The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Tips For Slim and Gorgeous
సన్నగా, నాజూకుగా ఉండటానికి సుకుమారమైన చిట్కాలు

నాజూకుగా తయారవ్వాలంటే ...

"వర్ధనం ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను చూస్తూ ఉంటే నా మనస్సు ఆగడం లేదు ... అబ్బా! ఆ చీరలో ఎంత అందంగా కనబడుతున్నావో'' అంటూ తన భార్య అయిన పర్వతవర్ధిని సొగసుని చూసి మురిసిపోతూ ముత్యాల్లాంటి మాటలు పలికాడు మిస్టర్ మదన్ మోహన్, "పొండి, అన్నీ అబద్ధాలే. మీరేమో ఇంట్లో వర్ధనం ... వర్ధనం అంటూ ముద్దుగా పిలుస్తూ ఉంటే, బయటేమో నన్ను చూసినవాళ్ళు 'పర్వతం ... పర్వతం' అంటూ ఏడిపిస్తూ ఉంటారు'' అంటూ ముఖం ముడుచుకుంది పర్వతవర్ధిని, నిజమే మరి లావుగా ఉన్న పర్వతవర్ధిని మదన్ మొహన్ కళ్ళకి రంభలాగా కనిపించి "వర్ధన, నీవు నా మనస్సుకి దమనం'' అన్నట్లు అని అనవచ్చు, కానీ తక్కినవాళ్ళ కళ్ళకి పర్వతవర్ధిని ఓ చిన్న సైజు పర్వతంలాగా కనిపించడమే కాకుండా ఆమె పేరులో ఉన్న పర్వతమే వద్దన్నా మళ్ళీ మళ్ళీ పర్వతాన్ని గుర్తు చేస్తూ ఉండవచ్చు.

లావుగా ఉంటే లవ్ కలగదా? :-

బాస్కర్ ని అతని స్నేహితుడు ఉండబట్టలేక "ఒరేయ్, రాధ అంత నల్లగం కోతిలాగా ఉంటుంది కదా, నీకెలా నచ్చిందిరా? అది అంటే ఎందుకురా పడిచస్తావ్? అంటూ అడిగేశాడు. "ఒరేయ్ పిచ్చి పిచ్చిగా వాగకు కావాలంటే రాధ ఎంత అందంగా ఉంటుందో ప్రేమించే నా కళ్ళతో చూడు'' అంటూ తడుముకోకుండా జవాబిచ్చాడు భాస్కర్. అదే విధంగా లావుగా ఉన్నవాళ్ళని చూస్తే లవ్ కలగదనుకోవడం భ్రమ. మనస్సులు కలిసిన చోట మగువ లావుగా ఉన్నదా, సన్నగా ఉన్నదా అనే ప్రసక్తే రాదు. లావు ఎందుకు అవుతారు? :- ఒంటికి కొవ్వు చేరి లావుగా తయారవడానికి ముఖ్యంగా మితిమీరి తినడమే. అయితే కొందరు ఎంత తిన్నా లావు ఎక్కరు. అయితే ఎక్కువ కేసుల్లోమితిమీరి భుజించేవారిలోనే లావు ఎక్కడం జరుగుతుంది. దీనికి కారణం భుజించడం ఎక్కువ, పనిచేయడం తక్కువ కావడమే. అరుదుగా కొన్ని హార్మోన్ల లోపం వల్ల లావుగా తయారవడం జరగవచ్చు. కాని అటువంటి కేసులు చాలా అరుదు. అయితే కొన్ని కుటుంబాలలో ఎక్కువమంది లావుగా ఉండటం గమనిస్తూ ఉంటారు అలా అవడం ఆ వంశంలోని లక్షణం. సాంఘిక వాతావరణం, జీవించే పరిసరాలు, మానసిక సంక్షోభం ఇవన్నీ కూడా ఒళ్ళు పెరగడానికి కారణమవుతాయి.

తల్లితండ్రులలో ఒకరు లావుగా ఉండటం జరిగితే వారికి పుట్టినవారిలో సగంమంది లావుగా అవడానికి అవకాశం వుంది. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ లావుపాటి వాళ్ళే అయితే పుట్టిన పిల్లల్లో మూడు వంతుల మంది లావుగా ఉండటానికి అవకాశం ఉంది. బాగా డబ్బు ఉన్న కుటుంబాలలో సమృద్ధి అయిన ఆహారంతోపాటు తగినంత శరీర శ్రమ లేకపోతే క్రొవ్వుపదార్ధం శరీరంలో పేరుకొని పోతుంది. కొందరు కొన్ని విషజ్వరాలు వచ్చి తగ్గినా తరువాత, మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చి తగ్గిన తరువాత బాగా లావు అయిపోవడం జరుగుతుంది. ఇలా జరగడానికి నాడీమండలానికి సంబంధించిన హైపోధలమిక్ సెంటర్ దెబ్బ తినడమే కారణమని భావించడం జరుగుతుంది.