The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>If Sex Organ's Doesn't work ...
సెక్సు గ్రంథులు సరిగ్గా పనిచేయకపోతే ...

సెక్సు గ్రంథులు సరిగ్గా పనిచేయకపోతే ...

సెక్సు గ్రంథులు తగినంత పనిచేయనప్పుడు కూడా ఒంటికి క్రొవ్వు చేరడం జరుగుతుంది. ముఖ్యంగా వక్షోజాలకి, కడుపుకి, తోంటికి, తోదలకి ఎక్కువ క్రొవ్వు చేరడం జరుగుతుంది. సెక్సు గ్రంథులతోపాటు పిట్యూటరీ గ్రంథి కూడా తగినంత పనిచేయకపోతే క్రొవ్వు మరింత చేరుతుంది. ఎద్రినల్ గ్రంధి ఎక్కువగా పనిచేసినా లావుగా తయారవడం జరుగు తుంది. థైరాయిడ్ గ్రంథి తగినంతగా పనిచేయకపోయినా ఒళ్ళు చేస్తుంది. అందుచేత లావుతా ఉన్నప్పుడు గ్రంథుల లోపం ఉన్నదా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలించడం అవసరం.

 

లావు ఉంటే అవస్థలు :-

ఏ పని చేయాలన్నా అలసట, దానితో పని అంటేనే ఉత్సాహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. కీళ్ళ నొప్పులు, నడుమునొప్పులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. గుండెజబ్బు, రక్తపోటు, మధుమేహం వ్యాధులు లావుగా ఉండేవారిలో ఎక్కువగా వస్తాయి. లావు ఎక్కువగా ఉనంవారిలో ఉబ్బసం వచ్చినా, ఊపిరితిత్తుల ద్వారా వ్యాధులు వచ్చినా మరింత ఆయాస పడవలసి వస్తుంది.

 

మనిషి ఎంత బరువు ఉండాలి?

ఒక మనిషి ఎంత బరువు ఉండాలనేది ఆ వ్యక్తి వయసు, ఎత్తు బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతవరకు ఆ వ్యక్తి శారీరక నిర్మాణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి ఉజ్జాయింపుగా తన బరువు ఎంత ఉండవచ్చో అతని ఎత్తుబట్టి నిర్థారించవచ్చు. మామూలుగా 5 అడుగుల మనిషి 105 పౌన్లు ఉండాలి. తరువాత ప్రతి అంగుళానికి 5 పౌన్లు ఉండాలి. ఉదాహరణకి 5 అడుగుల 7 అంగుళాలు ఉన్న వ్యక్తి 140 పౌన్లు ఉంటే మంచిది. ఆదర్శమైన బరువు పట్టికలని జీవిత భీమా సంస్థవారు తయారుచేశారు. దాని ప్రకారంగానే ఏ వ్యక్తి అయినా తన బరువుని పెరగకుండా అదుపు చేసుకోవచ్చు.