The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kama Shastram>>Thyroid Gland
థైరాయిడ్ గ్రంధి

సీతాకోకచిలుక ఆకృతిలో వుండే గ్రంధి స్వరపేటికకు క్రింద వుంటుంది. సుమారుగా 30 గ్రాముల బరువు ఉండే ఈ గ్రంధికి ప్రతి నిమిషానికి 80-120 మిల్లీలీటర్ల రక్తం సరఫరా అవుతుంది. థైరాయిడ్ గ్రంధి నిండా థైరాయిడ్ ఫాలిక్యుల్స్ వుంటాయి. ఈ థైరాయిడ్ ఫాలిక్యుల్స్ లో ఫాలిక్యులర్ కణాలుంటాయి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రభావం వలన ఈ కణాలు థైరాక్సిన్, ట్రై అయిడో థైరోలిన్ హార్మోన్ ని స్రవిస్తాయి. థైరాక్సిన్ ని టెట్రా అయిడో థైరోలిన్ లేదా T4 అంటారు. ఎందుకంటే ఇది 4 అయోడిన్ పరమాణువులు కలిగి వుంటుంది. T3 మూడు అయోడిన్ పరమాణువులు కలిగి ఉంటుంది. T3, T4 లను థైరాయిడ్ హార్మోన్స్ అంటారు. థైరాయిడ్ గ్రంధి సుమారు 100 రోజులకు సరిపోయే హార్మోన్ నిల్వ ఉంచుకోగలుగుతుంది.

T3 కంటే T4 ఎక్కువ పరిమాణంలో స్రవించబడినా T3, T4 కంటే సమర్ధవంతమైనది. శరీరంలో వున్న అన్ని కణాలను చేరగలదు. థైరాయిడ్ హార్మోన్ లు ముఖ్యంగా ఆక్సిజెన్ ఉపయోగాన్ని, బాసల్ మెటబాలిక్ రేట్ ని, కణాల మెటబాలిజమ్ ని, శారీరక, మానసిక ఎదుగుదలని నియంత్రిస్తాయి. కణాల్లో ఆక్సిజెన్ ఉపయోగాన్ని ప్రేరేపించడం ద్వారా థైరాయిడ్ హార్మోన్స్ బాసల్ మెటబాలికి రేట్ ని పెంచుతాయి. బాసల్ మెటబాలిక్ రేట్ అంటే రాత్రి ఉపవాసం తర్వాత విశ్రాంతి సమయంలో ఆక్సిజెన్ కన్జంప్షన్ రేట్. కణాలు ఆక్సిజెన్ ను ఎక్కువగా వాడుకొని ఎడినోజైన్ ట్రై ఫాస్పేట్ ని ఉత్పత్తి చేస్తే ఉష్ణం విడుదలయి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ప్రక్రియను థైరాయిడ్ గ్రంధి కాలరోజెనిక్ ఎఫెక్ట్ అంటారు. ఈ విధంగా థైరాయిడ్ శరీర ఉష్ణోగ్రత విషయంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.

అతి చల్లని వాతావరణంలో కూడా క్షీరదాలు బ్రతక గలుగుతాయి. అదే థైరాయిడ్ గ్రంధి తొలగించినవి బ్రతకలేవు. ధైరాయిడ్ హార్మోన్ ప్రోటీన్ సింధెసిస్ ను ప్రేరేపించి ATP ఉత్పత్తిలో గ్లూకోజ్ ఉపయోగాన్ని పెంచుతుంది. థైరాయిడ్ గ్రంధి ట్రైగ్లిసరాయిడ్స్ బ్రేక్ డౌన్ కలిగించి పైత్యరసం ద్వారా కొలెస్టరాల్ విసర్జన కలిగేట్టు చేస్తుంది. ఆ విధంగా రక్తంలో కొలెస్టరాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. హ్యూమన్ గ్రోత్ హార్మోన్, ఇన్సులిన్ లలో శరీరంలో ఎదుగుదలను ముఖ్యంగా నాడీకణాల ఎదుగుదలను థైరాయిడ్ ఎక్కువయ్యేటట్టు చేస్తుంది. గర్భస్థ పిండంలో థైరాయిడ్ తక్కువగా ఉన్నట్లయితే నాడీకణాలలో ఎదుగుదల లేక మానసిక వికలాంగత (mental retardation) కు దారి తీస్తుంది.

ఎదిగే వయసులో పిల్లల్లో థైరాయిడ్ గ్రంధి లోపం పొట్టివాళ్ళగానూ, మెదడు జననావయవాలు చిన్నవిగా వుండేట్టుగానూ చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ కాటకొలమైన్ (norepinephrine and epinephrine) ల కొన్ని కార్యాలను పెంచుతాయి. ఈ కారణంగా థైరాయిడ్ ఎక్కువైనప్పుడు గుండె ఎక్కువగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం లాంటి లక్షణాలు కలుగుతాయి. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి నియంత్రణ థైరాయిడ్ గ్రంధినుంచి థైరాయిడ్ హార్మోన్ల స్రావాలు థైరాయిడ్ గ్రంధి పరిమాణం ముఖ్యంగా రెండు విధాలుగా నియంత్రించబడుతుంది.

1. థైరాయిడ్ గ్రంధిలో అయోడిన్ పరిమాణం 2. హైపోథాలమస్, యాంటీ రియర్ పిట్యూటరీ గ్రంధుల నెగిటివ్ ఫీడ్ బ్యాక్. థైరాయిడ్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం. కానీ థైరాయిడ్ అయోడిన్ పరిమాణం బాగా ఎక్కువున్నట్లయితే అది థైరాయిడ్ హార్మోన్స్ విడుదలను తగ్గిస్తుంది. నెగిటివ్ ఫీడ్ బ్యాక్ * రక్తంలో T3, T4 పరిమాణం తగ్గడం జరిగినప్పుడు లేదా మెటబాలిక్ రేటు తగ్గినప్పుడు హైపోథాలమస్ కు ప్రేరేపణ కలిగి అది థైరోట్రోఫిన్స్ రిలీజింగ్ హార్మోన్ ను విడుదల చేస్తుంది (TRH). * ఈ థైరోట్రోపిన్స్ రిలీజింగ్ హార్మోన్ పిట్యూటరీ గ్రంధిని చేరి TSH విడుదలయ్యేట్టు చేస్తుంది. * TSH థైరాయిడ్ ఫాలిక్యుల్ సెల్స్ లోని అన్ని కార్యాల్ని ప్రేరేపిస్తుంది. * అయోడిన్ ట్రాపింగ్, హార్మోన్ సింథసిస్ మరియు విడుదల, ఫాలిక్యూల్ సెల్స్ లో గ్రోత్ వీటన్నింటిని TSH ప్రేరేపిస్తుంది. * ఫలితంగా థైరాయిడ్ ఫాలిక్యులర్ సెల్స్ నుంచి T3, T4లు రక్తంలోకి విడుదలవుతాయి. * మెటబాలిక్ రేట్ మామూలుగా అయ్యేంతవరకు T3, T4 పరిమాణం పెరుగుతుంది. * పెరిగిన T3, T4 లు ధైరోట్రోప్సిన్ రిలీజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ల విడుదలను ఆపివేస్తాయి. చల్లటి వాతావరణం, రక్తంలో గ్లూకోజు తగ్గడం, ఎత్తయిన ప్రదేశాలు, గర్బావస్థ ఇవన్నీ థైరాయిడ్ హార్మోన్ విడుదలను పెంచుతాయి. శరీరానికి థైరాయిడ్ గ్రంధి చాలా అవసరమయింది. థైరాయిడ్ గ్రంధి హార్మోన్ ఎక్కువయినా వ్యాధే, తక్కువైనా వ్యాధే. అలాగే థైరాయిడ్ గ్రంధి వాపు.