The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kama Shastram>>Thyroid Problems
థైరాయిడ్ సమస్యలు

గర్భావస్థలో లేదా చిన్నతనంలో థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉండడాన్ని క్రిటినిజమ్ అంటారు. ప్రతి 5వేలమంది నవజాత శిశువుల్లో ఒకరిలో ఈ హైపోథైరాయిడిజమ్ వుండవచ్చని అంచనా. కామెర్లు, మలబద్ధత, నిద్ర ఎక్కువగా వుండడం, పాలు తీసుకోవడంలో సమస్యలు లాంటి లక్షణాలు కలుగుతాయి. లక్షణాల్ని బట్టి ఈ వ్యాధి వుందని గుర్తించడం కష్టం. చికిత్స త్వరగా మొదలుపెట్టడం మానసిక ఎదుగుదలకు అత్యవసరం కనుక చిన్నపిల్లల్ని స్క్రీన్ చేయడం అవసరం. అందుకే అమెరికాలో డెలివరీ అయిన 10 రోజులలోపు అందరు పిల్లలకు తప్పనిసరిగా థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. ఎత్తు ఎక్కువగా లేకపోవడం, నాలుక బయటికి రావడం, చప్పిడిముక్కు ఉండడం, చర్మం గరుకుగా వుండడం, మానసిక ఎదుగుదల లేకపోవడం లాంటి లక్షణాలు కలుగుతాయి.

ఎదిగే పిల్లల్లో థైరాయిడ్ తక్కువైనప్పుడు ఎత్తు తక్కువ వుండడం, తరువాత యుక్తవయసు తాలూకు లక్షణాలు ఆలస్యమవడం, మానసిక ఎదుగుదల సరిగా వుండకపోవడం ఈ లక్షణాలుంటాయి. పెద్దవారిలో థైరాయిడ్ హార్మోన్ తక్కువైనప్పుడు ఏ పనీ చెయ్యి బుద్ధవకపోవడం, మలబద్ధత, చలి తట్టుకోలేకపోవడం, కండరాలు గట్టిగా వుండడం, మెలితిప్పినట్లు నొప్పులు, ఆడవారిలో మెన్సెస్ ఎక్కువగా అవ్వడం, ఆకలి తగ్గడం, బరువు పెరగడం, వెంట్రుకలు పొడిగా అవ్వడం లాంటి లక్షణాలు ఉంటాయి. గొంతులో బొంగురు కలగవచ్చు. హైపోథైరాయిడిజం ఎక్కువైతే దాన్ని మిక్సిడోమో అంటారు. ఈ మిక్సిడోమా వున్నవారి ముఖంలో ప్రస్ఫుటమైన మార్పులు కనబడతాయి. ఏ భావాలు లేని ముఖం, కళ్ళచుట్టూ వాపులు లాంటి లక్షణాలు కలుగుతాయి. హైపోథైరాయిడిజమ్ చికిత్స చేయకుండా చిరకాలం వదిలేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గడం, కొన్ని సందర్భాలలో కోమాలోకి వెళ్ళడం కూడా సంభవిస్తుంది. ముఖ్యంగా చలికి ఎక్స్ పోజ్ అవ్వడం, ఇన్ ఫెక్షన్లు, కేంద్రీయ నాడీ వ్యవస్థపై పనిచేసే మందులు కోమాకి దారి తీయవచ్చు. T3, T4, TSH పరీక్షల ద్వారా హైపోథైరాయిడిజమ్ గుర్తించవచ్చు.

నార్మల్ రేంజెస్ - థైరాయిడ్ హార్మోన్స్

T3 వయసు నానోగ్రామ్స్/డెస్సీ లీటర్

1-3 రోజులు 32-216

3-10 రోజులు 50-250

1-12 నెలలు 105-280

1-5 సం.లు

105-269

5-10 సం.లు 94-241

10-15 సం.లు 83-213

15-20 సం.లు 80-210

20 సం.లు పైబడినవారు 95-190

T4 వయసు మైక్రోగ్రామ్స్/డెస్సీ లీటర్

1-3 రోజులు 11.8-23.2

3-10 రోజులు 9.9-21.9

10-45 రోజులు 8.2-16.2

45-90 రోజులు 6.4-14.0

3-12 నెలలు 7.8-16.5

1-5 సం.లు 7.3-15.0

5-10 సం.లు 6.4-13.3

10-15 సం.లు 5.6-11.7

15-20 సం.లు

4.2-11.8 20 సం.లు పైబడినవారు 5.0-12.0

TSH

సాధారణ మానవులలో : 0.3 - 5.0

థైరాయిడ్ ఎక్కువ ఉన్నవాళ్ళలో : undetectable - 0.2 mlU/ml

థైరాయిడ్ తక్కువ ఉన్నవాళ్ళలో : 9.0 - 150 mlU/ml

హైపోథైరాయిడిజమ్ వున్నవాళ్ళు ఎండోక్రైనాలజిస్ట్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

థైరాయిడ్ గ్రంధి సమస్యలు థైరాయిడ్ గ్రంధి పెద్దదిగా అవడాన్ని గాయిటర్ అంటారు. గాయిటర్ లో అనేక రకాలున్నాయి. సింపుల్ గాయిటర్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రమాణం ఎక్కువయ్యి, థైరాయిడ్ గ్రంధిపై ప్రేరేపణ ఎక్కువైనందువలన సింపుల్ గాయిటర్ వస్తుంది. రక్తంలో థైరాయిడ్ హార్మోన్ తక్కువైనప్పుడు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రమాణం పెరుగుతుంది. ఏ కారణం చేతనైనా చిరకాలం థైరాయిడ్ హార్మోన్ పరిమాణం తక్కువగా వున్నట్లయితే సింపుల్ గాయిటర్ కలుగుతుంది.

గాయిటర్ కలగడానికి ముఖ్యమైన కారణం అయోడిన్ లోపం. మనిషికి రోజూ 100 - 125 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరమవుతుంది. ఒక ప్రదేశంలో అనేకమందిలో గాయిటర్ వుంటే దానిని ఎండెమిక్ గాయిటర్ అంటారు. నీళ్ళలో గానీ, ఆహారంలో గానీ అయోడిన్ పరిమాణం చాలా తక్కువగా వున్నచోట్ల గాయిటర్ అవకాశాలు ఎక్కువ. సున్నపురాయి వుండేచోట్ల కూడా గాయిటర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కాల్షియం గాయిటర్ ని కలిగిస్తుంది. అయోడిన్ మామూలుగా వున్నప్పటికీ ప్రేవుల్లో దాని శోషణ సరిగా జరగనప్పుడు కూడా గాయిటర్ కలుగుతుంది. ఎంజైమ్ లోపాలవల్ల కూడా గాయిటర్ కలుగుతుంది. సాధారణంగా ఇది కుటుంబంలో చాలామందిలో వుంటుంది. ఎంజైమ్ లోపం వున్నవారు అధిక పరిమాణంలో అయొడిన్ తీసుకున్నట్లయితే గాయిటర్ కలగదు. ఎంజైమ్ లోపం వుండి అయోడిన్ కలిగిన పదార్ధాలు తీసుకోనివారిలో సమస్య కలుగుతుంది. బ్రాసికా కుటుంబానికి చెందిన క్యాబేజీ లాంటి కూరలు, కొన్ని మందులు యాంటీ థైరాయిడ్ మందులు గాయిటర్ ని కలిగిస్తాయి.

గాయిటర్, డిఫ్యూజ్ గాయిటర్, నాడ్యులర్ గాయిటర్ అని రెండు రకాలుగా వుంటుంది. డిఫ్యూజ్ గాయిటర్ సాధారణంగా ఎండెమిక్ ప్రాంతాలలో చిన్నతనంలో కనబడుతుంది. కొన్ని సందర్భాలలో యుక్తవయసులో కనబడుతుంది. యుక్తవయసులో కనబడేదాన్ని ఫ్యూబర్టీ గాయిటర్ అంటారు. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రేరేపణ తగ్గగానే గాయిటర్ అంటారు. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రేరేపణ తగ్గగానే గాయిటర్ కూడా తగ్గడం ఆరంభిస్తుంది. తర్వాత ఎప్పుడైనా గర్భావస్థ లాంటి సందర్భాలలో మళ్ళీ కలగవచ్చు. నాడ్యులర్ గాయిటర్ లో నాడ్యూల్స్ వుంటాయి. సాధారణంగా గాయిటర్ మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా వుంటుంది. మామూలు థైరాయిడ్ కణాల్లోనూ నాడ్యులర్ గాయిటర్ లోనూ ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ ని కనుగొన్నారు.