అనుష్క శెట్టి (తుళు) తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. బెంగుళూరు నగరానికి చెందిన యోగా శిక్షకురాలు అనూష్క అసలు పేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించి, నిర్మించిన సూపర్ చిత్రం ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. ఆ తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో కధానాయికగా తన స్థానాన్ని పదిలపరచుకున్నది. తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైంది. బాండ్ గర్ల్ గా వచ్చిన అవకాశాన్ని నిరాకరించి అనుష్క ఫెవికాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకుంది.
మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది. అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదనీ, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.
అనుష్కకు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ఇమేజ్ ని తెచ్చిన పాత్ర 'అరుంధతి' చిత్రంలోని జేజెమ్మ పాత్ర.కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది. ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. సినిమాలో అనుష్క నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నది.అనుష్క మొదటీ సినిమాతొనె తనలొని నటిని ఆవిష్కరింఛింది
అనుష్క నటించిన చిత్రాలు : -
Anushka Acted movies
| సంవత్సరం |
చిత్రం |
భాష |
పాత్ర పేరు |
| 2005 |
సూపర్
మహానంది
|
తెలుగు
తెలుగు
|
సాషా
నందిని
|
| 2006 |
విక్రమార్కుడు
అస్త్రం
రెండు
స్టాలిన్
|
తెలుగు
తెలుగు
తమిళ్
తెలుగు
|
నీరజగోస్వామి
అనూష
జ్యోతి
అతిథి పాత్ర
|
| 2007 |
లక్ష్యం
డాన్
|
తెలుగు
తెలుగు
|
ఇందు
ప్రియ
|
| 2008 |
ఒక్క మగాడు
స్వాగతం
బలాదూర్
శౌర్యం
చింతకాయల రవి
కింగ్
|
తెలుగు
తెలుగు
తెలుగు
తెలుగు
తెలుగు
తెలుగు
|
భవాని
శైలు
భానుమతి
శ్వేత
సునీత (అతిథి పాత్రలో)
అతిథి పాత్రలో
|
| 2009 |
అరుంధతి
బిల్లా
వెట్టైకరన్
|
తెలుగు
తెలుగు
తమిళ్
|
జేజేమ్మ
మాయ
సుశీల
|
| 2010 |
కేడీ
సింగం
వేదం
పంచాక్షరి
తకిట తకిట
ఖలేజా
నాగవల్లి
రగడ
వానం
డెల్వ మగన్
|
తెలుగు
తమిళ్
తెలుగు
తెలుగు
తెలుగు
తెలుగు
తెలుగు
తెలుగు
తమిళ్
తమిళ్
|
అతిథి పాత్రలో
కావ్య
సరోజ
పంచాక్షరి,హనీ
అతిథి పాత్రలో
సుబ్బలక్ష్మి
చంద్రముఖి
శిరీష
పోస్ట్ ప్రొడక్షన్
షూటింగ్ జరుగుతుంది
|
| 2011 |
రాణీ రుద్రమదేవి
డమరుకం
రెబల్
|
తెలుగు
తెలుగు
తెలుగు
|
ప్రారంభ దశలో
ప్రారంభ దశలో
ప్రారంభ దశలో
|
|
|
|
|
|