Telugu Cinema USA Schedules     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
 
తెలుగు తార(లు)
     
జూ ఎన్టిఆర్
Share |
 
జూ ఎన్టిఆర్ (May 20, 1983)
బయోగ్రఫీ
పేరు : జూ ఎన్టిఆర్
అసలు పేరు : తారక రామారావు నందమూరి
జన్మ స్థలం : హైదరాబాద్
పుట్టిన తేది : May 20, 1983  (Age-32)
 
ఫ్యామిలీ & భంధువులు :
తల్లి తండ్రులు : నందమూరి హరికృష్ణ, నందమూరి శాలిని
 
మినీ బయోగ్రఫీ

జూనియర్ యన్ టి ఆర్ బాలనటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైనా,  ప్రముఖ నిర్మాత రామోజీరావు.ఆయన సంస్థ ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై యన్ టి ఆర్ హీరోగా నిర్మించిన 'నిన్ను చూడాలని' చిత్రం అతన్ని హీరోని చేసింది.ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా అతనిలోని నటనా పటిమను తెలుగు సినీ పరిశ్రమ, ప్రేక్షకులూ గుర్తించారు.దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాజమౌళి దర్శకత్వం వహించిన 'స్టూడెంట్ నం;1' చిత్రం హిట్టవటంతో యన్ టి ఆర్ కి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా నటించిన 'ఆది' చిత్రం సూపర్ హిట్టవటంతో యన్ టి ఆర్ కి స్టార్ డమ్ వచ్చింది.ఆ తర్వాత 'సింహాద్రి' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యి అతని బాక్సాఫీస్ స్టామినా ఎంతో చూపించింది. మధ్యలో 'సుబ్బు, నాగ, ఆంధ్రావాలా,నరసింహుడు'వంటి కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆ తర్వాత వచ్చిన రాఖీ','యమదొంగ', 'అదుర్స్',  'బృందావనం' చిత్రాల విజయంతో హీరోగా యన్ టి ఆర్ సినీ జీవితం మళ్ళీ గాడినపడింది.ప్రస్తుతం వైజయంతీ మూవీస్ లో 'శక్తి' చిత్రంలో నటిస్తున్న యన్ టి ఆర్, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో 'రచ్చ',బోయపాటి దర్శకత్వంలో 'గర్జన'చిత్రాల్లో నటించటానికి అంగీకరించారు. ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న యువ హీరోల్లో మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్న హీరో యన్ టి ఆర్ అంటే అతిశయోక్తి కాదు. 

వ్యక్తిగత జీవితం - స్వర్గీయ యన్ టి ఆర్ కి మనవడిగా ఆయన పోలికలతోపాటు ఆయన నటనా పటిమను కూడా పొందిన జూనియర్ యన్ టి ఆర్ బాలనటుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగి ప్రముఖ హీరోగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సీసొంతం చేసుకున్నారు.2010 మే లో నార్నే శ్రీనివాసరావు,శ్రీమతి మల్లికల కుమార్తె కుమారి లక్ష్మీ ప్రణతితో యన్ టి ఆర్ కి వివాహ సంబంధం నిశ్చయం అయ్యింది.వారి వివాహం 'శక్తి' చిత్రం విడుదలయ్యాక 2011 ఏప్రెల్ ఒకటవ తేదీన జరుగనుంది.    

 

Currently loading Tarak Tweets...