Home » » Divine logic is not rule-bound!
Home » » జ్ఞానోదయము యొక్క మొదటి అనుభవం
Home » » నిత్యానంద ధ్యాన పీఠం ఏర్పాటు - సేవాసమితి
Home » » సామాన్యుల ప్రతినిధిని మార్చండి
Home » » జీవితకాల తపస్సు
Home » » పరమహంస నిత్యానంద ఎవరు?
Home » » లక్షలాది ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శనం
Home » » ఒక ప్రామాణికమైన వేద పునరుజ్జీవన మార్గదర్శకుడు
జ్ఞానోదయము యొక్క మొదటి అనుభవం

ధ్యానం మధ్యలో, తన లోలోపల ఏదో తెరుచుకోవడం చూసారు.... అకస్మాత్తుగా తను కళ్ళు మూసుకున్నా, తన చుట్టూ 360 డిగ్రీలలో చూడగలుగుతున్నట్లు గ్రహించారు! ఆ సమయంలో, తన మొత్తం అస్తిత్వంతో, తన వాస్తవమును తెలుసుకొనే జాగృతిని పొందారు.
పన్నెండు సంవత్సరాల వయస్సులో ఒక రోజు కేవలం ధ్యానంతో ఆడుకుంటున్న ప్పుడు, తన జీవితమును శాశ్వతముగా మార్చేసిన, అప్పటివరకు తనకు తెలియని పరిమాణములో జ్ఞానోదయమును మేల్కొలిపే ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవమును పొందారు. ఈ అనుభవం తరువాత, శక్తివంతమైన అరుణాచల ఛాయలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలన్న తన వాంఛ బాగా తీవ్రతరం అయింది.
రామకృష్ణ మఠంలో సన్యాస శిక్షణా సమయంలో మరియు ఆ తర్వాత, నిత్యానంద భారతదేశం అంతటా ఒక ఆధ్యాత్మిక యాచకుడివలే సంచరించారు. నిష్ఠగా ఉండడంలో రాజసంతో తన జీవితం మొత్తం దాతృత్వంతో, ఒక యువ యాచకునివలే వేల కిలోమీటర్లు నడుస్తూ, అసంఖ్యాకమైన వికసించిన ఆత్మల నుండి నేర్చుకుంటూ, ఎన్నో పవిత్ర క్షేత్రాలను తరచుగా సందర్శించారు. తీవ్రమైన ధ్యానం, అధ్యయనం మరియు తపస్సు సఫలమయి జనవరి 1, 2000 న జ్ఞానోదయ విస్ఫోటనం ఆయనకు మన గ్రహం మీద ఆయన చేయవలసిన విశేష కార్యక్రమమును వెల్లడించింది.
 


నిత్యానంద ధ్యాన పీఠం ఏర్పాటు - సేవాసమితి

కలకాలం ఉండే ఆధ్యాత్మిక నిజాలను తనకు నేర్పి, సాధన చేసేలా చేసిన  ఆధ్యాత్మిక గురువులకు మరియు భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వమునకు నిత్యానంద ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారు. ఇతరులకు తన ఆధ్యాత్మిక అవగాహనను పంచడం కోసం మరియు మానవ సేవకే తన జీవితమును అంకితం చేయడం కోసం తన జీవితములో వానప్రస్థమును స్వీకరించి, ప్రజా జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నారు.    ఈ క్రమంలో, ఆయన జనవరి 1, 2003 న తన ఆధ్యాత్మిక సంస్థ ప్రధాన కార్యాలయంగా భారతదేశంలోని బిడది (పూర్వం బెంగళూరు)లో నిత్యానంద ధ్యానపీఠం ను ఏర్పాటు చేసారు.


భారతదేశ ప్రామాణిక వైదిక సంస్కృతిని కాపాడుట, పునరుద్ధరణ చేయుట మరియు వ్యాప్తి చేయడం. సామాన్యులకు యోగ, ధ్యానము యొక్క అనేక ప్రయోజనాలను పరిచయం చేయడం మరియు మెరుగైన జీవనం కోసం ఆచరణాత్మక పరిష్కారాలను అందించడం. నిరుపేద, కనీస వసతులు లేని వారిని ఆదుకుని, వారికి వైద్య సంరక్షణ, పోషణ, విద్య, యువత మరియు మహిళల సాధికారత మరియు ఇతర సామాజిక కార్యక్రమాలను చేపట్టడం. భాష, సంస్కృతి మరియు వర్గం యొక్క అడ్డంకులను అధిగమించి, వివాదాల్లేని, ఉత్పాదకమైన మరియు ఐకమత్య అంతర్జాతీయ సమాజమును సృష్టించడానికి సహాయం చేయడం. వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థను ఏర్పాటు చేసారు.

ప్రారంభం నుండి 8 సంవత్సరాల తక్కువ కాలపరిమితిలోనే నిత్యానంద ధ్యానపీఠం అసాధారణంగా  పెరిగింది మరియు విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ సంస్థలో ఆశ్రమములు, వైదిక ఆలయాలు మరియు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో వేల కొలదీ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఆధ్యాత్మికతను పెంచి, భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలను విలీనం చేసి ఆనందకరమైన జీవితమును సృష్టించే అవకాశాలను ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కువ పరిమాణములో అభివృద్ధిపరుస్తున్నాయి.


నేడు, నిత్యానంద యొక్క వ్యక్తిత్వము వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు ప్రోత్సాహం పొందుతున్నారు. ఆయన ప్రామాణికత, లోతైన అనుభవం మరియు ఆధ్యాత్మికతను ఆచరణాత్మకంగా మరియు ఆనందదాయకంగా చేయగలిగిన ఆయనకున్న అరుదైన బహుమతి నిత్యానంద బోధనలను సుదూర తీరాలు చేరుకొనేలా చేసాయి. ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక వైద్యులైన నిత్యానంద ఒకే ఒక స్పర్శతో వ్యాకులత నుంచి కాన్సర్ లాంటి రోగాలున్న వేలాదిమందికి నయం చేసారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ కు పైగా ప్రజల భాగస్వామ్యంతో పని చేస్తూ, మానవాళి ఉత్తమమైన జ్ఞానోదయం పొందేందుకు సహాయం చేసేందుకు కట్టుబడి ఉన్నారు.
 

 


సామాన్యుల ప్రతినిధిని మార్చండి

ప్రజల జీవితాలలో ఆధ్యాత్మికతను తెచ్చేందుకు కట్టుబడిన నిత్యానంద, ఆరాధన, సంప్రదాయ వ్యవహారాలు మరియు భక్తి సంగీతం (కీర్తనలు) ద్వారా అది సులభమని కనుగొన్నారు. భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా మధ్యతరగతి వారు ఆయన తన చర్చలలో అందించే సున్నితమైన జీవిత పరిష్కారాలకు, వివేకశాలురైన ఉన్నత వర్గం వారు ఆయన ధర్మగ్రంథములకు మరియు వ్యాఖ్యానాలకు ఆకర్షితులవుతున్నారు. ఆధ్యాత్మికతను ఆశించే వారు మరియు ఒక ఆధ్యాత్మిక తెమ్మెరను కావాలనుకునే సామాన్యులు అనుసరించే ఆచరణీయ మరియు సమర్థవంతమైన ధ్యాన పద్ధతులను ఆయన విస్తృతంగా బోధిస్తున్నారు.


ధ్యానమే జీవనశైలి

ప్రజానీకానికి ఒక గొప్ప స్థాయిలో ధ్యానం గురించి తెలియజేయాలనుకున్న ఆధ్యాత్మిక గురువులలో నిత్యానంద ఒకరు. 100,000 మంది హాజరయిన తన ఉచిత సత్సంగ్ లలో (ఆధ్యాత్మిక సమావేశాలు) నిత్యానంద ఒత్తిడి మరియు బాంధవ్యాలు వంటి ప్రాధమిక సమస్యలకు సాధారణ ధ్యాన పద్ధతులను బోధించి, వారిలో ధ్యానం మీద అభిరుచిని సృష్టిస్తారు. ఇంతేగాకుండా, ప్రతి వారాంతంలో నియుక్తమైన ఉపాధ్యాయులు, వారి ఇళ్ళలో లేదా స్థానిక కేంద్రాలలో మధ్యస్థ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పాఠశాలలు మరియు విద్యాలయాల్లో ఆధ్యాత్మిక విద్య మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు ఉచితంగా అందిస్తున్నారు, ఇంకా నిరంతరం కార్పొరేట్ మరియు పబ్లిక్ రంగ సంస్థలలో,  జైళ్ళలో ఉచిత ధ్యాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిత్య ధ్యాన్ మరియు ఎన్-క్రియ వంటి సాధారణ మరియు సమర్థవంతమైన పద్ధతులతో నిత్యానంద విజయవంతంగా సామాన్యులకు కూడా ధ్యానమును ఒక జీవనశైలిగా అందించారు.


యువతతో అనుసంధానం

నిత్యానంద, తానే యువకుడగుట వలన ఆయన విధానం నేటి యువతకు ఆచరణాత్మకంగా ఉంటుంది మరియు వారి ఆలోచనలను కూడా ఆయన పరిగణనలోకి తీసుకుంటారు. ఒత్తిడి, కార్యనిర్వహణ, పని భారం మరియు బాంధవ్యాలకు సంబంధించిన సమస్యలకు సాధారణ పద్ధతులు మరియు అవసరానికి తగిన పరిష్కారాల ద్వారా యువతను ఆధ్యాత్మికతకు ఆకర్షితులయ్యేలా చేసే నేర్పు ఆయనకు ఉంది. ఆధ్యాత్మికతకు ఆయన చూపే సరళమైన మార్గం, సాంకేతికతకు అనుకూలమైన గురువుగా ఆయన వేదాంతము యొక్క నిజాలను లాప్ టాప్ ను ఉపయోగించి వివరించే విధానం, వైదిక విలువలను నేర్పేందుకు ఆధునిక సారూప్యాలను ఉపయోగించే విధానం యువకుల అభిమానమునే కాక వారి తల్లిదండ్రుల అభిమానమును కూడా సంపాదించుకుంది. యువతను ఆధ్యాత్మిక మరియు సాధారణ జీవితంలో మార్గనిర్దేశం చేయుటకు, విద్య మరియు వృత్తి శిక్షణతో పాటుగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంతో పరిపూర్ణం చేసే 2 సంవత్సరాల వ్యవధి ఉన్న ఉచిత నివాస కార్యక్రమాలను ప్రతిపాదిస్తున్నారు. ఈ కార్యక్రమాలు చాలా మంది యువతను మద్యపానం, బాల్య అపరాధ ప్రవృత్తి, పిన్న వయసు గర్భధారణలు, మాదక ద్రవ్యాల వినియోగం మరియు సంఘవిద్రోహ ప్రవర్తనల నుండి సమర్థవంతంగా దూరం చేసింది.


మహిళలకు సాధికారత

విద్యాపరంగా, ఆర్థికంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా మహిళల సాధికారతకు, వారికి యోగ్యమైన గౌరవం మరియు సామాజిక హోదాను పునరుద్ధరించేందుకు నిత్యానంద కట్టుబడి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని నిత్యానంద వైదిక దేవాలయాల్లో, మహిళా భక్తులను ఉచితంగా నిత్య పూజలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. పురుషులతో పాటు, మహిళలు కూడా ఆధ్యాత్మిక వైద్యము చేసేవారిగా మరియు ధ్యాన ఉపాధ్యాయులుగా ఉపదేశింపబడ్డారు. వారు కావాలనుకుంటే వారికి ఆధ్యాత్మిక పేర్లు కూడా ఇవ్వబడతాయి. ఇంకా వారు సామాజిక వర్గంలో ఆధ్యాత్మిక రాయబారులుగా ఉన్నారు. ఒంటరి మహిళలకు లైఫ్ బ్లిస్ టెక్నాలజీ ఆధ్యాత్మిక మరియు వృత్తి విద్య రెండిటిలో బిడది ఆశ్రమంలో రెండేళ్ల ఉచిత నివాస శిక్షణనిస్తుంది. శిక్షణ పూర్తయ్యేసరికి వారు తమ జీవితాలను ఆధ్యాత్మికతకు అంకితం చేయాలనుకుంటే, 18 ఏళ్ళు నిండి, ఏ విభాగంలోనైనా ఒక డిగ్రీ / డిప్లొమా ఉన్న మహిళలకు కూడా బ్రహ్మచర్య దీక్షను మరియు సన్యాస శిక్షణను ఉపదేశిస్తారు. నిత్యానంద Dhyanapeetam ఆశ్రమాల్లో, మహిళలు వివిధ శాఖలకు ముఖ్య అధికారిగా ఉంటూ, ఆధ్యాత్మికత మరియు ధ్యానం గురించి అంతర్జాతీయ ప్రేక్షకులనుద్దేశించి ప్రసంగిస్తూ మరియు  స్థానిక సంఘంలో అభివృద్ధి మరియు మార్గదర్శక పాత్రలను పోషిస్తూ పురుషులతో సమాన హోదాలో నివసిస్తూ, పని చేస్తున్నారు.
ఆధ్యాత్మిక సలహా సమావేశం


ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలలో భాగంగా సమాజం అంచులలో నివసిస్తున్న సంఘము బహిష్కరించిన వారికి, మాదక ద్రవ్యాల నేరస్థులకు, బాల నేరస్తులకు ఉచిత ఆధ్యాత్మిక సలహా సమావేశాలను నిర్వహించబడుతున్నాయి. మొదటిసారి, మాదక ద్రవ్యాల వినియోగం మరియు ఆత్మహత్యలకు నిజమైన ప్రత్యామ్నాయంగా ధ్యానమును అందిస్తున్నారు. ప్రయోజనం పొందిన వారి సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ, విమోచన లేదనుకుని వదిలివేయబడినటువంటి విభాగాల్లో ఆధ్యాత్మిక సలహా సమావేశం అపారమైన మార్పును తెచ్చింది.
 


జీవితకాల తపస్సు

పరమహంస నిత్యానంద దక్షిణ భారతదేశంలోని పురాతన ఆలయ పట్టణమైన తిరువన్నామళైలో హిందూ మత విశ్వాసంగల తల్లిదండ్రులకు జనవరి 1, 1978న జన్మించారు. నిజానికి, అరుణాచలం మరియు అతని భార్య లోకనాయకి దక్షిణ భారతదేశంలోని కోరికలను తీర్చే ప్రసిద్ధ ఆలయం తిరుపతి తీర్థయాత్రలో ఉన్న సమయంలో ఆమె, తన  రెండవ శిశువుతో గర్భవతిగా వుందని తెలుసుకున్నారు.


నిత్యానంద (అప్పుడు రాజశేఖరన్ అని పిలువబడ్డారు) సాధువులు, సంచార పరివ్రాజకులను ఎల్లప్పుడూ స్వాగతించబడిన మరియు సత్కరించబడిన ఒక పెద్ద ధనవంతుల, దాతృత్వ కుటుంబములో భాగంగా ఒక ఆనందదాయకమైన బాల్యమును గడిపారు.
ఆయన తాతగారు వివిధ దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సంస్థలకు ఉచితంగా ఎన్నో రాయితీలను అందజేసిన పవిత్ర వ్యక్తి. నిత్యానందకు భారతదేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలను మరియు పవిత్ర గ్రంథములను పరిచయం చేసిన మొదటి గురువు ఆయనే.


నిత్యానంద 1992 లో తన పాఠశాల విద్యను, మరియు 1995 లో మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమాను పూర్తి చేసారు. అదే సంవత్సరంలో, ఆయన సన్యాస జీవితంలో నిమగ్నమవ్వాలనే జీవితకాల కాంక్షతో చెన్నైలోని రామకృష్ణ మఠంలో సన్యాస దీక్షలో చేరారు.



ఆధ్యాత్మికపై మొగ్గు / వేదాంత అభిరుచి

నిత్యానంద మొదటి ఇష్టం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వెతికే ఒక అయస్కాంతం వంటి పవిత్ర పర్వతం అరుణాచలం. భగవానుడు రమణ మహర్షి వంటి ఎండి శుష్కించిన యోగులకు, రహస్య సిద్ధులకు, జ్ఞానోదయం పొందిన ఋషులకు నిలయమైన ఆ పురాతన పర్వతం యువ నిత్యానందకు ఆత్మతో మొదటి ప్రయోగాలకు ఖచ్చితమైన శిక్షణ స్థలాన్నిచ్చింది.

మొదటి నుండి కూడా, నిత్యానంద క్లిష్టమైన ఆరాధన, యోగ మరియు ధ్యానం వంటి వాటికి మొగ్గు చూపారు. బాల్యంలో,  ఆయన తనకిష్టమైన దేవుళ్ళకు ఎన్నో గంటలు ఆరాధన చేస్తూ  ఆనందం పొందేవారు. తన విగ్రహాలతోనే ఆయన ఆడేవారు, పోట్లాడేవారు, నవ్వేవారు, కేకలు పెట్టేవారు.


పాఠశాల వద్ద తన అధ్యయనాలతో పాటు, తాను మర్చిపోయిన పురాతన భారతదేశ మార్మిక శాస్త్రాలు - వాయుస్తంభనం, టెలిపోర్టేషన్ మరియు సాక్షాత్కారం వంటి వాటిని తిరిగి పరిచయం చేసిన యోగిరాజ్ యోగానంద పురీ (రఘుపతి యోగి) అనే యోగ గురువు మరియు సిద్ధను (శక్తి నిపుణుడు) నిత్యానంద ఎంతో ప్రేమగా గుర్తుపెట్టుకున్నారు. నిత్యానంద విజయవంతంగా ఆధునిక స్థాయి యోగ మరియు ధ్యాన శిక్షణను పూర్తి చేసారు.

సమాంతరంగా, వివిధ ఆధ్యాత్మిక ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఆయన వేద గ్రంధములు, పురాణాలు మరియు ఉపనిషత్తులను అధ్యయనం చేయడం ప్రారంభించారు. తిరువన్నామలై పట్టణంలో అనేక పవిత్ర పురుషులు మరియు మహిళలను ఆయన కలిసి, వారి నుండి అమూల్యమైన బోధనలను పొందారు. ఆయనకు వేదాంతము, శ్రీ విద్య ఆరాధనను పరిచయం చేసిన వారిలో అన్నామలై స్వామి (భగవాన్ రమణ మహర్షి యొక్క ప్రత్యక్ష శిష్యులు), యోగి రామ్ సూరత్ కుమార్ మరియు మాతాజీ విభూతానంద దేవి (కుప్పంమల్) ముఖ్యులు.
 


పరమహంస నిత్యానంద ఎవరు?

 

పరమహంస నిత్యానంద జ్ఞానోదయ శాస్త్రంలో ప్రపంచ గురువు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిచే సజీవమైన ఉత్తమమైన జ్ఞానము కలిగిన అవతారముగా పూజించబడుతున్నారు. ఆయన యూట్యూబ్ లో 7.4 మిలియన్లకు పైగా ప్రజలు దర్శించిన ఆధ్యాత్మిక గురువుగా అత్యంత ప్రఖ్యాతి గాంచారు మరియు ఆయన చర్చలను ప్రజలు  http://www.Nithyananda.tv ద్వారా ప్రతి రోజూ ప్రత్యేక్షంగా, అలాగే బహుళ అంతర్జాతీయ ఛానళ్లు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వీక్షిస్తారు. ఆయన 20కి పైగా భాషలలో 200 పుస్తకాలను రచించారు. లండన్ లో 1893లో స్థాపించబడిన ప్రాచీనమైన మరియు పెద్దదైన ఎసోటేరిక్ పుస్తకాల దుకాణ భాగమైన మైండ్ బాడీ స్పిరిట్ మాగజైన్ 2012లో ప్రపంచంలోని మొదటి 100 మంది ఆధ్యాత్మిక శక్తి కలిగిన వారిలో నిత్యానంద ఒకరికిగా పేర్కోంది.


ఆధ్యాత్మిక మేధావి అయిన నిత్యానంద తన జ్ఞానోదయ అంతర్దృష్టితో నిర్వహణ నుండి ధ్యానం వరకు, బాంధవ్యాల నుండి మతం వరకు, విజయం నుండి ఆధ్యాత్మికం వరకూ అన్నిటికీ మనలో శాశ్వత పరివర్తనకు ఆచరణాత్మక జ్ఞానం, ధ్యాన పద్ధతులు, క్రియలు మరియు సాధనలను తెలిజేసారు. ఒక శిక్షణ పొందిన యోగి, ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక వైద్యుడు మరియు సిద్ధుడు అయిన పరమహంస నిత్యానంద కుండలిని మేల్కొలుపుట, వాయుస్తంభనం, టెలిపోర్టేషన్ మరియు సాక్షాత్కారం వంటి తూర్పు ఆధ్యాత్మిక యోగ శాస్త్రాలపై అవగాహనను తీసుకువచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులుతో చురుకుగా పనిచేస్తున్నారు .


పరమహంస నిత్యానంద ప్రతి ఉదయం (ధ్యానపీట మహాసంస్థాన అవతుమ్వార సింహాసనం) బోధన సంప్రదాయ పీఠమును అధిరోహించి తన బోధనా సమావేశమును (సత్సంగ్) ప్రారంభించినప్పుడు, 30 దేశాల నుండి వేలాది ప్రజలు 2-వే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనేందుకు Nithyananda.tv ని ప్రతి రోజు వీక్షిస్తారు మరియు 150 దేశాలలోని ప్రజలు రికార్డ్ వీడియోలను వీక్షిస్తారు.


నేడు పరమహంస నిత్యానంద ఒక నిర్మలమైన, ధర్మమైన, అరాజకీయ సమగ్ర సనాతన హిందూ ధర్మము యొక్క స్వరంగా గుర్తింపబడ్డారు. ఆయన హిందుత్వము యొక్క అతి పురాతన,  ప్రాచీనమైన శిఖరములాంటి సంస్థ అయిన మహానిర్వాణి పీఠానికి మహామండలేశ్వర్ (ఆధ్యాత్మిక గురువు) మరియు మధురై ఆధీనం యొక్క 293వ ప్రధానగురువు. ఆయన 100 పైగా దేశాలలో హిందూ ఆలయములను, ఆశ్రమాలను, కేంద్రాలను స్థాపించారు.

 


లక్షలాది ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శనం

 

లక్షలాది ప్రజల జీవితంలో ఒక ప్రేరణా శక్తినిచ్చే నిత్యానందకు ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే విధంగా అత్యంత లోతైన ఆధ్యాత్మిక భావనలను వివరించే సామర్థ్యము ఉంది. అద్భుతమైన ప్రసంగ నైపుణ్యమే గాకుండా, ఆయనకు శ్రోతలకు తన మాటల అనుభవమును ప్రసరింప జేయగలిగిన అరుదైన సామర్థ్యం కూడా ఉంది.


సరిహద్దును దాటిన ఆకర్షణ

నిత్యానంద బోధనా పద్ధతి అన్ని వర్గాల, మతాల మరియు సామాజిక నేపథ్యాల అనుచరులను కలిగి ఉంది. ఆధ్యాత్మికతను ప్రజల వద్దకు మరియు ప్రజలను ఆధ్యాత్మికత వద్దకు తీసుకురాగలిగే ఒక మార్గం ఆయన వద్ద ఉంది! బహిరంగ చర్చలు మరియు ధ్యాన కార్యక్రమాలలో పాల్గొన్న వేలాది మంది తాము జీవిత పరిష్కారాలను, భౌతిక మరియు మానసిక స్వస్థతను మరియు అదే విధంగా తమ దైనందిన జీవితాన్ని మరింత ఆనందంగా మరియు సార్థకమైన పద్ధతిలో నిర్వహించేందుకు సాహయపడే ప్రామాణికమైన  ఆధ్యాత్మిక అనుభవాలను పొందామని దృఢపరచారు.


ఆన్ లైన్ లో ఎక్కువగా వీక్షించబడే సజీవమైన గురువు

ప్రతి రోజూ, 150 దేశాలలో వేలాది శిష్యులు మరియు భక్తులు ఆన్ లైన్ లో ఆయనతో అనుసంధానమయి, ఆయన బోధనలు నుండి ప్రయోజనం పొందుతున్నారు. కేవలం ఆయన చేసే ఉదయ సత్సంఘమునే ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలలో ప్రతి రోజూ వీక్షిస్తారు.


బిడది ఆశ్రమం: భిన్న సంస్కృతుల సమ్మేళనం

అన్ని ధర్మాలు,  సామాజిక తరగతులు మరియు విద్యా నేపథ్యాలు నుండి ఆధ్యాత్మికతను ఆశించేవారిని ఆశ్రమంలోకి స్వాగతిస్తారు మరియు సమాన హోదా, గౌరవాదరణములతో వ్యవహరిస్తారు. ఆశ్రమవాసుల జాబితాలో వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఇతర నిపుణులు, గృహిణులు మరియు విద్యార్థులు సమానంగా ఉంటారు. బ్రహ్మచారులుగా ప్రతిపాదించిన వారిని బ్రాహ్మణులా, దళితులా, హిందువులా, క్రైస్తవులా మరియు సిక్కులా అన్నది పరిగణనలోకి తీసుకోరు, భారతీయులు అలాగే వివిధ దేశాలకు చెందిన విదేశీయులు ఉన్నారు, వారందరూ ఒకే దీక్షను (సంస్కారము) తీసుకుంటారు, ఒకే ఆశ్రమవాసుల హోదాను అనుభవిస్తారు.


సన్యాసమును పునరుత్తేజితం చేయుట

నిత్యానంద రూపొందించిన సన్యాస (త్యాగి) ఆదేశము ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి యువతను ఆకర్షిస్తోంది. కార్పొరేట్ ప్రపంచంలో ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తున్న విద్యావంతులైన యువతీయువకులు అన్నిటినీ వదులుకుని ఆత్మసాక్షాత్కార మార్గములో అడుగుపెడుతున్నారు. ఈ అపూర్వమైన యువ జాతి తమ జపమాలలతో పాటు లాప్ టాప్ లతో కూడా సౌకర్యవంతంగా ఉంటూ, సజావుగా రెండు ప్రపంచాలను మిళితం చేయగల జీవితానికి నిదర్శనగా ఉంటున్నారు. ప్రపంచంలో ఒక అంతరమును చేస్తున్నప్పుటికీ, తమ సొంత ఆధ్యాత్మిక ఎదుగుదలను కొనసాగించాలన్న కోరిక ఉన్న ఆధునిక విద్యావంతులైన యువతకు మరోసారి వైదిక సన్యాస సంకల్పము, ఒక ఆచరణీయ ఎంపికగా మారుతోంది. నిత్యానంద కృషికి ధన్యవాదాలు.


కుటుంబ విధులను నిర్వర్తిస్తూ, ఆధ్యాత్మికతను కొనసాగించాలనుకున్న వారి కోసం నిత్యానంద ఇప్పుడు ఆశ్రమంలోనే కుటుంబాలు నివశిస్తూ, ఆ ప్రాంగణంలోనే సేవ చేయగలిగే 'ఋషి క్రమం'ను నిర్వహిస్తున్నారు. వైదిక భారతదేశంలో ఋషులు వివాహితులు. ఇక్కడ భార్యాభర్తలు ఆధ్యాత్మిక మార్గంలో ఒకరికి ఒకరు సహాయంగా ఉంటూ, వారి పిల్లలకు చేతనతో నిండిన జీవితం కోసం సరైన ఆధ్యాత్మిక విద్యను మరియు సాధనాలను బోధిస్తున్నారు. సంప్రదాయ ఆశ్రమములోని ఆచరణలో వివాహిత జంటలు ఆధ్యాత్మిక జీవితమును గడపాలనుకుంటే తమ కుటుంబ విధులన్నిటినీ పూర్తి చేసే వరకు వేచివుండవలసిన అవసరముండేది కనుక రిషి క్రమం స్వాగత యోగ్యమైన మార్పు. అన్ని ప్రాపంచిక బాధ్యతలనుంచి విముక్తి పొందిన వారు ఒంటరిగా లేక జంటగా ఆశ్రమములోని 'వానప్రస్థ క్రమం'లో ప్రవేశించి, సన్యాసము కోసం ప్రారంభ జీవనాన్ని తీసుకుంటున్నారు. ఆశ్రమంలో 'గురుకులము' (‘గురువుగారి కుటుంబం’ అని అర్థం) పిల్లలకు పూర్ణరూపాత్మకమైన మరియు అవసర ఆధారిత విద్యనందించే ఒక వైదిక-శైలి శిక్షణాకేంద్రమును నడుపుతున్నారు. గురుకులము పిల్లలను సమగ్రమైన వ్యక్తులుగా, ఎంతో సాధించిన ఆధ్యాత్మిక సంధానకర్తలుగా, బాధ్యతగల ప్రపంచ పౌరులుగా వికసించేలా మార్గనిర్దేశం చేస్తుంది.
 


ఒక ప్రామాణికమైన వేద పునరుజ్జీవన మార్గదర్శకుడు

నిత్యానందకు తన అవతరణం నుండి కొన్ని సంవత్సరాల్లోనే భారతదేశం చాలా కాలంగా వేచివున్న శక్తివంతమైన వేద పునరుజ్జీవన మార్గదర్శకునిగా ఒక గుర్తింపు లభించింది. భారతదేశ సాంప్రదాయ ఆధ్యాత్మిక శాస్త్రంలో లోతుగా పాతుకుపోయిన నిత్యానంద చిన్నతనంలోనే యోగ, ధ్యానం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలలో ప్రావీణ్యతను మరియు తూర్పు దేశాల  ఆధ్యాత్మిక భావజాలాల ధ్వనిని గ్రహించారు. శాస్త్రసమ్మతమైన అధికార మద్దతుతో, తన సొంత అనుభవం నుండి నిత్యానంద ఒక శక్తివంతమైన వేదాంత ప్రతినిధిగా అవతరించారు. భారతదేశంలో ఒక సంచార సన్యాసి జీవితమును గడపడం వల్ల ఆయనకు స్థానిక ప్రజల ఆధ్యాత్మిక మూలాలు మరియు విలువలు గురించి ఒక సన్నిహితమైన వ్యక్తిగతమైన అవగాహన ఉంది.


హిందూ మత గ్రంధములకు జీవం పోశారు: అప్రయత్నంగానే ఆధునిక మనస్సుకు ఆనందదాయకంగా మరియు ఆచరణాత్మక విధంగా మళ్లీ అర్థవివరణనిచ్చిన ఒక సమగ్ర వక్త. నిత్యానంద వేగంగా స్థానిక తాత్విక ఆలోచనలను ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన స్వరంగా మారుతున్నారు. ఆయన తన ఉపన్యాసాలకు వ్యక్తిగత అనుభవ సంపదను తెస్తారు. విజ్ఞానముతో ఆధ్యాత్మిక రహస్యాలను చేధించుట మరియు ఆధ్యాత్మికతతో విజ్ఞానమును వృద్ధిచేయుట వంటి వాటితో తన చర్చలలో లౌకికము నుండి ఆధ్యాత్మికత వరకు మొత్తం మానవ అనుభవ విశ్లేషణములను చేరుస్తారు. భగవద్గీత, శివ సూత్రాలు, పతంజలి యోగా సూత్రాలు, బ్రహ్మ సూత్రాలు మరియు ఇతర శక్తివంతమైన గ్రంధాలను గురించి ఆయన చేసే  ప్రత్యక్ష చర్చలను  మన దేశంలో మరియు విదేశాలలో వేల ప్రేక్షకులు చూసారు.
ఇంట్లోకి వైదిక సంస్కృతిని తీసుకెల్లుట: ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి కోసం ఒక జ్ఞానోదయ జీవనము, ఒక ఆచరణాత్మక వాస్తవమును నిర్మించుట నిత్యానంద కార్యాచరణలో ఉంది.


ఈ పరివర్తనను ప్రభావితం చేసేందుకు నేరుగా సామాన్యుల ఇంటికి వైదిక జీవన సందేశాలను తీసుకు వచ్చేందుకు దక్షిణ భారతదేశంలో ఆయన పాద యాత్రలను (కాలినడకన తీర్థయాత్రలు) చేసారు. అంతే గాకుండా 2006 నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న రథ యాత్రలలో (రథం ఊరేగింపు) ఆశ్రమ ఆలయ దేవతల విగ్రహాలను దక్షిణ భాగం మొత్తం ఊరేగింపుగా తీసుకెళతారు. రథయాత్ర  పేదరికం, వ్యసనం మరియు గృహ హింస చుట్టుముట్టి ఉన్న మధ్యతరగతి మరియు కార్మిక తరగతుల జీవితాలలో ఒక కొనియాడదగిన పాత్ర పోషిస్తోంది. నిత్యానంద ధ్యానపీఠం జెండా ఉన్న రథము ఎక్కడకెళ్ళినా, ప్రజలు ప్రార్థనా సమయంలో గౌరవించే సంప్రదాయాలను పాటిస్తున్నారని మరియు ధార్మిక (న్యాయమైన, క్రమశిక్షణగల) జీవితమును గడుపుతున్నరనే ఒక కధ ప్రచారంలో ఉంది.


నిత్యానంద ధ్యానపీఠం సంప్రదాయ ఆరాధన మరియు కుటుంబాలకు మంత్రం జపించడంలో శిక్షణను కూడా అందిస్తుంది. పురుషులకు, మహిళలకు మరియు పిల్లలకు కూడా ఇలాంటి సంప్రదాయ ఆరాధనలో ప్రాథమిక శిక్షణనిస్తుంది. నగరాలు, పట్టణాలలో వందలాది కుటుంబాలు ఒక దగ్గర చేరి వారి సొంత శ్రేయస్సు కోసం మరియు ప్రపంచ శాంతి కోసం ఆరాధన చేసి ప్రార్థన చేసేందుకు మహాసప్తయాగాలు (సామూహిక ఆరాధన) నిర్వహించబడతాయి. ఒక కుటుంబంలా ఆరాధించడం ముఖ్యంగా యువతలో అంతర్గత బంధం బలపడడానికి, మన సంప్రదాయ సంస్కృతి మరియు విలువలకు గౌరవం పునరుద్ధరించడానికి ఒక మార్గం.


సంవత్సరంలో అనేక సార్లు వైదేక సంప్రదాయం ప్రకారం నిత్యానంద స్వయంగా కొన్ని జంటలకు వివాహం నిర్వహిస్తారు. పిల్లల్లో బారతీయ సాంప్రదాయక విలువలను బోధించాలన్న ఉత్సాహంతో  ప్రతి శిశువుకు వ్యక్తిగత శ్రద్ధ వహించి, విద్య పూర్తిగా అవసరమైన వాటిమీద మరియు సహజ సామర్థ్యం, అభిరుచి మీద ఆధారపడే ఒక ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థ అయిన గురుకుల వ్యవస్థను ప్రారంభించారు. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి స్థలాలను ప్రజలకు తెలియజేసేందుకు మరియు భారతదేశ గొప్ప ఆధ్యాత్మిక వారసత్వమును గురించి అవగాహనను సృష్టించడానికి, నిత్యానంద హిమాలయాలు, వారణాసి (బెనారస్ లేదా కాశీ) మరియు ఇతర పవిత్ర ప్రదేశాల యాత్రలకు (తీర్థ) నాయకత్వం వహిస్తారు. ఇతర దక్షిణ దేవాలయాల్లో చూడని విధంగా విశేషాధికారంతో తరగతి, లింగ భేధం లేకుండా  భక్తులందరూ బిడదిలోని సంస్థాగత ప్రధాన కార్యాలయ శక్తివంతమైన స్థలంలో ఉన్న శివలింగమునకు వ్యక్తిగత పూజలు నిర్వహించేందుకు అనుమతిస్తారు. సత్య మార్గంలో ప్రజలకు ఆధ్యాత్మికతను, ఆధ్యాత్మికతకు ప్రజలను పునరుద్ధరించడమే నిత్యానంద ధ్యేయం.


భారతీయ సంస్కృతి గురించి అంతర్జాతీయ అవగాహనను సృష్టించడం: నిత్యానంద ధ్యానపీఠం యొక్క పశ్చిమ ప్రధాన కార్యాలయం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కాలిఫోర్నియాలో ఉంది. ప్రస్తుతము ఈ సంస్థ ప్రతినిత్యం 3720 దేవతామూర్తులున్న 30 వైదిక దేవాలయాల్లో పూజ, మతపరమైన కార్యక్రమాలు, ధ్యానం, సంస్కృత తరగతులు, వేద పఠనం, సత్సంగము (ఆధ్యాత్మిక సమావేశాలు) జరుపుతోంది మరియు స్థిరమైన భారతీయ, అంతర్జాతీయ భక్తులను, అనుచరులను కలిగి ఉంది. ఈ దేవాలయాలను సగటున ప్రతిరొజూ 20,000 మంది సందర్శిస్తారు. ఇంతేగాకుండా, భక్తులు 400 పాదుక మందిరాలు (గురువు గారి పవిత్ర చెప్పులను పూజించే దేవాలయములు) మరియు 1000 గృహ మందిరాలను 33 దేశాల్లో ఏర్పాటు చేశారు.
 


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.