భార్య ఈ పని చేయకపోతే ఏమి చేయవలెనో చెప్పుచున్నాడు ....
దౌత్యకర్మ తెలియని కన్య, సేవకురాలు, దోషములు ఎంచని వారిని ఉపాయముతో పంపుచుండవలెను. పుష్పమాలలపైన, కర్ణపత్రములపైన గూఢముగా (దూతికి తెలియకుండా) సంకేతములు పంపవలెను. నాయిక గూడ అదేవిధముగా చేయవలెను. ఈమె వస్తువులు మాత్రమే తీసుకువెళ్ళును. స్వయముగా ఏమియు మాట్లాడదు. ఎందువలననగా ఈమె 'మూకదూతి'. ఆమె నాయకుని వద్ద నుండి ప్రత్యుత్తరము కోరవేలేను. అమాయకురాలైన మూక దూతిక కారాకార్యములను, గుణదోషములను, తెలుసుకొనలేదు. ఆమె కేవలము నాయకుడు పంపిన మాల్యాదులను నాయికకు ఇచ్చును. వానిపై ఉన్న నఖ క్షతాదులను తెలుసుకోనలేదు.
ఈ విషయము నాయికకు తెలుసు. ఇటువంటి కార్యములు చేయు స్త్రీ మూకదూతి అనబడును. ద్వందార్థములతో పత్రమును వ్రాసి వేరొక స్త్రీ ద్వారా నాయికకు పంపవలెను. నాయకుడు పంపిన దానిని ఆమె చదివి సంకోచించిన నాయిక అటువంటి భావమునే దూతి ద్వారా నాయకునకు పంపును. ఇటువంటి దూతి ''వాతదూతి'' అని పిలువబడును. దాసీ, సఖీ, కన్యా, విధవా, దైవజ్ఞురాలు, సైరంధ్రీ (ఇతరుల గృహమందు నివశించు స్త్గ్రీ) పుష్పమాలలు చేయువారు, సుగంధ ద్రవ్యములు విక్రయించువారు, రజకులు, వీరి భార్యలు, పినతల్లి, పొరుగున నివశించు స్త్రీ దౌత్యము చేయుటకు సమర్థులు. దాసీ జనులు చెప్పిన ఉపాయములతో కొందరు అంతఃపురములోనికి ప్రవేశింతురు. ఇహపర లోకములందు నింద్యములైన అంతఃపుర ప్రవేశ పద్ధతులు చెప్పబడలేదు.
వచ్చే సంచికలో వశీకరణాదికారము గూర్చి తెలుసుకుందాం ...
|
|


