The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Yuddhakshetram>>Yuddhakshetram
యుద్ధక్షేత్రం 112

మాధురి నవ్వింది. "ఈ మాటలు సినిమాల్లోనూ, కథల్లోనూ వినడానికీ, చదవడానికీ బాగుంటాయి. ఇది జీవితం ... నీకు తెలీదు ప్రశాంత్ నువ్వంటే నాకు పరమ అసహ్యం. అది ఎందుకు ఏర్పడిందో నాకు తెలీదు. నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదని ఆయన కోసం నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను. మన బంధం పెళ్ళి వరకే ప్రస్తుతం. నేను బిడ్డని కనేవరకూ నువ్వు నా దగ్గరకు రాకూడదు. నన్ను ముట్టుకోకూడదు'' అంది మాధురి.

"మాధురీ ...!'' ఆవేదనగా అన్నాడు ప్రశాంత్.

"ప్రేమించానన్నావ్ ... ప్రాణం అంటున్నావ్ ... నా కోసమే పెళ్ళి చేసుకోకుండా ఇలా వుండిపోయానని చెప్పావు. నేను నా ప్రసాద్ ప్రతిరూపానికి జన్మనిచ్చేవరకూ నువ్వు నాకోసం వెయిట్ చేయక తప్పదు''

"అలాగే మాధురీ ... నీ మాటకి నేనెప్పుడూ ఎదురుచెప్పను'' అన్నాడు ప్రశాంత్.

"మాట తప్పితే ఫుట్ పాథ్ తప్పదని మర్చిపోకు'' అని విసవిసా వెళ్ళిపోయింది మాధురి.

ఆమె మాటలకి ప్రశాంత్ విచిత్రంగా నవ్వుకొన్నాడు. పెళ్ళి తతంగం పూర్తయ్యేవరకూ నోరు మూసుకుని నక్క వినయం చూపించక తప్పదని అతనికి తెలుసు.

పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది. ప్రశాంత్ చివరి క్షణం వరకూ భయపడుతూనే వున్నాడు పోలీసుల గురించి. ఎలాంటి అవాంతరం లేకుండా జరిగిపోవటంతో తృప్తిగా గాలి పీల్చుకున్నాడు ప్రశాంత్.

ఆ రాత్రి ... మాధురికి, ప్రశాంత్ కీ మొదటి రాత్రి శోభనం. అయితే మాధురి తనకి సహకరించనని, లొంగదని అతనికి తెలుసు. కేవలం ఆమె తండ్రి తృప్తికోసం ఆ తతంగం ఏర్పాటు చేయబడింది.

"నువ్వు ఆ సోఫాలో పడుకో'' అంది మాధురి అతన్ని.

అతను ఆమె వెనకగా వెళ్ళి నించున్నాడు. "మాధురీ ...'' పిలిచాడు.

"ఏం కావాలి?''

"ఎంత కాదన్నా నేను నీ భర్తని, మొదటిరాత్రి ఎంత ఆనందంగా గడిపితే జీవితం అంత ఫ్రీగా సాగిపోతుందంటారు. ప్లీజ్ ... ఒక్కసారి నావేపు తిరుగు. ఈ రాత్రి మనది కాకుండా పోనీకు'' అంటూ ఆమె భుజాల్ని పట్టుకుని తనవేపుకి తిప్పుకున్నాడు.

తన భుజాల మీద వున్న అతని చేతులకేసి చూసింది మాధురి.