీ, అగోచరమైన మనసుగానీ అస్థిరమైన ప్రాణం గానీ ఇవేవీ కూడా ఆత్మ కాదని తెలుసుకో. దేనివలనైతే దేహము, ఇంద్రియాలు భాసమానం అవుతాయో అదే ఆత్మగా తెలుసుకుని, ఆ ఆత్మ పదార్ధమే నేను - అనే విచికిత్సను పొందు. ఎలాగైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అలాగే తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చలింపచేస్తున్నదే దాన్ని ఆత్మవాచ్యమైన నేను గా గుర్తించు. దేని సాన్నిధ్యంవల్ల జడాలైన దేహెంద్రియ మనఃప్రాణులు భాసమానాలౌతాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాడులను, వాటి ఆద్యంతాలను గ్రహిస్తుందో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మ చేతనే దేహాడులన్నీ భాసమానాలు అవుతాయి. అగోచర ప్రేమయే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైంది, జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ, పరినామత్వ, క్షీణత్వ, నాశంగతతత్వాలానే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నువ్వుగా, ఆ నువ్వే నేనుగా, నేనే నీవుగా, ''త్వమేవాహం''గా భావించు.

ఇలా ''త్వం'' (నీను) అనే పదార్ధ జ్ఞానాన్ని పొంది, తత్కారణాత్ వ్యాపించే స్వాభావం వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్ధాన్ని గ్రహించాలి.

అతద్వ్యవృత్తిరూపేనా సాక్షాద్విధి ముఖేన చ |

వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం ||

అతః శబ్దానికి బ్రాహ్మణమైన ప్రపంచం అని అర్ధం. వ్యావ్రుట్టి అంటే ఇది కాదు, ఇదీ కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదాన్నీ కొట్టిపారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ (ఆత్మ) కాదు. ఈ కాలు ఆత్మ (బ్రహ్మ) కాదు... అనుకుంటూ ఇది కాకపొతే మరి అది ఏది - అని ప్రశ్నించుకుంటూ పోగాపోగా మిగిలేదే బ్రహ్మం (ఆత్మ) అని అర్ధం. ఇక సాక్షాత్ విదిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతర బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాలవల్లే ఆత్మ నరయగల్గాలని అర్ధం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృషిగోచరం కాదని, చీకటిని ఎరుగనిదని, లేదా చీకటికి అవతలిదని, పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమణి పూర్వోక్త సాధనల వలన తెలుసుకో''

దేనినైతే ''సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం''గా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏం తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో, అదే ఆత్మ. అదే నువ్వు. అదే నేను. ''తదనుప్రవిశ్య'' ఇత్యాది వాక్యాలచేత జీవాత్మరూపాన జగత్ప్రవేశమూ ప్రవేశిత జీవులను గురించిన నియమ్త్రుత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము - దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్త్వమసి తత్ అంటే బ్రహ్మ, లేదా ఆత్మ. త్వం అంటే నువ్వే. అంటే పరబ్రహ్మమణి అర్ధం. ఓ జిజ్ఞాసూ! అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈ ప్రత్యగాత్మయే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ సబ్దార్ధం తనేనని, త్వం శబ్దం సాధనమే గానీ ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్ధమవడం కోసం చెప్తున్నాను, విను.

తత్వమసి - వాక్యానికి అర్ధం తాదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్దాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞతా విసిష్టులైన జీవేశ్వరులను పక్కనపెట్టి లక్ష్యార్దాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే ''తాదాత్మ్యం'' సిద్ధిస్తుంది.

అహం బ్రహ్మా౭స్మి అనే వాక్యార్ధ బోధ స్థిరపడేవరకూ కూడా శమ దమాది సాధన సంపత్తితో శ్రవణమనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతివల్లనో, గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్దకర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత రహితంగా స్థాయిని చేరతాం. దాన్నే ముక్తి, మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ది కోసం కర్మిష్టులుగా ఉండి, తత్ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండటం వల్ల ప్రారబ్దాన్ని అనుసరించి ఆ జన్మలోగానీ లేదా ప్రారబ్ధ కర్మ ఫలం అధికమైతే మరుజన్మలో నైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై, జ్ఞానులై, కర్మబంధాల్ని తెంచుకుని ముక్తులౌటారు. నాయనా! బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు'' - అంటూ ఆపాడు అంగీరసుడు.

అప్పుడు ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి అడగ్గా అంగీరసుడు తిరిగి ఇలా చెప్పసాగాడు.

మంచి విషయాన్ని అడిగావు. శ్రద్ధగా విను. సుఖ దుఖాది ద్వంద్వాదులన్నీ దేహానికే గానీ, తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడూ మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధి పొంది, ఆత్మజ్ఞాని కావాలి. దేహదారి అయినవాడూ తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నానశౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసితీరాలి.

స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్థవత్ |

ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం ||

స్నాన రహితంగా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తిన్న వెలగపండుళా నిష్ఫలమే అవుతుంది. అయినా బ్రాహ్మణులకు ప్రాతః స్నానం వేదోక్తమై ఉంది. ప్రతిరోజూ ప్రాతః స్నానం చేయలేనివాళ్ళు సూర్యసంచారం గల తులా-కార్తీక, మకర-మాఘ, మేష-వైశాఖాలలో అయినా చేయాలి. జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతః స్నానాలు చేసేవారు తిన్నగా వైకుంఠాన్నే చేరతారు. చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన సంధ్యా జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవారు రౌరవ నరకంచేరి పునః కర్మభ్రష్టులుగా జన్మిస్తారు.

ఓ వివేకవంతుడా! పుణ్యకాలాలూ అన్నింటా సర్వోత్తమం అయినది కార్తీకమాసం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యను మించిన సుఖం, ధర్మతుల్యమైన స్నేహం, కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీకమాసంతో సమానమైన పుణ్యకాలం గానీ కార్తీక దామోదరునికన్నా దైవం గానీ లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడూ వైకుంఠం చేరతాడు.

నాయనా! విష్ణువు లక్ష్మీసమేతుడై, ఆషాఢశుక్ల దశమి అంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రా మిషతో శయనిస్తాడు. తిరిగి హరిబోధినీ అని పిలుచుకునే కార్తీక శుక్ల ద్వాదశినాడు నిద్ర లేస్తాడు. ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మాస్యం అంటారు.

విష్ణువుకు నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలూ కూడా ఎవరైతే హరి ధ్యానము, పూజలు చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై, విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను.

కృతయుగంలో ఒకసారి విష్ణువు లక్ష్మీదేవితో కలిసి వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు వెళ్ళి నమస్కరింఛి ''శ్రీహరీ! భూలోకంలో వేదవిధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం సుఖాలకు లాలసులు అవుతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులౌతారో తెలీక బాధగా ఉంది'' అన్నాడు.

నారదుని మాటలు విన్న నారాయణుడు సతీసమేతుడై, వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్ధక్షేత్రాదుల్లో, బ్రాహ్మణ

పరిషట్పట్టణాల్లో పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరణులను చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనా మానసుడై చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో యధారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు.-

Hindu Calender Month Karthik masa, Karthika Puranam Epic, Moksha with Karthika Puranam Epic, Karthika Puranam Stories in Telugu

 


కార్తీక మహా పురాణం పదవరోజు

కార్తీక మహా పురాణం పదవరోజు

చాతుర్మాస్య వ్రతంతో సర్వ సంపదలు

  Karthika Puranam – 10

జ్ఞానసిద్ధ ఉవాచ

వేదవేత్తల చేత వేదవేద్యునిగాను, వేదాంత స్థితునిగాను రహస్యమైనవానిగా, అద్వితీయునిగా కీర్తింపబడేవాడా! సూర్యచంద్ర శివబ్రహ్మాదులచేత మహా రాజాధిరాజులచేత స్తుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా! నీకు నమస్కారం. పంచభూతాలు, సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలూ కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివసేవిత చరణా! నువ్వు పరమం కంటే పరముడివి. నువ్వే సర్వాదికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచమూ కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమౌతోంది. సృష్టి ఆది, మధ్య, అంతాల్లో ప్రపంచమంతా నువ్వే నిండిఉంటావు. భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప చతుర్విధ రూపుదవూ యజ్ఞ స్వరూపుదవూ కూడా నువ్వే.

అమృతమయమూ, పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రంచేత ఈ సంసారం సమస్తమూ వెన్నెల్లో సముద్రంళా భాసిస్తోంది. హే ఆనందసాగరా! ఈశ్వరా! జ్ఞాన స్వరూపా! సమస్తానికీ ఆధారము, సకల పురానసారమూ కూడా నువ్వే. ఈ విశ్వం సమస్తమూ నీవల్లనే జనించి తిరిగి నీ యందే లయిస్తూ ఉండి. ప్రానులందరి హృదయాల్లో ఉండేవాడివి, మనోవాగ్రూప గోచరుడివి అయిన నువ్వు కేవలం భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రీ. ఓ కృష్ణా! ఈశ్వరా! నారాయణా! నీకు నమస్కారం. నీ ఈ దర్శనఫలంతో నన్ను ధన్యుని చేయి. దయతో నన్ను పాలించు. జగదేక పూజ్యుడవైన నీకు మొక్కడంవల్ల నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు, నేతవు, కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకతాల పాలవుతున్న నన్ను సముద్ధరించు.

హే శుద్ధచరితా! ముకుందా! త్రిలోకనాథా! అనంతా! ఆద్యుడా! పరమాత్మా! పరమహంసా! పూర్ణాత్మా! గుణాతీతా! గురూ! దయామయా విష్ణుమూర్తీ! నీకు నమస్కారం. నిత్యానంద సుధాబ్దివాసీ! స్వర్గాపవర్గ ప్రదా! అభేదా! తెజోమయా! నీకిదే నమస్కారం. సృష్టి స్థితి లయకరా! వైకుంఠవాసా! బుద్ధిమంతులైన వారు భక్తి అనే పడవ సాయంతో సంసార సాగరాన్ని దాటి, నిన్ను చేరుతున్నారు.

ప్రహ్లాద, ధృవ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజెంద్రాది భక్తజనులను రక్షించిన నీ నామస్మరణ మాత్రంచేత సమస్త పాపాలూ నశించిపోతున్నాయి. ఓ కేశవా! నారాయణా! గోవిందా! మధుసూదనా! త్రివిక్రమా! వామనా! శ్రీధరా! హృషీకేశా! పద్మనాభా! దామోదరా! వాసుదేవా! నీకు నమస్కారం. నన్ను రక్షించు.

ఇలా తెరిపి లేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుని చిరునవ్వుతో చూస్తూ విష్ణుమూర్తి ''జ్ఞానసిద్దా! నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడినయ్యాను. ఏం వరం కావాలో కోరుకో'' అన్నాడు.

''హే జగన్నాథా! నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించు'' అని కోరాడు జ్ఞానసిద్ధుడు.

శ్రీహరి ''తధాస్తు'' అని దీవించి ఇలా చెప్పసాగాడు.

''జ్ఞానసిద్దా! నీ కోరిక నెరవేరుతుంది. కానీ, అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహా పాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెప్తాను, విను. సత్పురుషా! నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమినాడూ, లక్ష్మీసమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీకశుద్ధ ద్వాదశినాడు మేల్కొంటాను. నాకు నిద్రా సుఖాన్ని ఇచ్చే ఈ నాలుగు నెలలూ ఎవరైతే వ్రతాలను ఆచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విజ్ఞులు, వైష్ణవులు అయిన నీవూ నీ సహవ్రతులూ కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణ చేయండి. చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైనవారు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారు. నిజానికి నాకు నిద్ర, మెలకువ, కళ అనే అవస్తాత్రయం ఏదీ ఉండదు. నేను వానికి అతీతుడిని. అయినా నా భక్తులను పరీక్షించడానికి నేనలా నిద్రామిషతో జగన్నాటకరంగాన్ని చూస్తుంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నువ్వు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలాల్లో పఠించేవారు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు'' ఇలా చెప్పి, ఆదినారాయణుడు లక్ష్మీసమేతుడై ఆషాఢ శుక్ల దశమినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు.

అంగీరస ఉవాచ

ఓయీ! నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది. పాపులు కూడా హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతులవారందరూ కూడా తరించితీరతారు. ఈ వ్రతాన్ని చేయనివారు గోహత్యా ఫలితాన్ని, కోటిజన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించేవారు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని, చివర్లో విష్ణులోకాన్ని పొందుతారు.

జనకుని కోరికపై వశిష్టుడు ఇంకా ఇలా చెప్పసాగాడు

ఓ రాజా! ఈ కార్తీక మహత్యం గురించి అత్రి, అగస్త్య మునుల నడుమ జరిగిన సంవాదం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకరోజు అత్రి మహాముని అగస్త్యుని చూసి, ''కుంభ సంభవా! లోకత్రయోపకారం కోసం కార్తీక మహత్య బోధకమైన ఒకానొక హరిగాధను వినిపిస్తాను, విను. వేదాలతో సమానమైన శాస్త్రం గానీ, ఆరోగ్యానికి తగిన ఆనందం కానీ, హరికి సాటివచ్చే దైవంగానీ, కార్తీకమాసంతో సమానమైన నెల కానీ లేవు. కార్తీక స్నాన, దీపదానాలు, విష్ణు అర్చనల వల్ల సమస్త వాంఛలూ సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వల్ల మాత్రమే విజయ, వివేక, విజ్ఞాన, యశోదన ప్రతిష్టాన సంపత్తులను పొందగల్గుతారు. ఇందుకు సాక్షీభూతంగా పురంజయుని ఇతిహాసాన్ని చెప్తాను.

పురంజయోపాఖ్యానం

త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనే రాజు అయోధ్యణు పాలించేవాడు. సర్వ శాస్త్రకోవిదుడు, ధర్మజ్ఞుడు, అయిన ఆ రాజు ఐశ్వర్యం అధికమవడంతో అహంకరించి, బ్రాహ్మణద్వేషి, దేవ బ్రాహ్మణ పీడితుడు, సత్య విహీనుడు, దుష్టపరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడయ్యాడు. ఇలా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేకమంది ఏకమై చతురంగబలాలతో వచ్చి అయోధ్యణు చుట్టి ముట్టడించారు. ఈ వార్తా తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జండాతో అలంకరించబడింది, ధనుర్బాణాదిక అస్త్రశస్త్రాలతో సంపన్నమైంది, అనేక యుద్ధాల్లో విజయం సాధించింది, చక్కటి గుర్రాలు పూన్చినది, తమ సూర్యవంశాన్వయమైంది అయిన రథాన్ని అధిరోహించి రథ, గజ, తురగ అనే చతుర్బలాలతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు.

Karthika Puranam Rituals, Sacred Month Karthika Masam, Karthika Puranam read in Karthikamasam, Karthika Puranam and Moksha or Salvation

 


కార్తీక మహా పురాణం పదకొండవ రోజు

కార్తీక మహా పురాణం పదకొండవ రోజు

కార్తీక వ్రతంతో విజయం పొందిన పురంజయుడు

Karthika Puranam – 11

 

 

 

 అత్రి ఉవాచ

సాధారణమైన దొమ్మిగా, కొట్లాటగా ప్రారంభమై, ఆ సమరం మహా యుద్ధంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, ఖడ్గాలతో, కర్రలతో, ముసల, శూల, భల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యాయుదాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి, పురంజయుని గొడుగును, జండాలను, రథాన్ని కూలగొట్టాడు. మరో అయిదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. ఇంకొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను, కాంభోజ రాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగాబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి, ఆ కాంభోజ మహారాజు ''ఓ పురంజయా! నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నువ్వు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను తీసుకో'' అంటూ వాటిని తన వింత సంధించి, పురంజయుని మీద ప్రయోగించాడు.

ఆ బాణాలు పురంజయుని సారధిని చంపేశాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింత సంధించి వాటిని ఆకర్ణాంతం లాగి కాంభోజునిపై వదిలాడు. ఆ ఇరవై రెక్కల బాణాలూ ఏకకాలంలో అతగాడి గుండెల్లోంచి వీపు గుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చిల్లాడు. దాంతో యుద్ధం మరింత భీకరంగా మారింది. తెగిన తొండాలతో ఏనుగులు, తలలు కోల్పోయిన గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్చగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు, మొండాలు వేరైన విగతజీవులు, గిలగిలా తన్నుకుంటున్న కోన ఊపిరితో ఉన్న జీవాలతో కదనరంగమంతా పరమ భయానకంగా, కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తం వాగులు కత్తి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ, బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజ్రుంభణను తట్టుకోలేక ఆసాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి దుఃఖిస్తున్న పురంజయుని చూసి ''సుశీలుడు'' అనే పురోహితుడు ''మహారాజా! శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తిప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గం. ఇది కార్తీక పౌర్ణమి. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభితంగా ఉండే ఈవేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరి ముందు మోకరిల్లి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. గోవిందా, నారాయణా ఇత్యాది నామాలతో, మేళతాళాలతో ఎలుగెత్తి పాదు. ఆ పాటలతో పరవశుడైన హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీకమాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్ధం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. సంపూర్ణ కార్తీక మహిమను చెప్పడం ఎవరివల్లా అయ్యేపని కాదు. భూపతీ! ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం గానీ, నీకు శరీర బలం లేకపోవడం గానీ కానేకాదు. మితిమీరిన అధర్మవర్తనం వల్ల నీ ధర్మఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే న్ ఈ పరాజయానికి కారణం. కనుక పురంజయా! శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలత మాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. కార్తీక వ్రతంవల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖసంపత్ సౌభాగ్య సంతానాలు చేకూరుతాయి. నా మాటలను విశ్వసించు.

రెండోరోజు యుద్ధం - పురంజయుని విజయం

అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు..

 ''అగస్త్యా! ఆవిధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళతాళాలతో ఆయన్ను కీర్తించి పారవశ్యంతో నర్తించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానిక్కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేషసైన్యాన్ని తీసుకుని యుద్ధరంగం చేరాడు. నగర సరిహద్దులను దాతుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారం చేశాడు. ఆ ఠంకారం చెవినపడిన కాంభోజ కురుజాది బలాలు పురంజయుని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ, పిడుగులవంటి బాణాలతోనూ , మహా వేగంగా పరిగెడుతూ, ఆకాశమెత్తున ఎగరగల గుర్రాలతోనూ, ఐరావతాలను పోలిన ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్షా తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే సైన్యంతోనూ క్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమయింది.

 గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన శ్రీహరి దైవబలాన్ని తోడుచేయడంవలన నాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంభోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధరాజుల రథబలాను, వైరికూటం పదాతిబలాలు దైవకృపాపాత్రుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమతమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడిగా మారతాడు. విష్ణువు ప్రతికూలంగా ఉంటే, మిత్రుడే శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలమే ప్రధానం. దైవబలానికి ధర్మాచారణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో, వారి సమస్త దుఃఖాలూ చిటికెలో చిమిదిపోతాయి.

అగస్త్యా! విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందునా కార్తీక వ్రతాచరణ పట్ల ఆసక్తి కలగడం, చేసే శక్తి ఉండటం కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతమూ శ్రీహరిసేవా వదలకుండా చేస్తారో వాలు శూద్రులైనా సరే, వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు. వేదవిధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ, కార్తీక వ్రతాచారణలు లేనివాళ్ళు కర్మచండాలులే అని గుర్తించు. ఇక వేదవేత్తయై హరిభక్తుడై, కార్తీక వ్రతనిష్ఠులైన వారిలో సాక్షాత్తూ విష్ణువు నివసిస్తాడు. ఏ జాతివాళ్ళయినా సరే ఈ సంసార సాగరం నుండి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు.

అగస్త్యా! స్వతంత్రుడు గానీ, పరతంత్రుడు గానీ హరి పూజాసక్తుడై ఉంటేనే ముక్తి.శ్రీహరి, భక్తులు పరస్పరం అనురాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండిటినీ అనుగ్రహించి, రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండిఉన్న ఆ విష్ణువు యందు భక్తిప్రపత్తులు ఉన్నవారికి మాత్రమే కార్తీక వ్రతం చేసుకునే అవకాశం దొరుకుతుంది. కనుక, వేదసమ్మతము, సకలశాస్త్రసారం, గోప్యం, సర్వ వ్రతోత్తమం అయిన కార్తీక వ్రతాన్ని ఆచరించినవారికి, కనీసం కార్తీక మహత్యాన్ని భక్తిగా విన్నవారికి కూడా వాళ్ళు విగత పాపులై వైకుంఠం చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని పఠించడంవల్ల పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు.

పురంజయుని మోక్షం

''హే అత్రి మునీంద్రా! విష్ణు కృపవల్ల విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు'' అని కోరాడు అగస్త్యుడు.

బదులుగా అత్రి ఇలా చెప్పసాగాడు.

''భగవత్కృప వల్ల యుద్ధభూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రునిలా అత్యంత వైభవంగా ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశౌచపాలనం, నిత్యధర్మాచరణం, దానశీలత, యజ్ఞ యాగాది నిర్వహణలు చేస్తూ ప్రతి సంవత్సరం ప్రయుక్త కార్తీక వ్రతాచరణతో విగత కల్మషుడై, విశుద్దుడై, అరిషడ్వర్గాలను జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు, నిరంతరం శ్రీహరి పూజాప్రియుడి ఏ దేశాల్లో, ఏయే క్షేత్రాల్లో తీర్ధాల్లో విష్ణువును ఏయే రకాలుగా పూజించడంవల్ల తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకరోజు ఆకాశవాణి ''పురంజయా! కావేరీతీరంలో శ్రీరంగ క్షేత్రం నుంచి శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీకమాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి, తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్ధక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ తగినరీతిన శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి, కార్తీకమాసమంతా కావేరీనదిలో స్నానాదులు చేసి, శ్రీరంగంలో రంగనాథ సేవలు చేస్తూ ప్రతిక్షణం కూడా ''కృష్ణా, గోవిందా, వాసుదేవా, శ్రీరంగనాథా'' అంటూ హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్తధర్మాలన్నిటినీ నిర్వర్తించి కార్తీకమాస వ్రతం పూర్తిచేసుకుని పునః అయోధ్య చేరుకున్నాడు. అనంతరం ధర్మకామంవల్ల సత్పుత్రపౌత్రాదుల్ని పొంది కొన్నాళ్ళు సర్వభోగ వివర్జితుడై భార్యాసమేతంగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వ్రతాచరణ, విష్ణుసేవలోనే లీనమై తత్పుణ్యవశాన వైకుంఠం చేరుకున్నాడు.

Hindu Epic. Karthika Puranam, Karthika Puranam and Karthika Dwadashi, Karthika Puranam and Karthika Somavaram, Karthika Puranam and Karthika Pournami

 


కార్తీక మహా పురాణం పన్నెండవ రోజు

కార్తీక మహా పురాణం పన్నెండవ రోజు

అంబరీషుని శపించిన దూర్వాసుణ్ణి విష్ణుమూర్తి ఏం చేశాడు?

  Karthika Puranam – 12

అత్రి మహాముని ఇలా చెప్పసాగాడు

''అగస్త్యా! కార్తీక శుక్ల ద్వాదశిని ''హరిబోధిని'' అంటారు. ఆ పుణ్యతిథి నాడు చేసే వ్రతాచరణ సర్వ తీర్థాల్లో స్నానం చేసినంత, సర్వ యజ్ఞాలూ ఆచరించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ ప్రత్యేక దినాల కంటే, ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైంది అయిన ఈ ద్వాదశినాడు చేసే పాపం గానీ పుణ్యం గానీ కోటిరెట్లుగా పరిణమిస్తుంది. అంటే - ద్వాదశినాడు ఒకరికి అన్నదానం చేసినా కోటిమందికి అన్నదానం చేసినట్లు, ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించినట్లు అవుతుంది.

ఒకవేళ ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉంటే, ఆ స్వల్ప సమయాన్ని పారణకు ఉపయోగించాలే తప్ప ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమాన్ని ఉల్లంఘించినా, ద్వాదశి పారణను మాత్రం వదలకూడదు. ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి, మర్నాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సు అనంతం. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ.

 అంబరీషోపాఖ్యానం

ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఓ కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవసించి మర్నాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా, తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనక్కూడా భోజనం పెట్టమని కోరాడు. అంబరీషుడు ఆయన్ను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నాన, అనుష్టానార్ధం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికీ మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆత్రుత చెందాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలం అతిక్రమించకుండా పారణ చేయాల్సి ఉండి. అతిథి వచ్చేవరకూ ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం వ్రత ధర్మం.దీనిని వదులుకోలేడు.

 హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగాతో భవేత్

 

 

యతో౭నుపోషితో భూయాత్ కృత్వాసమ్య గుపోషణం

పూర్వం ద్వాదశ సంఖ్యాకె పురుషో హరివాసరే
పాపముల్లంఘనేపాపాత్ నైవయుజ్యం మనీషిణా

ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించిన వారు విష్ణుభక్తిని విస్మరించిన వారౌతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశినాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంటే కాదు, ఒక్క ద్వాదశి పారణ అతిక్రమణవల్ల, ఆనాటి వ్రతఫలంతో బాటు అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారణల మహా పుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణవల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానం అయినా సరే, ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపంవల్ల కల్పాంత దుఖమే కలుగుతుంది. దూర్వాసుని ఆగమనం తర్వాత కన్నా, ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు. ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్ధం తనను పరివేష్టించి ఉన్న వేదవిదులకు తన ధర్మసందేహాన్ని తెలియజేశాడు.

  అంబరీషుని మనోవ్యథ

అంబరీషుని సమస్యను విన్న వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల్లో శృతి, స్మృతి, శాస్త్ర, పూరాణాదులన్నీ మననం చేసుకుని ''మహారాజా! సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుయందు జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపచేయడం వల్లే జీవులకు ఆకలి కలుగుతోంది. దాన్నే క్షుత్పిపాసా బాధ కనుక యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం. జీవులు తీసుకునే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూపమైన అన్నాదులు వారిలోని అగ్ని భిజిస్తుంది. జీవులు అందరిలోనూ ఉన్న జఠరాగ్నిజగన్నాథ స్వరూపం.

తన ఇంటికి వచ్చిన వ్యక్తి శూద్రుడైనా, చండాలుడైనా ఆ అతిథిని వదిలి గృహస్తు భోజనం చేయకూడదు. ఒకవేళ బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని వదిలి భోజనం చేస్తే అంతకంటే నీచమైన పని ఇంకొకటి లేదు.

రాజా! ఇలాంటి అవమానం చేయడం వలన ఆయుస్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశిస్తాయి. మనస్సంకల్పాలు తిరోగమిస్తాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడు కనుక బ్రాహ్మణుని అవమానించడం సర్వ దేవతలనూ అవమానించడంతో సమానమౌతుంది. జాతిమాత్రంచేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మవల్లనేగాక జ్ఞానం వల్ల, తపోమహిమవల్ల, శుద్ధరుద్ర స్వరూపుడిగా కీర్తింపబడే దూర్వాసుని వంటి రుషిని భోజనానికి పిలిచి, ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యంకాదు. కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడు అనే భయాన్ని పక్కకు నెట్టి చూసినా మరో శ్లోకాన్ని అనుసరించి బ్రాహ్మణ అతిథి కంటే ముందుగా భుజించడం మంచిది కాదు. ధరణీనాథా! ద్వాదశీ పారణ పరిత్యాగం వల్ల తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. విప్ర పరాభవానికి విరుగుడు లేడు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి.

  విప్రుల ధర్మబోధ

''అంబరీషా! పూర్వజన్మ కర్మానుసారం నీకు ఈ ధర్మసంకటం ప్రాప్తించింది. దూర్వాసుడు వచ్చేవరకూ ఆగాలో, అక్కర్లేదో ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలో నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులమై పోతున్నాం. కనుక ''ఆత్మబుద్ధి స్సుఖంచైవ'' అనే సూత్రాన్ని అనుసరించి భారం భగవంతునిమీద పెట్టి నీ బుద్ధికి తోచినట్లు నడచుకో'' అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు ''ఓ బ్రాహ్మణులారా! బ్రాహ్మణ శాపంకన్నా విష్ణుభక్తిని విడిచిపెట్టడమే కష్టంగా భావిస్తున్నాను'' అనగానే, పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేకశరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రం రివ్వున దూర్వాసుని వైపు కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలిరావడాన్ని చూడగానే దూర్వాసుదు తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా క్షణాలమీద పరిభ్రమించాడు. అయినా ''సుదర్శనం'' ఆటగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడై దూర్వాసుడు వశిష్టాది బ్రహ్మర్షుల్ని ఇంద్రాది అష్టదిక్పాలకులని, చివరికి మహాశివుని, బ్రహ్మదేవుని కూడా శరణు వేడాడు. కానీ, అతని వెనుకే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్నా విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి, తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు.

ఇలా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చివరగా చక్రపాణి అయిన విష్ణు లోకం చేరాడు. ''హే బ్రాహ్మణప్రియా! మాధవా! మధుసూదనా! కోటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ సుదర్శనచక్రం నన్ను చంపడానికి వస్తోంది. బ్రాహ్మణ పాదముద్రా సుశోభిడివైన నువ్వే నన్ను ఈ ఆపద నుండి కాపాడాలి'' అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ విష్ణువునే శరణు కోరాడు.

 విష్ణువు విలాసంగా నవ్వి ''దూర్వాసా! ప్రపంచానికి నేను దైవాన్ని అయినా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవస్వరూపాలు. కానీ, నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయ్యుండీ అంబరీషుని అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలచుకున్నవాడివి నీకోసం ఎదురుచూడకుండా ద్వాదశి ఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళను తీసుకున్నాడే గానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. ''అనాహారేపి యచ్ఛస్త్రం శుద్ధ్యర్ధం వర్ణినాం సదా'' నిషిద్ధాహారులకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెప్తుండగా అదేమంత తప్పని నువ్వు సపించాల్సి వచ్చింది? ఆత్రేయా! నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడేగానీ, కోపగించుకోలేదు గదా! అయినా సరే, ముముక్షువైన అతన్ని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు. ణా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని ఈ నిమిషంలో తిప్పివేయగలను. కానీ, బ్రాహ్మణవాక్యం వట్టిపోయిందనే లోకాపవాదం నీకు కలక్కుండా ఉండటం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించినవాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ ''గ్రుహ్ణామి'' అంది నేనే గానీ ఆ అంబరీషుడు కాదు. అతనకి నీవిచ్చిన శాపం సంగతే తెలీదు. ఋషిప్రభూ! నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుని సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహా మత్స్యంగా అవతరిస్తాను.

దేవదానవులు క్షీర సాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుని అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు, హిరణ్యాక్షుణి సంహరించేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుని సంహరించడం కోసం నరసింహావతారం ఎత్తుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబాలుడైనా కూడా దానవుడైన బలిని శిక్షించేందుకు వామనుడినౌతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారునిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మార్గులైన రాజులను అంతమొందిస్తాను. రావణ సంహారంకోసం రామునిగా అవతరిస్తాను. ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభంలో పాపమోహాలను తొలగించుకోమని హితవు చెప్పడం కోసం బుద్ధుడినౌతాను. కలియుగ అంతాన శత్రుఘాతుకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను. దూర్వాసా! నా ఈ దశావతారాలూ ఆయా అవతారాల్లోని లీలలను చదివినా, విన్నా వారి పాపాలు పటాపంచలౌతాయి.

దేశ కాల వయో పరిస్థితులను బట్టి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదంచే ప్రవచింపబడి ఉండి. అటువంటి వివిధ ధర్మాల్లోనూ ఏకాదశినాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణ చేసినందుగ్గానూ నువ్వు అంబరీషుని శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడివైన నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ ణా భాధ్యతలే. కనుక పునః శపించబోయేముందు నిన్ను నివారించదానికే నా చక్రాన్ని నియమించాను.

Karthika Puranam Ambarisha, Karthika Puranam Parayan in 30 days, Hindu culture in Karthika Puranam, Holy Epic Karthika Puranam in Karthika Masam

 


కార్తీక మహా పురాణం పదమూడవ రోజు

కార్తీక మహా పురాణం పదమూడవ రోజు

సుదర్శనచక్రంతోనే యుద్ధానికి సిద్ధపడిన అంబరీషుడు

Kartika Puranam – 13

విష్ణు ఉవాచ

''దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్టునిలా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. దేశానికి రాజుగా గో, బ్రాహ్మణులను రక్షించడం తన కర్తవ్యమని, అందుకు విరుద్ధంగా విప్రుడైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలన చేయాలి. కానీ, బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు.

దోషి అయిన బ్రాహ్మణుని వేదవిదులు, సత్యధర్మనిరతులు, లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోనప్పుడు ధనహరణం లేదా వస్త్రహరణం స్థానభ్రష్టత్వం మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప, రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చనిపోయినా, ఇతరులతో చంపించినా కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తనవల్లనే ప్రాణాపాయాకరమైన సుదర్శన బాధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కనుక నువ్వు తక్షణం అంబరీషుని దగ్గరికి వెళ్ళు.. అప్పుడు మీ ఇద్దరికీ శుభం జరుగుతుంది..'' అని విష్ణువు చెప్పగానే, దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.

మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కృతమైంది. భయపడుతున్న దూర్వాసుని, అతనిమీదికి రాబోతున్న సుదర్శనాన్ని చూసిన అంబరీషుడు చక్రానికి ఎదురెళ్ళి ''ఓ సుదర్శనచక్రమా! నన్ను మన్నించు. ఒక బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు'' అంటూనే ధనుస్సు చేపట్టి ఇలా చెప్పాడు.

''ఓ విష్ణుచక్రమా! ఆగు.. ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రదానం అనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే సిద్ధం. రాజులకు యుద్ధమే ధర్మం కానీ యాచన చేయడం ధర్మం కాదు. విష్ణుమూర్తి ఆయుధమైన నువ్వు, నాకు దైవస్వరూపానివే. కనుక నిన్ను ప్రార్ధించడంలో తప్పులేదు. అయినా కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్ధం నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీలేదని నాకు తెలుసు. అయినా, నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచిచూడు. మరి కొన్నాళ్ళపాటు శ్రీహరి హస్తాలతో బతికి ఉండదలచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలి వెళ్ళిపో. లేదంటే నిన్ను ఖచ్చితంగా నెల కూలుస్తాను..'' అని క్షాత్రధర్మపాలనకై తనకీ దూర్వాసునికీ మధ్య ధనుర్దారి అయి నిలబడిన అంబరీషుని చూసి అతని ధర్మనిర్వహణను మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది.

''అంబరీషా! నాతో యుద్ధం అంటే సంబరమనుకుంటున్నావా? మహాబలమదమత్తులైన మధుకైటభుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్నీ అవలీలగా నాశనం చేశాను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడదానికైనా సమస్త ప్రపంచమూ కంపించిపోతుందో అలాటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడిప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్త పడుతున్నాడు అంటే అది నా ప్రతాపమే అని మర్చిపోకు. మహా తేజస్సంపన్నుడై న దూర్వాసుదే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు.. నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడూ బలవంతుడితో సంధి చేసుకోవాలే గానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణుభక్తుడివి కనుక ఇంతవరకూ నిన్ను సహించాను. లేనిపోనిబీరాలకు పోయి, వృథాగా ప్రాణాలు పోగొట్టుకోకు''

ఆ మాటలు విన్న అంబరీషుని కళ్ళు ఎరుపెక్కగా ''ఏమిటి, సుదర్శనా? ఎక్కువగా మాట్లాడుతున్నావు.. నా దైవం అయిన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గానీ లేకుంటే నా బాణాలతో నిన్ను ఎప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవ బ్రాహ్మణులు, స్త్రీలు, పిల్లలమీద, ఆవులమీద నేను బాణప్రయోగం చేయను. నువ్వు దేవతవైన కారణంగా ఇంకా నా క్రూర రాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుష రూపుడివై యుద్ధం చెయ్యి'' అంటూ ఆ సుదర్శనం పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలు వేశాడు.

అంబరీషుని పౌరుషానికి, ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసం చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గానీ నీతో కయ్యానికి కాదు. నిన్ను పరీక్షించేందుకు అలా ప్రసంగించాను కానీ, విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుని వదిలేస్తున్నాను'' అని అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు.

అంతటితో అంబరీషుడు ఆనందితుడై ''సుదర్శనా! నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము, ప్రాణహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకు ఇవే నా నమస్కారాలు'' అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు.

సంతోషించిన సుదర్శనుడు, అంబరీషుని లేవనెత్తి అభినందించి, దీవించి అదృశ్యమయ్యాడు.

కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని చదివినా, విన్నా అనేక భోగభాగ్యాలు అనుభవించి, తుదకు ఉత్తమగతులు పొందుతారు.

Hindu Dharmik Literature Kartika Puranam, Kartika Puranam hindu culture and traditions, Kartika Puranam related to Skanda Puranam, Kartika Puranam in Karthika masam


కార్తీకమాసంలో వనభోజనాలు ఎందుకు


కార్తీకమాసంలో వనభోజనాలు ఎందుకు?

 Karthika Puranam – 15

 

 

ఆవేళ కార్తీక పౌర్ణమి కావడాన నైమిశారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో  వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రీ వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరిచెట్టు (A tree with acid fruit used for pickles. Phyllanthus Emblica; Emblic myrobalan ) కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఉంచారు. ఉసిరికలతో హరిని పూజించారు. తర్వాత గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. సాయంకాల సంధ్యావందనాలు పూర్తిచేసుకుని తులసీ బృందావనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మళ్ళీ విష్ణువును కార్తీక దామోదరునిగా ప్రతిష్టించుకున్నారు. ప్రాణ ప్రతిష్టాదులు చేశారు. ''ఓం శ్రీ తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'' అంటూ నమస్కరించి దీపారాధన చేశారు. ధ్యానావాహన ఆసన అర్ఘ్య పాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గాంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్యాదులు, పుష్పాలం కరణ, నమస్కారాలు అనే షోడశోపచారాలతో పూజించారు. విష్ణువుకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి, దానిమీద తిలలు మొదలైన ధాన్యాదులు ఉంచి ఆపైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు.

అనంతరం కార్తీక మాసం మొదటినుండి తాము చెప్పుకుంటూ వస్తున్నా స్కాంద పురాణాంతర్గత విశేషాలను, సోమవార వ్రత, కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథా స్వరూపాలైన తత్వనిష్ఠోపా ఖ్యానం, వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము, అజామిళోపాఖ్యానము, మంధరోపాఖ్యానము, శ్రుతకీర్తి ఉపాఖ్యానము, అంబారీషోపాఖ్యానము మొదలైన వానిని పునః మననం చేసుకున్నారు. ఆనక మునులందరూ కూడి, యజ్ఞ దర్శనార్ధం సూతుల వారిచే ప్రవచింపబడే సంపూర్ణ కార్తీక మహా పురాణ శ్రవణార్ధం నైమిశారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తాంబూలాలతో సహా సమర్పించారు. ఆ రాత్రి శౌనకాది మునివర్యులు కాలాతిక్రమణ కూడా లెక్కచేయక హరినామస్మరణతో, సంకీర్తనతో, నృత్య గానాది ఉపచార సమర్పణలతో గడిపి, భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు.

Kartika Puranam and Hindu rituals, Karthika Vanabhojanam on Karthika Pournami, Karthika Vanabhojanam in Karthika Masam, Karthika Puranam and Vanabhojana Mahotsavam


కార్తీకంలో పసందైన వనభోజనాలు Vanabhojanam in Karthika Masam

 

కార్తీకంలో పసందైన వనభోజనాలు

 Vanabhojanam in Karthika Masam

 

కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. ఊరూవాడా సందడిగా ఉంటుంది. వనభోజనాల ప్రసక్తి అనేక ధార్మిక గ్రంధాల్లో ఉంది. ముఖ్యంగా ''కార్తీకపురాణం''లో కార్తీక పౌర్ణమినాడు నైమిశారణ్యంలో మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైంది. ఉసిరిచెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి, ఉసిరికలతో హరిని పూజించి, గోవింద నామస్మరణ చేస్తూ షోడశోపచారాలతో పూజించి ఆనక వనభోజనాలు చేశారు.

 

అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాం. నలుగురితో కలిసి ఆనందిస్తున్నాం. ఇంతకీ కార్తీక వనభోజనాలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం.

 

కార్తీకమాసం అంటే వర్షాకాలం తర్వాత వస్తుంది. అంటే అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారతాయి. అటు వానలు, ఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో నాలుగ్గోడల మధ్య కాకుండా వనంలో అందునా ఔషధ ప్రాయమైన ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది. వీలైనంతవరకూ వనభోజనాలు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాల్లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. వృత్తి ఉద్యోగాలతో కొందరికి తీరుబాటు దొరకని మాటా నిజమే. అలా కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాల్లో వీలు కుదరని పక్షంలో కార్తీకమాసంలో ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు.

వనభోజనం పేరుతో ఇంట్లో కాకుండా ఎక్కడో ఒకచోట భోజనం చేయడం అనుకుని కొందరు హోటల్సు, రిసార్ట్స్ రిజర్వ్ చేయించుకుంటున్నారు. అలా చేస్తే అది వనభోజనం అనిపించుకోదు. ఏదో మార్పు కోసం సరదాగా తినడం అవుతుంది. మన పెద్దలు ఉద్దేశించిన ప్రకారం కార్తీక వనభోజనానికి ఉసిరిచెట్టు ఉన్న తోట లేదా ఉద్యానవనాన్ని ఎంచుకోవాలి. అక్కడ ఉసిరిచెట్టు (A tree with acid fruit used for pickles. Phyllanthus Emblica; Emblic myrobalan ) కింద భోజనం చేయాలి. కార్తీక దామోదరుడు అని పిలుచుకునే శ్రీహరి విగ్రహం లేదా ప్రతిమను ఉసిరిచెట్టు కింద ఉంచి, పూజ చేసి, ఆనక వనభోజనాలు చేయాలి.

 

బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు, ఇరుగుపొరుగువారు, ఒక ఊరివారు - ఇలా రకరకాలుగా కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పదార్ధం తయారుచేసి తీసుకురావడం ఒక పద్ధతి కాగా, అందరూ తలా ఇంత అని డబ్బు చెల్లించి, కేటరింగ్ చెప్పడం మరో పద్ధతి. మొత్తానికి మామూలు కూరలు, పచ్చళ్ళతోబాటు గోంగూర పచ్చడి, ఉలవచారు, పులిహోర, బొబ్బట్లు, గారెలు, పూర్ణాలు లాంటి ప్రత్యేక వంటకాలతో ఆహా అనిపించే రుచికరమైన భోజనం చేయడం ఆనవాయితీ. వనభోజనానికి ముందు వెనుక రోజూవారి రొటీన్ కు భిన్నంగా అందరూ ఆటపాటలతో హాయిగా, ఆనందంగా గడుపుతారు.

 

  మనదేశంలోనే కాకుండా ప్రవాసాంధ్రులు కూడా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకుని ఆనందిస్తున్నారు. కేవలం ఆంధ్రులే కాదు తమిళులు తదితర దక్షిణభారతీయులు వనభోజన మహోత్సవాలు జరుపుకుంటున్నారు.

 

కార్తీక వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయి. పరస్పరం ఆహార పదార్థాలు పంచుకు తినడంవల్ల భిన్న రుచులు అనుభూతికి రావడమే కాకుండా నచ్చినవాటిని నేర్చుకోడానికి అవకాశం లభిస్తుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులకు దూరంగా అందరూ కలిసి వేడుక చేసుకోవడం వల్ల వత్తిళ్ళు, వేదనలు తీరతాయి. వనభోజనాలను పెద్దల కంటే పిల్లలు మరీమరీ ఆనందిస్తారు.

 

Vanabhojanam in Karthika Masam, Karthika Vanabhojanam at acid fruits tree or Usiri chettu, Karthika Vanabhojanam Hindu ritual, Vanabhojanam sharing food and playing games


మత్స్యావతార విశేషాలు Karthika Puranam – 17

కార్తీక మహా పురాణం పదిహేడవ రోజు

మత్స్యావతార విశేషాలు Karthika Puranam – 17


సూతుడు ఇలా చెప్తున్నాడు..

పూర్వ అధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ, శ్రీకృష్ణునికి నమస్కరించి, ''ప్రాణేశ్వరా! కాల స్వరూపుడవైన నీకు సర్వకాలాలూ అవయవాలై అలరారుతుండగా తిథుల్లో ఏకాదశీ, నెలల్లో కార్తీకము మాత్రమే మహా ఇష్టమైనందుకు కారణం ఏమిటో తెలియజేయ''మని కోరింది.

అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ''సత్యా! మంచి ప్రశ్ననే అడిగావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దాన్నే ఇప్పుడు నేను నీకు చెప్తాను విను'' అంటూ ఇలా చెప్పసాగాడు.

నారద ఉవాచ

సముద్ర నందనుడయిన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వ దేవతా అధికారాలనూ హస్తగతం చేసుకుని, వారిని స్వర్గం నుండి తరిమేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యాభంధువులతో సహా మేరు పర్వత గుహల్లో తల దాచుకున్నారు. అయినా శంఖుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే తిరిగి దాన్ని సాధించుకోవడం కోసం బలాన్ని పెంచుకుంటారు. అలా వేదమంత్రాలవల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలి అనుకున్నాడు. విష్ణువు యోగ నిద్రాగతుడై ఒకానొక వేళలో బ్రహ్మనుండి వేదాలను ఆకర్షించాడు. కానీ, యజ్ఞ మంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతినుండి తప్పించుకుని ఉదాకాలలో తల దాచుకున్నాయి. అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు గానీ వాటిని పసిగట్టలేక పోయాడు. అంతలోనే బ్రహ్మ పూజాద్రవ్యాలని సమకూర్చుకుని మేరు గుహాలయ వాసులైన దేవతలందరనీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు. సమస్త దేవతలూ కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతో ధూపదీప సుగంధ ద్రవ్యాదులతో కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిద్ర లేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు. శరణాగతులైన దేవతలను చూసి రమాపతి ఇలా అన్నాడు. ''మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడై మీ పట్ల వరదుడిని అవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశినాడు తెల్లవారుజామున నేను మేల్కొనేవరకూ మీరు ఎలా అయితే సేవించారో, అలాగే ధూప దీప సుగంధ ద్రవ్యాదులూ, నృత్య గీత వాద్య నామస్మరణాదులతో షోడశోపచారాలతో,కార్తీక శుద్ధ ఏకాదశీ ప్రాతః సమయాన నన్ను సేవించే మానవులు నాకు ఇష్టులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. వాళ్ళు సమర్పించిన అర్ఘ్య పాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖసౌఖ్యాలకే కారణమౌతాయి. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలు అయినట్లే ప్రతి కార్తీకమాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లుగాక!

నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి, వేదాల్ని కాపాడుతాను. ఇకనుంచి కార్తీకమాస ప్రాతః సమయాన చేసే నదీస్నానం అవబ్రుథ స్నానతుల్యం అవుతుంది. ఇంకా కార్తీక వ్రతం ఆచరించిన వాళ్ళంతా నేను వైకుంఠాన్ని, నువ్వు స్వర్గాన్ని పాలిస్తున్నట్లు పుణ్యలోకాలు పొందుతారు. ఓ వరుణదేవా! కార్తీక వ్రత నిష్టుల కార్యాలకు విఘ్నాలు కలక్కుండా రక్షణ చేసి పుత్ర పాత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలూ అందించు. ఓ కుబేరా! ఏ కార్తీక వ్రతాచరణ వల్ల మానవులు పుణ్యం సంపాదించి జీవన్ముక్తులు అవుతున్నారో, అలాంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా! కార్తీక వ్రతాన్నిఎవరు జన్మవ్రతంగా భావించి విధ్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరిచేతా కూడా పూజించదగిన వారిగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువల్ల కార్తీక వ్రత, ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరి దారి లేదని తెలుసుకోవాలి. తపోదాన యజ్ఞ తీర్దాదులన్నీ స్వర్గ ఫలాన్ని ఇవ్వగలవేమో గానీ వైకుంఠ ఫలాన్ని ఇవ్వలేవు..''

మత్స్యావతారం

భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు ఉపదేశించిన వాడై తక్షణమే మహా మత్స్యావతారమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడా చేప పిల్లను తన కమండలంలో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనం పెరిగిపోవడం వల్ల దాన్ని ఒక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలోనే అది నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణు మీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహా సముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుని వధించి, దాన్ని తన చేతి శంఖంగా ధరించి బదరీ వనానికి చేరి అక్కడ ఎప్పటివలెనే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి ''ఓ మునులారా! వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెతికి తీసుకుని రండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను'' అని చెప్పాడు.

విష్ణు ఆజ్ఞను శిరసా వహించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు.

ఓ పృథు మహారాజా! ఆ వేదాల్లో నుంచి ఋషులకు ఎవరికి ఎంత లభ్యమయిందో అది వారి శాఖ అయినది. తదాదిగా ఆయా శాఖలకు వారు రుషులుగా ప్రభాసించారు. తర్వాత వేదయుతులై ప్రయాగలో ఉన్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు.

విష్ణు ఆజ్ఞపై సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలు, ఋషులతో కూడినవాడై ఆశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గాంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్ధించారు.

''ఓ దేవాదిదేవా! జగన్నాయకా! మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో వరప్రదాతనై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథా! నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమంతా యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము. కనుక నీ దయవల్ల ఈ చోటు భూలోకంలో సర్వ శ్రేష్ఠమైంది, నిత్య పుణ్యవర్ధకమైంది, ఇహపర సాధకమైంది అవుగాక. అలాగే, ఈ కాలం మహా పుణ్యవంతమైంది. బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైంది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు''

దేవతల ప్రార్థన వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసం చేశాడు. ''దేవతలారా! మీ అభిప్రాయం నాకు సమ్మతం. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అగుగాక! ఇకనుంచి బ్రహ్మ క్షేత్రం పేరుతో ప్రఖ్యాతి వహించుగాక. అనతికాలంలోనే సూర్య వంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు. ఆ గంగా సూర్యసుత అయిన కాళింది ఈ పుణ్యస్థలంలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో ఇక్కడే సుస్థితులవుతారు. ఇది తీర్ధరాజంగా ఖ్యాతి వహించుగాక! ఈ నెలవునందు ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమ అర్చనాదులు అనంత పుణ్య ఫలదాలై నా సాన్నిధ్యం అందుతుంది. అనేకానేక జన్మక్రుతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేత్రదర్శనమాత్రం చేతనే నశించిపోతాయి.ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నా యందే లీనమై మరుజన్మ లేనివాళ్ళు అవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది. సూర్యుడు మకరం నందుండగా ప్రాతః స్నానం చేసినవాళ్ళని చూసినంత మాత్రంచేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలను ప్రసాదిస్తాను.

ఓ ఋషులారా! శ్రద్ధగా వినండి! నేను సర్వకాల సర్వావస్థల్లో కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాల్లో సంవత్సరాలుగా తపస్సు చేయడంవల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్ధ దర్శనమాత్రం చేతనే సర్వులూ తమ పాపాలను పోగొట్టుకున్నవారై జీవన్ముక్తులౌతారు''

శ్రీ మహావిష్ణువు ఇలా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమతమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథు నృపాలా! ఆ బదరీవన యాత్రా దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని ఈ కథా శ్రవణ మాత్రం చేతనే పొందగలరు'' అని చెప్పి ఆగాడు నారదుడు.

Kartika Puranam, Kartika Maha Puranam-6, Kartika Puranam brings Punya, Kartika Puranam Hindu Tradition, Kartika Puranam Hindu Culture, Lingashtama by S.P. Balasubrahmanyam

 


శివుని మూడో కంటి నుండి పుట్టిన బాలకుడు

కార్తీక మహా పురాణం ఇరవైయ్యవ రోజు

శివుని మూడో కంటి నుండి పుట్టిన బాలకుడు

Karthika Puranam – 20

నారద, పృథు చక్రవర్తుల సంభాషణ

''దేవర్షీ! తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని 'హరిప్రియ, విష్ణువల్లభ' తదితర పేర్లతో సంబోధించావు. విష్ణుమూర్తికి అంత ప్రియమైన తులసి మహత్యాన్ని వివరంగా చెప్పు'' అనడిగాడు, నారదుని పృథుమహర్షి.

నారదుడు చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు.

''శ్రద్ధగా విను. పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతా, అప్సరసా సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపిఅయి ఉన్నాడు. భీత మహా దంష్ట్ర, రుద్ర నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ''ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?'' అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు.

ఆ పురుషోత్తముడు జవాబు ఇవ్వని కారణంగా ''నిన్ను శిక్షిస్తున్నాను. ఎవడు రక్షిస్తాడో చూస్తాను'' అంటూ తన వజ్రాయుధంతో అతని మెడపై కొట్టాడు. ఆ దెబ్బకు భీకరాకారుడి కంఠం కమిలి నల్లగా మారింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడిచేత అతనికి మొక్కింది. తాను ఇలా శాంతి స్తోత్రం చేశాడు.

బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోత్రం  

నమో దేవాది దేవాయ త్ర్యంబకాయ కపర్దినే 

త్రిపురఘ్నాయ శర్వాయ నమోంధ కనిఘాయిన

విరూపాయాది రూపాయ బ్రహ్మ రూపాయ శంభవే 

యజ్ఞ విధ్వంస కర్త్రేవై యజ్ఞానాం ఫలదాయినే 

కాలంత కాలకాలాయ కాలభోగి ధరాయచ

నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః

బృహస్పతి ఇలా ప్రార్ధించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశనమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించుకునేందుకు నిశ్చయించి ''బృహస్పతీ! నా కోపాగ్ని నుండి ఇంద్రుని రక్షించినందుకుగానూ ఇకనుంచి నువ్వు ''జీవ'' అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఎదైనా వరం కోరుకో'' అన్నాడు.

ఆ మాటమీద బృహస్పతి ''హే శివా! నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను. త్రిదివేశుని, త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి కాపాడు. నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపచేయి. ఇదే నా కోరిక'' అన్నాడు.

అందుకు సంతోషించిన సాంబశివుడు ''వాచస్పతీ! నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగింది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్ధన మన్నించి, అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు

గానూ సముద్రంలో పడేస్తున్నాను'' అన్నాడు. చెప్పినట్లుగానే చేశాడు శివుడు.

ఆ అగ్ని గంగా సాగర సంగమంలో పడి, బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ శోక ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం దద్దరిల్లింది. ఆ రోదన విన్న బ్రహ్మ పరుగున సముద్రుని వద్దకు వచ్చి, ''ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు?'' అనడిగాడు. సముద్రుడు నమస్కరించి, ''గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను నా కుమారుడే. దయచేసి, వీనికి జాత కర్మాది సంస్కారాలు చెయ్యి'' అన్నాడు. ఈ లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది. అందువల్ల విధాత ''ఓ సముద్రుడా! నా కళ్ళ నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడి పేర విఖ్యాతుడౌతాడు. సకల విద్యావేత్త, వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడు అవుతాడు'' అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరునికి కాలనేమి కూతురు బృందతో పెళ్ళి చేశారు. రూప, వయో, బల విలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి, దానవాచార్యుడైన శుక్రుని సాయంతో సముద్రంనుండి భూమిని ఆక్రమించి స్వర్గంళా పాలించసాగాడు.

నారదుడు ఇంకా చెప్తున్నాడు...

''పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాల్లో దాగిన దానవబలమంతా ఇప్పుడు జలంధరుని ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడు ఒకరోజు శిరోవిహీనుడైన రాహువును చూసి ''వీనికి తల లేదేమిటి'' అని అడగ్గా, శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మధనం అమృతపు పంపకం.. ఆ సందర్భంగా విష్ణువు అతని తల నరకడం - ఇత్యాది కథ చెప్పాడు.

అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడి, తన తండ్రి అయిన సముద్రుని మధించడం పట్ల చాలా మధనపడ్డాడు. ఘస్మరుడు అనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుని వద్దకు వెళ్ళి ''నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. ఇంద్రా! నా తండ్రి సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నిటినీ వెంటనే నాకు అప్పగించు'' అన్నాడు.

అది విన్న అమరేంద్రుడు ''ఓ రాక్షసదూతా! గతంలో నాకు భయపడిన లోక కంటకాలు అయిన పర్వతాలను, నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మధనం చేయాల్సివచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రునిచేత వధింపబడ్డాడు. కనుక సముద్ర మధన కారణాన్నీ దైవతగణ తిరుస్కృతికి లభించబోయ ఫలితాన్నీ కూడా మీ నాయకుడికి విన్నవించుకో'' అని చెప్పాడు.

ఘస్మరుడు జలంధరుని దగ్గరికి వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలు వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు.

శుంభ-నిశుంభాడి సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాలవారు ముసల పరిఘ బాణ గదాది ఆయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ, గజ, తురగాది శవాలతో , రక్త ప్రవాహంతో, రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ ''మృత సంజీవనీ'' విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవ గురువైన బృహస్పతి అచేతనాలైన దేవ గణాలను ద్రోణగిరిమీది దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు.

ఇది గ్రహించిన శుక్రాచార్యుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పార వేయించాడు. ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమయిందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి, ''ఓ దేవతలారా! ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కనుక మనకు జయింపశక్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి'' అని హెచ్చరించాడు.

అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాళాలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై, శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు.

Karthika Masam non-vegetarian food brahma hatya, Karthika Puranam Vratam, Karthika Puranam Vratam in Karthika Masam, Rituals and customs of Karthika Puranam


శివుని కంటే ముందు కీర్తిముఖుని పూజించాలి

కార్తీక మహా పురాణం ఇరవై ఒకటవ రోజు

శివుని కంటే ముందు కీర్తిముఖుని పూజించాలి

Karthika Puranam – 21

 

మారుమూలల్లో తల దాచుకున్నా వదలకుండా ముట్టదింప వస్తున్న జలంధరునికి భయపడిన దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు.

సర్వదేవతా కృత విష్ణుస్తోత్రం

నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయ

సదాభక్త కార్యద్యతా యార్తి హంత్రే      

 విదాత్రాది స్వర్గస్థితి ధ్వంస కర్త్రే 

గదాశంఖ పద్మాది హస్తాయతేస్తు

రమావల్లభా యా సురాణాం నిహంత్రే

భుజంగారి యానాయ పీతాంబరాయ  

మఖాది క్రియాపాక కర్త్రే వికర్త్రే  

శరణ్యాయ తస్మై నతాస్స్మోవతాస్మః  

నమో దైత్య సంతాపి తామర్త్య దుఃఖా    

చాలా ధ్వంసదంభోళయే విష్ణవేతే

భుజంగేళ తలే శయా నాయార్కచంద్ర

ద్వినేత్రాయ తస్మై నతాస్స్మో నతాస్మః

నారద ఉవాచ

సంకష్ట నాశనం స్తోత్ర మేతద్యస్తు పఠేన్నరః

సకదాచిన్న సంకష్టః పీడ్యతే కృపయా హారే

మత్స్య కూర్మాది అవతారాలు ధరించిన వాడివి, సదా భక్తుల కార్యములు నెరవేర్చేందుకు సంసిద్ధుడిగా ఉండేవాడివి, దుఃఖాలను నశింపచేసే వాడివి, బ్రహ్మాదులను సృష్టించి పెంచి, లయింపచేసేవాడివి, గద, శంఖం, పద్మం, కత్తి, ఆదిగా గల ఆయుధాలను ధరించిన వాడివి అయిన నీకు నమస్కారం.

లక్ష్మీపతి, రాక్షసారాతి, గరుడవాహనుడు, పట్టుబట్టలు, ధరించిన వాడివి, యజ్ఞాదులకు కర్త, క్రియారహితుడు, సర్వ రక్షకుడివి అయిన నీకు నమస్కారం.

రాక్షసులచేత పీడించబడిన దేవతల దుఃఖం అనే కొండను నశింపచేయడంలో వజ్రాయుధం వంటివాడివి, శేషశయనుడివి, సూర్యచంద్రులనే నేత్రాలుగా గలవాడివి అయిన ఓ విష్ణుమూర్తీ! నీకు నమస్కారం.

ఈవిధంగా దేవతలు రచించినది, సమస్త కష్టాలనూ సమయింపచేసేదీ అయిన ఈ స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో, వారి ఆపదలన్నీ శ్రీహరి తొలగిస్తాడు''అని పృథువుకు చెప్పి, నారదుడు పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు.

దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే, దానవులపై కోపంతో వెంటనే శయ్యపై నుండి లేచి, గరుడవాహనం అధిరోహించి, ''లక్ష్మీ! నీ తమ్ముడైన జలంధరునికి, దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది. దేవతలు నన్ను ఆశ్రయించారు. నేను వెళ్తున్నాను'' అన్నాడు.

అందుకా ఇందిరాదేవి రవంత చలించి, ''నాథా! నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది?'' అని ప్రశ్నించింది.

ఆ మాటకు మాధవుడు నవ్వి ''నిజమే దేవీ! నాకు నీమీది ప్రేమచేత, బ్రహ్మ నుండి అతను పొందిన వారాలచేత శివాంశ సంజాతుడు కావడంచేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడూ కాదు'' అని మాత్రం చెప్పి, సర్వాయుధ సమీక్రుతుడై, గరుడ వాహానారూఢుడై అతి వేగంగా యుద్ధభూమి చేరాడు.

మహాబలి అయిన గరుడుని రెక్కల విసురుకు పుట్టిన గాలివల్ల రాక్షససేన మేఘశకలాల వలె చెల్లాచెదురై నేల రాలిపోసాగింది. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో బాణాలేసి జలంధరుని జెండాని, రథచక్రాలని ధనుస్సుని చూర్ణం చేశాడు. తర్వాత అతని గుండెలపై ఒక మహా బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమిపై వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికేశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుని ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలధిశాయికి, జలంధరునికి బాహు యుద్ధం ఆరంభమైంది. ఆ ముష్టిఘాతాలకు, జానువుల తాకిడికి భూమి దద్దరిల్లసాగింది. భయావహమైన ఆ యుద్ధంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణణుడు ''నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది. ఏదైనా వరం కోరుకో'' అన్నాడు.

విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి ''బావా! రమారమణా! నువ్వు నాపట్ల నిజంగా ప్రసన్నుడవే అయితే, నా సోదరి లక్ష్మీదేవితోనూ, నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండు'' అని కోరాడు. తన మాట ప్రకారం విష్ణువు వెంటనే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు.

సమస్త దైవ స్థానాల్లోనూ రాక్షసులను ప్రతిష్టించాడు జలంధరుడు. దేవ, సిద్ధ, గంధర్వాదులు అందరి వద్దా ఉన్న రత్న సముదాయాన్ని అంతటినీ స్వాధీనపరచుకున్నాడు. వాళ్ళందర్నీ తన పట్టణంలో పడి ఉండేట్లుగా చేసుకుని, తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తీ! అలా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువు ఉంచుకుని, భూలోకమంతటినీ ఏకచ్చత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణుసేవానిమిత్తంగానే నేను(నారదుడు) ఒకసారి అతని ఇంటికి వెళ్ళాను.

పృథురాజా! అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో భక్తిప్రపత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం ''మునిరాజా! ఎక్కడినుంచి ఇలా వచ్చావు? ఏయే లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్తే, దాన్ని తప్పక నేరవేర్చుతాను'' అన్నాడు.

అప్పుడు నేను ఇలా అన్నాను.

''జలంధరా! యోజన పరిమాణము, పొడవు గలది, అనేకానేక కల్పవృక్షాలూ, కామధేనువులు గలది, చింతామణులతో ప్రకాశవంతమైంది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతుడిని అయిన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు స్ఫురించావు. నీ సిరిసంపదలను చూసి నువ్వు గొప్పవాడివో, శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ ధీటుగానే ఉన్నారు గానీ ఒక్క స్త్రీ రత్నపు ఆధిక్యతవల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడిగా కనిపిస్తున్నాడు.

నీ ఇంట్లో అప్సరసలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరు అయినా ఉందురుగాక. వాళ్ళంతా ఏకమైనా సరే ఆ మహేశ్వరుని ప్రాణాంకస్థితమైన పార్వతీదేవి ముందు ఎందుకూ కొరగారు. కల్యాణానికి పూర్వం వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రమితుడై చేప వలె కొట్టుమిట్టాడాడో, అటువంటి ఆ పర్వత తనయకు ఇకయే చానా యీడు కాలేదు. నిత్యమూ ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ, ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరసా గణాన్ని సృష్టించాడో, ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో. నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడం వల్ల ఐశ్వర్యవంతులలో నువ్వు శివుని తర్వాతివానివేగానీ ప్రథముడివి మాత్రం కావు''

ఉపర్యుక్తవిధంగా జలంధరునితో ఉటంకించి, నా దారిన నేను వచ్చేశాను. తర్వాత పార్వతీ సౌందర్యప్రలోభుడై జలంధరుడు మన్మధ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా! అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధరుడు సింహికానందనుడైన ''రాహు''వనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరగా దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాలు అన్నీ తన కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతుండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురుపెట్టాడు. ''ఏం పనిమీద వచ్చావు?'' అన్నట్లు కనుబొమల కదలికతోనే శివుడు ప్రశ్నించాడు .

రాహువు చెప్పసాగాడు...

''ఓ కైలాసవాసా! ఆకాశంలోని దేవతలచేత, పాతాళంలోని ఫణులచేత కూడా సేవింపబడుతున్నవాడూ, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మారాజు జలంధరుడు ఇలా ఆజ్ఞాపించాడు. 'హే వృషధ్వజా! వల్లకాటిలో నివసించేవాడిని, ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరివి అయిన నీకు హిమవంతుని కూతురు, అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్నిరకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను. కనుక స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని గానీ, నువ్వు ఎంతమాత్రంతగవు''

 కీర్తిముఖోపాఖ్యానం

రాహువు అలా చెబుతుండగానే, ఈశ్వరుని కనుబొమల వల్ల రౌద్రాకారుడు అయిన పురుషుడు వేగవంతం అయిన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదికి లంఘించబోగా రాహువు భయపడి పారిపోబోయాడు. కానీ, ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకుని మింగబోయాడు. అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకుని, శివాభిముఖుడై ''హే జగన్నాథా! నాకు అసలే ఆకలి దప్పికలు ఎక్కువ. వీనిని తినవద్దు అంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో ఆనతి ఇవ్వు'' అని కోరాడు.

హరుడు అతన్ని చూసి, ''నీ మాంసాన్నే నువ్వు ఆరగించు'' అన్నాడు.

శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తిన్నాడు.

శిరస్సు ఒక్కటే మిగిలిన ఆ మహా పురుషుని పట్ల కృపాళుడైన కంఠకాలుడు ''నీ ఈ భయంకర క్రుత్యానికి సంతుష్టుడిని అయ్యాను. ఇకనుంచీ నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు'' అని ఆశీర్వదించాడు.

ఓ పృథురాజా! తదాదిగా ఆ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు.. అంతేకాదు, ''ఇకమీదట, ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించినవారి పూజలు వృథా అవుతాయి. కనుక నన్ను అర్చించదలచినవారు ముందుగా కీర్తిముఖుని పూజించితీరాలి'' అని ఈశ్వరుడు శాసించాడు. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడంవల్ల తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెండాడు. ఆ మీదట రాహువు తనకు అది పునర్జన్మగా భావించి భయవిముక్తుడై జలంధరుని దగ్గరికి వెళ్ళి జరిగింది అంతా పొల్లు పోకుండా చెప్పాడు.

Karthika Puranam Epic and spiritual bath, Karthika Puranam and light diya, Karthika Puranam and Karthika Vratam, Rituals of Hindu Epic Karthika Puranam


జలంధరునితో యుద్ధం చేసిన మహాశివుడు

కార్తీక మహా పురాణం ఇరవై రెండవ రోజు

జలంధరునితో యుద్ధం చేసిన మహాశివుడు

Karthika Puranam – 22

నారద ఉవాచ

''పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి మోగించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలింది. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడిని రాహువు చూశాడు. తత్ఫలితంగా జలంధరుని కిరీటం నేలపై పడింది. రాక్షససేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఇది తెలిసిన దేవతలు ఇంద్రుని ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుని సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు.

''ఓ దేవాదిదేవా! ఇన్నాళ్ళుగా వానివల్ల మేం పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలుసు. ఈవేళ వాడు నీమీదికే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్ధం వానిని జయించు తండ్రీ!'' అని ప్రార్ధించారు.

వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ''కేశవా! గత జగడంలోనే ఆ జలంధరుని అంతం చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండటమేమిటి?'' అనడిగాడు.

అందుకు జవాబుగా విష్ణువు ''పరమేశ్వరా! ఆ జలంధరుడు నీ అంశవల్ల పుట్టినందున లక్ష్మీదేవికి సోదరుడు కావడంచేత యుద్ధంలో నేను చంపలేదు. కనుక, నువ్వే వానిని జయించు'' అని చెప్పాడు. అందుమీదట శివుడు ''ఓ దేవతలారా! వాడు మహా పరాక్రమవంతుడు. ఈ శస్త్ర అస్త్రాల వల్ల కానీ, నా చేత కానీ మరణించేవాడు కాదు. కనుక, మీరందరూ కూడా ఈ అస్త్ర శస్త్రాల్లో మీమీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి'' అని ఆజ్ఞాపించడంతో విష్ణు ఆది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు.

గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమమూ, భీషణజ్వాలాస్యము వేగసంపన్నము, అత్యంత భయంకరము అయిన ''సుదర్శన'' చక్రాన్ని వినిర్మించాడు.

అప్పటికే ఒక కోటి ఏనుగులు, ఒక కోటి గుర్రాలు, ఒక కోటి కాల్బలముతో కైలాసభూములకు చేరిన జలంధరుని దేవతలు, ప్రమదగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో జలంధరుని మార్కొన్నారు.

రెండు తెగల మధ్యనా భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ రథాది ధ్వనులతోనూ గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది. పరస్పర ప్రయోగితాలైన శూల, పట్టిస, తోమర, బాణ, గదాది ఆయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది. యుద్ధభూమిలో నేలకూలిన రథ గజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమద బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవనీ విద్యతో పునర్జీవింప చేయసాగాడు.

ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖంలో మహాశక్తి ఆవిర్భవించి మహా వృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది. మొట్టమొదట రాక్షసులు ఎందరినో తినేసింది. ఆపైన శుక్రుడిని సమీపించి అతన్ని తనలో చేర్చుకుని అంతర్ధానమై పోయింది. చనిపోయిన వారిని తిరిగి బతికించే శుక్రుడు లేకపోవడంవల్ల ప్రమదగణాల విజ్రుంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకలా చెల్లాచెదరైపోసాగింది.

అందుకు కినిసిన శుంభనిశుంభ కాలనేమ్యాది సేనా నాయకులు అగణ శరపరంపరతో శివగణాలను నిరోధింపసాగారు. పంటచేలపై మిడతల దండులాగా తమమీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై, అప్పుడే పూసిన మోదుగచెట్లవలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షససేనలమీదికి విజ్రుంభించారు.

నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకి తలపడ్డారు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య (కుమార) స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది.

నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి గుర్రాలను, జెండాను, ధనుస్సును, సారధిని నాశనం చేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుని వాహనమైన ఎలుకను బాణంతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకన శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని కొట్టాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలబడ్డారు. దీన్ని గుర్తించి వారిమధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ-భైర-బేతాళ-పిశాచ-యోగినీ గణాలు అన్నీ ఆయన్ను అనుసరించాయి.

గణసహితుడైన వీరభద్రుని విజ్రంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్చదేరిన నందీశ్వర, కుమారస్వాములు ఇద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజ్రుంభణతో వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు ''అతి'' అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతం అంతా నిండిపోయింది. అయిదు బాణాలతో విఘ్నేశ్వరుడిని, తొమ్మిది బాణాలతో నందీశ్వరుని, ఇరవై బాణాలతో వీరభద్రుని కొట్టి మూర్చ పోగొట్టి భీషణ అయిన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుని గుర్రాలను, పతాకాన్ని, గొడుగును నరికేశాడు. మరో మూడు బాణాలు అతని గుండెల్లో గుచ్చుకునేలా నాటాడు. దాంతో మండిపడ్డ జలంధరుడు ''పరిఘ'' అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు.

అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. తర్వాత జలంధరుడు వీరభద్రుని తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు. చివరికి దేవతల ప్రార్ధనలమీద శివుడు జలంధరునితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతన్ని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణు మాయను ప్రయోగించదానికి బయల్దేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది.

recite chapters of Karthika Puranam, Karthika Puranam stories and hindu rituals, Auspicious Karthika Masam and Sacred Karthika Puranam, Punya with Karthika Purana

 


విష్ణుమూర్తిని శపించిన బృంద

కార్తీక మహా పురాణం ఇరవై మూడవ రోజు

విష్ణుమూర్తిని శపించిన బృంద

Karthika Puranam – 23

జలంధరుడు వీరభద్రుని తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు. చివరికి దేవతల ప్రార్ధనలమీద శివుడు జలంధరునితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతన్ని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణు మాయను ప్రయోగించదానికి బయల్దేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది.

అప్పుడు ముని కారుణ్యం ప్రదర్శిస్తూ, ఆకాశంవంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని బోధించాడు. ఆ రెండు కోతులూ మళ్ళీ ఆకాశానికి ఎగిరి, అతి కొద్దిసేపట్లోనే తెగవేయబడిన జలంధరుని చేతులను, మొండేన్ని, తలను తెచ్చి వారి ముందు ఉంచారు. తన భర్త ఖండితావయవాలను చూసి బృంద ఘోల్లుమని ఏడ్చింది.

అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి, తన భర్తను బతికించవలసిందిగా ప్రార్ధించింది. అందుకా ముని నవ్వుతూ ''శివోపహతులైన వారిని బతికించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీపట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణవల్ల తప్పక బతికిస్తాను'' అంటూనే అంతర్హితుడయ్యాడు.

అతనలా మాయమైందే తడవుగా జలంధరుని అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు. ఖిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదేపదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడల్లో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు తిరిగి బతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేక పోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతన్ని విష్ణువుగా గుర్తించింది. మగని వేషంలో వచ్చి, తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ''ఓ విష్ణుమూర్తీ! పర స్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడును గాక! నీ మాయతో ఇంతకు పూర్వం కల్పించిన వానరులు ఇద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక! నువ్వు భార్యా వియోగ దుఃఖితుడివై నీ శిష్యుడైన ఆదిశేషునితో కలిసి అడవుల్లో పడి తిరుగుతూ వానర సహాయమే గతియైన వాడివి అగుగాక!'' అని శపించి తనను అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికీ బృందనే స్మరించసాగాడు.

నిలువుగా కాలిపోయిన ఆమె చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు. సిద్ధులు, ఋషులు ఎందరు ఎన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు.

Hindu calendar month Karthika Masam, Karthika Puranam and sacred rituals, Karthika Puranam Epic represents Lord Shiva, Karthika Puranam Epic represents Lord Vishnumurthy

 


తులసి, ఉసిరి కథలతో స్వర్గప్రాప్తి

కార్తీక మహా పురాణం ఇరవై నాల్గవ రోజు

తులసి, ఉసిరి కథలతో స్వర్గప్రాప్తి

Karthika Puranam – 24

యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు ఈశ్వరుని సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి, నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయా గౌరిని చూశాడు శివుడు. చూసీచూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు మూడు మహా బాణాలను శివుని శిరసు, వక్షస్థలం, ఉదరభాగాలపై ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు.

అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవుడు బోధించాడు. పరమేశ్వరుడు భీషణ రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేకమంది రాక్షసులు పారిపోసాగారు.

అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ, నిశుంభులను చూసిన రుద్రుడు ''పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించెదరు గాక'' అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు.

ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగంనుండి పరుగుతీయసాగింది. దాన్ని మళ్ళించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది. రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింపచేయగల మహా శక్తివంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుని తల నరికి నేలపై పడేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు, ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలు అందరూ సంతోషాతిరేకులు, అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునికి ప్రణమిల్లారు. స్తుతించారు. కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవుల్లో అల్లాడిపోతున్న విష్ణువును స్వస్తుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుగ్గానూ పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గ్రుహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్ధించారు.

1. సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో, ఎవరి ఇచ్చ వల్ల లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో, అటువంటి మూల ప్రకృతి (మహామాయ)కి నమస్కరిస్తున్నాను.

2. ఏదైతే ఇరవై మూడు బేధాలతో చెప్పబడి సమస్త లోకాలను అధిష్టించిందో, వేదాలు సైతం దేని రూప కర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను.

3. దేనియందు భక్తుడైన వాడు దారిద్ర భయ మోహ పరాభావలను పొందడో, ఏదయితే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను.

4. దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతిని (మహా మాయ) ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలూ పఠిస్తారో వాళ్ళు ఎన్నడూ దారిద్ర్యాన్ని, భయాన్ని, మొహాన్ని, దుఃఖాన్ని, అవమానాన్ని పొందరు.

నారద ఉవాచ

ఇక ప్రస్తుతంలోకి వద్దాం.

అలా దేవతల ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు పొడచూపి ''ఓ దేవతలారా! త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వల్ల లక్ష్మిగాను, తమోగుణం వల్ల సరస్వతిగాను సత్వగుణంవల్ల పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే కనుక మీ వాంఛాపరిపూర్తికై ఆ లక్ష్మి, పార్వతి, సరస్వతులను ఆశ్రయించండి'' అని ఆదేశించి అంతర్ధానమై పోయింది. దేవతలు రమా, ఉమా, సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని బీజాలను ఇచ్చి 'విష్ణువు ఎక్కడయితే మొహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాల్ని చల్లండి'' అని చెప్పారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా చితా ప్రాంతమంతటా చిలకరించారు.

ఓ పృథు భూపతీ! పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివినా స్త్రీలు గానీ, పురుషులు గానీ ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు'' అన్నాడు నారదుడు.

పునః నారదుడు ప్రవచిస్తున్నాడు

ఓ పృథు మహారాజా! పూర్వోక్తవిధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాలవల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి - అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వల్ల ఉసిరిక, లక్ష్మి వల్ల మాలతి, గౌరీ వల్ల తులసి ఏర్పడ్డాయి. అంతవరకూ బృందా మొహంతో మందుడై ఉన్న విష్ణువు తనచుట్టూ చెట్లయి మొలిచిన లక్ష్మీ, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకుని అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ, వాటిలో లక్ష్మీదత్తబీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండటంవల్ల ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై, విష్ణువునకు ఎడమయింది. కేవలం అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునికి ప్రియంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై, ధాత్రీ తులసీ సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలివెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు.

తులసి మహిమ

ఎవరింట్లో తులసివనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్ధ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వ పాప సంహారకమైన ఈ తులసివనాన్ని ఎవరు ప్రతిష్టిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా, నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం - ఈ మూడూ సమాన ఫలదాయకాలే. తులసిని ప్రతిష్టించినా, నీళ్ళు పోసినా, తాకినా సర్వ పాపాలూ నశిస్తాయి.

తులసి దళాలతో శివ, కేశవులను అర్చించినవారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు. పుష్కరాది తీర్ధాలు గంగాది నదులు, విష్ణు ఆది దేవతలు తులసిలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసినవాళ్ళయినా తులసి మట్టిని పూసుకుని మరణించినట్లయితే వారిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు. ఇది ముమ్మాటికీ సత్యం. తులసి ఆకులను ధరించేవారికి పాపాలు అంటవు. తులసివనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితరులకు మేలు చేస్తుంది.

ధాత్రీ (ఉసిరి) మహిమ

ఉసిరిచెట్టు నీడన పిండప్రదానం చేసినవారి పితరులు నరకం నుంచి విముక్తులౌతారు. ఎవరైతే తన శిరసు, ముఖ, దేహం, చేతుల్లో ఉసిరిపండును ధరిస్తున్నారో వారు సాక్షాత్తు విష్ణుస్వరూపులని తెలుసుకోవాలి. ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వారు జీవన్ముక్తులే. ఉసిరిపండ్లని, తులసిదళాల్ని కలిపిన జలాలతో స్నానం చేస్తే గంగా స్నానఫలం లభిస్తుంది. ఉసిరి పత్రితోగానీ, ఫలాలతో గానీ దేవతాపూజ చేసినవారికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీకమాసంలో చేసే యజ్ఞయాగాలు, తీర్ధ సేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. సమస్త దేవతలూ మునులూ కూడా ఈ కార్తీకమాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించి ఉంటారు.

ఏ నెలలో అయినా సరే, ఎవరైతే ద్వాదశినాడు తులసిదళాలను, కార్తీకం ముప్పై రోజుల్లో ఉసిరిక పత్రిని కోస్తున్నారో వారు నింద్యాలైన నరకాలనే పొందుతున్నారు. కార్తీకమాసంలో ఎవరైతే ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తారో వారి ఒక సంవత్సరం దోషం తొలగిపోతుంది. ఉసిరినీడన విష్ణుపూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లో శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలను, మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో, అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గానీ, సహస్రముఖుడైన శేషునికి గానీ సాధ్యం కాదు. ఈ ధాత్రీ తులసీ జనన గాధ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకుని, తమ పూర్వులను కూడి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గం చేరతారు.

Karthika Puranam Shiva and Keshava, Karthika Vratam with Karthika Puranam, Sacred Tulasi in Karthika Puranam, Sacred Usiri in Karthika Puranam


బ్రాహ్మణుడి భార్య రాక్షసిగా ఎలా మారింది

కార్తీక మహా పురాణం ఇరవై ఐదవ రోజు

బ్రాహ్మణుడి భార్య రాక్షసిగా ఎలా మారింది?

Karthika Puranam – 25

నారదమహర్షిని ''నారదా! నువ్వు చెప్పిన తులసీ మహత్యాన్ని విని ధన్యుని అయ్యాను. అలాగే కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో విపులంగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరు ఎలా ఆచరించారో కూడా విడమర్చి చెప్పు'' అని పృథురాజు అడగ్గా నారదుడు ఇలా చెప్పసాగాడు.

ధర్మదత్తోపాఖ్యానం

 చాలాకాలం పూర్వం సహయ పర్వత ప్రాంతంలో కరవీరం అనే ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరీ జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు అయిన ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.

ఒకానొక కార్తీకమాసంలో ఆ విప్రుడు విష్ణుజాగరణ చేయదలచి తెల్లవారుజామున లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణు ఆలయానికి బయల్దేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగి హోర దంష్ట్రలు, పెద్ద నాలుక, ఎర్రటి కళ్ళు, దళసరి పెదాలు, మాంసరహితమైన శరీరంతో గర్జిస్తున్న ఒక దిగంబర రాక్షసి తారసపడింది.దాన్ని చూసి భీతిచెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలం చిలకడంవల్ల ఆ నీళ్ళు సోకగానే, దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానంవల్ల ''కలహ'' అనే ఆ రాక్షసి బ్రాహ్మణునకు సాష్టాంగ ప్రణామం చేసి తన పూర్వ జన్మ గురించి విన్నవించసాగింది.

''కలహ'' చిప్పిన కథనం

''పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా! పూర్వం నేను సౌరాష్ట్ర దేశమండలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు చాలా కఠినంగా ఉంటూ కలహ అనే పేరుతో పిలవబడేదాన్ని. నేనెప్పుడూ నా భర్త ఆజ్ఞలను పాటించలేదు. ఆయన హితవును ఆలకించేదాన్ని కాను. నేనలా కలహకారిణిగా అహంకరించి ఉండటంవల్ల కొన్నాళ్ళకు నాథుని మనసు విరిగి మారుమనువు చేసుకోవాలనుకున్నాడు. అతని ఆ కోరికను నేను జీర్ణం చేసుకోలేక విషం తాగి చనిపోయాను.

యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుని చూసి ''చిత్రగుప్తా! ఈమె కర్మకాండలను తెలియజేయి. శుభమైనా, అశుభమైనా సరే, కర్మఫలాన్ని అనుభవించవలసిందే'' అన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు ''ఓ యమధర్మరాజా! ఈమె ఒక్క మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేత భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మ ఎత్తి బాధపడుగాక! నిత్యమూ భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకుగాను పురుగై పుట్టుగాక! వండిన వంటను తాను మాత్రమే తిన్న పాపానికిగానూ పిల్లిగా పుట్టి తన పిల్లలను తానే తినుగాక! భర్తృద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువల్ల అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొండుగాక! ఇది ప్రేతరూపం పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి, తర్వాత సత్కార్యములను ఆచరించుగాక'' అని తీర్మానించాడు.

అది మొదలుగా ఓ ధర్మదత్తా! నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలిదప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణా, సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికోట్టగా ఇలా వచ్చాను. పరమ పావనమైన తులసి జలాలతో నువ్వు తాడించడం వల్ల ఈపాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్యతేజస్వివైన నీ దర్శనం లభించింది. కనుక కళంకరహితుడవైన భూసురుడా! ఈ ప్రేత శరీరం నుంచి, దీని తదుపరి ఎత్తవలసిన జన్మత్రయం నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు'' అని ప్రాధేయపడింది.

కలహ చెప్పింది అంతా విని కలతచెందిన విప్రుడు సుదీర్ఘ సమయం ఆలోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు.

ధర్మదత్తుడు చెప్తున్నాడు...

''ఓ కలహా! తీర్ధాలు, దానాలు, వ్రతాలు చేయడం వల్ల పాపాలు నశించిపోతాయి. కానీ, నీ ప్రేత శరీరంవల్ల వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక మూడు జన్మల్లో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువల్ల నేను పుట్టి ఊహ తెలిసిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నువ్వు తరించి ముక్తిని పొందు''

అలా చెప్పి, ద్వాదశాక్షరీ మంత్రయుక్తంగా తులసీ తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. మరుక్షణమే కలహ, ప్రేత శరీరాన్ని విడిచి దివ్యరూపిణిగా, అగ్నిశిఖలా లక్ష్మీకళతో ప్రకాశించింది.

అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే, విష్ణుస్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానంలో ఆసీనురాలుకాగా అప్సర గణాలు సేవించసాగారు. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు. ధర్మదత్తుడు. సుశీలా పుణ్యశీలులు ఇద్దరూ అతన్ని లేవదీసి సంతోషం కలిగేలా ఇలా చెప్పసాగారు.

ఓ విష్ణుభక్తా! దీనులయందు దయాబుద్ధి గలవాడవు, ధర్మవిదుడవు, విష్ణుభక్తుడవు అయిన నువ్వు అత్యంత యోగ్యుదవు౭. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడంవల్ల నీ నూరు జన్మల్లోని పాపాలు యావత్తు సర్వనాశనమై పోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నానఫలంవల్ల తొలగిపోయింది. విష్ణుజాగరణ ఫలంగా విమానం వచ్చింది. నీవు ఆమెకు అర్పించిన దీపదాన పుణ్యంవల్ల తేజోరూపాన్ని తులసి పూజాదుల వల్ల విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది. ఓ పవిత్రచరిత్రుడా! మానవులకు మాధవసేవ వల్ల కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణుధ్యాన తత్పరుడైన నువ్వు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేకవేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు.

ధర్మదత్తునికి విష్ణుదూతల వరం

విష్ణుదూతలు చెప్తున్నారు

''ఓ ధర్మదత్తుడా! వైకుంఠంలో నీ పుణ్యఫలాను భవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలు అవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహయే నీకు ఆ జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది. దివ్యకార్యార్ధ అయి భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు. ఓ ధాత్రీ సురవరేణ్యా! విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు కానీ, దానతీర్ధాలు కానీ లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది, నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక, నువ్వు దిగులుచెందకు'' అన్నారు విష్ణుదూతలు.

Karthika Puranam Kalaha Story, Karthika Puranam 25th Chapter, Karthika Puranam and Dharmadatta story, Sacred Purana Stories and Karthika Vratam


త్రిమూర్తులు నదులుగా ఎలా మారారు


త్రిమూర్తులు నదులుగా ఎలా మారారు?

Karthika Puranam – 27

 

విష్ణు గణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు ''ఓ గణాధిపతులారా! జయ-విజయులు వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకులని విన్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో, తెలియచేయండి'' అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు.

జయ - విజయుల పూర్వజన్మలు

తృణబిందుడి కూతురు దేవహూతి. ఆమెయందు కర్దమ ప్రజాపతి దృక్ స్ఖలనం జరగడంవల్ల ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్లిద్దరూ విష్ణుభక్తిపరాయణులే. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడంవల్ల వాళ్ళు విష్ణు సాక్షాత్కారం పొందారు. వేదవిదులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ కలిగి ప్రసిద్దులయ్యారు. అందువల్ల మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తనచేత యజ్ఞం చేయించవలసిందిగా సంకల్పం చేసుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి, ఒకరు బ్రహ్మ, ఇంకొకరు యాచకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు. ఆ సొమ్ముతో అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తించదలచారు. తదర్ధంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇద్దరికీ తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం కాగా, తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి ''నువ్వు మొసలివైపొమ్మని'' శాపం పెట్టాడు. అంతటితో ఊరుకోక జయుడు ''అహంకారంతో శపించిన నువ్వు, సాహంకారి అయిన సామజమై పుడతావు'' అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇలా పరస్పర శాపగ్రస్తులైన ఆ సోదరులు ఇద్దరూ విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకుని తమ శాపాలను, తత్ పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తికై శ్రీహరినే ఆశ్రయించారు. ''హే భగవాన్! నీకు ఇంత మహా భక్తులమైన మేము మొసలిగా, ఏనుగుగా పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళించు'' అని మొర పెట్టుకున్నారు.

అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు ''జయ-విజయులారా! నా భక్తుల మాటలు పొల్లుపోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్థంభంనుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను. అందువల్ల మీరు సత్యం తప్పనివారై ''మీమీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి'' అని ఆదేశించాడు. తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ-విజయులిద్దరూ గండకీనది ప్రాంతాన మకర, మాతంగాలుగా జన్మించి పూర్వ జన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒక కార్తీకమాసం వచ్చింది. ఆ కార్తీకమాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగుగా ఉన్న జయుడు గండకీ నదికి వచ్చాడు. నీళ్ళలోకి దిగడమే తడవుగా ఆ నదిలో మొసలి రూపంలో ఉన్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్ధించాడు.

తలచిన వెంటనే ప్రత్యక్షమైన విష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించి, కరి, మకరాలు రెండిటినీ ఉద్ధరించి వారికి వైకుంఠం ప్రసాదించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీనదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నాయి.

ఓ ధర్మదత్తా! నువ్వు అడిగిన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువల్ల నువ్వు కూడా దంభమాత్సర్యాలను విడిచి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు. తులా, మకర, మేష సంక్రమణాలతో ప్రాతః స్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణలో నిష్ఠగా ఉండు. గోబ్రాహ్మణులను, విష్ణుభక్తులను సర్వదా సేవించు. కొర్రలు, పులికడుగునీరు, వంగ మొదలైన వాటిని వదిలిపెట్టు. జన్మ ప్రభ్రుతిగా నువ్వు అనుష్టిస్తున్నఈ కార్తీక విష్ణు వ్రతం కంటే దన, తపో, యజ్ఞ తీర్ధాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో.

ఓ విప్రుడా! దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణ వల్ల నీవు, నీ పుణ్యంలో సగభాగం అనుకోవడం వల్ల ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకు వెళ్తున్నాం'' అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతన్ని పునః నియమవ్రత నిష్టుడిని చేసి కలహ సమేతంగా విమానంలో వైకుంఠానికి బయల్దేరారు.

''పృథురాజా! అతి పురాతనమైన ఈ పుణ్య ఇతిహాసాన్ని ఎవరు వింటారో, వినిపిస్తారో వారు శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులై, విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతారు..'' అంటూ నారదుడు చెప్పింది అంతా విని ఆశ్చర్యపోయిన పృథుచక్రవర్తి ''హే దేవర్షీ! ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులలాగానే గతంలో కృష్ణ, సరస్వతీ మొదలైన నదుల గురించి విన్నాను. ఆ మహా మహిమలన్నీ ఆ నదులకు చేనినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా.. విశదపరచు'' అని కోరగా తిరిగి నారదుడు చెప్పసాగాడు. ''కృష్ణానది సాక్షాత్తూ విష్ణుస్వరూపం. సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే.

కృష్ణా - సరస్వతీ నదుల ప్రాదుర్భావం

ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలూ, మునులూ కూడా కలిసి ఒక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష ఇవ్వడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురుపంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు.

దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వల్ల భ్రుగుమహర్షి ''హే విష్ణుమూర్తీ! సరస్వతి ఎందుకు రాలేదో తెలీదు. ముహూర్తం దాటిపోతోంది. ఇప్పుడేమిటి గతి?'' అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ ''సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరొక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి'' అని సలహా ఇచ్చాడు.

ఆ సలహాను శివుడు కూడా సమర్ధించడంతో భ్రుగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణభాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఈవిధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష ఇవ్వడం పూర్తిచేయగానే సరస్వతి అక్కడికి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతి గాయత్రిని చూసి మత్సరంచెంది ''ఎక్కడైతె పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో, పూజనీయులు పూజింపబడటం లేదో అక్కడ కరువు, భయము, మరణము - అనే మూడు విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన ణా స్థానంలో ఉపవిష్టురాలిన ఉవిద ప్రజలకు కనిపించనటువంటి రహస్యనదీ రూపం పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా! మీరందరూ ఈ యజ్ఞ వాటికలో ఉండి కూడా ణా సింహాసనాన నా కన్నా చిన్నదాన్ని ఆసీనురాలీని చేశారు. గనుక మీరు కూడా జడీభూత నదీరూపాలను పొందండి'' అని శపించింది.

సరస్వతీ క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారిస్తున్నా వినకుండా ''ఈ బ్రహ్మ నీకు ఎలా భర్తో, నాక్కూడా అలాగే భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు'' అని ప్రతిశాపం ఇచ్చింది.

ఈ లోపల హరిహరులు అక్కడికి వచ్చి ''మేం నదులం అయినట్లయితే లోకాలన్నీ అతలాకుతలం అయిపోతాయి. కనుక, అవివేకమైన నీ శాపాన్ని మళ్ళించుకో'' అన్నారు. కానీ ఆమె వినలేదు. ''యజ్ఞం మొదట్లో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడంవల్లనే నా కోప రూపంగా యాగం విఘ్నపడి ఆగమయింది. పలుకుల పడతినైన నా మాట తప్పదు. మీరందరూ నదీరూపాలను ధరించి, మీ అంశలు జడత్వాన్ని వహించవలసిందే. నేను, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాం'' అని చిప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలూ జడాలుగానూ, రూపాలు నదులుగానూ పరిణమించాయి.

ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలినవారు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పుముఖంగానూ, వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించ ఆరంభించారు. గాయత్రీ, సరస్వతీ నదీ రూపాలు సావిత్రీ అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి.

ఈ యజ్ఞంలో ప్రతిష్టితులైన శివ, కేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, విన్నా, వినిపించినా వారి వంశమంతా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది.

Karthika Puranam in Karthika Masam, Karthika Puranam Chapter 27, Karthika Puranam describes Karthika Vratam, Devotees read or listen Karthika Puranam


రావిచెట్టుని పూజిస్తే లక్ష్మీ కటాక్షం


రావిచెట్టుని పూజిస్తే లక్ష్మీ కటాక్షం

Karthika Puranam – 30

సూత ప్రోక్తమైన విషయాలను విన్న ఋషులు ''ఓ మునిరాజా! రావిచెట్టు ఎందుకు అంటరానిది అయ్యింది? శనివారంనాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని అడగ్గా సూతర్షి వారిని సమాధానపరిచాడు.

రావిచెట్టు - దరిద్ర దేవత

పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువుల్లో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి, శ్రీదేవిని పెళ్ళి చేసుకోదలచాడు. కానీ శ్రీదేవి ''ఓ నారాయణా! నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్ళి కాకుండా కనిష్ఠనైన నేను కల్యాణమాడటం న్యాయం కాదు కనుక ముందు ఆమె పెళ్ళికై సంకల్పించు'' అని కోరింది. ధర్మబద్ధమైన ''రమ'' మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభకారిణి, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు.

దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలాలు

నిరంతర హోమధూమ సుగంధాలతో, వేద నాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ''ఓ ఉద్దాలకా! నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించే, అతిథి పూజా సత్కారాలు జరిగే, యజ్ఞయాగాదులు నిర్వహించే స్థలాల్లో నేను నివసించను. అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోటగానీ, పితృదేవతలు పూజింపబడే చోటగానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్టుడు, ప్రేమగా మాట్లాడేవాడూ, గురుపూజా దురంధరుడు ఉండే స్థలాల్లో నేను ఉండను. ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడయితే దురాచారాలు, పరద్రవ్య, పరభార్యాపహరణ శీలులైనవారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేనుంటాను. కల్లు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను'' అంది.

రావి మొదట్లో జ్యేష్ఠావాసం

ఆమె మాటలకు వేదవిదుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకుని ''ఓ జ్యేష్ఠా! నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వీ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కోర్చో'' అని చెప్పి బయల్దేరి వెళ్ళాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావిచెట్టు మొదలులో అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్దపెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై, ఆమెని ఊరడిస్తూ ''ఓ జ్యేష్ఠాదేవీ! ఈ రావిచెట్టు నా అంశతో కూడి ఉంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్తుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది'' అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణ కురిపించేట్లు ఏర్పరచాడు శ్రీహరి.

''ఓ ఋషులారా! సత్యభామకు శ్రీకృష్ణుడు, పృథుచక్రవర్తికి నారదుడు చెప్పినట్లు నేను మీకు ఈ పద్మపురాణ అంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరయితే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నారు'' అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడినుంచి బద్రీవన దర్శన కాంక్షులై పయనమయ్యారు.

(ఇంతటితో ముప్పయ్యవ రోజు పారాయణ సమాప్తం)

పోలి స్వర్గం చేరుట

ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానదీ తీరాన ''బాదర'' అనే ఊరుంది. ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణాలవారు సకల సంపన్నులు. పాడిపంటలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు మున్నగువానితో ఆ ఊరు సంతోషపూర్ణమై ఉంది. ఆ ఊళ్ళో ''పోతడు'' అనే పేరుగల చాకలివాడు ఒకడున్నాడు. అతని భార్య ''మాలి'' క్రూర స్వభావురాలు. దయాదాక్షిణ్యాలు లేని గయ్యాళి. వారికి నలుగురు కుమారులు. ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయంలో వివాహం చేశారు. మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి లాగానే పొగరుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అత్తగారితో సమానంగా గయ్యాళితనమును, చెడు స్వభావాన్ని కలిగిఉన్నారు. నాల్గవ కోడలు ''పోలి'' భర్తయందు ఆసక్తి కలిగిన మృదు స్వభావురాలు.

ఊరివారి బట్టల మాలిన్యాన్ని పోగొట్టి స్వచ్ఛతను కలిగించు ''పోతడు'' మాత్రం తన కుటుంబసభ్యుల దుష్టస్వభావం వల్ల కుటుంబంలోని మాలిన్యాన్ని పొగొట్టలేని స్థితిలో ఉన్నాడు. దీనికితోడు వాని నిర్దనత్వం కూడా వానిని బాధిస్తోంది. తన భార్య మాలి, మిగిలిన కోడళ్ళు, చిన్నకోడలు పోలిని దూషించుట, బాధించుట గమనించి కూడా నిస్సహాయుడై ఊరుకున్నాడు.

అత్త ''మాలి'', మిగిలిన తోడికోడళ్ళు ఇంటిపనులన్నీ పోలిపై వదిలారు. ఆ పనులను మారుమాట్లాడక తలవంచి చేస్తున్నా కూడా ఆమెమీద జాలిలేక చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించి సంతోషపడుతున్నారు. ఇలా తనను, అత్త, తోడికోడళ్ళు అనేక విధాలుగా బాధిస్తున్నా కూడా పోలి తన శాంతస్వభావాన్ని, దైవభక్తిని, ధర్మ కార్యాసక్తిని విడవలేదు.

ఇలా ఉండగా కార్తీకమాసం వచ్చింది. గ్రామవాసులంతా కార్తీకస్నానం చేసేందుకు కృష్ణానదికి వెళ్తున్నారు. నదిలో స్నానం చేసి, తీరంలో దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు. ఇలా నదికి వెళ్ళేవారిలో నిజమైన భక్తులు కొందరుంటారు. కొందరు కేవలం నదీస్నానం, దీపారాధనలతో పుణ్యం వచ్చేస్తుందని కపటభక్తిపరులుంటారు. మరికొందరు ఇతరులు ఆచరిస్తుండగా తాము చేయకుంటే బాగుండదని మొక్కుబడిగా వెళ్ళేవారుంటారు.

పోలి అత్త ''మాలి'', పోలి తోటికోడళ్ళు ముగ్గురు పోలిని మాత్రం ఇంటిదగ్గరుంచి వారంతా నదీస్నానానికి వెళ్లారు. పనులు, బాధ్యతలు పోలికి అప్పగించారు. స్నానం, దీపారాధన చేసే సమయంలో మాలి తదితరుల మనసు దైవం, దివ్యాచారాలమీద లేదు. పోలి ఇంటిదగ్గర పాలు తాగేస్తోందేమో, పెరుగు, వెన్న తింటున్నదేమో, లేక వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటుందేమో లాంటి ఆలోచనలతో గడిపారు. వారంతా పోలిని ఆడిపోసుకుంటూ మొక్కుబడిగా పూజాకార్యక్రమాలు ముగించారు. తర్వాత వ్రత ఉద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమినాడు కృష్ణాతీరం చేరారు. వారి సంగతి అలా ఉండగా ఇంట్లో ఉండిపోయిన పోలి నిస్సహాయురాలు. అత్తగారికి, తోటికోడళ్ళకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది.

భర్త తల్లి, వదినల మాటలు విని నమ్ముతాడే తప్ప పోలిని పట్టించుకోడు. నదీస్నానం, దీపారాధన చేయాలని ఉన్నప్పటికీ ఇంటి బాధ్యతకు బంధితురాలైన పోలి తన భక్తిని, నదీ స్నానాదుల పట్ల ఉన్న కోరికను, దైవ, ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకుంది. అత్తకు, తోటికోడళ్ళకు సమాధానం చెప్పలేదు. తనను కనీసం ఒక జీవిగా కూడా తలచని వారి అమానుషత్వానికి ఏం చేయగలదు?

అప్పుడామె నిస్సహాయంగా ఇంటిపనులు చేస్తూ మనసులో ''దీనరక్షణా! గోవిందా! జనార్దనా! స్వామీ! దీనబంధూ! నేనేం చేయగలను?! అశక్తురాలను. నిస్సహాయురాలను. వీళ్ళంతా నన్ను విడిచి నదీతీరానికి వెళ్ళి, స్నానం, దీపారాధన చేస్తున్నారు. అలా నాకూ పుణ్యం సంపాదించాలని ఉంది. మనసారా పూజ చేసుకోవాలని ఉంది. కానీ, చేసుకోలేకపోతున్నాను. పవిత్ర నదీస్నానం లేదు. స్ఫూర్తినిచ్చే దీపారాధన లేదు. మనసుకు ప్రశాంతత ఇచ్చే దైవ దర్శనం పూజ, పురాణ శ్రవణం ఏవీ లేవు. ఏం చేయను? నాకు ఎలాంటి గతి కలుగుతుందో.. నేనెంత దురదృష్టవంతురాలిని?' అంటూ విచారించింది.

మనసులో భగవంతుని ధ్యానిస్తూ పోలి, తన పరిస్థితికి లోబడి, ఇంట్లో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది. చిరిగిన వస్త్రాన్ని ధరించి, అందులోనే ఓ పక్కనుంచి చిన్న పీలికను చించి వత్తిగా చేసి, ఒక పాత్రలో ఉంచి కవ్వానికి అంటిన కొద్ది వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి దీపం వెలిగించి, ''స్వామీ! పుండరీకాక్షా! గోవిందా! జనార్దనా! అనాథరక్షకా! దీనబంధూ! దయ చూపు. నేను అశక్తురాలను. నాపై అనుగ్రహం చూపు'' అని ప్రార్ధించింది పోలి.

ఇలా దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలో ఉన్న దయాసముద్రుడైన శ్రీ మహావిష్ణువు చూసి సంతోషించాడు. ఆమెపై అనుగ్రహం కలిగింది. ద్వారపాలకుడైన సుశీలుని చూసి ''ఓయీ! నీవు ఆమెను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకురా'' అని ఆజ్ఞాపించాడు. సుశీలుడు తక్షణం పోలి ఉన్న ప్రదేశానికి వెళ్ళి ''ఓ సాధ్వీమణీ! ఉత్తమురాలా! నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠానికి తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపాడు. వెంటనే వచ్చి ఈ బంగారు విమానం ఎక్కు'' అని తొందరపెట్టాడు. పోలి విమానం ఎక్కింది.

అప్పుడే, వ్రత ఉద్యాపన పూర్తిచేసుకుని పోలి అత్త మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురు ఇల్లు చేరారు. మాలి జరిగిన విషయం తెలుసుకుని తాను కూడా వైకుంఠం చేరాలనే కోరికతో విమానం ఎక్కబోతూ పోలి పాదాలను పట్టుకుంది. పెద్ద కోడలు మాలి పాదాలను, రెండో కోడలు ఆమె పాదాలను, మూడో కోడలు రెండో కోడలి పాదాలను పట్టుకున్నారు. ఇలా వైకుంఠానికి విమానంలో వెళ్తోన్న పోలి పాదాలను ఆమె అత్తగారు, ఆమె పాదాలను వరుసగా ఒకరి వెంట ఒకరుగా కోడళ్ళు పట్టుకుని వెళ్ళాడుతున్న దృశ్యం మహా విచిత్రంగా ఉంది.

వైకుంఠ విమానం నడిపిస్తున్న సుశీలుడు వాళ్ళను చూశాడు. వారు పోలిని పెట్టిన బాధలు కళ్ళముందు మెదిలాయి. విష్ణుమూర్తికి పోలిమీద కలిగిన దయ, ఆయన మాటలు గుర్తొచ్చాయి.

''మీరు మహా దుర్మార్గులు. పోలిని చూసి అసూయచెంది ఆమెను అనేకరకాలుగా బాధించారు. మీరు నదీస్నానం దీపారాధన, దైవదర్శనం, పూజ, పురాణశ్రవణం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటే ఏం లాభం? అప్పుడు కూడా ఆమెను నిందిస్తూ, దూషిస్తూనే గడిపారు. మీరు వైకుంఠానికి రాతగినవారు కాదు. కుంభీపాక మొదలైన నరకాలే మీకు తగినవి. ఆ నరకానికి వెళ్ళండి'' అని సుశీలుడు కత్తితో మాలి చేతులను నరికాడు. ఒక్కసారిగా మాలి, ఆమె కోడళ్ళు ముగ్గురూ కింద పడ్డారు.

సుశీలుడు ఎంతో ప్రేమాదరణతో, మహా వైభవంగా పోలిని వైకుంఠానికి తీసికెళ్ళాడు. ఇలా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది.

పోలి వృత్తాంతంవల్ల ఈ కింది విషయాలను గ్రహించాలి...

భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండాలి.

భక్తిలో తన్మయత్వం ఉండాలి.

పూజ చేసేవారు లేదా పూజావిధానం ఆడంబరంగా ఉండనవసరంలేదు. మనసు నిమగ్నం చేయడమే ముఖ్యం.

భక్తులకు అసూయాతత్వం, హింసా ప్రవ్రుత్తి ఉండకూడదు. నిశ్చలమైన, పరిపూర్ణమైన భక్తిమాత్రమే కావాలి. దిక్కులేనివారికి దేవుడే దిక్కు అనే మాట అక్షర సత్యం. అసూయాద్వేషాలు విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యధాశక్తిగా భగవంతుని చేరేందుకు పోలిలా ప్రయత్నించాలి. మాలి తదితరులు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల, నిశ్చల భక్తికి ప్రతీక. అలాంటి భక్తికి కులము, సుసంపన్నత అవసరం లేదు. మనసును అర్పించడమే భక్తికి నిదర్శనం. సర్వేజనాః సుఖినోభవంతు!

Devotees and Karthika Puranam, Mukti or Salvation with Karthika Puranam, Holy Epic Karthika Puranam and auspicious month Karthika, the last day of Karthika Vratam



TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.