The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Preyasi Nee Peru Rakshasaa
ప్రేయసి నీ పేరు రాక్షసా - 83

ఊహు! చనిపోకూడదు- తనకోసమైనా బ్రతకాలి. జీవితాంతం ఆమె ఋణం తీర్చుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలి. హాస్పిటల్లో ఆమె బెడ్ దగ్గరకు చేరుకున్నారు.

అంకిత కళ్ళుమూసుకుని పడుకుని వుంది. "అంకితా ... ఇడుగో సాగర్ వచ్చాడు ...'' ఆమెను నెమ్మదిగా తడుతూ అన్నాడు సిద్ధార్థ.

అంకిత కళ్ళు తెరవలేదు. కదల్లేదు. "అంకితా ...'' మృదువుగా పిలిచాడు సాగర్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ.

కొంచెంగా కళ్ళు తెరిచిందామె. ఆమె పెదాలమీద మందహాసం. "సాగర్ ...'' గొంతులోనుంచి శబ్దం బయటకు రావటంలేదు.

"అంకితా ...''

"నిన్ను నేనెంతగా ప్రేమించానో నీకు తెలీదు - నాకే తెలీదు - ఆ రోజు నిన్నూ శృతిని చూసేవరకూ. అప్పటివరకూ నాయీ బలవంతంగా అణచబడ్డ ప్రేమ ఒక్కసారిగా తిరగబడినట్లనిపించింది సాగర్ - నిన్ను నా నుంచి ఎవరూ కాజేయగూడదని నీకు శారీరకంగా దగ్గరవడానికి ప్రయత్నించాను. కానీ మనసొప్పలేదు. నిజమయిన ప్రేమ శారీరక సంబంధాలతో నిలబడదని నాకు తెలుసు-అది ఎటర్నల్'' ఆయాసం వచ్చిందామెకి.

"అంకితా విశ్రాంతి తీసుకో. నువువ్ కోలుకున్నాక అన్నీ మాట్లాడుకుందాం''

"మనిద్దరం కలిసి ఆనందంగా జీవితం గడపాలి సాగర్ - ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరుండకూడదు''

"అలాగే జరుగుతుంది అంకితా- నువ్విక విశ్రాంతి తీసుకో!'' ఆమె ముఖంలో సంతృప్తి కనిపించింది. కళ్ళు మూసుకుంది ఆనందంగా. అంతే - ఆమె చేయి వాలిపోయింది. తల ప్రక్కకు ఒరిగిపోయింది.

సాగర్ గుండె వేగంగా కొట్టుకుంది. చటుక్కున ఆమె చితిని అందుకుని నాడి చూశాడు. చలనం లేదు. అతని కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్. సాగర్ కి చిన్నప్పుడు జ్యోతిష్యం చెప్పిన జ్యోతిష్కుడు గుర్తుకొచ్చాడు. మనసోకరికిస్తావు ... తనువొకరికిస్తావు. మనసిచ్చిన మగువ దూరమవుతుంది - తనువిచ్చిన అతివ ఆరడి పెడుతుంది- అచ్చం అలాగే జరుగుతోంది. సిద్ధార్థ కళ్ళనిండా నీళ్ళు. నెమ్మదిగా హాస్పిటల్ నుంచి బయటికొచ్చాడు సాగర్. ఎక్కడెక్కడో తిరిగి యింటికి చేరుకున్నాడు.

తలుపుకి అడ్డంగా కూర్చునివుంది శృతి. శోకదేవతలా ఏడుస్తూ ...

"ఎందుకొచ్చావిక్కడికి?''

అతని కాళ్ళమీద పడిపోయింది. "సాగర్! నన్ను క్షమిస్తావా?''

సాగర్ కేం మాట్లాడాలో తెలీలేదు. మనసంతా బ్లాంక్ అయిపొయింది.