నేను అనేక కామశాత్రములను (నందికేశ్వరాది ప్రణీతములు) ఉడ్డీశుని తంత్ర సంహిత, శబ్దార్ణవము, హరమేఖల అను గ్రంథములను, యోగావలిని, మూడు వైద్య సంహితలను. దైవాగమములను, యోగా శాస్త్రములను పరిశీలించి బహుజన సమ్మతమైన శుభంగకరణమును అధ్యాయమును వివరించుచున్నాను. కొక్కోక కవి రతి రహస్యములలో వశీకరణమును ఒక పరిచ్చేదముగా వ్రాసెను. నంతర శాస్త్ర గ్రంథములను ఆధారముగా చేసుకొని మంత్ర, తంత్ర ప్రయోగముల చర్చ చేసెను. ఇది స్త్రీలను అనురాక్తులుగా చేయుటకుగాని, కామసుఖము అధికముగా అనుభవించుటకు గాని కాదు. ఈ ప్రయోగాములను అంతిమముగా ఆచరించవలెను. పుస్తకములో వ్రాసిన వానిని అనుసరించుట మూర్ఖత్వము.
అవసరమైన అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకొని ఆచరించవలెను. స్త్రీ పురుషులకు అనురాగాభారణమైన రతివేళయందు మథనుడు నివసించును. అనురాగము సహజము, అధేయమని రెండు విధములు. అనుభవజ్ఞులు అనురాగామునకు వేగము, మందము అని రెండు విధములుగా విభజించిరి. అనురాగ, అంగాదులకు సంబంధించిన మంత్ర, ఔషధములు చెప్పబడుచున్నవి. కామేశావర మంత్రమును లక్ష జపము చేసి, మోదుగ పుష్పములతో పదివేలు హోమము చేసిన సిద్ధించును. "ఓం క్లీం నమః'' అను మంత్రము పూర్తిచేసి, తన ప్రియురాలి యోనిని ధ్యానించును. సహస్రావమును సమీపించుకొలది, అతని కంఠము నుండి వెలువడు అమృతము నాతడు సేవించును.
అతని ధ్యానము కామ కమలమును చేరును. అతను కామేశ్వర మంత్రమును జపిస్తూ ప్రేయసి మనస్సును కరిగించును. ఈ విధముగా అతడు తన ప్రేయసిని ఆకర్షించును. దీనితో కాముకుడు - "ఓం క్లీం అనయ నయ వశతాం ఓం క్షం నమః'' అను మంత్రమును పదివేలు జపించి, దానిలో పదవవంతు (1000) మోదుగ లేక కదంబ పుష్పములతో గాని రాత్రి సమయమున జపముతో గూడ హోమము చేసిన ప్రియురాలు ద్రవించును. కుచుమార తంత్రములో "ఓం క్లీం ఏనమా నయ నయ వశతామ్ ఓం క్షం నమః'' అను మంత్రమును పదివేలు జపము చేసి మోదుగ లేక కదంబ పుష్పములతో 1000 హోమము చేసిన సిద్ధించునని చెప్పెను. ఈ మండలినీ మంత్రమును హృదయమునందు జపించిన ఆకర్షించును. లలాటమందు జపించిన వశమగును. మన్మథ ప్రదేశమున జపించిన ద్రవించును.
|
|


