The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Psycho
సైకో - 93

"చెప్పండి మీ సమస్య ఏమిటో ... మీకు పెళ్ళి ఎప్పుదయింది? మీకు శోభనం ఎప్పుడు అయింది? పాపాయి ఎప్పుడు పుట్టింది? డేట్ దగ్గర పెట్టుకుని చూడండి ...'' అని "బ్లడ్ రిపోర్ట్స్ విషయమై మీకు సందేహాలు వున్నట్టున్నాయి'' అంటూ ...

"ముఖ్యంగా బ్లడ్ గ్రూపులు నాలు అవి 'ఎ' గ్రూపు, ;బి' గ్రూపు, 'ఎబి' గ్రూపు, 'ఓ' గ్రూపు, ఇలా గ్రూపులు చేయడానికి రక్తకణాల మీద వుంటే యాంటిజన్స్ ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బ్లడ్ గ్రూపుకి చెందడమనేది వంశపారంపర్యంగా క్రోమోజోమ్స్ ద్వారా సంక్రమిస్తుంది.

మన దేశ జనాభాలో 'ఒ' గ్రూపు వారు 44 శాతం, 'బి' గ్రూపువారు 32 శాతం, 'ఎ' గ్రూపువారు 20 శాతం, 'ఎబి' గ్రూపువారు 4 శాతం వున్నారు. తల్లిదండ్రుల నుంచి బ్లడ్ గ్రూపులు క్రోమోజోమ్స్ ద్వారా వంశపారంపర్యంగా సంక్రమణ జరగడమనేది మూడు సూత్రాల మీద ఆధారపడివుంటుంది.

మొదటి సూత్రం ప్రకారం బిడ్డలో ఎ ఒకరికైనా 'ఎ'గాని, 'బి'గాని ఉండాలంటే తల్లిదండ్రులలో ఒకరిలోనైనా ఎ,బి, ఎబి వర్గ రక్తకణాలు వుండాలి.

రెండవ సంక్రమణ సూత్రం ప్రకారం తల్లిదండ్రులతో ఒకరు 'ఎబి' వర్గంవాడైతే బిడ్డ ఎప్పటికీ 'ఒ' వర్గానికి చెందదు.

మూడవ సంక్రమణం సూత్రం ప్రకారం తల్లిదండ్రులలో ఒకరు 'ఒ' వర్గం వారైతే బిడ్డ ఎప్పుడూ 'ఎబి' వర్గానికి చెందదు. ఇలా జరగడానికి ముఖ్యకారణం ఈ రక్తకణ వర్గాన్ని గుర్తించే క్రోమోజోమ్స్ ఎదురుబొదురుగా రెండు గుర్తింపు రసాయనకాలు వుంటాయి. అంటే 'ఎ' వర్గం వారిలో అవి 'ఎఎ'గాని, 'ఎఒ' గాని కావచ్చు. అలాగే 'బిఒ' గాని అవచ్చు. 'ఎబి' వర్గం వారికి 'ఎ,బి'గా వుంటాయి.

' ఒ'వర్గం వారిలో రెండూ 'ఒ'గానే వుంటాయి. తల్లిదండ్రుల నుంచి బిడ్డలకి సంక్రమించే బ్లడ్ గ్రూపులు ఈ విధంగా వుండవచ్చు.