The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Psycho
సైకో - 94

1. తల్లిదండ్రులిద్దరూ 'ఒ' గ్రూపు వారైతే బిడ్డ 'ఒ' గ్రూపుకే చెందుతుంది. 'ఎ', 'బి' గ్రూపు కానేకాదు.

2. తల్లిదండ్రులళో ఒకరు 'ఒ' మరొకరు 'ఎ' అయినా లేదా ఇరువురూ 'ఎ' గ్రూపుకి చెందిన వారైతే బిడ్డ 'ఎ' లేదా 'ఒ' గ్రూపుకి చెందుతుంది. 'బి'కి గాని, 'ఎబి'కి గాని చెందదు.

3. తల్లిదండ్రులలో ఒకరు 'బి' మరొకరు 'ఒ' అయినా, ఇరువురూ 'బి' అయినా బిడ్డ 'ఒ' లేక 'బి' గ్రూపు అవుతుంది. 'ఎ' లేక 'ఎబి' గ్రూపు అవదు.

4. తల్లిదండ్రులలో ఒకరు 'బి' మరొకరు 'ఎ' అయితే బిడ్డ నాలుగు గ్రూపులలో 'ఎ'గాని, 'బి'గాని, 'ఎబి'గాని, 'ఒ' గాని కావచ్చు.

తల్లిదండ్రులలో ఒకరు 'ఎబి' మరొకరు 'ఒ' అయితే బిడ్డ 'ఎ' గాని 'బి'గాని 'ఎబి'గాని అయితే బిడ్డ 'ఒ'వర్గం తప్ప మిగతా ఏ వర్గమైనా కావచ్చు. ఇవే కాకుండా యం.యస్.ఆర్.హెచ్. మొదలైన వాటిగా బ్లడ్ గ్రూప్ లు తిరిగి వర్గీకరించబడ్డాయి. ఏదైనా బిడ్డకి సంక్రమించే బ్లడ్ గ్రూపులు, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే క్రోమోజోమ్ లు అందులో బ్లడ్ గ్రూపులకి సంబంధించిన రసాయనాల మీద ఆధారపడి వుంటుంది.

నేను చెప్పింది మీకు పూర్తిగా అర్థమైందా? బ్లడ్ గ్రూపులు వంశపారంపర్యం, తండ్రి/తల్లి బ్లడ్ గ్రూపు ఏది అయితే అదే పిల్లలకు వస్తుందనుకోవడం అపోహ మాత్రమే. ఇప్పుడు చెప్పండి మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నాయా? డాక్టర్ అభినయ్ ఇంకా ఏమేమి చెప్పేవాడో పులి మధ్యలో కల్పించుకుని మాట్లాడటంతో డాక్టర్ అభినయ్ వాక్ప్రవాహం ఆగిపోయింది.

"డాక్టర్ గారూ ... బుద్ధి గడ్డితిని, అమాయకత్వంతో, అజ్ఞానంతో మా మొదటి అబ్బాయి నా కొడుకు కాదు అన్నాను. సారీ ... సారీ ... సారీ ... జరిగినదానికి చెంపలు వేసుకుంటున్నాను'' అని చెప్పి పులి "అయినా డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఆనందంగా వుంది అంతకుమించి బాధగా వుంది'' అన్నాడు.

"ఎందుకు?'' అన్నట్టుగా చూసింది అతడి భార్య.

"ఇంతకాలం నిన్ను, బాబిగాడ్ని బాధపెట్టినందుకు బాధ, వాడు నా కొడుకేనని ఆనందం. డాక్టరు దగ్గర ఆనందంగా శెలవు తీసుకున్నారు పులి, అతని భార్య,

ఆ హాస్పిటల్ విడిచి పెడుతున్నప్పుడు పులి భార్య ఒకటే అనుకున్నది. 'మగవారు స్త్రీ శీలాన్ని ఎంత తేలిగ్గా అనుమానిస్తారు?' అని.

--- సమాప్తం ---