The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Rati Rahashyam>>Vasikaranadhikaaramu
వశీకరణాధికారము

ఉమ్మెత్త, వెఱ్ఱిపుచ్చ, మదంతిక, గిరికర్ణి, ఉత్తరేణి, రుద్రజడ, అత్తిపత్తి వీనిని నెయ్యి తేనెలతో కలిపి పంచాంగ మలములతో (చిటికెన వ్రేలి రక్తము, శ్లేష్మము, నాసికా మలము, కంటి మలము, స్వేద మలము) పై వస్తువులను కలిపి తిలకముగా ధరించిన వ్యక్తికీ ముల్లోకములు వశమగును. లేక జలము, మజ్జిగ మొదలగు త్రాగు పదార్థములతో కలిపి ఇచ్చినను లేక తినుబండారములలో కలిపి ఇచ్చినాను వీనికి వశమగుదురు. బాబ్బూల కష్టాన్ని నందికీట చూర్ణమును పానాదులలో ఇచ్చిన వశకారము. కాక జంఘూ చూర్ణము వశకరము. జిల్లేడు ఆకుల రసములో వెలిగారమును భావన చేసి ఇచ్చినాను వశీకరము. ఈగలను చూర్ణము చేసి గాని లేక పిచ్చికుక్క యొక్క గుండెను చూర్ణము చేసి ఇచ్చినను వశీకరము. తెల్ల జిల్లేడు వేరులు, గజ మదము, తెల్ల ఆవాలు, ఎర్రగన్నేరు, నెయ్యి, అడవి తులసి, తేనె వీనితో పంచాంగ మలములను, నీతితో కలిపి తిలకముగా ధరించిన వానికి ముల్లోకములు వశమగును.

లేక త్రాగు, తినుబండారములలో కలిపి ఇచ్చినను వశ మగుదురు. స్నుహీ, మణిషిల, గంధక చూర్ణములతో స్నుహీని అనేక పర్యాయములు భావన చేసి, లింగలేపము చేసి రమించిన స్త్రీ వశమగును. శరీరమునకు లేపనము చేసుకొనినను వశమగును. లేక ఈ చూర్ణమును వానర మలముతో కలిపి ఏ స్త్రీపై చల్లుడురో ఆమె కన్యయైనను, వివాహితయైనను, సురూపి అయినను తప్పక వశమగును. మర్రి, ప్రేంఖణము, చందనము, పిన్న ఏలకులు, పెద్ద ఏలకులు, సర్జ రసము, చెంగల్వ కోష్టు, తెల్ల ఆవాలను చూర్ణము చేసి శరీరమునకు ధూపము చేసుకొనిన సర్వజన వశీకరణము.

 

చెంగల్వ కోష్టు, నల్ల కలువ కాండ, భ్రుంగరాజము ఆకులు, గ్రంధి తగరము, గురివింద గింజలను చూర్ణించి తన అనామికా (ఉంగరపు) వ్రేలి రక్తముతో తడిపి ఆ చూర్ణమును ఎవరి శిరస్సుపై చల్లుదురో వారు వశమగుదురు. కలువ, సహదేవి, గలిజేరు, సుగంధపాల వీటి కల్కము (ముద్ద)తో చేసిన తైలమును అన్జనముగా వాడిన వశీకరణము. ఏనుగు చేత చంపబడిన మనిషి నేత్రములు, ముక్కు, హృదయము, నాలుక, అంగములను పుష్యమీ నక్షత్రము రోజు రాత్రి శివాలయములో తైలము తీయవలెను. దీనిని "మదనాంకుశ'' మందురు. ఇది పరమ వశీకరణము, ఈ తైలమును భక్షణ, పాన, స్పర్శనములకు వాడిన సర్వము వశమగును. తెల్లజిల్లేడు, చెంగల్వ కోష్టు, చందనము, కుంకుమ పువ్వు, దేవదారు, తేనెలతో ధూపము వేసిన సర్వజన వశీకరణమగును. ఇది "చింతామణి'' అను పేరుతొ పిలువబడుతున్నది. కన్యను వరించు సమయమందు, సంభోగ సమయమందు, క్రయ విక్రయములందు ఈ ధూపము సర్వసిద్ధి కరమని హర మేఖలా కారుని అభిప్రాయము.