The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Bastime savaal
బస్తీమే సవాల్ - 166

“అనూ ...!’’ బిగ్గరగా గుండె తెగిపోయేలా అరిచాడు పరుశురాం.

ఒకసారి బస్తీకేసి చూశాడు పరుశురాం ... అతని చుట్టూ బస్తీజనం ...

“మమ్మల్ని క్షమించు బాబూ ’’ ఓ వృద్ధుడి గొంతు“

నువ్వెక్కడికీ వెళ్ళకు’’

“బాబూ ...! రామయ్య తండ్రీ ... ఈ అమ్మని విడిచి వెళ్ళిపోతావా ...?’’ యాదమ్మ వేడుకుంటోంది. అతని కళ్ళు ఎవరికోసమో చూశాయి ... ఆ మనిషి కనుపించలేదు.

ఎవరితోనూ మాట్లాడలేదు పరుశురాం ... యాదమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడు ... కళ్ళు తుడుచుకుంటూ ముందుకి నడిచాడు. అతని కళ్ళముందు చిన్నారి కన్నయ్య కనుపించాడు. అతను ఇంటికేసి, రచ్చబండ కేసి నడిచాడు. దుఃఖం ముంచుకొస్తోంది .... ఉద్వేగాన్ని దాచుకుంటూ అడుగులు ముందుకి వేశాడు. ఎదురుగా కారు వచ్చి ఆగింది నందిని ....!

పరుశురాం కారు ఎక్కి కూర్చున్నాడు .... కారు కదిలింది. జేబులోంచి పేకముక్కల్ని తీసి ఒక్కొకార్డుని చింపి బయటపడేస్తున్నాడు పరుశురాం.

నందిని కారు ఆపింది.

ఎదురుగా రిక్త హస్తాలతో నిలబడి వున్న రాణిని పరుశురాం చూశాడు.

“నేనూ నీతో వస్తాను రామయ్యా ...’’ అంది రాణి బొంగురు గొంతుతో ...

పరుశురాం మాట్లాడలేదు ...

నందిని కారు వెనక డోర్ తెరిచి “ఎక్కు’’ అంది. రాణి కారు ఎక్కి కూర్చుంది.

“రామ్ ....! నువ్వు కూడా వెనకసీట్లో కూర్చో’’అందామె.

పరుశురాం, రాణి పక్కనే వెళ్ళికూర్చున్నాడు. కారు కదిలింది. నందిని కళ్ళనించి జారుతున్న కన్నీటిని చేతి చూపుడు వేలితో తుడుచుకుంది ...

కారు వేగంగా పోతోంది ....

అయిపొయింది ....!